
డెంగీ నిర్మూలనకు కృషి చేద్దాం
రాజంపేట రూరల్ : పట్టణ, గ్రామ స్థాయిలో డెంగీ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ చిన్ని కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక ఏరియా వైద్యశాలలో శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ ఆకస్మికంగా జ్వరం రావడం, తలనొప్పి, విపరీతంగా కండరాలు, కీళ్లు, కాళ్ల నొప్పులు రావడం, చర్మంపై ఎర్రటి దద్దులు రావడం వంటి లక్షనాలు కనిపిస్తే ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రతి శుక్రవారం ప్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి జ్వరాలు ఎలా ప్రబలుతాయో ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ పళని వేంకటనాగేశ్వర రాజు, సానే శేఖర్, వికాస్, లక్ష్మీ ప్రసన్న, అశోక్, స్నేహ, ఎస్‌ఎస్.దాస్, పిల్లి జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.