
సురభి లే అవుట్‌లో చోరీ
మదనపల్లె రూరల్ : మండలంలోని పొన్నూటిపాలెం పంచాయతీ సురభి లే అవుట్‌లో సోమవారం చోరీ జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు నాగపరిమళ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నక్కలదిన్నె సత్సంగ్ సమీపంలోని సురభి లేఅవుట్ రోడ్డులో శంకరరెడ్డి, నాగపరిమళ దంపతులు నివాసముంటున్నారు. సత్సంగ్ ఫౌండేషన్‌కు చెందిన స్వాస్థ ఆస్పత్రిలో నాగపరిమళ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. సోమవారం ఆమె విధులకు వెళ్లగా భర్త శంకరరెడ్డి పట్టణంలోకి వచ్చాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నాగపరిమళ ఇంట్లో వస్తువులు చిందరవందరగా, బీరువా తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని భర్త శంకరరెడ్డికి విషయం తెలిపారు. ఆయన డయుల్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్ ద్వారా వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. అనంతరం మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా చోరీ ఘటనలో తమ ఇంట్లోని బీరువాలో ఉంచిన సుమారు 100గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, దాదాపు 400 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.50వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లినట్లు బాధితులు తెలిపారు.
రూ.10 లక్షల విలువైన
ఆభరణాల అపహరణ