నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
రాయచోటి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 37, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 26 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
13978 మంది విద్యార్థులు.....
జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 10726 మంది, ద్వితీయ ఏడాదికి సంబంధించి 3252 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంపంధించి ఇంప్రూవ్‌మెంట్ రాసే వారి సంఖ్య అధికంగా ఉంది. జనరల్ 10726 మంది ఉన్నారు. కాగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 37 మంది డిపార్టుమెంట్, 37 మంది చీఫ్ సూపరిటెండెంట్లను నియమించారు. ద్వితీయ ఏడాదికి సంబంధించి 26 మంది డిపార్టుమెంట్ అధికారులు, 26 మంది చీఫ్ సూపరిటెండెంట్లను నియమించారు. వీరితోపాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. పశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని ఆయా పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
రెండు సెషన్లలో....
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ ఏడాదికి సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 13978 మంది విద్యార్థులు


