
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. కార్పొరేష
● సురేష్‌బాబుపై కక్షగట్టిన
ఎమ్మెల్యే మాధవిరెడ్డి
● అధికారుల తప్పిదాన్ని బూచిగా
చూపెట్టి ప్రభుత్వం ద్వారా చర్యలు
● కార్పొరేషన్‌లో రూ.36లక్షల కాంట్రాక్టు పనులు చేశారని అనర్హత వేటు
సాక్షి ప్రతినిధి, కడప : కడప మేయర్ సురేష్‌బాబుపై దొంగదెబ్బ కొట్టారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్దిని కనస్ట్రక్షన్స్ సంస్థ రూ.36 లక్షలు కాంట్రాక్టు పనులు చేశారని బూచిగా చూపెట్టి అనర్హత వేటు వేశారు. ఆమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 446 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పగబట్టి దొంగ దెబ్బతీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొలేమని అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని అనర్హత వేటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కడప కార్పొరేషన్‌లో లేని ప్రొటోకాల్ కావాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టుబట్టారు. సాధ్యపడకపోవడంతో కడప మేయర్ సీటుపై కన్నేశారు. ఎలాగైనా కై వసం చేసుకోవాలనే అంచనాకు వచ్చారు. సామ బేధ దండోపాయాలను ప్రయోగించినా 8మంది కార్పొరేటర్లు మాత్రమే మొగ్గు చూపారు. అవిశ్వాసంతో దింపలేమని స్పష్టమైంది. లొసుగులు, లోటుపాట్లుపై దృష్టి పెట్టారు. మేయర్ సురేష్‌బాబు తనయుడు అమరేష్ కాంట్రాక్టు సంస్థను రిజిస్టర్ చేసుకున్న విషయాన్ని పసిగట్టారు. కాంట్రాక్టు అనుభవం కోసం చేసిన పనులను బూచిగా చూపెట్టారు. ముందుగా కార్పొరేషన్‌ను అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ లు చేశారు. విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంటుకు ఫిర్యాదు చేశారు. పనుల్లో ఎలాంటి అవినీతి లేదని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు ధ్రువీకరించింది. మున్సిపల్ యాక్టుపై దృష్టి సారించారు. అధికారంలో ఉన్న మేయర్ కుటుంబ సభ్యులు కార్పొరేషన్‌లో పనులు చేపట్టరాదనే ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ద్వారా చర్యలు చేపట్టారు.
అధికారులపై చర్యలేవీ....
ఆగమేఘాలపై మేయర్ సురేష్‌బాబుపై చర్యలు తీసుకున్న ప్రభుత్వ పెద్దలు కారకులైన అధికారులను విస్మరించారు. మేయర్ మాత్రమే టార్గెట్‌గా వ్యవహరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కాంట్రాక్టు సంస్థ కార్పొరేషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే అభ్యంతరం చెప్పాల్సింది ఎవరు? చట్టం తెలిసిన అధికారులే కదా? మున్సిపల్ నిబంధనలు ప్రకారం కార్పొరేషన్‌లో పనులు చేయరాదంటూ అభ్యంతరం చెప్పాలి కదా? ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కన్పిస్తోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. పైగా కార్పొరేషన్ పరిధిలో రూ.10లక్షల లోపు పనులు అధికారుల కనుసన్నుల్లోనే చేపట్టనున్నారు, స్టాండింగ్ కమిటీ దృష్టికి కూడా రావు. రూ. 50లక్షల పైబడిన పనులు మాత్రమే జనరల్ బాడీకి చేరనున్నాయి. మరోవైపు రూ.36లక్షల కాంట్రాక్టు పనుల్లో అవినీతి లేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు నివేదికలు ఇచ్చాయి. అయినా ఇలా అనర్హత వేటు వేయడం రాజకీయంగా దొంగదెబ్బ కొట్టడమేనని పలువురు వెల్లడిస్తున్నారు.
ఆగమేఘాలపై చర్యలు...
ప్రభుత్వం మేయర్‌పై అనర్హత వేటు వేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు మొదటి నుంచి స్పష్టమౌతోంది. మేయర్‌గా సురేష్‌బాబుకు నోటీసు అందకముందే టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి నోటీసులు మీడియాకు చూపెట్టడం తెలిసిందే. పైగా మంగళవారం సాయంత్రం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్‌బాబును వి చారించారు. మేయర్ తన వివరణ ఇచ్చిన 24గంటలు కూడా గడవకముందే అనర్హత వేటు ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. సీఎంఓ డైరెక్షన్‌లో జిల్లా అ ధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూహాత్మకంగా దెబ్బకొట్టుతున్న
చంద్రబాబు సర్కార్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేశారు. 51శాతం స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిథ్యం వహించాలని సంకల్పించారు. క్షేత్రస్థాయిలో అమలు పర్చారు. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు అదే బీసీ, ఎస్సీలను లక్ష్యం చేసుకొని దొడ్డిదారిన దెబ్బకొడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వైజాగ్, గుంటూరు మేయర్, తిరుపతి డిప్యూటీ మేయర్, మాచర్ల మున్సిపల్ చైర్మన్ స్థానాలను ౖకైవసం చేసుకున్న తీరును వారు వివరిస్తుండడం విశేషం.
బీసీ నేతపై కక్షసాధింపు చర్యలు
బీసీ నేత కడప మేయర్ సురేష్‌బాబును తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కక్షసాదింపు చర్యలు చేపట్టింది. తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ ద్వారా కాంట్రాక్టులు పొందారని ఆరోపణలు మేయర్ పదవినుంచి తొలగిస్తూ జీఓ జారీ చేయడం అన్యాయం. ఈచర్య పూర్తిగా రాజకీయ కక్షసాధింపే. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అణచివేత ధోరణిని అవలంబిస్తోంది. అందులోనూ ముఖ్యంగా బీసీ నేతలపై చర్యలు చేపట్టడం విడ్డూరంగా ఉంది. – డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ

కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. కార్పొరేష

కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. కార్పొరేష

కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. కార్పొరేష