
యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
రాయచోటి: శారీరక, మానసిక ఉరోగ్యం, భావోద్వేగాల సమతుల్యతలు యోగాతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం రాయచోటిలోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యా ప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నా రు. ఇందులో భాగంగా జిల్లాలో నేటి నుండి జూన్ 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. .
జోనల్ మాస్టర్ ప్లాన్ కోసం
నివేదికలు రూపొందించాలి
జిల్లా పరిధిలోని శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహ అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ప్రాంతాల ఏకో సెన్సిటివ్ జోన్ల నిర్మాణాలకు రూపొందించనున్న జోనల్ మాస్టర్ ప్లాన్‌కు వారంలోగా పటిష్టమైన నివేదికలను రూపొందించి, సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో సబ్ డీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రాజంపేట, చిట్వేలి మండలాల పరిధిలో 185.42 చదరపు కిలోమీటర్ల మేర శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ అభయారణ్యం, ఓబులవారిపల్లి, కోడూరు, చిట్వేలి మండలాల పరిధిలో 87.02 చదరపు కిలోమీటర్ల మేర శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు విస్తరించి ఉందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ హిత సున్నితమైన ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందన్నారు. ఇందులో భాగంగా గుర్తించిన ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాల్లో నిషేదించాల్సిన, ప్రమోట్, రెగ్యులేట్ చేయాల్సిన అంశాల్లో జోనల్ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచడానికి వారంలోగా ఆయా శాఖలు తప్పనిసరిగా నివేదికలు సమర్పించాలన్నారు. అంతకు ముందు సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ హైదరాబాద్ సంస్థ రీజినల్ డైరెక్టర్ కె జయచంద్ర జోనల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి ఆయా శాఖలు దృష్టి సారించాల్సిన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ డీఎఫ్‌ఓ సుబ్బరాజు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్