
ఆటో ఢీకొని డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని డిగ్రీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. సత్యసాయిజిల్లా కదిరి మండలం కొండకమర్లకు చెందిన చాంద్‌బాషా కుమారుడు సుహేల్(21) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం పట్టణంలోని బీటీ కాలేజీలో పరీక్ష ముగించుకుని ద్విచక్రవాహనంలో కురబలకోట మండలం అంగళ్లులోని స్నేహితుడి వద్దకు వెళుతుండగా, మార్గమధ్యంలోని అమ్మచెరువుమిట్ట ఏసీ గోడౌన్ వద్ద ఆటో ఢీకొంది. ప్రమాదంలో సుహేల్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.