ఆదుకునేవారు లేరు
గ్రామాల్లో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా వూరింది. వరుసగా పంటలు పండక నష్టపోతున్నా ఆదుకొనేవారు లేరు. ప్రభుత్వ సబ్సీడీ పథకాలు అందడంలేదు. ప్రతి ఏడాది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం తప్పితే మరే పనిచేయలేకున్నాం. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడంలేదు.
– రెడ్డిమోహన్, కౌలురైతు, గుర్రంకొండ.
జిల్లాలో కౌలురైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. ఏడాదిన్నర కాలంగా ఒక్కరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. కనీసం సబ్సీడీపై ఎరువులు, విత్తనాలు కుడా ఇవ్వడం లేదు. బ్యాంకర్లు బ్యాంకులవైపు కౌలురైతులను రానివ్వడం లేదు. పంటనష్టపరిహారం అందలెదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– రమేశ్‌బాబు, జిల్లా కౌలురైతుల సంఘం కార్యదర్శి, టి.రాచ పల్లె
నేను మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేశాను. వైరస్‌లు, బొప్పాయిపై నల్లమచ్చలు ఏర్పడిన కారణంగా పంట దెబ్బతింది. ధరలు పూర్తిగా పడిపోయాయి. తోటలో కాయలను కిలో రూ.1 కి ఇస్తామన్నా వ్యాపారులు రాలేదు. పంటసాగుకు ఖర్చుచేసిన పెట్టుబడి కూడా రాలేదు. పంటనష్టపోయినా నాకు నష్టపరిహారం కూడాఅందలేదు.
– వెంకటరమణారెడ్డి,
కౌలురైతు, దిగువ బురుజుపల్లె
ఆదుకునేవారు లేరు
ఆదుకునేవారు లేరు


