హెచ్‌వీఐ బాధితులకు అండగా.! | - | Sakshi
Sakshi News home page

హెచ్‌వీఐ బాధితులకు అండగా.!

May 19 2025 2:06 AM | Updated on May 19 2025 2:06 AM

హెచ్‌

హెచ్‌వీఐ బాధితులకు అండగా.!

మదనపల్లె సిటీ : కౌన్సెలింగ్‌తో హెచ్‌ఐవీ బాఽధితులకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (శాక్స్‌) వ్యాధి నివారణకు నివారణ చర్యలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్లు(ఐసీటీసీ)లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది మే మూడవ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్‌ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని మేము గుర్తుంచుకుంటాం, మేము మాట్లాడుతాం, మేము నడిపిస్తాం అనే నినాదం ఇచ్చారు. వ్యాధితో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ క్యాండిల్స్‌ వెలిగించి నివాళులు అర్పిస్తారు.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్నవారికి ఏఆర్‌టీ (యాంటీ రిట్రోవైరల్‌) కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఆత్మసైర్థ్యాన్ని నింపేలా కౌన్సెలింగ్‌ను ఇవ్వడంతో పాటు అవసరమైన మందులను అందిస్తున్నారు. జిల్లాలో మదనపల్లెలో ఏఆర్‌టీ కేంద్రం ఉంది. దీంతో పాటు రాయచోటి, పీలేరు ఏఆర్‌టీ ప్లస్‌, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, వాల్మీకిపురం, రాజంపేట, లక్కిరెడ్డిరెడ్డి, రైల్వేకోడూరులలోని ప్రభుత్వ సీహెచ్‌సీలలో లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలున్నాయి. ఆయా ఐసీటీసీ కేంద్రాల్లో నిర్వహించే రక్తపరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉందని తెలితే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. వారందరిని ఏఆర్‌టీ కేంద్రాల్లో నమోదు చేసి మందులు అందజేస్తారు. నేషనల్‌ ఎయిడ్స్‌ ఆర్గనైజేషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిని రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌ఐవీ వచ్చాక బాధపడేకన్నా దాని బారిన పడకుండా చూసుకోవాలని పలు కార్యక్రమాలతో చైతన్యం పెంచుతున్నారు. ముందు జాగ్రత్తనే అసలైన మందు అనే విషయాన్ని వివరిస్తున్నారు. గతంతో పోలిస్తే బాధితులకు మందులు సకాలంలో అందిస్తుండటంతో ఆరోగ్యం మెరుగవుతోంది. ఏటా పరీక్షల సంఖ్యను పెంచుతూ పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నారు.హెచ్‌ఐవీ పాజిటివ్‌ గల గర్భిణికి ముందుగా పీపీటీసీటీ చికిత్స అందిస్తూ పుట్టబోయే బిడ్డను ఎయిడ్స్‌ నుంచి కాపాడే ప్రయత్నాలు జిల్లాలో జరుగుతున్నాయి.

అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. కళా బృందాలతో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాధితులకు అండగా నిలుస్తున్నాం. వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. ఆదివారం సాయంత్రం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులో క్యాండిల్స్‌ వెలిగించి మరణించిన వారి ఆత్మశాంతి కోసం నివాళులు అర్పిస్తాం.

– డాక్టర్‌ శైలజ, జిల్లా ఎయిడ్స్‌

నియంత్రణ అధికారి, రాయచోటి

కౌన్సెలింగ్‌తో మనోధైర్యం

ఉచితంగా మందులు పంపిణీ

నేడు అంతర్జాతీయ ఎయిడ్స్‌

కొవ్వొత్తుల స్మారక దినం

ఐసీటీసీ కేంద్రాలు మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం,

బి.కొత్తకోట, తంబళ్లపల్లె, రాయచోటి,

రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు

ఏఆర్‌టీ కేంద్రం

మదనపల్లె

హెచ్‌వీఐ బాధితులకు అండగా.! 1
1/1

హెచ్‌వీఐ బాధితులకు అండగా.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement