
ఎస్‌ఐ కారును ఢీకొని బోల్తా పడిన ఐచర్ వాహనం
కురబలకోట : మహిళా ఎస్‌ఐ కారును ఐచర్‌వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐకు పెనుప్రమాదం తప్పింది. ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ వివరాల మేరకు.. మదనపల్లె రూరల్ స్టేషన్ మహిళా ఎస్‌ఐ గాయత్రి బుధవారం తంబళ్లపల్లె కోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారులో మదనపల్లెకు బయలుదేరారు. కడప క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా టమాటా లోడ్‌తో వచ్చిన ఐచర్ వాహనం ఎస్‌ఐ కారును రెప్పపాటున రాసుకుంటూ వెళ్లింది.
ఈ క్రమంలో ఐషర్ వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్‌ఽ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. అక్కడే బస్సుకోసం వేచి ఉన్న చౌటకుంటపల్లెకు చెందిన రెడ్డెమ్మ(50), నారేవాండ్లపల్లెకు చెందిన అరుణమ్మ(56), కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ(65)లకు తీవ్ర గాయాలయ్యాయి. ముదివేడు టోల్‌ఫ్లాజా సిబ్బంది వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మహిళా ఎస్‌ఐ గాయత్రికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమెను సమీపంలోని ముదివేడు స్టేషన్‌కు తరలించి.. ఆ తర్వాత మదనపల్లె పట్టణంలోని ఇంటికి పంపారు. ఈ సంఘటనపై డ్రైవర్‌పై కేసు నమోదుచేసి ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. అయితే బస్టాపు వద్ద ప్రయాణికులు ఎక్కువమంది వేచి ఉండడంతో వారిపై లారీ పడి ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.