
‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ పటిష్టంగా నిర్వహించాలి
రాయచోటి : ఈనెల 17న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో ఈనెల మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, జిల్లా స్థూల దేశీయోత్పత్తి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకంగా నియమించిన జోనల్ అధికారి ఈనెల 16న జిల్లాలో పర్యటించనున్నట్లు జేసీ తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.