
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నిమ్మనపల్లె : రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం ఎగువ కురవంకలో నివాసముంటున్న షేక్ రెడ్డిబాషా శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి నిమ్మనపల్లెలోని సయ్యద్‌షావలి దర్గా వద్ద జరిగే ఉరుసు చూసేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి సింగంవారిపల్లెకు వెళ్లేందుకు చిన్నళ్లవారిపల్లెకు చెందిన పఠాన్ ముస్తఫా ఆటో బాడుగకు మాట్లాడుకుని కుటుంబసభ్యులతో బయలుదేరారు. మార్గమధ్యంలో సైదాపేట మలుపు వద్ద కందూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో రెడ్డిబాషా(46), తాజున్‌బీ(40), ఇమ్రాన్(17), అసిఫా(14)తోపాటు ఆటో డ్రైవర్ ముస్తఫా(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను నిమ్మనపల్లె పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు