మేం చెప్పిందే వేదం! | - | Sakshi
Sakshi News home page

మేం చెప్పిందే వేదం!

May 13 2025 2:44 AM | Updated on May 13 2025 2:44 AM

మేం చెప్పిందే వేదం!

మేం చెప్పిందే వేదం!

బియ్యం లారీ సీజ్‌ – విడుదల

కలికిరి : రేషన్‌ బియ్యం అక్రమంగా తరలుతున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ముని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే బియ్యం లారీని ఆపి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు లారీని సీజ్‌ చేసిన పోలీసులు సమాచారం ఉన్నతాధికారులకు తెలియచేశారు. బియ్యం రవాణాదారు మధ్యాహ్నానికి బియ్యం రవాణాకు సంబంధించి సంబంధిత రికార్డులను చూపడంతో పరిశీలించిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రవాణాదారుకు లారీని అప్పగించారు. అయితే లారీని అదుపులోకి తీసుకున్నప్పుడు లేని రికార్డులు మధ్యాహ్నానికి ఎలా వచ్చాయనేది చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, కడప : పోట్లదుర్తిలో మేం చెప్పిందే వేదం. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలు ఏవైనా సరే, మా ఇష్టారాజ్యంగా కొనసాగాల్సిందే. కోర్టు ఉత్తర్వులకు సైతం ధిక్కారమే. ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మమన్న గ్రామస్తులపై పోలీసు అధికారుల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. గ్రామ దేవత పెద్దమ్మ దేవాలయం ప్రాంగణం మొత్తం ప్రహరీ నిర్మించాలని హైకోర్టు ఉత్తర్వులున్నాయి. ఆ ఉత్తర్వులు అమలు చేయాల్సిందిగా దేవదాయశాఖ సంయుక్త కమిషనర్‌ ఎండోమెంటు అసిస్టెంట్‌ కమిషనర్‌ను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులు భేఖాతర్‌ చేస్తున్న వైనాన్ని ప్రశ్నించిన గ్రామస్తులపై ఖాకీ ఆగ్రహించిన వైనమిది.

పోట్లదుర్తి గ్రామంలో సర్వేనంబర్‌ 657లో 3.06 ఎకరాలు పెద్దమ్మ దేవాలయం భూమి. అందులో కొంత భాగం ఆక్రమణ చేశారు. పెద్దమ్మ దేవాలయం భూమి మొత్తానికి ప్రహరీ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఆక్రమణలతో నిమిత్తం లేదు. ఉన్న భూమికి మాత్రమే ప్రహరీ నిర్మిస్తామని పోట్లదుర్తి బ్రదర్స్‌ స్పష్టం చేస్తున్నారు. ఇదివరకే రూ.9 0లక్షలు సీఎం రమేష్‌ రాజ్యసభ గ్రాంట్‌ నుంచి దేవాలయంలో ప్రహరీ, ఇతర పనుల కోసం కేటాయించారు. గ్రామస్తులంతా ముక్తకంఠంతో దేవాలయం భూమి అన్యాక్రాంతం కాకుండా మొత్తానికి ప్రహరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారి అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దేవాలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని డబ్ల్యుపీ నెంబర్‌ 871/2025 ద్వారా ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని దేవదాయశాఖ సంయుక్త కమిషనర్‌ భ్రమరాంబ ఆర్సీ నెంబర్‌ ఎం3/19024(39)/2/ 2025 ద్వారా ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు.

అక్కడికెళ్తే కేసులు నమోదు చేస్తాం..

గ్రామస్తులు ప్రహరీ నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని పోట్లదుర్తి బ్రదర్స్‌ ఎర్రగుంట్ల పోలీసులను ఉసిగొల్పారు. వారి ఆదేశాలను తు.చ. అమలు పర్చేందుకు సిద్ధమైన ఓ త్రిబుల్‌స్టార్‌ అధికారి గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ఆ పనుల వద్దకు మీరు వెళ్లొద్దంటూ హుకుం జారీ చేశారు. ఓ వైపు హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన, మరోవైపు దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు అమలు కాకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నిస్తే, వారిని పోలీసు అధికారులు మందలించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. పోట్లదుర్తి బ్రదర్స్‌ నియంతృత్వాన్ని అమలు చేయడమే తమలక్ష్యం అన్నట్లుగా జిల్లాలో అధికార యంత్రాంగం ఊడిగం చేస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దమ్మ దేవాలయం ఆక్రమణలు చట్టబద్ధం చేస్తున్న పోట్లదుర్తి బ్రదర్స్‌

ప్రాంగణం మొత్తం ప్రహరీ

నిర్మించాలంటున్న గ్రామస్తులు

హైకోర్టు తీర్పును సైతం

ఉల్లంఘిస్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement