
ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కడప ఎమ్మెల్యే మాధవీకి కార్పొరేటర్లంతా ఘనంగా స్వాగతం పలికి ఎంతో గౌరవించారు. కానీ ఆమె తమను చులకన భావంతో చూసింది. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మేయర్ ఇంటిపై చెత్త వేయించింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు నిబంధనల ప్రకారం ఎక్కడ కుర్చీ వేయాలో అక్కడే వేశారు. దాన్ని ఎమ్మెల్యే అవమానంగా భావించి ఇలా రాద్దాంతం చేయడం దారుణం.
– రామలక్ష్మణ్‌రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్
మేయర్ ఎన్నిక సమయంలోనే ఇవన్నీ చూడాలి
మేయర్‌ను ఎన్నుకునే సమయంలోనే వారికి కాంట్రాక్టులు ఉన్నాయా? వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉన్నాయా? అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మేయర్ ఎన్నిక పూర్తయి 2023లో వర్దిని కన్‌స్ట్రక్షన్ సంస్థ పుట్టింది. వర్దిని కన్‌స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేసి ఉండాలి. బీసీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వారిని పదవుల నుంచి తప్పిస్తోంది.
– బసవరాజు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రజాస్వామ్యం ఖూనీ
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. కడప నగర పాలక సంస్థలో 50 స్థానాలకుగాను 49 మంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌ను ఏమి చేసుకోలేక ఎనిమిది మంది కార్పొరేటర్లను అన్ని విధాలుగా భయపెట్టి, మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుమారుడు చేసిన కాంట్రాక్టు పనుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణలో చెప్పలేదు.
– మల్లికార్జున, 10వ డివిజన్ కార్పొరేటర్

ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం

ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం