
అధికారుల అరెస్టులు అప్రజాస్వామికం
రాజంపేట : గత ప్రభుత్వ పాలనలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయలు చేస్తుండడంతో వ్యవస్ధలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తూ ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై రాజకీయవిరోధం చూపిస్తున్నారన్నారు. లిక్కర్ వ్యవహారంలో బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని అరెస్టు చేస్తున్నారన్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు డైవర్షన్ పాలిట్రిక్స్ చేస్తున్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నతాధికారులను బలిచేయడం చూస్తుంటే, ప్రభుత్వ ఆరాచక పాలన స్పష్టం అవుతోందన్నారు. ఇంకా కొనసాగితే ప్రజలు సహించరన్నారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్ధితులు ఉత్పన్నమవుతాయని స్పష్టంచేశారు.
కక్షపూరిత రాజకీయాలు సరైనవి కావు
వైఫల్యాలను కప్పించుకునేందుకే
డైవర్షన్ పాలిటిక్స్
రాజ్యసభ సభ్యుడు
మేడారఘునాథరెడ్డి ఆగ్రహం