
24 గంటలూ మెరుగైన విద్యుత్
రాయచోటి: ఆర్‌డీఎస్ స్కీమ్ ద్వారా గ్రామాలలో 24 గంటలూ మెరుగైన విద్యుత్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర రవాణా,యువజన క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి, జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆర్డీఎస్ స్కీమ్‌పై ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా త్రీఫేస్ కనెక్షన్ ఇచ్చి 24 గంటలూ మెరుగైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వివరించారు.జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ స్కీమ్ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా మారుమూల గ్రామాలలో సైతం చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, పవర్ గ్రిడ్ డీజీఎం కిరణ్, ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ కన్‌స్ట్రక్షన్ శ్రీనివాసరెడ్డి, రాజంపేట, మదనపల్లి, ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాఫిర్యాదులకు సత్వర పరిష్కారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదు లను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎన్నో వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్‌డీసీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి