
కూటమిలో చేరి.. భూమిని దోచేసి!
ఒంటిమిట్ట : గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను తెలుగు తమ్ముళ్లు దర్జాగా దోచేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి గ్రామంలో గల సర్వే నంబరు 9లోని 79 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇటీవల ఇన్‌చార్జి ఎంపీపీగా ఎన్నికై న నల్లగొండ లక్ష్మీదేవి భర్త నల్లగొండ వెంకట సుబ్బారెడ్డి గతంలో ఆవుల మంద ఉన్న 80 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు రాచగుడిపల్లి గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ వెంకటరమణమ్మకు వినతిపత్రం అందజేశారు. భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరేందుకు కారణం భూ కబ్జాలు చేసేందుకేనని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలాంటి భూ ఆక్రమణలు జరగలేదని, కేవలం కూటమి ప్రభుత్వం వచ్చాకే అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూటమి నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
టీడీపీ మద్దతుతో ఇన్‌చార్జి ఎంపీపీని దక్కించుకున్న నల్లగొండు లక్ష్మీదేవి
ఎన్నికై న కొద్ది రోజులకే భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ఎంపీపీ భర్త
తహసీల్దార్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

కూటమిలో చేరి.. భూమిని దోచేసి!