
● పెద్దిరెడ్డి చేసిన కృషిని చూసి ఓర్వలేక..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరుజిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి చేసిన కృషి మరువలేనిది. వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్న ప్రజలు, రైతుల కోసం ప్రత్యేకంగా మూడు రిజర్వాయర్లు, పీబీసీ వెడల్పు, హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధాన పథకం మంజూరుకు చేసిన కృషి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. దీంతో రాజకీయంగా టీడీపీ బలహీన పడుతుందని ఈ పథకాలపై పెద్దిరెడ్డి కుటుంబ ముద్ర ఉండకూదడన్న కక్షతో కూడా ప్రభుత్వం వాటిని పక్కనపెట్టిందని ఈ ప్రాంత ప్రజలు గుర్తించారు.