
మాండవ్యా నదిని కాటేస్తున్న కాలుష్యం
మాండవ్యా నదిని కాలుష్యం కాటేస్తోంది. పట్టణం గూండా ప్రవహించే ఈ నదిలో ఇప్పటికే
ముళ్లకంపలు, తూడు, చెత్త పేరుకుపోయాయి. ఎటు చూసినా పట్టణ వాసులు వేస్తోన్న వ్యర్థాలు, జంతు కలేబరాలు దర్శనమిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రజలు దుర్గంధం భరించలేని పరిస్థితి. మాండవ్యా నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని రాయచోటి పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి మున్సిపల్ పరిధిలోని ఎగువ అబ్బవరం నుంచి ప్రారంభమై లక్ష్మీపురం, పాతరాయచోటి, మాసాపేటల గుండా వీరబల్లి మండలం వరకు మాండవ్యా నది ప్రవహిస్తోమంది. అనంతరం వీరబల్లి మండలంలోని పుల్లగూరమ్మ గండిలో కలుస్తుంది. వర్షాకాలంలో నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వర్షం పడనకపోతే నీరు లేక పిచ్చి మొక్కలు, పలు రకాల వ్యర్థాలు పెరుగుతున్నాయి. పట్టణంలోని వ్యర్థాలు కాలువల గుండా మాండవ్యానదిలోకి చేరుతాయి. దీంతో నీరు సరిగ్గా ప్రవహించక ఎక్కడికక్కడ పేరుకుపోయి దోమలు పెరుగుతున్నాయి. నదికి ఇరువైపులా ఉండే ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దుర్గంధం భరించలేకపోగా.. తరచూ జ్వరాల బారిన పడాల్సివస్తోందని ఇరువైపుల నివశించే ప్రజలు వాపోతున్నారు.
పర్యావరణానికి పెను ముప్పు
నిర్వహణ లోపం.. పేరుకుపోతున్న వ్యర్థాలు
దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు

మాండవ్యా నదిని కాటేస్తున్న కాలుష్యం