IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ బ్యాటింగ్
టీమిండియాతో ఐదో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగులు చేసింది. భారత్ భారీ స్కోరు: 231-5(20)ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) రాణించగా.. తిలక్ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి విఫలం అయ్యాడు.ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్‌మన్ చెరొక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ జట్టు లక్ష్యం 232 పరుగులు.భారత్ బ్యాటింగ్.. హైలైట్స్19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్‌మన్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్‌మన్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)👉16 బంతుల్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకంబాష్ బౌలింగ్‌లో సిక్స్ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3తిలక్ 57, హార్దిక్ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.👉14.4 తిలక్ వర్మ హాఫ్ సెంచరీ: ఎంగిడి బౌలింగ్‌లో ఫోర్ బాది.. ఆరో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ (30 బంతుల్లో).👉12.1 మూడో వికెట్ డౌన్: బాష్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య (5) అవుట్. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా. స్కోరు: 115-3(12.1)👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2తిలక్ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.👉9.1 రెండో వికెట్ డౌన్: లిండే బౌలింగ్‌లో శాంసన్ బౌల్డ్ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్ డౌన్. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. 👉8.4: సంజూ బాదిన షాట్‌తో అంపైర్‌కు గాయంఫెరీరా బౌలింగ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్‌ను ఫెరీరా డ్రాప్ చేయగా.. అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్ చేశారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 27, తిలక్ వర్మ 4 పరుగులతో ఉన్నారు.👉5.4- తొలి వికెట్ డౌన్: కార్బిన్ బాష్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్) అవుట్. తొలి వికెట్ డౌన్. క్రీజులోకి తిలక్ వర్మ. స్కోరు: 63-1(5.4)👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0👉అభిషేక్ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.తుదిజట్లలో మార్పులు ఇవేఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో జార్జ్ లిండేను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్, శుబ్‌మన్ గిల్ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ వారి స్థానాలను భర్తీ చేశారు.కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్‌లో భారత్, ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్‌లో గెలిచి 3-1తో సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్సౌతాఫ్రికాక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.
పంచాయతీ ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీల్లోని కొందరు నేతలే కారణమని అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమేంటో ఆ వివరాలన్నీ పీసీపీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తాను. వనపర్తిలో నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేశారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు. వనపర్తి నియోజకవర్గంలోని 140 పంచాయతీల్లో 85 సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. 60.66% ఓటు శాతం వచ్చింది. బీఆర్ఎస్కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం 36% వచ్చింది. అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుంది అనేది అందరూ గ్రహించాలి. గ్రామ పంచాయతీ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 92407 ఓట్లు వచ్చాయి.. బీఆర్ఎస్కు 59788 ఓట్లు వచ్చాయి. రెండింటిని చూస్తే వారికన్నా కాంగ్రెస్‌కు 35.09% అధికంగా వచ్చాయి. ఎన్నికల ఓటు పర్సంటేజ్ విషయంలో బీఆర్ఎస్కు ఓటు శాతం తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా వాళ్ళు కిందికి పడిపోవడం ఖాయం.మా కాంగ్రెస్ పెద్ద మనిషి చిన్నారెడ్డి నియోజకవర్గంలోనే 15 గ్రామాలలో కావాలని పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ వాళ్లకు సపోర్ట్ చేశారు. బీఫామ్స్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నామీద కోపం తీర్చుకోవాలి కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వనపర్తి ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం. చిన్నారెడ్డి పంచాయతీ ఎన్నికలలో ఓటర్లకు ఫోన్లు చేసి కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు.. బీఆర్ఎస్కు ఓటు వేయమని చెప్పిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని అభ్యర్థులను ఓడించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్!
మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. వీళ్లలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలియడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.శుక్రవారం 40 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నారని.. .. వీళ్లలో ముగ్గురు అగ్రనేతలు ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు పూర్తి వివరాలను పోలీస్ బాస్ శివధర్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ ద్వారా తెలియజేయనున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన వరకు మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదేం భారీ లొంగుబాటు కాదు!. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో.. పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించగా.. ఆ ప్రభావంతో ఇంకొందరు స్వచ్ఛందంగా తమ కేడర్లతో పెద్దఎత్తున లొంగిపోతున్నారు. పోలీసులు మాత్రం.. మావోయిస్టులకు ప్రజల మద్దతు తగ్గిపోవడం, పార్టీ నెట్వర్క్ నిర్వీర్యం కావడం, అనారోగ్యాల బారిన పడటం, ఎన్కౌంటర్ల భయం, సిద్ధాంతపరమైన విబేధాలు, తెలంగాణ ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు.. కారణాలంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇటు తెలంగాణలోనూ ఈ మధ్యకాలంలో పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. నవంబర్ నెలాఖరులో.. ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతంలో.. 2021 సెప్టెంబరులో 52 మంది, ఈ ఏడాది మార్చి 15న 64 మంది, ఏప్రిల్ 5న 86 మంది, మే 9న 38 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డుతోపాటు పునరావాస పథకం కింద ఇతర ప్రయోజనాలను అందిస్తోంది తెలంగాణ పోలీస్ శాఖ.వీళ్లలో ఎవరైనా ఉండొచ్చా?..తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి మావోయిస్టుల గురించి గత ప్రెస్మీట్లో.. తెలంగాణలో మిగిలింది 59 మంది మాత్రమేనని స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఇందులో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్లలో గణపతి, దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, పాక హన్మంతు, పసునూరి నరహరి తెలుగువారే. మరో 10 మంది తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల్లో రాష్ట్రకమిటీ హోదాలో ఉన్నారు. బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి కాగా.. గంకిడి సత్యనారాయణరెడ్డి, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, గీరెడ్డి పవనానందరెడ్డి, జోడే రత్నాభాయ్ ఎలియాస్ సుజాత, లోకేటి చందర్, శేఖర్ ఎలియాస్ మంతు, మేకల మనోజ్, కర్రా వెంకట్‌రెడ్డి రాష్ట్ర కమిటీల సభ్యులుగా ఉన్నారు.తెలంగాణ కమిటీలో ప్రస్తుతం రాష్ట్రానికి చెందినవారు నలుగురు ఉండగా.. మిగిలిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే. అలాగే తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇతర రాష్ట్రాల కమిటీల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాజా లొంగుబాటులో కీలక నేతలు ఉంటారా? ఉండరా? అనే ఆసక్తి నెలకొంది.
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ
ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం ‘అవతార్’. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ఇది. 2009లో రిలీజైన ఈ చిత్రం.. అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు వెండితెరపై చూడని విజువల్స్‌ని చూపించి..సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు కామెరూన్. ఈ సినిమాకు కొనసాగింపుగా నాలుగు సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించిన కామెరూన్.. పార్ట్ 2 అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ని 2022లో రిలీజ్ చేశాడు. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు అవతార్‌కి రెండో సీక్వెల్‌గా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Fire And Ash Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పెద్ద కొడుకు నితాయాం చనిపోయిన తర్వాత జేక్ సల్లీ(శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి(జో సల్డానా) జంట తీవ్రమైన విషాదంలో కూరుకొనిపోతుంది. మిగిలిన పిల్లలు లోక్(బ్రిటన్ డాల్టన్), టూక్(ట్రినిటీ జో-లి బ్లిస్), కిరి (సిగౌర్నీ వీవర్)తో పాటు దత్తపుత్రుడు స్పైడర్(జాక్ ఛాంపియన్)ని కాపాడుకుంటూనే.. కొడుకు చావుకు కారణమైన మానవ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతారు. అదే సమయంలో అవతార్ 2లో చనిపోయిన కల్నల్ క్వారిచ్(స్టీఫెన్ లాంగ్).. నావి తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొని వస్తాడు. అతనికి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్(ఊనా చాప్లిన్) సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది. వరంగ్‌కి జేక్ సల్లీ ప్యామిలీ కొలిచే ఈవా దేవత అంటే నచ్చదు. అదే కోపంతో కల్నల్ క్వారిచ్‌తో చేతులు కలుపుతుంది. మరోవైపు పండోరా గ్రహాన్ని నాశనం చేయాలనుకున్న ఆర్డీఏ బృందం కూడా వీరికి తోడుగా నిలుస్తుంది. బలమైన ఈ ముగ్గురు శత్రువుల నుంచి జేక్ సల్లీ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే అవతార్ 3(Avatar 3 Review) కథ. ఎలా ఉందంటే..‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను చూపించిన జేమ్స్ కామెరూన్.. పార్ట్ 2 సముద్ర గర్భంలోని సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అయితే అవతార్ 2 సమయంలోనే కథ-కథనంపై విమర్శలు వచ్చాయి. కానీ విజువల్స్ అద్భుతంగా ఉండడంతో సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడో భాగంగా వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’లోనూ కథ- కథనమే మైనస్ అయింది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ కథ-కథనంలో మాత్రం కొత్తదనం లేదు. విజువల్స్ చూడడానికి బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మాత్రం మిస్ అయింది. అవతార్, అవతార్ 2లో చూసిన సన్నివేశాలే.. పార్ట్ 3లోనూ కనిపిస్తాయి. అగ్నితెగ ఒక్కటి ఇందులో యాడ్ చేశారు. అంతకు మించి పార్ట్ 2కి, పార్ట్ 3కి పెద్ద తేడా లేదు. పైగా నిడివి చాలా ఎక్కువగా (దాదాపు 3 గంటల 17 నిమిషాలు) ఉండడంతో .. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ ప్రేక్షుకుడి సహనానికి పరీక్షలా మారుతుంది. చూసిన సన్నివేశలే మళ్లీ మళ్లీ రావడం.. కథ అక్కడక్కడే తిరగడంతో ‘విరామం’ పడితే బాగుండేది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నంతలో సెకండాఫ్‌లో కథ కాస్త పరుగులు పెడుతుంది. వరంగ్, కిరి మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. అలాగే స్పైడర్ పాత్ర నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. బంధీ అయిన జేక్ సల్లీని విడిపించేందుకు నేతిరి రావడం..ఈ క్రమంలో వచ్చే పోరాట ఘట్టాలు బాగుంటాయి. క్లైమాక్స్ విజువల్స్ పరంగా బాగున్నా.. అవతార్ 2లోని క్లైమాక్స్‌ని గుర్తు చేస్తుంది. మొత్తంగా జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో మిస్ అయింది. వీఎఫెక్స్ పనితీరు మాత్రం ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టుల కంటే బాగుంటుంది. కథ పరంగా చూస్తే.. అవతార్ 3 రొటీన్ చిత్రమే కానీ.. సాంకేతికంగా మాత్రం అవతార్ 3 ఓ అద్భుతమే. విజువల్ గ్రాండియర్ కోసమే అయినా ఈ సినిమాను తెరపై ఒక్కసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే.. జేక్ సెల్లీ పాత్రకు సామ్ వర్తింగ్టన్ పూర్తి న్యాయం చేశాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతిరి పాత్రలో జో సల్డానా ఒదిగిపోయింది. పార్ట్ 2తో పోలిస్తే..ఇందులోనే ఆమెకు ఎక్కువ యాక్షన్ సీన్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాకు కొత్తతనం తెచ్చిన పాత్ర వరంగ్. ఆ పాత్రలో ఊనా చాప్లిన్ జీవించేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆమె నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సిగర్నీ వీవర్, బ్రిటన్ డాల్టన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. , రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. సైమన్ ఫ్రాంగ్లెన్ నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను తొలగించినా.. అసలు కథకు ఇబ్బందేమి లేదు. అలాంటి సీన్లను తొలగించి నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్
ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
‘రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి’
కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు జస్ట్ మిస్!
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
పెళ్లిలో వధువు ల్యాప్‌టాప్ పట్టుకుని..
ఒక్కరోజే ఊరట.. మారిపోయిన బంగారం, వెండి రేట్లు
ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం
ఈ రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది-చంద్రబాబు
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
గుప్త నిధుల ఆశతో..
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
అసలు ఆ అప్పులు,వాటికి వడ్డీలు కట్టేది మనమే కదా! కనీసం మనకు ఒక్క మాటకూడా చెప్పకుండా తెస్తున్నారు!
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్
ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
‘రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి’
కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు జస్ట్ మిస్!
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
పెళ్లిలో వధువు ల్యాప్‌టాప్ పట్టుకుని..
ఒక్కరోజే ఊరట.. మారిపోయిన బంగారం, వెండి రేట్లు
ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం
ఈ రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది-చంద్రబాబు
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
గుప్త నిధుల ఆశతో..
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
అసలు ఆ అప్పులు,వాటికి వడ్డీలు కట్టేది మనమే కదా! కనీసం మనకు ఒక్క మాటకూడా చెప్పకుండా తెస్తున్నారు!
సినిమాల చెట్టు.. మళ్లీ చిగురించింది.. వంశీ భావోద్వేగం
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
ఫొటోలు
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
దుబాయ్‌లో దంచికొట్టిన వర్షం.. బుర్జ్ ఖలీఫాను తాకిన పిడుగు (ఫొటోలు)
అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం టీజర్ లాంచ్ (ఫొటోలు)
విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి సహస్ర ఘటాభిషేకం (ఫొటోలు)
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పారిస్‌లో చిల్ అవుతోన్న మన్మధుడు హీరోయిన్ అన్షు.. ఫోటోలు
జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కీలక సమావేశం (ఫొటోలు)
ఫుడ్.. షాపింగ్.. ఇంకేం కావాలంటున్న రెజీనా! (ఫోటోలు)
వైఎస్సార్సీపీ సమరభేరి.. కోటి సంతకాలకు జెండా ఊపిన వైఎస్ జగన్ (చిత్రాలు)
ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు.. ఈవెంట్ ఫోటోలు
సినిమా
వారణాసి ఆలయంలో అఖండ-2 టీమ్.. నీ టైమ్ బాగుంది బ్రో!
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ అఖండ-2. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకోలేకపోయింది. గతంలో విడుదలై హిట్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా బాలయ్య, బోయపాటి ప్రముఖ ఆలయం వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అఖండ-2 రిలీజ్ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో బోయపాటి, బాలయ్య కనిపించడంతో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అదే సమయంలో బాలయ్య భుజంపై ఉన్న కండువా కింద పడిపోయింది. కానీ ఫ్యాన్స్‌పై ఆగ్రహంతో రెచ్చిపోయే సైలెంట్‌గా కండువా తీసుకుని ముందుకు కదిలారు. ఇది చూసిన నెటిజన్స్ అదేంటి బాలయ్య ఇంతలా మారిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది అతను బతికిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో చాలాసార్లు అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే. God of Masses #NandamuriBalakrishna garu and blockbuster director #BoyapatiSreenu garu visited the sacred city of Varanasi, took divine blessings after the Blockbuster success of #Akhanda2 🔱🔥Har Har Mahadev 🔱Book your tickets now!🎟️ https://t.co/8l5WolzzT6… pic.twitter.com/rOMNIQQ7sN— 14 Reels Plus (@14ReelsPlus) December 19, 2025 God Of Masses Nandamuri Balakrishna, Sensational Director Boyapati Sreenu Visited Varanasi Temple on the occasion of of #Akhanda2 Success pic.twitter.com/TfkCM6GqKG— idlebrain jeevi (@idlebrainjeevi) December 19, 2025
'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్
బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లకు రానుంది.మూవీ రిలీజ్ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to be launching the trailer of #Dhandoraahttps://t.co/sOuUJAUZlqRooted, raw and powerful this looks very promising Wishing the entire team a huge success , looking forward to watching it .In Cinemas from 25-12-25#DhandoraaOnDec25th@Afilmby_Murali… pic.twitter.com/7zL0X3WBpG— chaitanya akkineni (@chay_akkineni) December 19, 2025
ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా
ఈ వారం థియేటర్లలోకి 'అవతార్ 3' వచ్చింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇదేమంత కొత్తగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటిలో సంతాన ప్రాప్తిరస్తు, ప్రేమంటే, డొమినిక్ ద లేడీస్ పర్స్, మఫ్టీ పోలీస్, దివ్యదృష్టి చిత్రాలతో పాటు నయనం, ఫార్మా సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ)ఇప్పుడు తమిళ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత నెల 21న థియేటర్లలో రిలీజై హిట్ అయిన మూవీ 'మిడిల్ క్లాస్'. సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మునిష్ కాంత్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. విజయలక్ష్మీ ఇతడి సరసన నటించింది. మిడిల్ క్లాస్ కష్టాలపై దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ వచ్చే బుధవారం (డిసెంబరు 24) నుంచి జీ5 ఓటీటీలోకి రానుంది.'మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. నిత్యం ఆర్థిక ఇబ్బందులు, నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐలు, బడ్జెట్ లెక్కలు.. ఇలా సగటు మధ్యతరగతి కష్టాలతో బాధపడే ఓ కుటుంబానికి.. తమ సమస్యలన్నీ ఒకేసారి తీరిపోయే అరుదైన అవకాశం వస్తుంది. మరి అప్పుడు ఆ ఫ్యామిలీ ఏం చేసింది? తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటి? అనేదే మిగతా స్టోరీ. కిశోర్ రామలింగం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ చేస్తుంది. ఇప్పటికైతే తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పారు. త్వరలో తెలుగు డబ్బింగ్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: దురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!)
మెరిసిపోతున్న నిధి అగర్వాల్.. బార్బీ డాల్‌లా రుక్మిణి
అందాల అపరంజిలా హీరోయిన్ నిధి అగర్వాల్బ్లాక్-వైట్ బార్బీ బొమ్మలా రుక్మిణి వసంత్హీరోయిన్ కృతి సనన్ చెల్లి బర్త్ డే సెలబ్రేషన్చీరలో వయ్యారాలు పోతున్న దీపిక పిల్లివింటేజ్ హాలీవుడ్ బ్యూటీలా దిశా పటానీ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by ELLE India (@elleindia) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12)మూడ్ ఇదే.. క్యూట్ అండ్ స్వీట్ సంయుక్త
క్రీడలు
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026కు ముందు శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా చరిత్ అసలంకను తప్పించింది. మాజీ సారథి దసున్ షనకకే మరోసారి టీ20 జట్టు పగ్గాలు అప్పగించింది.అందుకే కెప్టెన్‌ని చేశాంకాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్ టోర్నీకి లంక క్రికెట్ బోర్డు శుక్రవారం తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఇందులో భాగంగా దసున్ షనకకు సారథిగా పెద్ద పీట వేయడంపై చీఫ్ సెలక్టర్‌గా తిరిగి వచ్చిన ప్రమోదయ విక్రమసింఘ స్పందించాడు.‘‘షనక ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడు. నేను సెలక్టర్‌గా దిగిపోయేనాటికి షనకనే కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు చరిత్ మా దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఒకడిగా ఉన్నాడు. కెప్టెన్ అయిన తర్వాత చరిత్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.సనత్ జయసూర్యతో చర్చించిన తర్వాతేఇటీవల అతడు బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నాం. హెడ్‌కోచ్ సనత్ జయసూర్యతో చర్చించిన తర్వాతే ఈ జట్టును ఎంపిక చేశాము. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు పెద్దగా మార్పులు చేయాలని మేము అనుకోలేదు’’ అని ప్రమోదయ విక్రసింఘ తెలిపాడు.ఇక నిరోషన్ డిక్‌విల్లాను తిరిగి జట్టుకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. ‘‘ఓపెనర్‌గా.. రిజర్వు వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అతడు బహుముఖ పాత్రలు పోషించగలడు’’ అని విక్రమసింఘ తెలిపాడు. కాగా 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో చివరగా డిక్విల్లా లంక టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తిరిగి సారథిగా..కాగా 2021- 24 వరకు శ్రీలంక వన్డే, టీ20 జట్లకు దసున్ షనక సారథిగా ఉన్నాడు. అయితే, కెప్టెన్‌గా వరల్డ్‌కప్ టోర్నీలో విఫలం కావడంతో అతడిని తప్పించి.. అసలంకకు బాధ్యతలు ఇచ్చారు. అయితే, అసలంక సారథ్యంలో ముఖ్యంగా టీ20లలో శ్రీలంక చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఆసియా టీ20 కప్-2025లోనూ తేలిపోయింది. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు.ఈ పరిణామాల నేపథ్యంలో అనుభవానికి పెద్ద పీట వేస్తూ.. సెలక్షన్ కమిటీ దసున్ షనకపైనే మరోసారి నమ్మకం ఉంచింది. కాగా గత ఆసియా కప్ (టీ20) టోర్నీలో లంకను అతడు చాంపియన్‌గా నిలిపాడు. కాగా ఇటీవల పాకిస్తాన్ పర్యటన సందర్భంగా అసలంక భద్రతా కారణాలు చూపి మధ్యలోనే తప్పుకొన్నాడు. ఈ క్రమంలో షనక తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శ్రీలంక ప్రకటించిన ప్రాథమిక జట్టుదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, కామిల్ మిశారా, కుశాల్ పెరీరా, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్విల్లా. జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్మనాయకే, సహాన్ అరాచిగే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మిలన్ రత్ననాయకే, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదూషాన్, మతీశ పతిరణ, దిల్షాన్ మధుషాంక, మహీశ్ తీక్షణ, దుషాన్ హేమంత, విజయకాంత్ వియస్కాంత్, త్రవీణ్ మాథ్యూ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్
వెంకటేశ్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్‌క్లాస్ క్రికెట్లో 20, లిస్ట్-ఎ క్రికెట్లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్‌లు ఆడాడు.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్‌లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్‌గా నియమించింది.పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్‌కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్‌గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్‌తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టువెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ స్వయంగా వెల్లడించాడు.కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని ఆదేశించింది.ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందేడిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్‌ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ మాట దాటవేశాడు.అందుబాటులో లేరుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్ పాటిల్ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.వారికే సడలింపుటీ20 ప్రపంచకప్-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్ అయ్యర్దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ముల్‌చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా ‘కోటి’ గళాల గర్జన...
బిజినెస్
రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఏఎల్) మాజీ ఉద్యోగులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.312 కోట్ల వేతన బకాయిలను కంపెనీ మాజీ ఉద్యోగులకు చెల్లించినట్లు అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అధికారిక లిక్విడేటర్‌కు ఈడీ బదిలీ చేసింది.గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి ఈడీ అప్పగించిన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. సెక్యూర్డ్ క్రెడిటర్ల (బ్యాంకుల) క్లెయిమ్‌ల కంటే కార్మికుల బకాయిలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఎస్బీఐ అంగీకరించింది.మనీలాండరింగ్ కేసు నేపథ్యంవేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో 2016లో విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ, మాల్యాను జనవరి 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఇప్పటివరకు మాల్యా, కింగ్‌ఫిషర్ సంస్థలకు చెందిన దాదాపు రూ.5,042 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి జప్తు చేసింది. అదనంగా రూ.1,695 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.రికవరీలో..ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో జప్తు చేసిన ఆస్తులను ఈడీ బ్యాంకుల కన్సార్టియానికి అప్పగించింది. వీటి విక్రయం ద్వారా బ్యాంకులు ఇప్పటివరకు దాదాపు రూ.14,132 కోట్లు వసూలు చేసుకున్నాయి. ‘దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల బకాయిలను పరిష్కరించడానికి మేము వాటాదారులతో సమన్వయం చేసుకున్నాం. ఎస్బీఐ అధికారులతో చర్చించి పునరుద్ధరించిన ఆస్తుల ద్వారా ఉద్యోగుల క్లెయిమ్‌లను చెల్లించేలా చొరవ తీసుకున్నాం’ అని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన తర్వాత జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.ఇదీ చదవండి: సత్య సారథ్యంలో సమూల మార్పులు!
సత్య సారథ్యంలో సమూల మార్పులు!
సాఫ్ట్వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్‌గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.పాత పద్ధతులకు స్వస్తి‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవైపు ఆ భవనాల నీడలోనే మగ్గిపోతున్న రేకుల షెడ్లు. ఒకరికి వేల కోట్ల సంపద ఎలా ఖర్చు చేయాలో తెలియని సందిగ్ధం.. మరొకరికి పూట గడవడానికి కావాల్సిన సరుకులు లేక విచారం. అంకెల్లో చూస్తే అభివృద్ధిలో ప్రపంచంలోనే దేశం పరుగులు పెడుతోంది కానీ, ఆ పరుగులో సామాన్యుడు మాత్రం వెనకబడిపోతున్నాడు. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ బయటపెట్టిన తాజా వాస్తవాలు భారత్‌లో పెరుగుతున్న ఈ అగాధాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇదే ఆర్థిక అసమానతలు కొనసాగితే సామాజిక అశాంతి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ఒక భారీ వృక్షంలా ఎదుగుతోంది. కానీ దాని ఫలాలు మాత్రం కొద్దిమందికే అందుతున్నాయి. దేశంలోని 1 శాతం మంది చేతుల్లోనే 40 శాతం సంపద పోగుపడటం అనేది కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల నిస్సహాయతకు సాక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడమేనా? లేక ఆ పెరిగిన సంపద పేదవాడి ఆకలిని తీర్చడమా? ఈ తరుణంలో పెరుగుతున్న అసమానతలపై విశ్లేషణ చూద్దాం.భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. జీడీపీ పరంగా మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం.. పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో అంతరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని కేవలం 1 శాతం అత్యంత ధనవంతుల వద్దే 40 శాతం జాతీయ సంపద ఉంది. సంపదపరంగా టాప్‌లో ఉన్న 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతాన్ని పొందుతుండగా, దిగువన ఉన్న 50 శాతం మందికి కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే దక్కుతోంది. ప్రస్తుత ఆదాయ అసమానతలు బ్రిటిష్ పాలన కాలం నాటి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఆర్థిక అసమానతల వల్ల తలెత్తే పరిణామాలుఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నేరాలు పెరగడానికి, వర్గ పోరాటాలకు, పౌర అశాంతికి దారితీస్తుంది. మెజారిటీ ప్రజల వద్ద ఆదాయం లేకపోతే వారు నాణ్యమైన విద్య, వైద్యానికి దూరమవుతారు. ఇది దేశ భవిష్యత్తు శ్రామిక శక్తి నాణ్యతను తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే సామాన్యుల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. కేవలం కొద్దిమంది ధనవంతుల ఖర్చుతో దేశ ఆర్థిక చక్రం పూర్తిస్థాయిలో తిరగలేదు. పేదరికం వల్ల మార్కెట్లో వస్తువులకు డిమాండ్ తగ్గి, ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. సంపద కేంద్రీకరణ వల్ల రాజకీయ అధికారం కూడా కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుల గొంతుకను నొక్కివేస్తుంది.నియంత్రించేందుకు మార్గాలుఅత్యంత ధనవంతులపై సంపద పన్ను(Wealth Tax) లేదా వారసత్వ పన్ను (Inheritance Tax) వంటివి విధించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలి.ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం వల్ల పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది వారిని పేదరికం నుంచి బయటపడేలా చేస్తుంది.కేవలం కార్పొరేట్ కంపెనీలకే కాకుండా భారీగా ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి.అసంఘటిత రంగంలోని కార్మికులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు అందేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలి.ఇప్పటికీ దేశంలో సగం జనాభా ఆధారపడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచవచ్చు.చివరగా..ఆర్థిక వృద్ధి అనేది కేవలం అంకెల్లో కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందించినప్పుడే అది సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. భారతదేశం వికసిత్ భారత్‌గా మారాలంటే సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద సమంగా పంపిణీ అయ్యేలా చూడటం అత్యవసరం. లేనిపక్షంలో ఈ ఆర్థిక అసమానతలు దేశ సుస్థిరతకు ముప్పుగా మారతాయని గమనించాలి.ఇదీ చదవండి: ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?
ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?
ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక విప్లవంలా దూసుకుపోతోంది. పనులను సులభతరం చేస్తూనే, మరోవైపు డేటా గోప్యత, డీప్‌ఫేక్స్ వంటి రూపాల్లో సరికొత్త సవాళ్లను విసురుతోంది. సాంకేతికత అందించే ఫలాలను అందుకుంటూనే, దానివల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో ఏఐని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన చట్రం, తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.భారత్‌లో ఏఐ నియంత్రణభారతదేశంలో ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేకమైన ఏకీకృత చట్టం లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం వివిధ ప్రస్తుత చట్టాలు, కొత్త మార్గదర్శకాల ద్వారా ఏఐ వినియోగాన్ని నియంత్రిస్తోంది. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందడానికి, పనిచేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ఈ డేటాను ఎలా సేకరించాలి, ఎలా వాడాలి అనే అంశాలను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP Act), 2023 నియంత్రిస్తుంది. ఏఐ మోడల్స్ వ్యక్తిగత డేటాను ఉపయోగించే ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం డేటా ఉల్లంఘనలు జరిగితే ఏఐ సంస్థలపై భారీ జరిమానాలు (రూ. 250 కోట్ల వరకు) విధించే అవకాశం ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000, 2025 సవరణలుప్రస్తుతానికి ఐటీ చట్టమే డిజిటల్ రంగంలో ప్రాథమిక చట్టంగా ఉంది. 2025లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. తప్పుదోవ పట్టించే ఏఐ కంటెంట్ లేదా డీప్‌ఫేక్స్‌ను నిరోధించే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లదే. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం తప్పనిసరి.ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు 2025నవంబర్ 2025లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అధిక రిస్క్ ఉన్న ఏఐ అప్లికేషన్లపై కఠినమైన నిఘా అవసరం. స్టార్టప్‌లు ఏఐ సాంకేతికతను సురక్షితమైన వాతావరణంలో పరీక్షించుకునేలా ప్రోత్సహించాలి.బ్యాంకింగ్ రంగంలో ఏఐ వాడకంపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా లోన్ అప్రూవల్స్ వంటి వాటిలో ఏఐ వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.ప్రస్తుత చట్టాలు ఏఐకి పూర్తిస్థాయిలో సరిపోవని నిపుణుల అభిప్రాయం. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకోకుండానే ప్రజా భద్రత, గోప్యతను కాపాడటం అనే సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ కోసం మరింత సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు
ఫ్యామిలీ
శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి
శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.(చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు)
తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..!
ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.బ్రిస్టల్‌లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత. ఎందుకంటే రొటీన్‌గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్‌గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్‌లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్‌గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్నెస్గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..డైట్..కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.కెన్లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్దయ్యే కొద్ది సిక్స్ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా)
ఒట్టు... ఇలాంటి పెళ్లి చూసి ఉండరు!
‘ఇది పెళ్లి వేడుకా? పాన్ ఇండియా సినిమానా?’ అని ఆశ్చర్యపోయారు అతిథులు. వేడుకలో అడుగడుగునా సినిమాటిక్ ట్రిక్స్‌ను ఉపయోగించడమే దీనికి కారణం. వేదికపై రైలు పట్టాలు కనిపిస్తాయి. అయితే ఆ పట్టాల మీది నుంచి రైలు కాదు... అటు నుంచి హంసతూలికా వాహనంలో వధువు, ఆమెకు ఎదురుగా మరో హంసతూలికా వాహనంలో వరుడు వస్తుంటాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో అలనాటి ‘మహాభారత్’ టీవీ సీరియల్లోని పాటలు వినిపిస్తుంటాయి. వధూవరుల చేతిలో స్పార్క్–షూటింగ్ గన్స్ ఉంటాయి. ఇద్దరూ ఒకే చోటుకి రాగానే పూల వెలుగు వాన కురుస్తుంది. బాణసంచా పేలుతుంది.ఒక్కటా రెండా... ఈ పెళ్లి వేడుకలో ఎన్నో వింతలు.‘ఎంత గొప్ప క్రియేటివిటో... ఆహా!’ అని ఆకాశానికెత్తారు కొందరు. చాలామంది మాత్రం... ‘ఎవరి పిచ్చి వారికి ఆడంబరం’ అన్నట్లుగా కామెంట్స్ పెట్టారు. అయినప్పటికీ ఈ వీడియో వైరల్ అయింది. రాబోయే కాలంలో ఇదొక ట్రెండ్‌గా కూడా మారవచ్చు! View this post on Instagram A post shared by युक्ति (@lil_dicey_ybz)
స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా
ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్‌ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్‌తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025 (చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!)
అంతర్జాతీయం
భారతీయులకు పెరిగిన హెచ్–1బీ కష్టాలు
వాషింగ్టన్: తెంపరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయుల హెచ్–1బీ వీసా కష్టాలు మరింత పెరిగాయి. అమెరికా వ్యతిరేక, పాలస్తానా అనుకూల వ్యాఖ్యలు, వీడియోలు, పోస్ట్‌లు చేసే విదేశీయులను తమ గడ్డమీద అడుగుపెట్టకుండా, హెచ్–1బీ, హెచ్4 వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ గత వారం ఆయా వీసా దరఖాస్తుదారుల సోషల్‌మీడియా ఖాతాల ముమ్మర పరిశీలన మొదలెట్టడం తెల్సిందే. అన్ని ఖాతాల పరిశీలనకు సుదీర్ఘకాలం పట్టేనున్న నేపథ్యంలో అప్పటిదాకా హెచ్–1బీ వీసాల ఇంటర్వ్యూలను 2026 అక్టోబర్‌దాకా వాయిదావేస్తున్నట్లు చాలా మంది అభ్యర్థులకు సందేశాలు అందాయి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకు ఈ నిర్ణయం అశనిపాతమైంది. అక్టోబర్కైనా తమ వీసా ఇంటర్వ్యూలకు మోక్షం లభిస్తుందో లేదంటే 2027 జనవరికి మరోసారి వాయిదాపడతాయా? అనే సందిగ్దావస్థ భయాందోళనలు భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జరగాల్సిన ఇంటర్వ్యూలను గతంలోనే 2026 ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేయడం తెల్సిందే. జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఖరారైన వేరే దరఖాస్తుదారులు వాటిని రద్దుచేసుకుంటే వాళ్ల స్థానంలో తమకు అవకాశం లభిస్తుందేమోనన్న ఆశ ఈ అక్టోబర్‌కు రీషెడ్యూల్ అయిన దరఖాస్తు దారుల్లో కన్పిస్తోంది.
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్‌వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్‌వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.
సమస్యల్ని పరిష్కరించా విజయాలెన్నో సాధించా
న్యూయార్క్/వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘ బైడెన్ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్–పాకిస్తాన్, థాయిలాండ్–కాంబోడియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్ సర్కార్ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్ ఆరోపించారు.వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్ మార్కెట్ 60 శాతం పెరగడానికి బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్‌ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్‌లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
మస్కట్: భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు గురువారం సంతకాలు చేశాయి. ఫలితంగా 98 శాతానికిపైగా భారతీయ ఉత్పత్తులపై ఒమన్‌లో సుంకాలు సున్నాకు చేరుకోనున్నాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే భారతీయ వ్రస్తాలు, వ్యవసాయ, తోలు సహా పలు ఉత్పత్తులను ఒమన్‌లో విక్రయించుకోవచ్చు. అదేసమయంలో ఒమన్ నుంచి దిగుమతి అయ్యే ఖర్జూరం, మార్బుల్స్, పెట్రో కెమికల్స్ సహా పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించనుంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం సానుకూల పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎఫ్‌టీఏపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి ఖాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసుఫ్ సంతకాలు చేశారు. దీన్ని అధికారికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)గా పిలుస్తున్నారు. ఒప్పందంలో ముఖ్యాంశాలు → భారతదేశం ఒమన్‌కు చేసే ఎగుమతుల్లో 99.38 శాతం ఉత్పత్తులపై జీరో–డ్యూటీ అమల్లోకి రానుంది. → భారతీయ సంప్రదాయ ఔషధాలపైనా ఒమన్ సున్నా సుంకాలు విధించబోతోంది. దీనివల్ల ఇండియాలోని ఆయుష్, వెల్నెస్ రంగాలకు లబ్ధి చేకూరనుంది. → భారత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారు ఆభరణాలు, తోలు, పాదరక్షలు, క్రీడా పరికరాలు, సామగ్రి, ప్లాస్టిక్, ఫరి్నచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ పరికరాలపై ఎలాంటి పన్ను ఉండదు. → కంప్యూటర్ సంబంధిత సేవలు, వ్యాపార, వృత్తి సేవలు, ఆడియో–విజువల్, పరిశోధన–అభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలపైనా ఒమన్ ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతోంది. ఒమన్ 12.52 బిలియన్ డాలర్ల విలువైన సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఇండియా వాటా కేవలం 5.31 శాతంగా ఉంది. ఎఫ్టీఏతో ఈ వాటా మరింత పెరగనుంది. → భారతీయ వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పిచేందుకు ఒమన్ ముందుకొచ్చింది. అకౌంటెన్సీ, టాక్సేషన్, ఆర్కిటెక్చర్, మెడికల్ సంబంధిత రంగాల్లో భారతీయులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయి. → అంతేకాకుండా భారతీయ కంపెనీల నుంచి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ)కు ఒమన్ అనుమతి ఇవ్వనుంది. → ఒమన్ నుంచి దిగుమతి అయ్యే వాటిలో 94.81 శాతం ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సుంకాలు రద్దు చేయనుంది. → భారతీయ పరిశ్రమలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం లేదు. ఒమన్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్, పొగాకు, బంగారం, వెండి ఆభరణాలు, పాదరక్షలు, క్రీడాసామగ్రి, కొన్ని రకాల లోహాలపై ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. వీటిని ఒప్పందంలో చేర్చలేదు. కీలక మిత్రదేశం ఒమన్ → 2006 తర్వాత ఒమన్ ప్రభుత్వం మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. అలాగే గత ఆరు నెలల్లో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇది రెండోది. ఆరు నెలల క్రితం యూకేతో కలిసి ఎఫ్‌టీఏపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. → ఇండియా, ఒమన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2024–25లో 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. → గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి ఒమన్. అంతేకాకుండా భారతదేశ సరుకులు, సేవలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలకు చేరడానికి ఒమన్ ఒక ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. → ఒమన్‌లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 300 ఏళ్ల క్రితమే స్థిరపడిన భారతీయ వ్యాపార కుటుంబాలు కూడా ఉన్నాయి. → ఒమన్‌లో 6 వేలకుపైగా భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. → ఒమన్‌లోని భారతీయులు ప్రతిఏటా 2 బిలియన్ డాలర్లను భారత్‌కు పంపిస్తున్నారు. → 2000 ఏప్రిల్ నుంచి 2025 సెపె్టంబర్ మధ్య ఒమన్ నుంచి భారత్‌కు 615.54 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.
జాతీయం
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. రేపటి వరకు తీవ్రస్థాయిలో పొగమంచు కొనసాగుతుందని ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఉత్తరాఖండ్లపై కూడా దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, త్రిపురలో రేపటి వరకు కూడా పొగమంచు కప్పేస్తుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.కాగా, పొగమంచు కారణంగా ఢిల్లీలో వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లు ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. జాతీయ రాజధానిలో సగటు గాలి నాణ్యత సూచిక (AQI) ఇవాళ ఉదయం 7 గంటలకు 387గా నమోదైంది. నిన్న (గురువారం) వాయు నాణ్యత (AQI) 373గా నమోదైంది. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దు కాగా.. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కాగా, ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది. గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ- ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో నిర్వహణ, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. గడువు ముగిసిన వాహనాలపై నిషేధం అమలు చేస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ నేపథ్యంలో 5వ తరగతి వరకు ఆన్లైన్లలో మాత్రమే తరగతులు నిర్వహించాలని.. 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు చేపట్టాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది.
ఇదో లగ్జరీ లిటిగేషన్.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలుండేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ‘లగ్జరీ లిటిగేషన్’ అంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలకు కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితులున్నాయని పేర్కొంది.‘ఈ దేశంలో తాగు నీరు ఎక్కడుంది, మేడమ్? ప్రజలకు తాగు నీరే అందుబాటులో లేదు. నీటి నాణ్యత విషయం తర్వాత మాట్లాడుకుందాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా, ఇవన్నీ ఖరీదైన పిటిషన్లంటూ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. మన దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ తాగు నీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థలు నిర్ణయించిన అంతర్జాతీయ ప్రమాణాలుండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సారంగ్ వామన్ యద్వాద్కర్ వేసిన పిటిషన్‌పై సీనియర్ లాయర్ అనితా షెనాయ్‌తో ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. అసలు, మీ ఇంట్లో మంచినీరు ఉందా అని ప్రశ్నించింది.దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తాము మరువలేమని తెలిపింది. పట్టణ ప్రాంత పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్న ధర్మాసనం.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బావుల్లో నీటిపైనే ఆధారపడుతున్నారని, వారెలాంటి అనారోగ్యాలకు గురికావడం లేదని తెలిపింది. అమెరికా, జపాన్, ఈయూ తరహా మార్గదర్శకాలను మనం అమలు చేయగలమని భావిస్తున్నారా అంటూ నిలదీసింది. పేదల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇలాంటివన్నీ కేవలం పట్టణవాసులు, ధనికుల భయాందోళనల నుంచి వస్తున్న పిటిషన్లు మాత్రమేనని పేర్కొంది.
ఆ వీడియో చూసి.. మానవత్వం అంటే ఏమిటో చెప్పండి..!
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) వీధి కుక్కలపట్ల అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘తదుపరి విచారణ సమయంలో ఒక వీడియో చూపిస్తాము, అమానవీయం ఏమిటో అప్పుడే మీరు చెబుదురుగాని అంటూ వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాట్లతో చిన్నారులు రేబిస్ బారినపడుతున్నారంటూ వచి్చన కథనంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..నవంబర్ 7వ తేదీన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లలో వీధికుక్కలు, ఇతర జంతువులు కనిపించరాదని, వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించాలని దేశవ్యాప్త ఆదేశాలివ్వడం తెల్సిందే. అయితే, ఢిల్లీలోని అధికారులు అదనంగా మరికొన్ని నిబంధనలను చేర్చి, వీధి కుక్కలపై దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ గురువారం వాదించారు. అయితే, దీనిపై ఇప్పుడేమీ తాము విచారణ చేపట్టబోమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 7వ తేదీన జరిగే విచారణ సందర్భంగా తామొక వీడియో చూపిస్తామని, దాన్ని చూశాక మానవత్వం గురించి మాట్లాడుతామంటూ వ్యాఖ్యానించింది. కుక్కల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న వైఖరిపై తామూ ఒక వీడియో చూపుతామని కపిల్ సిబాల్ తెలిపారు.
ఐక్యతా ప్రతిమ రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత
న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు, గుజరాత్లో ఏర్పాటైన ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం రూపకర్త అయిన రామ్ సుతార్ కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఉన్న తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు తెలిపారు. వందేళ్ల వయస్సున్న రామ్ సుతార్ గత కొంత కాలంగా వయో సంబంధ రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ‘మా తండ్రి శ్రీ రామ్ వంజీ సుతార్ డిసెంబర్ 17వ తేదీ రాత్రి మా నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలుపుటకు విచారిస్తున్నాం’అని ఆయన కుమారుడు అనిల్ సుతార్ గురువారం ఒక ప్రకటన చేశారు. తండ్రితోపాటు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో అనిల్ కూడా పాలుపంచుకున్నారు. మహారాష్ట్రలోని ధులె జిల్లా గొండూర్ గ్రామంలో 1925 ఫిబ్రవరి 19వ తేదీన రామ్ సుతార్ జని్మంచారు. చిన్ననాటి నుంచే శిల్పకళపై ఆయన ఆసక్తి కనబరిచారు. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యారి్థగా చూపిన ప్రతిభకు బంగారు పతకం సాధించారు. పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించిన ధ్యానముద్రలో ఉన్న మహాత్ముడు, మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో అశ్వంపై ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఆయన రూపొందించిన అత్యత్తుమ కళాఖండాల్లో కొన్ని. గుజరాత్లో నర్మదా తీరంలో కేవడియా వద్ద దేశ ప్రప్రథమ ఉపప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం కూడా రామ్ సుతార్ ఘనతే. 182 మీటర్ల ఎత్తయిన ఐక్యతా శిల్పం రూపకర్తగా ఈయన పేరు ప్రపంచదేశాల్లో మారుమోగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ విగ్రహంతో భారీ స్థాయి స్మారక విగ్రహాల రూపకల్పనలో ఆయన ప్రతిష్టను, పేరును సుస్థిరం చేసింది. రామ్ సుతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ముంబైలోని ఇందుమిల్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మెమోరియల్ ఒకటి. మరికొద్ది రోజుల్లో ఆవిష్కరించనున్న అసోంలోని గౌహటిలో గోపీనాథ్ బొర్డొలోయ్ విగ్రహం కూడా ఈయన చేతుల్లో జీవం పోసుకున్నదే కావడం విశేషం. ఇప్పటికే అసోంలోని జోర్హాత్‌లో ఉన్న లచిత్ బర్ఫుకాన్ భారీ విగ్రహం సైతం సుతార్ రూపొంచిందిందే కావడం గమనార్హం. తుదిశ్వాస వరకు దాదాపు ఏడు దశాబ్దాలపాటు రాతి, కాంస్య శిల్పాలకు ప్రాణం పోసే పనిలోనే నిమగ్నమై ఉన్న రామ్ సుతార్‌కు స్టాచ్యూ మ్యాన్ అనే పేరు స్థిరపడిపోయింది. కేంద్ర ప్రభుత్వం 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మ భూషణ్ పురస్కారాలతో ఆయన్ను గౌరవించింది. ఇటీవల మహారాష్ట్ర అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ కూడా రామ్ సుతార్ అందుకున్నారు. రామ్ సుతార్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎన్ఆర్ఐ
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.
క్రైమ్
నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్, సీనియర్ నటుడు రాకేశ్ బేడీ దురందర్ ఈవెంట్‌కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్ బేడీ స్పందించారు.‘ధురంధర్’ సినిమాలో రాకేశ్, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు. సారా వేదిక పైకి రాగానే రాకేశ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు. ఈ ఘటన గురించి ట్రోల్స్ రావడం చాలా బాధాకరం అంటూ రాకేశ్ బేడీ రియాక్ట్ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్‌లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్ పేర్కొన్నారు.
ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్‌తో సహా ఏడుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నార్త్ కరోలినాలోని స్టేట్స్‌విల్ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఉదయం 10:15 గంటలకు సెస్నా C550 విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ప్రముఖ నాస్కార్ మాజీ డ్రైవర్, అతని కుటుంబం ఉన్నారని కార్-రేసింగ్ సంస్థ తెలిపింది. ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ టేకాఫ్ అయిన 26 నిమిషాల తర్వాత విమానం తిరిగి రావడానికి ప్రయత్నించింది కానీ కూలిపోయింది. దీంతో NASCAR ఛాంపియన్ గ్రెగ్ బిఫిల్ తన భార్య, పిల్లలతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. మరో ముగ్గురు కూడా మరణించారు. వారిలో మరో తండ్రి కుమారుడు ఉన్నారు. వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ ఆకస్మిక మరణం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి జెఫ్ కోలీ తెలిపారు. బిఫిల్ కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎవరీ గ్రెగ్ బిఫిల్ రేసింగ్‌తో మక్కువతో కరియర్లో ఎంతో రాణించి, NASCAR హాల్ ఆఫ్ ఫేమ్‌కు నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి బిఫిల్ అని రేషింగ్ అభిమానులు చెబుతున్నారు. నాస్కార్ చరిత్రలోని ప్రముఖ రేసర్లలో 75 మందిలో ఒకరిగా గుర్తింపు పొందిన బిఫిల్, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. 1998లో NASCAR క్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రక్ సిరీస్‌లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో అదే సిరీస్‌లో ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు.రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువ, సమగ్రత, అభిమానులు, తోటి పోటీదారుల పట్ల ఆయనకున్న నిబద్ధత క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపాయంటూ కార్-రేసింగ్ సంస్థ బిఫిల్‌కు నివాళులర్పించింది. రేసింగ్‌తోపాటు, గత సంవత్సరం హెలీన్ హరికేన్ తర్వాత నార్త్ కరోలినాలో బిఫిల్ తన వ్యక్తిగత హెలికాప్టర్‌ను ఉపయోగించి చిక్కుకుపోయిన నివాసితులను రక్షించి, వారికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ❗️⚠️🇺🇸 - A Cessna C550 business jet crashed while attempting to land at Statesville Regional Airport in Statesville, North Carolina, on the morning of December 18, 2025, resulting in multiple fatalities.The aircraft, registered under tail number N257BW and owned by GB Aviation… pic.twitter.com/fb8qxZmrkm— 🔥🗞The Informant (@theinformant_x) December 18, 2025 Oh no!! Horrible breaking news!!Greg Biffle, a NASCAR champion has gone down in a plane crash with his wife and children. Three others perished as well. One was a man and his son.Just 26 mins after takeoff the plane tried to return but crashed. pic.twitter.com/4c2ieDpQaB— Jennifer 🟥🔴🧙♀️🦉🐈⬛ 🦖 (@babybeginner) December 19, 2025
అల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య
నంద్యాల (అర్బన్): అల్లుడుతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లుడితోనే కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురువారం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సుభద్ర, గుర్రప్ప(40) దంపతులు ఐదేళ్లుగా నంద్యాల శివారులోని నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు తువ్వపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యతో మూడేళ్ల క్రితం వివాహం చేశారు.ఈ క్రమంలో సుభద్రకు అల్లుడైన లింగమయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పలుమార్లు సుభద్రను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజూ ఇంట్లో గొడవ జరుగుతుండటంతో గుర్రప్పను హతమార్చాలని సుభద్ర కుట్ర పన్నింది. గురువారం ఇంట్లో పడుకుని ఉన్న గుర్రప్ప మెడకు సుభద్ర, లింగమయ్య తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. గుర్రప్ప తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు భార్య సుభద్రను అరెస్ట్ చేయగా, లింగమయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
బ్యాంక్ దోపిడీకి స్కెచ్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ఏడుగురు ఆగంతకులు స్కెచ్ వేశారు. బ్యాంక్‌ను దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌కు ఏడుగురు వచ్చారు. అప్పటికే కొంత మంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన ఏడుగురిలో ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా.. ఐదుగురు లోపలకు ప్రవేశించారు.కొంత సేపు వారు లోపల అన్ని విభాగాలను పరిశీలించారు. వీరిలో ఒకరు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు, మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్ మోగించారు. దీంతో దొంగలు వెంట తీసుకొచి్చన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. బ్యాంక్ అధికారులు అనకాపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
వీడియోలు
మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ DGP ఎదుట 40 మంది లొంగుబాటు
నువ్వు వేస్ట్ అని ప్రజలకు ఎప్పుడో తెలుసు నీకే ఇప్పుడు తెలిసింది
నడిరోడ్డుపై పడుకొని మందుబాబు వీరంగం
దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..
బిహార్ సీఎం నితీష్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
Appalaraju: అధికారుల ముందు తప్పు ఒప్పుకున్న బాబు
Gudivada : ముందు మీ ఎమ్మెల్యేకు చెప్పండి ప్రతిదానికి ఉన్నాం అంటూ..
Medchal: మహిళకు ఆపరేషన్ చేసి మధ్యలోనే వదిలేసిన డాక్టర్లు
పార్లమెంటులో వివిధ పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ చాయ్ పే చర్చ
అందరినీ నరికేస్తాం.. యూనివర్సిటీలో జనసైనికుల రచ్చ

