అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు ! | - | Sakshi
Sakshi News home page

అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !

May 11 2025 7:29 AM | Updated on May 11 2025 7:29 AM

అన్నమ

అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !

రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సంకీరన్తలు విశ్వవ్యాప్తి చేసేందుకు అన్నమయ్య వారసులు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో 2005లో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ను ఆగస్టు 30న తిరుపతిలో ప్రారంభించుకున్నారు. ఉభయ తెలుగురాష్ట్రాలలో సంకీర్తనల సేవతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవలను కొనసాగిస్తూ వస్తున్నారు. 12వ తరం అన్నమయ్య వారసులు ఏర్పాటుతో ప్రారంభమై ఇప్పుడు 13వ తరం వారసులు కూడా నేటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా)లో అన్నమయ్య సేవా సంస్కృతి అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు.

ఊరూరా అన్నమయ్యలో..

ఊరూరా అన్నమయ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆలయాలకు వెళ్లి సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విష్ణుపురాణం, హనుమాన్‌ చాలీసా, నగర సంకీర్తన కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నమయ్య పల్లకీసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అన్నమాచార్య సంకీర్తనలు, కోలటాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సామాజికసేవ, ఆధ్యాత్మికసేవ, అన్నమయ్య సంకీర్తన ప్రచారసేవ, సాంస్కృతిక సేవ, భక్తిసేవ, సంగీతసేవ, పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తున్నారు. కోలాటంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. పిల్లలకు స్తోత్ర మంజరి పై కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు.

ఏటా అన్నమయ్య ఆరాధనోత్సవాలు..

ప్రతి ఏటా అన్నమయ్య ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ నిర్వహించే అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలకు అన్నమయ్య 12 వతరానికి చెందిన హరిస్వామి విధిగా పాల్గొంటున్నారు. ఈ ట్రస్ట్‌ చైర్మన్‌గా తాళ్లపాక రామ్‌చరణ్‌, వైస్‌చైర్మన్‌గా తాళ్లపాక కృష్ణధీరజ్‌, సెక్రటరీగా తాళ్లపాక గౌరీ ప్రసన్న, ఉభయ రాష్ట్రాల డైరెక్టర్లుగా కొఠారి సునీత, మీనాక్షి అన్నమయ్యలున్నారు.

సామాజిక సేవలోనూ..

ప్రతి సంవత్సరం మార్చి నుంచి జూన్‌ వరకు వేసవిలో విశాఖ, కర్నూలు నగరాలలో భక్తులకు దాహం తీర్చేందుకు మంచినీళ్లు, మజ్జిగ వితరణ కేంద్రాలను ఏర్పాటుచేసి అన్నమయ్యసేవను అందిస్తున్నారు. అలాగే పల్స్‌పోలియో, మెడికల్‌ క్యాంప్‌, రక్తదానశిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగుతోంది. అన్నమయ్య బాటలో ఆయన వారసులు ముందుకెళుతున్నారు.

12న అన్నమయ్య జయంత్యుత్సవాల్లో వారసులు..

ఈనెల 12న జరిగే అన్నమయ్య జయంత్యుత్సవా ల్లో అన్నమయ్య వారసులు పాల్గొంటారు. వారిని టీటీడీ గౌరవిస్తుంది. అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో ఊరూరా అన్నమయ్య..ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఊరూరా అన్నమయ్య..

ఇంటింటా అన్నమయ్య

ఉభయ తెలుగు రాష్ట్రాలలో

సంకీర్తనల సేవ

ఏటా అన్నమయ్య వర్ధంతి,

జయంతి, ఆరాధనోత్సవాలు

నడుం బిగించిన అన్నమయ్య

12వ తరం వారసులు

అన్నమాచార్యుని వంశీయులు కావడం పూర్వజన్మ సుకృతం

అన్నమాచార్యుని వారసులు కావడం మా పూర్వజన్మ సుకృతం. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు చూపిన మార్గంలో మేము నడుచుకుంటున్నాము. శ్రీవారిసేవ చేసుకునే మహాభాగ్యం దక్కింది. ఆధ్యాత్మిక, సామాజిక సేవలను చేస్తున్నాము. అన్నమయ్య కీర్తనలు విశ్వవ్యాప్తం చేసేందుకు. ఊరూరా అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని చేపట్టాము. టీటీడీ, భక్తుల సహకారంతో విజయవతంగా నిర్వహిస్తున్నాము.

– తాళ్లపాక హరినారాయణచార్యులు, తిరుమల

నలుదిశలా అన్నమయ్య

సంకీర్తనలకు విస్తృత ప్రచారం

తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ఊరూరా అన్నమయ్య..ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాలను ఏపీ, తెలంగాణలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామంటే భక్తులు, టీటీడీ సహకారం మరువలేనిది. – తాళ్లపాక గౌరీ ప్రసన్న,

ట్రస్ట్‌ సెక్రటరీ, తిరుమల

అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !1
1/2

అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !

అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !2
2/2

అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement