రాజంపేట సబ్‌వేకి కదలిక! | - | Sakshi
Sakshi News home page

రాజంపేట సబ్‌వేకి కదలిక!

May 22 2025 12:17 AM | Updated on May 22 2025 12:17 AM

రాజంప

రాజంపేట సబ్‌వేకి కదలిక!

సబ్‌వే అందుబాటులోకి రాక అనేక ఇబ్బందులు...

రాజంపేట 103 ఎల్సీగేట్‌ స్ధానంలో సబ్‌వే నిర్మాణం అందుబాటులోకి రాక ప్రజలు, విద్యార్ధులు, మహిళలు, ఇరువైపుల ఉన్న ప్రాంతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్‌వేలో కనీసం ఆటో, బైకులు, పాదచారులు వెళ్లేందుకు అనుకూలంగా రైల్వేశాఖ నిర్మించినప్పటికి, రెండువైపు అప్రోచ్‌రోడ్డు వేసే అంశం చిరకాలంగా పెండింగ్‌లో పడిపోయింది. ఇటీవల గంగమ్మ జాతర సందర్భంగా సబ్‌వే అందుబాటులో లేకపోవడంతో వందలాది అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికి పట్టాలు దాటి అవలివైపు వెళ్లాల్సి వస్తోంది.భవిష్యత్తులో రైల్వేట్రాక్‌కు ఫెన్సింగ్‌ వేస్తే ఇక దారి వుండదనే వాదన వినిపిస్తోంది. రైలుపట్టాలు దాటడం రైల్వేచట్టం ప్రకారంగా నేరమైనప్పటికి స్ధానికులు తప్పనిపరిస్ధితులో కొనసాగించాల్సి వస్తోంది.

రూ.5కోట్లు కేటాయింపు

స్థానికులలో చిగురించిన ఆశలు

సబ్‌వేకి అప్రొచ్‌రోడ్డ్డు ప్రశ్నార్ధకరం

ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి

రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రైల్వేస్టేషన్‌ యార్డులో అర్ధాంతరంగా ఆగిపోయిన సబ్‌వేకి కదిలికవచ్చింది. గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో రాజంపేట యార్డు 103 లెవ ల్‌ క్రాసింగ్‌ గేట్‌కు ప్రత్యామ్నాయంగా నిర్మితం చేసి న సబ్‌వేకి రూ.5కోట్ల 22లక్షలు కేటాయించారు. దీంతో సబ్‌వే నిర్మాణం అంశం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రాజంపేట సబ్‌వే నిర్మాణ విషయంలో నిధుల లేమితో వెనకడుగు వేసినట్లుగా స్ధానికంగా విమర్శలున్నాయి.

దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఆర్వోబి

రాజంపేట రైల్వేగేటు సమస్య తీవ్రరూపం దాల్చిన క్రమంలో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాల నలో ఆనాటి ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి డీసీసీ అధ్యక్షునిగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి చొరవ కృషితో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మితౖమైంది. రాజంపేట–రాయచోటి మార్గంలో ఇప్పుడు వాహనాల రాకపోకల సుగమమైంది.

ఆర్వోబి ఇరువైపుల వారికి రాకపోకల సమస్య

ఆర్వోబి నిర్మించిన తర్వాత ఇరువైపుల ఉన్న ప్రాంతీయులకు రాకపోకల సమస్య ఉత్పన్నమైంది. రైల్వేగేటుకు ఇరువైపుల ఉన్న ప్రాంతాల వారికి ఆర్వోబితో నిమిత్తం లేకుండా ఆర్‌యూబీ నిర్మించాలని కోరా రు. అయితే ఆర్వోబి ఉన్న చోట ఆర్‌యూబీ ఇచ్చే పరిస్ధితులు లేని కారణంగా సబ్‌వే నిర్మితానికి ముందుకు వచ్చింది. రైల్వేశాఖ నిథులు కేటాయింపులు జరిగాయి. సబ్‌వే నిర్మితం తుదిదశకు చేరుకునేలా పనులు జరిగాయి. అనేక కారణాలతో సబ్‌వే నిర్మాణం మరుగునపడింది. ఇప్పటికి ఒకటిన్నర దశాబ్ధకాలం అయింది.

వెంటాడుతున్న అప్రోచ్‌ రోడ్డు

నిర్మాణ వ్యవహారం..

సబ్‌వే నిర్మాణానికి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణవ్యవహారమే అడ్డంకీగా మారింది. సబ్‌వేకు అటు రాయచోటి వైపు, ఇటు రాజంపేట వైపు ఉన్న నిర్మాణాలు కారణంగా సబ్‌వే పూర్తికావడానికి బ్రేక్‌ పడింది. ఈ విషయంలో పురపాలకసంఘం, రోడ్లు భవనాల శాఖలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ కాలాన్ని వెల్లదీసిన సంగతి తెలిసిందే. అలాగే సబ్‌వేకు ఇరువైపు ప్రాంతాలకు చెందిన వారు కొందరు కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కోర్టులో ఉండటంతో రెండు శాఖలు ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో ఉన్నారు. గతంలో సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ప్రీతిమీనాతోపాటు అనేకమంది అధికారులు, ప్రజాప్రతినిధులు సబ్‌వే ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి విధితమే.

రైల్వేమంత్రి, జీఎం,డీ ఆర్‌ఎం వరకు వినతులు

రైల్వేమంత్త్‌వ్రిశాఖ, దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజరు, గుంతకల్‌ రైల్వే డివిజనల్‌ మేనజరు వరకు రాజంపేట సబ్‌వే నిర్మాణం అంశం వెళ్లింది. సబ్‌వే నిర్మాణం పూర్తి కోసం ఆందోళనలు, నిరసనలు జరిగాయి. రాజంపేట లోక్‌సభ సభ్యుడుపీవీ మిథున్‌రెడ్డి ఇదే అంశాన్ని పలుమార్లు రైల్వేమంత్రిత్త్వశాఖ, ఎస్సీ రైల్వే జీఎం దృష్టి తీసుకెళ్లారు. ఫలితంగా 2025–2026 రైల్వే బడ్జెట్‌లో రాజంపేట సబ్‌వేకి రూ.5కోట్ల 22 లక్షలు నిధులు కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు పింక్‌బుక్‌లో వెల్లడించారు.

సబ్‌వేను త్వరితగతిన పూర్తి చేయాలి

సబ్‌వే నిర్మాణవిషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిని పూర్తి చేయాలి. రైల్వేబడ్జెట్‌లో రాజంపేట 103 లెవల్‌ క్రాస్‌గేట్‌ స్ధానంలో సబ్‌వే నిర్మాణానికి నిధులు కేటాయించడం హర్షణీయము. సబ్‌వేను అందుబాటులోకి తీసుకొస్తే ఆర్వోబికి ఇరువైపు ఉన్న ప్రాంతీయులు ఇబ్బందులు తీరుతాయి. –రెడ్డిమాసి రమేష్‌నాయుడు, వైఎస్సార్‌సీపీనేత, రాజంపేట

ఎంపీ మిథున్‌రెడ్డి కృషితోనే నిధుల కేటాయింపు

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రాజంపేట సబ్‌వే నిర్మాణ అంశాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సెక్షన్‌ అనేక ప్రాంతాల్లో ఆర్‌యూబీల నిర్మాణానికి కృషిచేశారు. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న సబ్‌వే నిర్మాణానికి రైల్వేంత్రి, జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా రైల్వేబడ్జెట్‌లో సబ్‌వే నిర్మాణానికి నిధులు కేటాయించారు.

–తల్లెంభరత్‌రెడ్డి, సభ్యుడు, గుంతకల్‌ డీఆర్‌యుసీసీ

రాజంపేట సబ్‌వేకి కదలిక! 1
1/2

రాజంపేట సబ్‌వేకి కదలిక!

రాజంపేట సబ్‌వేకి కదలిక! 2
2/2

రాజంపేట సబ్‌వేకి కదలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement