
ఐఎఫ్‌ఎస్‌కు అంబటి బాలాజీ
గాలివీడు: మండలంలోని బోరెడ్డిగారిపల్లెకు చెందిన అంబటి బాలాజీ ప్రతిభ కనబరచి యూపీఎస్సీలో 65 వ ర్యాంకు సాధించారు.కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్) – 2024 తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది ఈ సర్వీసులకు ఎంపిక కాగా, వారిలో పది మందికి పైగా తెలుగు తేజాలు ఉండటం విశేషం.అందులో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బోరెడ్డిగారి పల్లెకు చెందిన అంబటి బాలాజీ జాతీయ స్థాయిలో 65 వ ర్యాంకు సాధించి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకర్‌గా నిలిచారు.ఈ సందర్భంగా బాలాజీ స్పందిస్తూ తన తాత అంబటి వెంకటరమణ , తల్లిదండ్రులు రఘునాథ, రామలక్షుమ్మ, ఆన్న వదిన లోకేష్,జ్యోత్స్న, అక్క బావ స్వాతి రవిచంద్ర భార్య గౌతమి కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇంటర్ వరకు జవహర్‌లాల్ నవోదయ విద్యాలయం రాజంపేట, ఇంజినీరింగ్ ( బీటెక్ –ఈసీఈ) ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేశాక సివిల్స్ కు ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నానని, తరువాత సొంత ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. 2020 లో గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. కొద్దినెలలు మాత్రమే ఉద్యోగం చేసినట్లు చెప్పారు. తరువాత రిజైన్ చేసి మళ్లీ సివిల్స్ ప్రిపేర్ అయినట్లు తెలిపారు.2023 సివిల్స్ తరహాలోనే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈపీఎఫ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో జాయిన్ అయ్యానని, ఇప్పుడు సివిల్స్ ఐఎఫ్‌ఎస్‌లో సెలెక్ట్ అయ్యానని తెలియజేశారు. ఐఏఎస్ సాధించాలన్నదే తన అంతిమ లక్ష్యమని, దానిని నెరవేర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.