ఘనంగా నల్లగంగమ్మ తిరునాల
సంబేపల్లె : మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయ నల్లగంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొలకలపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని వేపాకులతో శుద్ధిచేసి పచ్చని తోరణాలు, వివిధరకాల పుస్పాలతో అంకరించారు. ప్రతి ఏడాది మొలకల పౌర్ణమి రోజున అమ్మవారి తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి హోమాలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మొక్కులు తీరిన వారు చాందినీ బండ్లను అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పారు.ఆలయ కమిటీ సభ్యులు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. తిరునాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా స్థానిక ఎస్‌ఐ భక్తవత్సలం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


