
కాలుష్యంతో ప్రాణాలు పోతున్నాయి
ఓబులవారిపల్లె : కంకర క్రషర్ ద్వారా నీరు కాలుష్యం అవుతోంది.. రోగాల బారిన పడి ప్రాణాలు పోతున్నాయి. కాపాడండి సారూ అంటూ మండలంలోని గోవిందంపల్లి గ్రామస్థులు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఇటీవల కంకర క్రషర్‌ఫై ఫిర్యాదు చేయడంతో కర్నూలు, కడప ఉమ్మడి జిల్లా కాలుష్య నియంత్రరణ అధికారి సుధారాణి గురువారం పరిశీలించారు. గోవిందంపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ కంకర క్రషర్ ద్వారా వెలువడే కాలుష్యంతో దుమ్ము, ధూళి పెరగడంతో కిడ్నీ, శ్వాస కోస, క్యాన్సర్ రోగాల బారిన పడి చాలామంది చనిపోయారన్నారు. అంతేగాక మంగంపేట ఏపీఎండీసీ గనులకు 300 మీటర్ల వరకు డేంజర్ ప్రాంతంగా ఏపీఎండీసీ అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే గనులకు 75 మీటర్ల లోపు కంకర క్వారీ ఏ విధంగా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పేలుళ్లకు కాలుష్యం ప్రబలుతోందని, అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కాలుష్య నియంత్రణ అధికారిణి ఉషారాణి మాట్లాడుతూ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ నియంత్రణ సహాయ అధికారి అనిల్‌కుమార్‌రెడ్డి, ఈశ్వర్‌రాజు, చంద్రరాజు, కేశవరాజు పాల్గొన్నారు.

కాలుష్యంతో ప్రాణాలు పోతున్నాయి