
నన్ను ఇండియా రప్పించండి
బి.కొత్తకోట : ఇక్కడ బతలేకున్నాను.. ఎలాగైనా నన్ను ఇండియా రప్పిస్తే నా కుటుంబంతో జీవిస్తాను.. అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. అందులో బాధితుడు పేర్కొన్న వివరాలు.. బి.కొత్తకోట జయశ్రీ కాలనీకి చెందిన అఫ్జల్ బేగ్ జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ మిత్రులు అతని నుంచి డబ్బు తీసుకుని మోసం చేసి కెనడా వెళ్లిపోయారు. డబ్బు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం అప్జల్‌పై కేసు నమోదు చేయడంతో 72 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి, బయటకు వస్తే మళ్లీ జైలుకు పంపుతారు. దీంతో బతకడం కంటే చావే నయం. నాకు నా కుటుంబంతో కలిసి జీవించాలని ఉంది. నన్ను ఇండియాకు రప్పించండి, నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఆర్థికంగా కృంగిపోయానంటూ సందేశంలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన వారు బాధితున్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
దుబాయ్‌లోని బి.కొత్తకోట
వాసి వేడుకోలు