●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం

May 21 2025 12:33 AM | Updated on May 21 2025 12:33 AM

●రాజం

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం

సాక్షి రాయచోటి: ‘కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కాకమునుపే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.. ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో తిప్పికొట్టాలి. అంతేకాకుండా ప్రజల సంక్షేమం కోసం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు కూటమిపై ఆందోళన బాట పట్టాలి. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యం. యువత, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు, సానుభూతిపనులు, అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి. తద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపడటంతోపాటు తిరుగులేని విధంగా దూసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలి’ అని పార్టీ కీలక నేతలు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు, కడప నగర మేయర్‌ కొత్తమద్ది సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్‌చార్జి నిసార్‌ అహ్మద్‌తోపాటు పలువురు నేతలు పార్టీకి సంబంఽధించిన అనేక అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అనుబంధ విభాగాల పటిష్టత, ఇతర అనేక అంశాలపై చర్చించారు.

అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలి

అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతోపాటు పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకలు, ఇతర పార్టీ శ్రేణులు వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నేతలు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కలిసికట్టుగా ముందుకు వెళుతూ ప్రజా ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని.. ప్రభుత్వం అన్యాయం చేసిన వారికి పార్టీ తరుఫున పోరుబాట చేపట్టేలా కార్యకర్తలు ముందుండాలన్నారు. ఇప్పటికే కూటమి సర్కార్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఇంతకుమునుపు ఏ ప్రభుత్వానికి ఏడాదిలోపే ఇంత వ్యతిరేకత కనిపించలేదని అభిప్రాయపడ్డారు. సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోగా, ఇతర సంక్షేమాన్ని అందించని వైనాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, పార్టీ శ్రేణులు, నాయకులు అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కదం తొక్కుతూ కదలాలని.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని వారు సూచించారు.

ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరుబాట

రాష్ట్రలలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలపై ఎప్పటికప్పుడు పోరుబాట పట్టేలా నేతలు పథక రచన చేశారు. వైఎస్సార్‌సీపీ కీలక నేతల సమీక్ష సందర్భంగా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పుటికప్పుడు ఉద్యమబాట పట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా అధిష్టాంనం ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలువాలని నిర్ణయించారు. కూటమి అరాచకాలు, భూకబ్జాలు, బెదిరింపులు, అక్రమ వ్యవహారాలపై పోరుబాట పట్టాలని సంకల్పించారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవడంతోపాటు ప్రజలకు మద్దతుగా నిలవాలని సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

బలోపేతమే ధ్యేయం

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు మండలాలు, గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని ప్రతిన బూనారు. ప్రధానంగా మండల కమిటీలతోపాటు నియోజకవర్గ, జిల్లా అనుబంధ కమిటీలను ఎప్పటికప్పుడు సకాలంలో వేసుకుని.. అందులో అన్ని వర్గాలకు సముచితన్యాయం కల్పించడం ఒక లక్ష్యం కాగా.. మరో పక్క వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడంతోపాటు అన్ని విధాలుగా ప్రభుత్వంపై పోరాటానికి ముందుండేలా సమాయత్తం చేశారు.

వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలి

సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రణాళిక

అన్ని విభాగాలు, అనుబంధ కమిటీల్లో నాయకులను నియమించేలా కసరత్తు

ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాడేందుకు వ్యూహ రచన

కార్యకర్తలతోపాటు నాయకులు, శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగాలని నేతల పిలుపు

అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు పరిశీలకునిగా ఎన్నికై న కడప నగర మేయర్‌ సురేష్‌బాబును నేతలు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ అఽధికార ప్రతినిది, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్‌చార్జి నిస్సార్‌ అహ్మద్‌ తదితరులు సురేష్‌బాబును సత్కరించారు. ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం 1
1/3

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం 2
2/3

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం 3
3/3

●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement