
మహిళలపై పోలీసుల వైఖరి సిగ్గుచేటు
రాజంపేట రూరల్ : మహిళల పట్ల పోలీసులు రౌడీలుగా వ్యవహరించటం సిగ్గుచేటని, మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ సుబ్బనాయుడు తీరు దారుణమని వెఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి మండిపడ్డారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో ఆదివారం వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ, జిల్లా కార్యదర్శి రక్కాసీ శ్రీవాణీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండు చంద్రలీలతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో మహిళలకు ఎంతో ప్రాధా న్యత ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసుల ఎదుటనే దిశ చట్టానికి సంబంధించిన పేపర్లను తగలబెట్టడం బాధాకరమన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా మాజీ మహిళా మంత్రి విడదల రజని చేయి పట్టి లాగి పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా కారులోకి దూరి పీఏ శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.