
ఎర్రచందనం కేసుల్లోని నిందితులకు కౌన్సెలింగ్
సిద్దవటం : ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి కేసుల్లోని నిందితులకు బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేంజర్ మాట్లాడుతూ పాత ఎర్రచందనం కేసుల్లోని నిందితులు ఇకపై సత్ ప్రవర్తనతో మెలగాలని సూచించామన్నారు. ప్రలోభాలకు లోనై మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడితే వారిపై తీసుకునే చర్యలు, విధించే శిక్షలు, పర్యావరణానికి కలిగే నష్టం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ కె. ఓబులేసు, ఎఫ్‌ఎస్‌ఓ సురేష్‌బాబు, బీట్ అధికారులు, అసిస్టెంట్ బీట్ అధికారులు పాల్గొన్నారు.