
మినీ మహానాడుకు బత్యాల, కస్తూరి డుమ్మా
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, టిడిపి రాష్ట్ర నిర్వహక కార్యదర్శి, మాజీ ఇన్‌చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు హాజరుకాకపోవడంపై పలువురు టీడీపీ శ్రేణులు చర్చించుకున్నారు. స్థానిక రాజు రెసిడెన్షీలో మంగళవారం ముందస్తుగా టీడీపీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కస్తూరి, బత్యాల వర్గీయులు హాజరుకాలేదు. గత నెలలో రూపానందరెడ్డి కార్యాలయం వద్ద బయటపడ్డ వర్గ విభేదాలు ఇంకా సమసిపోలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ఓబులవారిపల్లె : విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో మండలంలోని జె.వడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.నారాయణమ్మ ఇల్లు మంగళవారం దద్ధమైంది. వేసవికాలం కావడంతో నారాయణమ్మ ఇంటి బయట నిద్రిస్తోంది. తెల్లవారుజామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు మంటలు అదుపుచేసే లోగా వస్తువులు కాలిపోయాయి. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం రూ.1,50,000ల నగదు తెచ్చి ఇంట్లో ఉంచింది. ఆ డబ్బు కూడా కాలి బూడిదవడంతో ఆమె బోరున విలపించింది. సామగ్రి కాలిపోయి కట్టుబట్టలతో ఉన్నతనను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.
ఉరి వేసుకుని
బీటెక్ విద్యార్థి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని అంబకపల్లి రోడ్డు సమీపంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని యువతి స్వాతి మృతిచెందింది. పోలీసుల కథన మేరకు.. వరప్రసాద్, కళావతిల కుమార్తె స్వాతి బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందినట్లు సీఐ చాంద్‌బాషా తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మినీ మహానాడుకు బత్యాల, కస్తూరి డుమ్మా