
చర్చలలో ఒక తీరు, నిర్ణయాలు మరో తీరు..
పాఠశాలల పునః వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ఒక తీరుగా, నిర్ణయాలను అమలు చేసేటప్పుడు మరో తీరుగా వ్యవహరిస్తోంది. జీఓ 117ను బేషరతుగా రద్దుచేసి, దాని స్థానంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునః వ్యవస్థీకరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. అన్ని ప్రాథమిక పాఠశాలలలో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలనే ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్‌ల స్థాయిని దిగజార్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్‌గా నియమిస్తామనడం సరికాదు.
– మాదన విజయకుమార్,
యూటీఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు