
లోయలో పడిన కోలాట బృందం వాహనం
రాజంపేట : రాజంపేట–రాయచోటి ఘాట్‌రోడ్‌లోని లోయలో కోలాట బృందం పయనిస్తున్న బొలోరో లగేజి వాహనం బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కోలాట బృందంలోని వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో ఘోరప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి మదనపల్లెకు కోలాట బృందం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసు స్టేషన్‌లో ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు.
తప్పిన ఘోర ప్రమాదం

లోయలో పడిన కోలాట బృందం వాహనం