
శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనలతో విశ్వవ్యాప్తం
రాజంపేట : శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తమయ్యాయని రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. సోమవారం తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి సందర్భంగా ధ్యానమందిరంలోని అన్నమాచార్యుని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన గానంతో వెంకటేశ్వరస్వామి హృదయంలో స్ధానం కలిగిన అన్నమయ్యతో ఎవరు కూడా సాటిరారన్నారు. స్వామి అనుగ్రహంతో ఎవరూ ఈ సృష్టిలో రచించిలేని రచనలు ప్రారంభించిన అద్భుతమైన ప్రాంతం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక అన్నారు. వెంకటేశ్వరస్వామి మహిమలు, మహాత్యం.. తెలియలాంటే అన్నమయ్య కీర్తనలు విశ్వవ్యాప్తం కావాలన్నారు. స్వామివారిని ప్రత్యక్షంగా చూసిన, స్వామివారి అందాలను తన కీర్తనలతో అభివర్ణించి తెలియచేసిన మహాజ్ఞాని అన్నమయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రూరల్ కన్వీనర్ దొడ్డిపల్లె భాస్కరరాజు, ఎంపీటీసీ మధుబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు శివయ్య,రెడ్డయ్య,శేఖర్‌రెడ్డి, బోయనపల్లె సర్పంచి రాజా, బొడిచెర్ల సుబ్బరాయుడు, రామయ్య, శివకుమార్, సొంబెత్తిన శ్రీనువాసులు టీటీడీ అధికారులు తాళ్లపాక గ్రామస్తులు పాల్గొన్నారు
ఆకేపాటికి సత్కారం
అన్నమాచార్య జయంత్యుత్సవాలలో తొలిరోజు తాళ్లపాకలోని అన్నమాచార్య ధాన్యమందిరానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వచ్చారు. ఈసందర్భంగా టీటీడీ అధికారులు ఆయనను సత్కరించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదాలను అందచేశారు. అనంతరం కల్యాణవేదికపై ఆసీనులైన వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి,భూదేవి ఉత్సవమూర్తులను ఆకేపాటి దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి