కన్నేశారు.. కమ్మేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

May 21 2025 12:33 AM | Updated on May 21 2025 12:33 AM

కన్నే

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

హుండీ ఆదాయం లెక్కింపు

సంబేపల్లె: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. బ్యాంక్‌ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొత్తం రూ.3,23,700 ఆదాయం వచ్చినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. ఈ నగదును బ్యాంక్‌ ఖాతాలో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఫారంపాండ్‌ పనుల పరిశీలన

గాలివీడు: మండలంలోని నూలివీడు గ్రామం చీమల చెరువుపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఫారంపాండ్‌ పనులను ఉపాధి పీడీ వెంకటరత్నం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించి, ఆర్థిక భరోసా ఇవ్వాలని సూచించారు.. పీడీ వెంట ఏపీఓలు హరిబాబు, రామచంద్ర, టీఏ, ఎఫ్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

దేవదాయ భూములను పరిరక్షించాలి

రాయచోటి: జిల్లాలోని దేవదాయ శాఖ భూములను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో దేవాలయ భూముల పరిరక్షణపై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరియైన ధరకు వేలం నిర్వహించి భూములను లీజుకు ఇవ్వాలని ఆదేశించారు. దేవాలయాల్లో పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, దేవదాయశాఖ అధికారి సి.విశ్వనాథ్‌, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, టెంపుల్‌ ఈఓలు, తనిఖీదారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమిఆక్రమణకు యత్నం

అధికారులుఅడ్డుకుంటున్నా.. వదలని అక్రమార్కులు

కబ్జాదారులకుకూటమి నేతల అండ

సరిహద్దులు లేకపోవడంతో చెలరేగుతున్న వైనం

గుర్రంకొండ: ప్రభుత్వ భూములపై కొందరు అక్రమార్కులు కన్నేసి.. కబ్జా చేస్తున్నారు. అధికారులు అడ్డుకుంటున్నా.. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల అండతో ముందుకు సాగుతున్నారు. మండలంలోని గుర్రంకొండ పంచాయతీ చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామ సమీపంలో సర్వే నంబరు 87/8లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది గుర్రంకొండ పట్టణ సమీపంలో.. జాతీయ రహదారి 340 పక్కనే ఉండటంతో.. భారీగా విలువ చేస్తోంది. ఈ భూమికి సంబంధించి ఇంత వరకు ఎవరికీ పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో ఎకరం రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో కొంత మంది కబ్జాదారుల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. వారి నుంచి కాపాడుకోవడానికి రెవెన్యూ అధికారులు నెలన్నర క్రితం సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా.. వాటిని కొంత మంది కూటమి నేతలు అడ్డుకుని రెవెన్యూ ఆధికారులను అక్కడి నుంచి పంపించి వేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

కొన్నాళ్లు గుంభనంగా ఉన్న కబ్జాదారులు అప్పట్లో మళ్లీ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నెల క్రితం తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబరు 87/8లో ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.

మళ్లీ మొదలైన కబ్జా యత్నాలు: కొన్నాళ్లు వేచి చూసిన కబ్జాదారులు మళ్లీ ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండు రోజులుగా ముమ్మరం చేశారు. ఆ భూమిలో ఉన్న వేప తదితర చెట్లను మెల్లమెల్లగా నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి.. భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చాలా చదును చేసే పనుల్లో భాగంగా.. బయటి ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఇప్పటికే మట్టికుప్పలు దర్శనమిస్తుండటం గమనార్హం. రెవెన్యూ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూమి ఆక్రమణ పనులు మెల్లగా మొదలు పెడుతున్నారు.

ముందుకు సాగని సర్వే పనులు

నెలన్నర క్రితం ఆగిపోయిన ప్రభుత్వ భూమి సర్వే పనులు.. మళ్లీ ముందుకు సాగడం లేదు. కేవలం బోర్డులు పెట్టి వదిలేయడంతో మళ్లీ కబ్జా యత్నాలు పుంజుకొంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు సర్వే పనులు పూర్తి చేసి.. సరిహద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూములు కాపాడా లని గ్రామస్తులు కోరుతున్నారు.

చెట్ల నరికివేతను అడ్డుకున్నాం

చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 87/8లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంత మంది చెట్లను నరికివేస్తుండడంతో అడ్డుకొని పంపించి వేశాం. ఇప్పటికే సదరు భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయించి త్వరలోనే సరిహద్దులు ఏర్పాటు చేస్తాం. ఆ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడుతాం.

– శ్రీనివాసులు, తహసీల్దార్‌, గుర్రంకొండ

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 1
1/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 2
2/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 3
3/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 4
4/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 5
5/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 6
6/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

కన్నేశారు.. కమ్మేస్తున్నారు! 7
7/7

కన్నేశారు.. కమ్మేస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement