
విద్యుత్ చీకటి ఒప్పదంతో ప్రజలకు వెన్నుపోటు
రైల్వేకోడూరు అర్బన్ : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.60 పైసలతో ఒప్పందం చేసుకొంటే గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు, ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు.. సీఎం చంద్రబాబు తాజాగా యూనిట్ రూ.4.60తో ఒప్పందం చేసుకుంటే స్పందించరేమని రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అప్పుడు 2.60 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకొంటే చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయన్నారు. ఇపుడు యాక్సిస్‌తో రూ.4.60 పైసలకు ఏరకంగా ఒప్పందం చేసుకుంటారు... ఇది కుంభకోణం కాదా అని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లు ఒప్పందాలతో భవిష్యత్తు తరాలపై భారం మోపిన చంద్రబాబు ఏం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు కిమ్మనకున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి మేలు చేయడానికి సోలార్ ఎనర్జీపై కేంద్ర సంస్థ సెకీ నిబంధనల మేరకు అప్పటి ఏపీ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.60 పైసలతో కొనేందుకు ఒప్పందం చేసుకుంటే అమెరికాకు లింకులు పెడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రెండు పత్రికలు విష ప్రచారం చేసాయన్నారు ఇప్పుడు చంద్రబాబు మోపుతున్న భారాలు, తక్కువ కాలంలో చేసిన అప్పుల భారం వారికి కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఏడాదిలో ప్రజలపై సుమారు రూ.15,835 కోట్లు విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని ఊదర కొడుతూ పేదలను నమ్మించి వంచన చేశారని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కొరముట్ల శ్రీనివాసులు