
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. మండలంలోని పోతబోలు పంచాయతీ దళితవాడకు చెందిన వెంకటేష్ భార్య ఆర్. రమణమ్మ (55) భర్త మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె కుమారుడు కుషాల్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. రమణమ్మ ఆదివారం స్థానిక కూలీలతో కలిసి పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం కూలి పనులు ముగించుకుని తిరిగి వచ్చి, పోతబోలు నుంచి దళితవాడకు వెళ్తుండగా, ద్విచక్ర వాహనంలో ఒక యువకుడు వేగంగా వచ్చి ఆమెను ఢీకొని, ఎవరు గమనించలేదని అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదంలో రమణమ్మ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకు ని వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకుని, తిరిగి ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యా రు. అయితే మృతదేహాన్ని ఫ్రీజర్‌బాక్స్‌లో పెడుతు న్న సమయంలో ఒంటిపై తీవ్ర గాయాలను గుర్తించారు. ఈ లోపు సంఘటనా స్థలం వద్ద రమణమ్మను పోతబోలు గ్రామానికి చెందిన యాసిన్ లేపి కూర్చోబెడుతుండగా, తాము చూశామని తోటికూలీలు చెప్పారు. దీంతో యాసిన్‌ను ప్రశ్నించగా, అతను బుకాయించగా, కుటుంబ సభ్యులు తాలూకా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీ గదికి పోస్టుమార్టం నిమి త్తం తీసుకువచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.