కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవెన్యూ డివిజన్‌కు శాపంగా మారనుంది. బద్వేలు విడిపోయిన తర్వాత కేవలం రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మంట్లను ఆధారం చేసుకొని డివిజన్‌ పాలన కొనసాగేది..ఇప్పుడు రైల్వేకోడూరు డివిజన్‌ నుంచి లెఫ్ట్‌ అయింది. ఇ | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవెన్యూ డివిజన్‌కు శాపంగా మారనుంది. బద్వేలు విడిపోయిన తర్వాత కేవలం రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మంట్లను ఆధారం చేసుకొని డివిజన్‌ పాలన కొనసాగేది..ఇప్పుడు రైల్వేకోడూరు డివిజన్‌ నుంచి లెఫ్ట్‌ అయింది. ఇ

Dec 30 2025 7:22 AM | Updated on Dec 30 2025 7:22 AM

 కూటమ

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవె

రాజంపేట వాసుల్లో ఆందోళన

తిరుపతిలోకి రైల్వేకోడూరు

డివిజన్‌లోని ఐదు మండలాలు లెఫ్ట్‌

కడపలోకి రాజంపేట అసెంబ్లీ సెగ్మంట్‌

రాజంపేట : బ్రిటీషు కాలం నుంచి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కొనసాగిన రాజంపేటకు మరో ముప్పు పొంచి ఉంది. డివిజన్‌ పరిధిలో ఉన్న రైల్వేకోడూరు నియోజకర్గాన్ని తిరుపతి జిల్లాలోకి విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో రెవెన్యూ డివిజన్‌లో ఉన్న ఐదుమండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఫలితంగా రెవెన్యూ డివిజన్‌ విస్తరణ రీత్యా బలహీనపడింది.

నాలుగుమండలాలకు డివిజన్‌ డౌటే..

రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఇప్పుడు ఒక్క రాజంపేట నియోజకవర్గం ఉంది. ఇందులో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు ఇప్పటికే కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొనసాగుతున్నాయి. ఇక ఉండేది నందలూరు, రాజంపేట, వీరబల్లి, సుండుపల్లె మండలాలు. ఈ మండలాల పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారనుంది. డివిజన్‌ ఎత్తివేస్తే కడప రెవెన్యూ డివిజన్‌లోకి విలీనం చేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బద్వేలు డివిజన్‌లో 12 మండలాలు..

మూడేళ్ల క్రితం రాజంపేట డివిజన్‌ నుంచి బద్వేలు విడిపోయింది. ఆ డివిజన్‌లో అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, బ్రహ్మంగారిమఠం, చాపాడు, దువ్వూరు, గోపవరం, కలసపాడు, ఖాజీపేట, మైదుకూరు, పోరుమామిళ్ల, కాశీనాయన మండలాలున్నాయి. వీటన్నింటిని బద్వేలు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ పాలన కొనసాగుతోంది.

జిల్లా కలెక్టరేట్‌ తర్వాత..

జిల్లా కలెక్టరేట్‌ తర్వాత రాజంపేట సబ్‌కలెక్టరేట్‌ స్థా నం రాజంపేటది. జిల్లా కేంద్రంతో సమానంగా ఐఏఎస్‌ల పాలన ఇక్కడ కొనసాగింది. 1915లో 13 ఎకరా లకుపైగా విస్తీర్ణంలో సబ్‌కలెక్టరేట్‌ ఏర్పాటైంది. రాజంపేట, రైల్వేకోడూరు ఉమ్మడి నియోజకవర్గానికి ఈ సబ్‌కలెక్టరేట్‌ ప్రజాస్వామ్యపరంగా ప్రత్యేక భూమిక పోషించింది. ఇది వందేళ్లను పూర్తి చేసుకుంది.

బ్రిటీషుకాలం నుంచి ఐఏఎస్‌ల రాజ్యం..

1953 నుంచి రాజంపేట డివిజన్‌ కేంద్రంగా చేసుకొని సబ్‌కలెక్టర్లు పనిచేశారు. బ్రిటీషుకాలం నుంచి ఎందరో ఐఏఎస్‌లు ఇక్కడ సబ్‌కలెక్టర్లుగా పనిచేశారు. సీనియర్‌ ఐఎఎస్‌లు ఎంఎస్‌రాజాజీ, సతీనాయర్‌, డి. ఆరోరా, సి.రామచంద్రమూర్తి, టీఎస్‌ రంగాచారి, వల్లియప్పన్‌, ఎంఆర్‌సాయ్‌, మిన్నీమాథ్యుస్‌, జానకికృష్ణమూర్తి, ఎకే గోయల్‌, సతీసుజామన్‌, రణబీర్‌సుధన్‌, అజయ్‌జైన్‌, ప్రీతిమీనా, కేతన్‌గార్గ్‌ వైఖోమా నైదియాదేవి, ఇప్పుడు భావనలు సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెవిన్యూశాఖ పేరు ఇనుమడింప చేశారు.

జిల్లాలో సగంభాగం రెవెన్యూ పాలన రాజంపేట సబ్‌కలెక్టరేట్‌ నుంచిఏ జరిగేది. డివిజన్ల ఏర్పాటు తర్వాత రాయచోటి కడప డివిజన్‌కు, జమ్మలమడుగులో ఉన్న బద్వేలును రాజంపేట డివిజన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.డివిజన్లు అయిన తర్వాత ఆర్డీవోలుగా కొంతమంది పనిచేశారు. అలాగే ఆర్డీఓ క్యాంప్‌ ఆఫీసు, క్వార్టర్స్‌తోపాటు రెవెన్యూహోం, జడ్జి క్వార్టర్స్‌, సభాభవనం లాంటి భవనాలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కొనసాగిన రాజంపేటలో వివిధ ప్రభుత్వశాఖల కార్యాలయాల తరిలింపు ప్రభావం చూపనుంది. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఎపీఎస్పీడీసీఎల్‌, ఐసీడీఎస్‌, అటవీశాఖ, పోలీసుశాఖ తదితర కార్యాలయాల డివిజన్‌ స్థాయి అధికారులు కొనసాగింపు ప్రశ్నార్థకరంగా మారునంది. కేవలం నాలుగు మండలాలకు డివిజన్‌ కార్యాలయాలు, అధికారులు ఉండరనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి ప్రాంతీయులు ఆవేదన చెందుతున్నారు.

 కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవె1
1/1

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement