
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణే కీలకం
రాయచోటి: టెక్నాలజీ ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యమైన కేసుల దర్యాప్తునకు నేర పరిశోధనలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలే ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దర్యాప్తు అధికారులకు సూచించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, కర్నూలు రేంజ్ డీఐజీ సూచనల మేరకు బుధవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోకుండా నేర స్థలంలో సాక్ష్యాధారాల సేకరణ, వాటి భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని సూచించారు. పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు కొత్త పద్ధతులను ఉపయో గిస్తున్న సందర్భంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఈ శిక్షణా తరగతులలో అందిపుచ్చుకోవాలన్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో గల అన్ని విభాగాలకు సంబంధించిన నిష్ణాతులైన వారితో ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు అధికారులు శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ డివిజన్ ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, విజయవాడ ఫోరెన్సిక్ నిపుణులు ఇ.కిరణ్ కుమార్, ఎం.మురళీ, అనంతపురం ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు కె.జయరాజు, వై. కుళాయమ్మ, జిల్లాలోని సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ
విద్యాసాగర్ నాయుడు
నేరగాళ్ల ఎత్తుగడలకు సాంకేతిక
పరిజ్ఞానంతో అడ్డుకట్ట
ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై ఒక్కరోజు శిక్షణా తరగతులు