
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
కలకడ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కలకడ మండలం కె.బాటవారిపల్లెకు చెందిన కార్పెంటర్ నాగార్జున, అతని కుమారుడు విష్ణు శుక్రవారం ద్విచక్ర వాహనంపై పీలేరు వైపు వెళ్తున్నారు. కడపకు చెందిన శివ రాయచోటి నుంచి సోమలవైపు వెళ్తున్నారు. కె.బాటవారిపల్లి సచివాలయం సమీపంలోకి రాగానే రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్పెంటర్ నాగార్జున, విష్ణులతోపాటు, శివకు తీవ్రగాయాలయ్యాయి. నాగార్జునను తిరుపతికి తరలించారు. కలకడ పోలీసులు విచారిస్తున్నారు.