3 కిలో మీటర్లు వెళ్లాలి
తంబళ్లపల్లె మండలం కొత్తకురవపల్లెకు చెందిన గుల్జార్‌బీకి రేషన్‌కార్డు ఉంది. గతంలో ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోని కే.రామిగానిపల్లె చౌక దుకాణం (షాప్ నంబర్ 10) వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునేది. భర్తతోపాటు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న ఆమెకు ఎండీయూ సేవలతో ఎంతో ఉపశమనం కలిగింది. కూలీకి వెళ్లినా ఎండీయూ వాహనం ఎప్పుడొస్తుందో ముందే చెప్పేవారు. కూలీపనికి వెళ్లినా మధ్యలో వచ్చి సరుకులు తీసుకునేవాళ్లు. తిరిగి చౌక దుకాణాల ద్వారా రేషన్ ఇస్తే తీసుకునేందుకు మూడు కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్లి క్యూలో నిలబడి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని గుల్జార్‌బీ ఆవేదన వ్యక్త చేస్తోంది.
● నిత్యావసర సరుకులకు డీలర్ల వద్ద మళ్లీ క్యూ కట్టాల్సిందే
● ఇంటిముంగిటకే ఇస్తున్న ఎండీయూ సేవలు నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వ నిర్ణయం
● ఇకపై కిలోమీటర్ల దూరం వెళ్లాలి..డీలర్లు ఎప్పుడిస్తే అప్పుడే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి
● మళ్లీ పాతరోజులు వచ్చాయని లబ్ధిదారుల ఆవేదన


