
ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోనికి తీసుకోవాలి..
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా విద్యా శాఖాధికారులు ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి గ్రామంలో 1 నుండి 5 తరగతులతో ప్రాథమిక పాఠశాలలను తప్పనిసరిగా కొనసాగించాలి. 1 నుండి 10 తరగతుల విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్ని రకాల సబ్జెక్టు టీచర్లను నియమించాలి. ఉన్నత పాఠశాలలలో 45 మంది విద్యార్థులు దాటితే రెండవ సెక్షన్ , 80 మంది దాటితే మూడవ సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి.
– ఆదిరెడ్డి శ్యాసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు