breaking news
Bihar
-
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్‌బ్రాండ్ పాలిటిక్స్‌తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్‌ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్‌లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్‌లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్‌ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి.. సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
బిహార్ ఎన్నికల్లో జేఎంఎం సొంతంగా పోటీ
రాంచీ: బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)బాంబు పేల్చింది. పక్క రాష్ట్రం బిహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేయనున్నట్లు జేఎంఎం శనివారం ప్రకటించింది. అదేవిధంగా, ప్రస్తుతం జార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కొనసాగుతున్న పొత్తుపై బిహార్ ఎన్నికల అనంతరం సమీక్షిస్తామని కూడా స్పష్టం చేసింది. జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మీడియా సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. బిహార్‌లో తమకు 12 సీట్లు కేటాయించాలని ఇండియా కూటమిని జేఎంఎం కోరింది. స్పందన లేకపోవడంతో స్వయంగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నామన్నారు. -
కొత్త ముసుగులో ‘జంగిల్‌రాజ్’
పట్నా: బిహార్‌లో ‘జంగిల్‌రాజ్’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్ సమాగం’లో అమిత్ షా మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు. బెంగాల్లో చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయలో రాష్ట్ర హోదా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు. -
బిర్యానీ కోసం కొట్టుకున్న జనం
-
బిహార్‌లో ప్రజాస్వామ్యం గెలిచేనా?
దేశంలో అన్ని ఎన్నికలనూ కురుక్షేత్ర సంగ్రామంగా మార్చడం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. అక్టోబర్ 6న ఎన్నికల నగారా మోగిన బిహార్‌లో మొదలైన ఎన్నికలసందడి అనేక ప్రత్యేకతలు కలిగిన దృష్ట్యా దేశ ప్రజల దృష్టి అటువైపు కేంద్రీకృతమైంది. 243 స్థానాలున్న బిహార్లోపోలింగ్ రెండు విడతలలో నవంబర్ 6, 11 తేదీలలో జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి. ‘యువ బిహార్’ సాధ్యమా?ఉత్తరాది రాష్ట్రాలలో, ప్రత్యేకించి బిహార్‌లో అభ్యర్థులు ఎన్ని కలకు ముందు ఆ యా పార్టీలు మారటమే కాకుండా... కూట ముల్లోని పార్టీలు అటు ఇటు పిల్లిమొగ్గలు వేస్తుంటాయి. ప్రధాన కూటములుగా ఎన్డీయే, ఇండియా బ్లాక్ (మహా ఘట్బంధన్)లు రెండే ఉన్నాయి. ఎన్డీయేలో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ (యు), భారతీయ జనతా పార్టీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి (ఎల్జేపీ) ఉన్నాయి. కొత్తగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ‘జన్ సురాజ్’ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇక, ముస్లివ్‌ు ఓట్లను గంపగుత్తగా వేయించు కోగలననే ధీమాతో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. స్వర్గీయ రావ్ువిలాస్ పాశ్వాన్ తనయుడైన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ‘అబ్ కీ బార్ యువ బిహార్’ అనే నినాదంతో బిహార్ యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఎన్డీయే కూటమికి ఇబ్బందికరమే! అందుకే ఎన్డీయే నుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకు పోకుండా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నితీష్ కుమార్‌ను ప్రకటించకుండా బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు చెక్ పెట్టింది. ‘యువ బిహార్’ కావాలంటే యువకుడైన ముఖ్యమంత్రి ఉండాలన్న సెంటిమెంట్‌ను ప్రశాంత్ కిశోర్ తేవడంతో... ఈసారి ఎన్డీఏ గెలిచినా, 75 సంవ త్సరాల వయస్సులో ఉన్న నితీష్ కుమార్‌ను మరోమారు ముఖ్య మంత్రిగా ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవచ్చు.ఓట్ల తొలగింపు రగడనిజానికి బిహార్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలను మోదీ వర్సెస్ రాహుల్‌గాంధీల నడుమ సాగే పోరుగానే చూడాలి. గత ఏడాది రాహుల్ బిహార్‌లో చోటు చేసుకొన్న ఓటర్ల జాబితా సవరణలపై దృష్టి పెట్టారు. బిహార్‌లో చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించి కేంద్ర ఎన్నికల సంఘం పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ‘సర్’ ద్వారా ఓట్లను తొలగించడంతోకాంగ్రెస్ దానిపై పెద్దఎత్తున ఉద్యమించింది. స్వతంత్రంగా నడుచుకోవాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఓట్లను తొలగించిందని ‘ఓట్ చోరీ’ అంటూ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొంది. చివరకు ఓటర్ల తొల గింపు అంశం సుప్రీంకోర్టుకు చేరింది.భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. రెండు విడతలుగా భారత్ జోడో యాత్రలు ఇందులో భాగంగానే చూడాలి. దేశంలో సమగ్రంగా, శాస్త్రీయంగా కులగణన చేయాలనీ కాంగ్రెస్ కోరుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అక్కడ స్వయంగా కులగణన చేసింది. దానిని తెలంగాణ మోడల్‌గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పట్ల ప్రతికూలంగా మారినా మోదీ ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శ చేస్తోంది. బీజేపీ వైపు నుంచి, మోదీ వైపు నుంచి ‘ఇండియా’ కూటమిపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు కూడా పదునైనవే! దేశం వెనుకబడి పోవడానికీ, అన్ని వ్యవస్థలూ సకల అవలక్షణాలతో కునారిల్లడానికీ కారణం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘంగా పాలించడమేనని బీజేపీ విమర్శిస్తోంది. దాంతోపాటు మోదీ నేతృత్వంలో ఈ 12 ఏళ్లకాలంలో దేశం ఏ విధంగా ముందంజ వేసిందీ ఘనంగా చాటుకొంటున్నారు. తాజాగా తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను, ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. అయితే, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... జీఎస్టీ సంస్కరణలు చేశారనీ, ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారనీ ప్రతిపక్షం ఆరోపి స్తోంది. 17 శాతం ముస్లివ్‌ు జనాభా గల బిహార్‌లో... మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో యథావిధిగా ఎవరితోనూ పొత్తు లేకుండా ఒవైసీ తన పార్టీ ‘మజ్లిస్’ను రంగంలోకి దించు తున్నారు. తమకు పడని ఓట్లు ఎదుటి పక్షానికి పడకుండా చీల్చడంలో ఇది బీజేపీకి లాభించేదే!కొత్త సంస్కరణలు ఇక్కడి నుంచే...తాజాగా పలు ఎన్నికల సంస్కరణలకు బిహార్ వేదిక కావడం విశేషంగా చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న 17 ఎన్నికల సంస్కరణల అమలు బిహార్ నుంచి మొదలు కాబోతోంది. ఈ సంస్కరణలలో ప్రధానంగా ఒక్కోపోలింగ్ బూత్‌ను 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు, పోస్టల్ బ్యాలెట్‌ను ముందుకు జరిపి తప్పనిసరి చేస్తున్నారు. ఓటరు గుర్తింపునకు ఆధార్‌ను వినియోగించుకోవచ్చు నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల కమిషన్ తొలుత నిరాకరించినా చివరకు దిగొచ్చింది. గతంలో తన మీద వచ్చిన ఆరో పణలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చేది. ఈసారి అందుకు భిన్నంగా సీఈసీ తనను విమర్శించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన టీఎన్ శేషన్ అన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి గౌరవాన్నిపెంచారు, ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడది మృగ్యమైంది.ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక పార్టీ లేదా కూటమి గెలు పొందుతుంది. అయితే, ప్రజాస్వామ్యం గెలిచిందన్న భావన ప్రజలకు కలగాలి. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలి. గెలుపు కోసం ఎంతకైనా దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడి పోతున్న నేపథ్యంలో... ప్రజాస్వామ్యం గెలవాలని కోరు కోవడం అత్యాశ అవుతుందా? కొత్తగా కొన్ని సంస్కరణలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం డేటా, బ్యాటరీ లాగ్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. పైగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ను నాశనం చేయాలనిజిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఇటువంటి నిబంధనలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, పొత్తులు కుదుర్చు కోవడంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల నేపథ్యంలో బిహార్ ఎన్నికలు ఈసారి అత్యంత రసవత్తరంగా మారనున్నాయి.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్‌కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్‌కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్‌పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్‌లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
‘వైభవ్ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’
భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలమయ్యాడు.టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచిరంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్‌కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆశ్చర్యపోయాఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్‌లో కామెంట్రీ చేస్తున్నా.నాలుగో ఓవర్లో లైవ్‌లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మనుఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్‌డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్‌నే.. నువ్వు చైర్మన్‌వి కదా! -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్‌లో విపక్ష మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్‌లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్‌ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్.. టీ20 మ్యాచ్ అనుకున్నావా?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ వైస్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూపులో భాగంగా పాట్నా వేదికగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అరుణాచాల్ కెప్టెన్ తొలుత బిహార్‌ను బ్యాటింగ్ అహ్హనించాడు.అయితే బ్యాటింగ్‌కు దిగిన బిహార్ ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టీ20 తరహాలో తన బ్యాటింగ్‌ను ప్రారంభించిన వైభవ్ కేవలం 5 బంతుల్లో 280.00 స్ట్రైక్ రేటుతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. బిహార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన యాబ్ నియా బౌలింగ్‌లో తొలి నాలుగు బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన వైభవ్.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు."వైభవ్ ఫార్మాట్ తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతీ బంతికి షాట్ ఆడే అవసరం లేదు. ఇది రెడ్ బాల్ క్రికెట్. సహనం, టెక్నిక్ కూడా కావాలి" ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. కాగా 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే అతడికి బిహార్ క్రికెట్ అసోయేషిన్ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.అతడి బిహార్ జట్టును అత్యున్నత స్ధాయికి తీసుకు వెళ్తాడని బీసీఎ భావించింది. కానీ వైభవ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే విఫలమై నిరాశపరిచాడు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా సూర్యవంశీ తన బ్యాట్‌కు పని చెబుతాడో లేదో చూడాలి.భారీ స్కోర్ దిశగా బిహార్..సూర్యవంశీ నిరాశపరిచినప్పటికి తొలి ఇన్నింగ్స్‌లో బిహార్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బిహార్ రెండు వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ఆయుష్ లోహరుక(155), సకిబుల్ గని(56) ఉన్నారు.చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్‌లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్‌నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్‌మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్‌కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్‌పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బీహార్ ఎన్నికల్లో పోటీకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి
-
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్‌కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది. भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025 రెండు రోజుల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఇచ్చారు. ఇదిలా ఉంచితే బిహార్‌లో నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఒప్పందం ఇలా..జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు ఇదీ చదవండి: బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే..! -
ఎల్లో కవర్ల కలకలం.. అర్ధరాత్రి బీహార్‌లో పొలిటికల్ హైడ్రామా
బీహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ బంధన్‌లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్‌లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి.. లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి. కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో కూడా ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్ ఫస్ట్ ఫేస్‌కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్ 6న పొలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ -
కొలిక్కి వచ్చిన మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కోరుకున్న సీట్లకు కేటాయించడంతో మహాఘట్ బంధన్‌లో సీట్ల కేటాయింపు సస్పెన్స్‌కు దాదాపుగా తెర పడినట్లేనని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి(Bihar Seats Sharing). మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే సర్దుబాటు నేపథ్యంలో ఇప్పుడు 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తొలుత 61 స్థానాలను కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు 70 స్థానాల్లో పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అని బహిరంగంగా చెప్పేశాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించిన అంశమేదీ మహాఘట్ బంధన్‌లో చర్చకు రాలేదని సమాచారం. అంతకు ముందు..బీహార్‌లో ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ 70 స్థానాలు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఒకవైపు రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వి యాదవ్ ప్రకటించినా.. సీట్ల డిమాండ్‌ను నేరవేర్చుకునేందుకే కాంగ్రెస్ ఆ అంశంపై సైలెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇంకోవైపు.. బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాన్ని ఇరకున పడేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ(IIP) విపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో.. ఎనిమిది పార్టీలకు ఈ కూటమి విస్తరించింది. అదే సమయంలో వీఐపీ పార్టీ అధినేత ముకేశ్ సాహ్ని.. 50 స్థానాలు+ఉపముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో సీట్ల పంపకంలో జాప్యం జరిగింది. చివరకు 16 పార్టీలకు సాహ్ని ఒప్పుకోగా.. ఆర్జేడీ తన కోటా నుంచి జేఎంఎంకు, కాంగ్రెస్ తన కోటా నుంచి IIP పార్టీకి స్థానాలు కేటాయించేందుకు అంగీకరించడంతో.. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లైంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొత్తం 243 స్థానాలకుగానూ.. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఓట్లు లెక్కించే తేదీ నవంబర్ 14. ఇదీ చదవండి: లాలూ కుటంబానికి భారీ షాక్ -
లాలు ఫ్యామిలీకి భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవి, కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు ఇతర నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది. వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, నిందితుల పాత్ర ఆధారంగా న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపింది. అయితే నిందితులందరిపై నేరపూరిత కుట్ర అభియోగం ఉమ్మడిగా ఉంది. తమపై మోపిన ఆరోపణలను లాలు కుటుంబం ఖండించింది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘టెండర్ కుంభకోణానికి సంబంధించిన పూర్తి కుట్ర లాలు ప్రసాద్ యాదవ్‌కు తెలిసే జరిగింది. టెండర్ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ కుట్ర ద్వారా లాలు కుటుంబం లబ్ధి పొందింది. రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమి లభించింది’అని పేర్కొంది. కోర్టు లాలు యాదవ్‌ను ఉద్దేశించి, ‘మీరు మీపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా? లేక విచారణను ఎదుర్కొంటారా?’అని ప్రశ్నించగా, ‘ఈ ఆరోపణలన్నీ అవాస్తవం’అని లాలూ యాదవ్ బదులిచ్చారు. అదేవిధంగా, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లు కూడా తాము ఏ కుట్రలో, మోసంలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. ఏంటీ కుంభకోణం?2004– 2009 మధ్యకాలంలో లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. సీబీఐ ఆరోపణల ప్రకారం, రాంచీ, పూరీలలో ఉన్న ఐఆర్సీటీసీకి చెందిన రెండు బీఎన్ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను ‘సుజాత హోటల్స్’అనే ప్రైవేట్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టుకు ప్రతిఫలంగా, లాలు కుటుంబానికి పట్నాలోని అత్యంత విలువైన భూమిని సుజాత హోటల్స్ యజమానులు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. 2017 జూలై 17న సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. #WATCH | Delhi: RJD leader Tejashwi Yadav leaves from the Rouse Avenue Court.The Rouse Avenue court framed charges against former Railway Minister Lalu Prasad Yadav, former Bihar CM Rabri Devi, RJD leader Tejashwi Yadav and others in the IRCTC hotels corruption case. This case… https://t.co/F9E3EhYfJM pic.twitter.com/zpX2ecXFcC— ANI (@ANI) October 13, 2025మరోవైపు.. బీహార్‌లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బీహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఎమ్మెల్యేలు నవాడా ఎమ్మెల్యే విభాదేవి, రజౌలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్‌ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ పోక్సో కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉండి, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబంలోని వారికి టిక్కెట్ ఇవ్వలేదని ఆర్జేడీపై ఈయన ఆగ్రహంతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్ వీర్ మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బీహార్‌లో సీట్ల సర్దుబాటు పరిష్కారమైంది. బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల నుంచి పోటీచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)తోపాటు బీజేపీ సైతం చెరో 101 సీట్ల నుంచి బరిలో దిగనుంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ 29 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాలు చెరో ఆరు స్థానాల నుంచి పోటీచేయనున్నాయి. 243 నియోజకవర్గాలున్న బీహార్‌లో పాలక ఎన్డీఏ కూటమిలో ఎవరే స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
Bihar: కుదిరిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సీట్ల సర్దుబాటు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. బీహార్ సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వె ల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।BJP – 101JDU – 101LJP (R) – 29RLM – 06HAM – 06एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।बिहार है तैयार,फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025 జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇదీ చదవండి:బీహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ! -
బిహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్‌లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.గత ఎన్నికల్లో..నిజానికి 2015 నుంచే బిహార్‌పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.నాలుగో బలమైన శక్తిగా..బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు.. తేజస్వీ యాదవ్‌ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్‌లో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.ఓట్లు చీలుతాయా?మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్‌లో పర్యటించారు. సీమాంచల్‌పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.విమర్శలు మొదలు..మజ్లిస్‌పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం. -
పాలిటిక్స్‌లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్‌కి మోస్ట్‌వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్‌ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
డెబ్యూతోనే పెద్ద రిస్క్!! పీకే ఏమన్నారంటే..
అదేదో సినిమాలో.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచి.. చివరకు తాను కాకుండా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సీఎం చేస్తాడు క్లైమాక్స్‌లో హీరో. బీహార్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ సీన్‌ను ప్రస్తావిస్తున్నారు పలువురు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త(మాజీ).. తన పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థుల ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్(prashant kishor).. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి తన జన సురాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారాయన. అందులో.. ప్రముఖ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేసీ సిన్హా(పాట్నా వర్సిటీ మాజీ వీసీ), మాజీ అడ్వొకేట్ జనరల్ వైబీ గిరి, రితేష్ రంజన్ పాండే (బోజ్‌పురి గాయకుడు)తో పాటు డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే..గోపాల్‌గంజ్ భోరే నియోజక వర్గంలో జన్ సురాజ్(Jan Suraaj Party) తరఫున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్(Preeti Kinnar).. ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ కాబట్టి. ప్రీతి కిన్నర్.. స్వస్థలం కల్యాణ్‌పూర్. ట్రాన్స్జెండర్ల నాయకురాలిగా.. సామాజిక వేత్తగా స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. ఇంతకీ ఆమె పోటీ చేయబోతోంది ఎవరి మీదనో తెలుసా?.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్ మీద. అందుకే ఆమె గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. అయితే.. స్థానిక సమస్యలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశమని జన్ సురాజ్ భావిస్తోంది.గెలిచిన దాఖలాల్లేవ్!రాజకీయాల్లో ట్రాన్స్జెండర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పాలి. 1998 మధ్యప్రదేశ్ ఎలక్షన్స్‌లో శబ్నం మౌసీ సోహగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2015లో మధు కిన్నర్ చత్తీస్‌గఢ్ రాయ్‌ఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గి.. మేయర్ పదవి చేపట్టారు కూడా. అయితే.. ఆ తర్వాతే ఆ వర్గం నుంచి చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు కాలేదు.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి రాజన్ సింగ్ పోటీ చేసి.. కేవలం 85 ఓట్లే దక్కించుకున్నారు. ఈ తరుణంలో ప్రీతి కిన్నర్.. అదీ జన్ సురాజ్ నుంచి బీహార్ ఎన్నికల బరిలో దిగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ప్రీతి కిన్నర్(ఎడమ), ప్రొఫెసర్ కేసీ సిన్హా(మధ్యలో), సింగర్ రితేష్ రంజన్ పాండే(చివర.. కుడి)రిస్క్‌పై పీకే ఏమన్నారంటే.. జన్ సురాజ్ తొలి జాబితాలో.. సామాజిక న్యాయం వరకు అయితే బాగానే జరిగింది. 17 మంది ఈబీసీలు, 11 మంది బీసీలు, 9 మంది మైనారిటీలు, ఏడుగురు షెడ్యూల్ కాస్ట్(ప్రీతి కూడా), ఎనిమిది మంది ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. ‘‘జన సురాజ్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓట్లు పడకపోతే.. అది నా తప్పేం కాదు. అది ముమ్మాటికీ బీహార్ ఓటర్లదే’’ అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. ‘పార్టీకి సరైన గుర్తింపు లేదు, ప్రచార నిధులు పరిమితంగా ఉన్నాయి. పైగా అవతల జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా.. ఎన్నికల్లో కొత్త ముఖాలతో వెళ్లడం రిస్క్ కాదా?’ అనే మీడియా ప్రశ్నకు ఆయన పైబదులు ఇచ్చారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం నినాదాలతో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. అక్టోబర్ 11న, రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పేరు తొలి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ తెలిపింది. నవంబర్ 6, 11.. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: మాయావతి ఎంట్రీ.. సీన్ మారేనా? -
బిహార్ బిలియనీర్లు.. బిజినెస్‌లో తోపులు!
బిహార్ అంటే పేద రాష్ట్రం, నిరక్షరాస్యులు ఎక్కువ అనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంటుంది. కానీ బిహార్ (Bihar) సాంప్రదాయకంగా పండితులు, నాయకులు, సాంస్కృతిక గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా కూడా ఉంది.మైనింగ్ నుండి ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ సర్వీసులు, పునరుత్పాదక ఇంధనం, రాజకీయాల వరకు వివిధ రంగాల్లో సంకల్పం, విజన్‌తో వేల కోట్ల సంపదను ఎలా సృష్టించగలరో బిహార్ సంపన్నులు (Richest People In Bihar) చూపిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 2025లో బిహార్ లోని టాప్ 10 ధనవంతులు, వారి వ్యాపార సామ్రాజ్యాలు, నెట్వర్త్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అనిల్ అగర్వాల్నెట్వర్త్: రూ.16,000–17,000 కోట్లుబిజినెస్: వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు (మైనింగ్ & మెటల్స్)నేపథ్యం: పాట్నాలో స్క్రాప్ డీలర్ గా ప్రారంభించిన అగర్వాల్ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వనరుల కంపెనీలలో ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది.రవీంద్ర కిషోర్ సిన్హానెట్వర్త్: రూ.5,000–10,000 కోట్లుబిజినెస్: SIS (సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్)నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్మించిన మాజీ జర్నలిస్ట్.మహేంద్ర ప్రసాద్నెట్వర్త్: రూ .4,000 కోట్లు పైనేబిజినెస్: అరిస్టో ఫార్మాస్యూటికల్స్నేపథ్యం: "కింగ్ మహేంద్ర"గా పిలువబడే ఈయనది బిహార్ ఫార్మా ఉనికిలో కీలక పాత్ర.సంప్రదా సింగ్నెట్వర్త్: (2019లో మరణించడానికి ముందు): రూ .25,000 కోట్లు పైనేబిజినెస్: ఆల్కెమ్ లేబొరేటరీస్నేపథ్యం: తన సోదరుడితో కలిసి ముంబైలో ఆల్కెమ్ ను స్థాపించి, దానిని ప్రముఖ ఫార్మా బ్రాండ్ గా తీర్చిదిద్దారు.సుబ్రతా రాయ్నెట్వర్త్: రూ .3,000 కోట్లు పైనేబిజినెస్: సహారా ఇండియా (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా)నేపథ్యం: 1978లో సహారాను కనీస మూలధనంతో స్థాపించి, దానిని జాతీయ సమ్మేళనంగా నిర్మించారు.శుభమ్ సింగ్నెట్వర్త్: రూ.500+ కోట్లుబిజెనెస్: భారత్ ఊర్జా డిస్టిలరీస్ (ఇథనాల్ ప్లాంట్)నేపథ్యం: కేవలం 26 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఇంధన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా బిహార్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని నడిపించారు.సుభాష్ చంద్రనెట్వర్త్: రూ .5,000+ కోట్లుబిజినెస్: ఎస్సెల్ గ్రూప్, జీ మీడియానేపథ్యం: భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించారు. బీహార్ వెలుపల ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు బిహార్‌తో ముడిపడి ఉన్నాయి.సుమంత్ సిన్హానెట్వర్త్: రూ .3,000+ కోట్లుబిజినెస్: రెన్యూ పవర్నేపథ్యం: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడైన సుమంత్ భారత క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్ -
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఝలక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ మంత్రి మురారి ప్రసాద్ గౌతమ్ బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గౌతమ్ రాజీనామాతో రోహ్తాస్ జిల్లా చెనారి రిజర్వుడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని బీహార్ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ సందర్భంగా ‘శాసన సభ్యత్వానికి రాజీనామా వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గౌతమ్ పీటీఐకి స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో గౌతమ్ మంత్రిగా పనిచేశారు. జేడీ(యూ) మళ్లీ ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత, ఆయన ట్రెజరీ బెంచ్ సభ్యులతో కలిసి కూర్చోవడం ప్రారంభించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ ముందు పెండింగ్‌లో ఉంది. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుండటం తెలిసిందే. -
Bihar Elections: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ?
పట్నా: బీహార్‌లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
బీహార్ ఎలక్షన్స్: ‘భారతంలో దృతరాష్ట్రుడిలా..’
విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్ రాజకీయం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్‌ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్ సిన్హా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. బీహార్‌లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్‌ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్‌లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్ సిన్హా అన్నారు. ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు! -
తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పూర్తి వివరాలను తమకు అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్‌లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఎస్ఐఆర్ తర్వాత సెప్టెంబర్ 30న ప్రచురించిన తుది ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించిన వారి వివరాలు ఇవ్వాలని కోరింది.ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విచారణకు హాజరయ్యారు. తొలగించిన పేర్లలో చాలావరకు కొత్తగా ఓటు నమోదుచేసుకున్నవారేనని తెలిపారు. వారిలో ఎవరి నుంచీ ఫిర్యాదులు రాలేదని చెప్పారు. అయినప్పటికీ తొలగించినవారి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎలక్టోరల్ ముసాయిదాతోపాటు తుదిజాబితాను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. గందరగోళాన్ని తొలగించేందుకే.. తమ ఆదేశాలు ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొస్తాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఎన్నికల జాబితాపై గందరగోళాన్ని తొలగించేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ‘ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజలకు మరింత సమాచారం అందుబాటులో ఉండేందుకు మీరు (ఈసీ) మా నిర్ణయంతో ఏకీభవించాలి. మీరు ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల పేర్లు తొలగించారు. చనిపోయినవారు, రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించటం సబబే. కానీ, మీరు ఓటరు జాబితా నుంచి ఒక పేరును తొలగించాలంటే కచి్చతంగా రూల్ 21ను పాటించాలి. ప్రజలకు కూడా ఒక విన్నపం. ఎవరి పేర్లయితే ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందో.. వారు తమ వివరాలను ఎన్నికల కార్యాలయాల్లో అందజేయండి’అని సూచించారు. -
Bihar Election: ‘మెట్రో’ సెంటిమెంట్.. 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ప్రభావం..
పట్నా: బీహార్ ఎన్నికల్లో విజయానికి బీజేపీ ‘మెట్రో’ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తోంది. గత 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు వివిధ పార్టీల ప్రభుత్వాలు ‘మెట్రో’ను ప్రారంభించాయి. ఈ మెట్రో సెంటిమెంట్ నాలుగు రాష్ట్రాల్లో విజయానికి దారి తీసింది. మొన్న అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు బీహార్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అయితే దీనికి ఐదు గంటల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా మెట్రోకు పచ్చజెండా ఊపారు. ఎన్నికలకు ముందు మెట్రోలు..2013, రాజస్థాన్: ఎన్నికలకు మూడు నెలల ముందు జైపూర్ మెట్రో ట్రయల్ రన్. దీనిని నాటి కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఫలితం: 200 సీట్లు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ 21 సీట్లకు పడిపోయింది. బీజేపీ 163 సీట్లతో మెజారిటీని సాధించింది. వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యారు. మెట్రో ప్రారంభించిన జైపూర్ జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది.2017, ఉత్తరప్రదేశ్: 2016, అక్టోబర్ 4న నాటి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాన్పూర్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 1న లక్నో మెట్రోను ప్రారంభించారు. 2017, ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ 47 మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 312 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాన్పూర్‌లోని 10 సీట్లలో ఎస్పీ రెండు, లక్నోలో ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.2022, ఉత్తరప్రదేశ్: కాన్పూర్ మెట్రో మొదటి దశ ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ మెట్రో మొదటి దశను ప్రారంభించారు. తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లలో 255 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాన్పూర్‌లోని 10 స్థానాల్లో ఏడు స్థానాలు బీజేపీ ఖాతాలో చేరాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు.2023, మధ్యప్రదేశ్: ఎన్నికలకు 45 రోజుల ముందు భోపాల్ మెట్రో ట్రయల్ రన్‌ను నాటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ 230 సీట్లలో 163 గెలుచుకుంది. భోపాల్ జిల్లాలో 7 సీట్లలో 6 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో డాక్టర్ మోహన్ యాదవ్ సీఎంగా నియమితులయ్యారు.2024, మహారాష్ట్ర: ఎన్నికలకు కొన్ని నెలల ముందు పూణే, ముంబై మెట్రో ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ముంబై మెట్రోను ప్రారంభించారు. 2024, సెప్టెంబర్ 29న పూణే మెట్రోను ప్రారంభించారు. ఆ సమయంలో రాష్ట్రాన్ని బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల మహాయుతి (మహాయుతి) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఫలితం: నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, మహాయుతి 288 సీట్లలో 230 గెలుచుకుంది. ముంబైలోని 36 సీట్లలో 22, పూణేలోని 21 సీట్లలో 18 వారి సొంతమయ్యాయి. అయితే, దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్నాథ్ షిండే స్థానంలో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.2025, ఢిల్లీ: ఎన్నికలకు ఒక నెల ముందు ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.ఫలితం: నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకుని, 27 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు.మెట్రో ప్రారంభం.. ఎన్నికలపై ప్రభావంఆరు రాష్ట్రాల ఎన్నికల విశ్లేషణలో మెట్రో ప్రారంభం ఎన్నికలపై ప్రభావం చూపిందని వెల్లడయ్యింది. ఆరు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో మెట్రోను ప్రారంభించిన పార్టీ ప్రయోజనం పొందింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 42 శాతం మంది పట్టణ ప్రజలు. వారు పట్టణీకరణను అభివృద్ధిగా భావిస్తారు. అందుకే పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం కోసం మెట్రో కార్డును ఉపయోగిస్తున్నాయి. -
బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్‌కు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్‌కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్‌ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్‌తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ. ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్! -
బిహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు
-
బిహార్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్‌లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్‌ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
ఈసీ ప్రెస్‌మీట్.. నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Election) షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. బీహార్(Bihar Election) అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్(Jubilee Hills Election) అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్(దేశంలో మరో నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు) విడుదలయ్యే అవకాశం ఉంది. Delhi | Election Commission of India to hold a press conference at 4 PM today to announce the schedule for the upcoming Bihar Assembly Elections pic.twitter.com/YFTiaVTkk0— ANI (@ANI) October 6, 2025కాగా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బీహార్‌లో పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికలతో (Assembly Elections) అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని, తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ముమ్మర సవరణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. బీహార్ (Bihar)లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. కాగా, ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
పారదర్శకత కోసం 17 మార్పులు
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో 17 నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక రోల్‌మోడల్ అవుతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపులో ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధూ, వివేక్ జోషీతో కలిసి జ్ఞానేశ్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ఓటర్ రిజి్స్ట్రేషన్ తర్వాత 15 రోజుల్లోగా ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)ను సంబంధిత ఓటర్‌కు అందజేయడానికి ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించబోతున్నామని వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. మార్పుల్లో కీలకమైనవి..→ బిహార్‌లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల జనం బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవచ్చు. తక్కువ మంది ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్ రికార్డుకెక్కనుంది. → ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యపై పరిమితి విధించారు. 1,500 నుంచి 1,200కు తగ్గించారు. దీనివల్ల బిహార్‌లో అదనంగా 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మొత్తం కేంద్రాల సంఖ్య 90,712కి చేరుకోనుంది. → ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) బ్యాలె ట్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి కలర్ ఫోటోలు ముద్రించబోతున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపెంచేలా పెద్ద అక్షరాల్లో ముద్రిస్తారు. ప్రస్తుతం ఈవీఎంలపై నలుపు తెలుపు రంగు ఫొటోలే ఉంటున్నాయి. దీనివల్ల అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిహార్‌లో ఈ కష్టాలకు తెరపడినట్లే. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచి్చంది. దేశంలో ఈవీఎంలపై కలర్ ఫొటోలు ముద్రించిన మొట్టమొదటి ఎన్నికలుగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రకెక్కబోతున్నాయి. → ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్–లెవెల్ అధికారులకు అధికారికంగా గుర్తింపు కార్డులు జారీ చేయబోతున్నారు. తద్వారా ఓటర్లు వారిని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. → బిహార్ ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కవరేజీని తప్పనిసరి చేశారు. అనుమానాలకు తావులేకుండా ప్రతి అంశాన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేశారు. → పోలింగ్ కేంద్రాల వల్ల మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తారు. → పోలింగ్ ఏజెంట్లకు ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17సీని అందజేస్తారు. ఫామ్ 17సీలోని వివరాలకు, ఈవీఎం కౌంటింగ్ యూనిట్లలోని ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైతే దానికి సంబంధించిన వీవీప్యాట్లను రీకౌంటింగ్ చేస్తారు. → ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ముందే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబర్ 22వ తేదీలోగా నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలు ఉండగా, వీటిలో 38 ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కోసం బూత్–లెవెల్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామన్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 243 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులను(ఈఆర్ఓ) నియమించామని తెలిపారు. ఎస్ఐఆర్ను జూన్ 24న ప్రారంభించామని, ఈఆర్ఓతోపాటు బూత్–లెవెల్ అధికారుల సాయంతో గడువులోగా విజయవంతంగా పూర్తిచేశామని వివరించారు. ఎస్ఐఆర్ విజయవంతం అయినందుకు ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో చురుగ్గా భాగస్వాములు కావాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఛత్ వేడుకలో పాల్గొన్నంత ఉత్సాహంగా ఎన్నికల పండుగలో పాల్గొనాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. బిహార్‌లో 90,217 మంది బూత్ లెవెల్ అధికారులు ఎస్ఐఆర్ నిర్వహించారని, అద్భుతంగా పనిచేసి దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారని జ్ఞానేశ్ కుమార్ ప్రశంసించారు. ఓటర్ల జాబితా శుద్ధీ్ధకరణ విషయంలో మొత్తం దేశానికే వారు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు వెల్లడించారు. -
‘ఇలాంటి వ్యక్తా ప్రభుత్వాన్ని నడిపేది’.. సీఎం నితిష్ కుమార్ వీడియో వైరల్
పాట్నా: బిహార్ రాజకీయాల్లో సీఎం నితీశ్ కుమార్ తీరు మరోసారి చర్చాంశనీయంగా మారింది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభంలో ఓ కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు. దీంతో నితీశ్ పరిపాలనపై ప్రశ్నలు తలెత్తాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ టాపర్ల కోసం దేశవ్యాప్తంగా జరిగే నైపుణ్య స్నాతకోత్సవం Kaushal Deekshant Samaroh 2025లో నితీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ దాదాపు ఒక నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని కనిపించారు. ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను వ్యాఖ్యాత చదువుతుండగా.. నితీష్ తన చేతులను ఒకదానికొకటి పట్టుకుని కూర్చున్నారు. కొద్దిగా కదిలించి పక్కకు చూశారు. అయితే ఆయన ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీఎం ఆరోగ్యం బాగానే ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ అబ్బే ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరంటూ’ ఘాటు వ్యాఖ్యలే చేశారు.ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థిరంగా మాట్లాడలేకపోతే ఎలా?’అని ప్రశ్నించారు. అలాగే, ఆయన పాలనలో బిహార్ పూర్తిగా గందరగోళంగా మారిందని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. నితీశ్‌పై తేజస్వీ చేసిన విమర్శల్ని జేడీయూ నేతలు ఖండిస్తున్నారు. నితీశ్ కుమార్ అనుభవజ్ఞుడు. ఆయనపై ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. బిహార్ రాజకీయాల్లో ఈ ఘటన మరో మలుపు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వానికి పారదర్శకత అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Nitish Kumar theek toh hai na ? Ye jo kar rahe hai ye bilkul achha nahi lagta hai dekhne mein !pic.twitter.com/Etev7K8tKG— Surbhi (@SurrbhiM) October 5, 2025 -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్‌పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్‌తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్‌లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్‌పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్‌ప్రెస్) రన్‌ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్‌లోని అనేక చోట్ల రైల్వే అండర్‌పాస్, ఓవర్‌బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్‌లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
నేడు బిహార్ ఓటరు తుది జాబితా
న్యూఢిల్లీ: బిహార్ తుది ఓటరు జాబితా మంగళవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో, వచ్చే వారంలో ఈసీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముగియడంతో ఓటరు జాబితా ఫైనల్ లిస్ట్‌ను ఈసీ ఆన్లైన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 7.24 కోట్ల ఓటర్లున్నారు. ఇలా ఉండగా, ఈసీ బృందం అక్టోబర్ 4, 5వ తేదీల్లో పట్నాకు వెళ్లి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరపనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముందని సమాచారం. మొదటి దశ పోలింగ్ ఛట్ పండుగ తర్వాత అక్టోబర్ ఆఖర్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల పరిశీలకుల నియామకం కసరత్తు అక్టోబర్ 3వ తేదీకల్లా ముగియనుందని చెబుతున్నారు. బిహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. -
వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..
ఎన్నో దుర్గమాత ఆలయాలు చూసుంటారు. కచ్చితంగా అక్కడ ఇచ్చే బలులకు నేలంతా రక్తసికమై ఎర్రటి సింధూరలా మారిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆలయంలో రక్తమే చిందించని సాత్విక బలి సమర్పిస్తారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఎన్నేళ్ల నాటిదో తెలిస్తే విస్తుపోతారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ కట్టడం తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. దసరా సదర్భంగా ఈ ఆలయ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం. ఇది బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ముండేశ్వరి మాతగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంఆ పేరు రావడానికి కారణం..ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకు వారాహి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు. విచిత్రమైన బలి ..ఇక అమ్మవారికి సమర్పించే బలి అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఇలాంటి బలి ఏ ఆలయంలో కనిపించదు. ముందుగా అమ్మవారికి బలి ఇవ్వదలుచుకున్న మేకను ముండేశ్వరి మాత ముందుకు తీసుకువస్తారు. దాని మెడలో ఒక పూల దండ వేయగానే ఏదో మూర్చ వచ్చినట్లు పడిపోతుంది. కాసేపటికి పూజారి ఏవో మంత్రాలు చదువుతూ బియ్యం గింజలు వేయగానే తిరిగి ఆ మేక యథాస్థితిలోకి వస్తుంది. దాన్ని తిరిగి భక్తుడికి ఇచ్చేస్తాడు పూజారి. ఇక్కడ అమ్మవారికి రక్తం చిందించని, ప్రాణం తీయని సాత్విక పద్ధతిలో బలిని ఇవ్వడమే ఈ ఆలయం విశిష్టత. ఈ అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులుచేత నీరాజనాలు అందుకుంటోంది.(చదవండి: శ్రీలంక టూర్..బౌద్ధ రామాయణం) -
అధికారం మాదే.. లేదంటే చివరి స్థానమే: పీకే ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఫుల్ మెజార్టీ సాధిస్తుంది.. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుంది అంటూ జోస్యం చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీకే.. తన పార్టీ బీహార్‌లోని 243 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో తమ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుందన్నారు. ఎటూ కాకుండా మధ్యలో ఉండటం జరగదన్నారు. అలాగే, అధికార ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ)కు 25 సీట్లకు మించి రావని తేల్చిచెప్పారు. బీజేపీకి కూడా ఓటమి తప్పదన్నారు. విపక్ష మహాఘట్బంధన్ మూడో స్థానంలో నిలుస్తుందని, తన పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.ఇదిలా ఉండగా.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. జేడీ(యూ)నేత, బీహార్ మంత్రి అశోక్ చౌదరికి పరువు నష్టం నోటీసు పంపుతానని తెలిపారు. రూ.200 కోట్ల అవినీతికి ఆయన పాల్పడినట్లు ఆరోపించారు. కోట్ల విలువైన ఆ భూమిని తన పీఏ పేరుతో ఆయన ఎందుకు కొన్నారు? అని ప్రశ్నించారు. త్వరలోనే నలుగురు లేదా ఐదుగురు ప్రముఖ నేతల గుట్టు బయటపెడతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ బీహార్ రాజకీయాల్లో నెలకొంది. -
వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మహిళా సాధికారతకు కృషి
పట్నా: బిహార్‌లో మహిళా సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం 75 లక్షల మంది పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేశారు. రూ.7,500 కోట్లతో ఈ పథకానికి బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 75 లక్షల మంది లబి్ధదారులకు త్వరలో అదనంగా రూ.2 లక్షల చొప్పున అందజేయబోతున్నామని ప్రధాని వెల్లడించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. వారు స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్ మహిళల ప్రగతి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలకమైన అడుగు ముందుకు వేసిందని అన్నారు. మన అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలు ఉద్యోగాలు సంపాదిస్తే, స్వయం ఉపాధి పొందితే వారి కలలకు రెక్కలొచ్చినట్లేనని చెప్పారు. సమాజంలో వారి గౌరవం మరింత పెరుగుతుందని ఉద్ఘాటించారు. 11 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ‘జన్‌ధన్ ఖాతాల’ సంకల్పం వల్లే ఈరోజు 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైందని వివరించారు. మహిళలకు ఇద్దరు సోదరులు బిహార్ మహిళలకు నితీశ్ కుమార్, నరేంద్ర మోదీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ సోదరీమణుల బాగు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం పట్ల గరి్వస్తున్నానని స్పష్టంచేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘జీవిక నిధి సఖ్ సహకారి సంఘ్’ను ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనతో అనుసంధానిస్తామని ప్రకటించారు. పీఎం ఉజ్వల యోజన, ఉచిత రేషన్ సరుకుల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో 8.5 కోట్ల మంది బిహారీల జీవితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతీ దీదీలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా మహిళలు లఖ్పతీ దీదీలుగా మారారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. -
ఆ మూడు రాష్ట్రాలపై బీజేపీ నజర్.. నూతన నియామకాలతో ఎన్నికల వ్యూహం
న్యూఢిల్లీ: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో రాబోయే ఎన్నికలకు పోల్ ఇన్‌చార్జ్‌లను నియమించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ నియామకాలు కీలక రాష్ట్రాలలో ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయుక్తమవుతాయని పార్టీ భావిస్తోంది.బీహార్‌లో ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడులో బైజయంత్ పాండా పశ్చిమ బెంగాల్లో భూపేంద్ర యాదవ్ పోల్ ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్య సహ ఇన్‌చార్జ్‌లుగా పనిచేయనున్నారు. ఈ బృందం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, రాష్ట్రంలో బలమైన బీజేపీ ఉనికిని చాటేందుకు వ్యూహాలను అమలు చేయడం తదితర బాధ్యతలను చేపడుతుంది. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను బైజయంత్ పాండాకు అప్పగించారు. మురళీధర్ మోహోల్ అతనికి సహ ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు.పశ్చిమ బెంగాల్‌కు పోల్ ఇన్చార్జ్గా భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమితులయ్యారు. బిప్లాబ్ కుమార్ దేబ్ ఆయనకు సహ ఇన్చార్జ్గా మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ భావిస్తోంది. అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రచార నిర్వహణ, ఓటర్ల సమీకరణకు సమన్వయ విధానాన్ని రూపొందించనుంది. ఈ నూతన నియామకాలు బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేసే దిశగా పార్టీలోని సీనియర్ నేతల సలహా, సంప్రదింపులను బీజేపీ తీసుకుంటున్నదని సమాచారం. -
అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
-
బీహార్‌లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?
సాక్షి, ఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తాజాగా నవంబర్ 5-15 మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు.వివరాల ప్రకారం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబర్ మొదటి వారంలో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఛఠ్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: క్రెడిట్ కొట్టేయాలని మోదీ ఆరాటంఅయితే, బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. దీంతో, ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా బీహార్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7వ తేదీల్లో చేపట్టారు. ఫలితాలను నవంబర్ 10వ తేదీన వెల్లడించారు. దీంతో, ఈసారి కూడా ఇంచుమించుగా ఇలాగే మూడు దశల్లో ఎన్నికల జరిగే అవకాశం ఉంది. -
Bihar: ప్రధాని మోదీ దివంగత తల్లికి మళ్లీ అవమానం.. వీడియోను షేర్ చేసిన ఉపముఖ్యమంత్రి
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన బీహార్ అధికార్ యాత్ర లో ప్రధాని మోదీ దివంగత తల్లిని మళ్లీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఈ సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది బీహార్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. కాగా దీనిపై ఆర్జేడీ ఇంకా అధికారిక ప్రతిస్పందన వెల్లడించలేదు.తేజస్వి యాదవ్ పర్యటనలో ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషను ఉపయోగించారని బిజెపీ ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ అరోపణలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తేజస్వి యాదవ్ కార్యకర్తల వేధింపుల తీరును ప్రోత్సహిస్తున్నారని, ఈ తరహా ప్రవర్తన బీహార్ సంస్కృతిని నాశనం చేస్తున్నదని రాశారు. బీహార్‌లోని మహిళలు ఈ అవమానంపై ప్రజాస్వామ్య రీతిలో ప్రతిస్పందించాలని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. तेजस्वी यादव ने फिर दिलवाई- मोदी जी की मृत माताजी को गाली। इन्होंने बिहार की संस्कृति को एक बार फिर तार-तार कर दिया।रैली में आरजेडी के कार्यकर्ता जितना ही गाली दे रहे, तेजस्वी उतना ही हौसला बढ़ा रहे थे। इस गुंडई की मानसिकता और गाली का हिसाब बिहार की माताएँ-बहनें जरूर करेंगी। pic.twitter.com/p4TNr4J20V— Samrat Choudhary (@samrat4bjp) September 20, 2025ఈ ఘటనను ప్రజాస్వామ్యానికి జరిగిన తీవ్ర అవమానంగా చౌదరి అభివర్ణించారు. మహిలలను అవమానించడం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారిందా? అని ప్రశ్నించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రతిస్పందన తెలియజేశారు. తేజస్వి యాదవ్ తన పర్యటనలో ప్రధాని మోదీ దివంగత తల్లిపై దుర్భాషలాడారని అన్నారు. ఈ రకమైన రాజకీయాలు ఆమోదయోగ్యం కాదని, దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాగా బీజేపీ ఆరోపణలపై ఆర్జేడీ నుండి అధికారిక స్పందన రాలేదు. కాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సెప్టెంబర్ 16న జెహానాబాద్ నుండి తన బీహార్ అధికార్ యాత్రను ప్రారంభించారు. యాత్రలోని మొదటి దశ నలంద, బెగుసరాయ్ తదితర ప్రాంతాల గుండా సాగి, సెప్టెంబర్ 20న వైశాలిలో ముగిసింది. -
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే బీహార్‌లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్‌లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్‌లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్‌లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్‌పుత్‌లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్‌లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్‌ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్‌లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్‌గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్‌గంజ్‌తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
బీహార్‌లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్బంధన్ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. అవినీతి.. కులాల లెక్కలు బిహార్‌లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్‌లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాఘఠ్బంధన్ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ బిహార్ ఇన్చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది. కాంగ్రెస్ అంచనా వేరే.. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్‌కు బిహార్‌లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది. ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్జేడీ బలపడి, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు తేజస్వియాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్‌కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
చట్టవిరుద్ధం అని తేలితే పక్కన పడేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్ఐఆర్పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్‌కు మాత్రమేకాదు యావత్భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్‌ఐఆర్‌లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది. ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్ఐఆర్పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్‌సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్సైట్లో అభ్యంతరాలను అప్‌లోడ్‌చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు. -
బిహార్‌ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్‌లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్‌లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్‌ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్‌పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్‌కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
విమర్శల బదులు విస్తృత దర్యాప్తు చేయించాల్సింది
న్యూఢిల్లీ: బిహార్‌లో ఆగమేఘాల మీద చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా భావించి దర్యాప్తు చేపట్టాల్సిందిపోయి ఆయనపై ప్రత్యారోపణల బురద చల్లడం ఏమాత్రం సబబుకాదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషి వ్యాఖ్యానించారు. ఖురేషి రాసిన ‘ప్రజాస్వామ్యానికి గుండెకాయ(డెమొక్రసీస్ హార్ట్‌ల్యాండ్’పుస్తకం త్వరలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన తర్వాత ఉద్యమస్థాయికి చేరిన విషయం తెల్సిందే. ‘‘ఓట్ల చోరీ అంశంలో త్వరలో రాహుల్‌గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’పేలుస్తానని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎన్నికల సంఘం కొత్త ఓట్ల జోడింపు, నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాటు ఉన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఈసీ చాలా తీవ్రంగా భావించాలి. వాటిలోని సహేతుకత, ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేపట్టాలి. సమగ్రస్థాయిలో దర్యాప్తుతో ఆయన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చాలి. అలాంటిదేమీ చేయకుండా కేవలం ఆయనపై ప్రత్యారోపణలు చేయడం ఈసీకి తగదు. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని విపక్షపారీ్టలుసహా పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సిందిపోయి ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకుని వివాదాల తేనెతుట్టెను ఈసీ కదిపింది’’అని ఖురేషి అన్నారు. అఫిడవిట్ అడగడం సబబుకాదు ‘‘ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించినప్పుడు దర్యాప్తు మొదలెడితే సరిపోయేది. అలా చేయకుండా రాహుల్ నుంచి ఆ ఆరోపణలు నిజమేనని పేర్కొంటూ అఫిడవిట్‌ను కోరడం సబబుకాదు. ఆయనేం వీధిలో వెళ్లే వ్యక్తికాదు. లోక్‌సభలో విపక్ష నేత. కోట్లాది ఓటర్లకు ప్రతినిధి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధి. కోట్లాది ప్రజల గొంతుక. అలాంటి కీలకమైన హోదాలో ఉన్న వ్యక్తితో ఈసీ ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. అఫిడవిట్ ఇవ్వండి లేదంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఆయనతో అమర్యాద బాషలో సం¿ోదించడం అభ్యంతరకరం మాత్రమేకాదు నేరంకూడా’’అని ఖురేషి ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సందర్భాల్లో నేనెంతో బాధపడ్డా.. ‘‘నేరుగా ఈసీని తప్పుబడుతూ ఏవైనా ఆరోపణలు వస్తే నేను తొలుత ఆందోళనచెందుతా. ఈసీని అత్యంత పారదర్శకంగా పనిచేసేలా చూడటంలో నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నా వంతు కృషిచేశా. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘంపై ఎవరైనా ఆరోపణలుచేస్తే మాజీ సీఈసీగానేకాకుండా ఒక సగటు భారతీయ పౌరునిగా ఎంతో బాధపడతా. ఏదైనా ప్రభుత్వసంస్థను ఎవరైనా బలహీనపర్చడానికి ప్రయతి్నస్తే కుంగిపోతా. అలాంటి ఈసీ స్వయంగా ఆరోపణల దాడులను ఎదుర్కొన్నప్పుడు వాటిని సమగ్ర దర్యాప్తు ద్వారా సమగ్రంగా ఎదుర్కోవాలి. రాజకీయ శక్తులు, బయటి వ్యక్తుల ఒత్తిళ్ల ఏ స్థాయిలో ఉన్నా సరే స్వీయ నిర్ణయాలల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రజల విశ్వాసాన్ని ఈసీ చూరగొనాలి. అధికార పారీ్టతో పోలిస్తే విపక్ష పార్టీల పలుకుబడి తక్కువ అయినాసరే విపక్ష పారీ్టల విశ్వాసాన్నీ సాధించాలి. అధికార పార్టీ నేతలతో పోలిస్తే విపక్ష పారీ్టల నేతలు చెప్పేవి ఎక్కువగా వినాలి. అందుకోసం వారికి ఈసీ తలుపులు బార్లా తెరవాలి. వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ల వాదనలు, ఆరోపణలు, అభ్యంతరాలు, విన్నపాలను సావదానంగా ఆలకించాలి. మా మాట ఈసీ వినట్లేదని ముఖ్యమైన 23 పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు’’అని ఈసీకి ఖురేషి హితవు పలికారు.కొత్త జాబితాలో తప్పుల్లేవని అఫిడవిట్ ఇవ్వగలరా? ఈ సందర్భంగా ఈసీపై ఖురేషి పలు ప్రశ్నలు సంధించారు.‘‘ముసాయిదా జాబితా తర్వాత సవరణల తర్వాత తెచ్చే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లవని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? రాహుల్‌ను అడిగినట్లుగా మీరు కూడా ఇందులో ఏ తప్పులు ఉండబోవని అఫిడవిట్ సమరి్పంచగలరా? తప్పులు ఉంటే అది నిజంగా నేరమే. అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కోగలరా?. ఈసీ అనేది పారదర్శకంగా ఉంటే సరిపోదు. పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించాలి. నిజానిజాలను దర్యాప్తు మాత్రమే బయటపెట్టగలదు. తీవ్ర ఆరోపణలు అరుదుగా చేస్తారు. అలాంటప్పుడే దర్యాప్తు చేపట్టాలి. అలాంటి అవకాశాన్ని ఈసీ సది్వనియోగం చేసుకోలేకపోయింది’’అని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ‘రాజకీయ పారీ్టలతో మేము క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇంత నిర్మాణాత్మక పద్ధతిలో మరెక్కడా సమావేశాలు జరగవు’అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేడు బిహార్‌లో ప్రధాని పర్యటన
పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్‌ఫుడ్‌గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్‌లో సాగవుతోంది. మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలాలను అందుకుంటోందన్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. -
బీహార్‌లో ‘సీట్ల’ లొల్లి.. ‘ఆల్-243’పై తేజస్వి దృష్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. ఇదే సమయంలో మిత్రపక్షాల కూటమి ‘మహాఘట్ బంధన్’లో సీట్ల లొల్లి మొదలయ్యింది. కూటమిలోని అన్ని పార్టీలు అధిక సీట్లు కోరుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాము రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లోనూ పోటీచేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో తేజస్వి ప్రసంగిస్తూ ‘ఈసారి తేజస్వి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తారు. అది ముజఫర్‌పూర్ అయినా మరొకటైనా.. తేజస్వి పోరాడుతారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నా పేరు మీద ఓటు వేయండి. బీహార్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తేజస్వి కృషి చేస్తారు... మనమందరం కలిసి పనిచేసి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి’ అని అన్నారు.ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్.. ప్రజల ఓటు హక్కును లాక్కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాఘట్ బంధన్‌లో ఇప్పటికే సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. ఇటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ తాజా ప్రకటన సంచలనంగా పరిణమించింది.2020 బీహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 75 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తాను బలపడినట్లు భావిస్తోంది. ఓటరు అధికార్ యాత్ర, ఓటు 'చోరీ'సందేశం బీహార్ ప్రజలతో ప్రతిధ్వనించిందని, రాహుల్‌కు, పార్టీకి మరింతగా ప్రజాదరణ పెరిగిదని అనుకుంటోంది.ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణ అల్లవారు మాట్లాడుతూ కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే, ప్రతి పార్టీ తమ వాటాను అందించాల్సి ఉంటుందనుకుంటున్నామని, అయితే సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలన్నారు. కాంగ్రెస్ కనీసం 70 నియోజకవర్గాలను కోరుకుంటున్నదని, ఆ సంఖ్య ఇంకా తక్కువ కూడా కావచ్చన్నారు. అయితే 15 మంది ఎమ్మెల్యేలను కలిగిన వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) కూడా మరిన్ని సీట్ల కోసం అభ్యర్థిస్తున్నాయని సమాచారం.గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు మహాఘట్ భంధన్లో సీట్ల కేటాయింపును మరిత జఠిలం చేశాయి. ఇదిలా ఉండగా తేజస్వి యాదవ్ మాటలకు స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘తేజస్వి యాదవ్.. మీరు కలలు కనడం ఆపండి. మీకు 243 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు. మీరు ఇలాంటి ప్రకటనలతో కాంగ్రెస్, మీ మిత్రదేశాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ బీహార్ ప్రజలకు మీపై నమ్మకం లేదు. మిమ్మల్ని చూస్తే వారికి పశుగ్రాసం కుంభకోణం, ఉద్యోగాల భూకుంభకోణం గుర్తొస్తాయి. ప్రజలు ఎన్డీఏకు, నితీష్ కుమార్, ప్రధాని మోదీ పేరు మీద ఓటు వేస్తారు’ అని అన్నారు. -
యూపీఎస్సీ టాపర్స్ చిరునామా.. ఆ రాష్ట్రం!
ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా UPSC టాపర్లు వచ్చారో చెప్పమని ఎవరినైనా అడిగితే.. వారి నుంచి వెంటనే వచ్చే సమాధానం బిహార్. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇది సరైన సమాధానమే. కానీ ఇప్పుడు కాదు. గతంలో యూపీఎస్సీ టాపర్లు అనగానే ముందుగా బిహార్ పేరుకు గుర్తుకు వచ్చేది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది సివిల్స్‌లో సత్తా చాటి యావత్ దేశం తమవైపు చూసేలా చేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో కష్టసాధ్యమైన సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ముందు వరుసలో నిలిచి బిహార్‌కు పేరు తెచ్చారు. దీంతో చాలా కాలం పాటు యూపీఎస్సీ టాపర్లకు చిరునామాగా బిహార్ నిలిచింది.ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాఅయితే గడిచిన నాలుగేళ్లలో యూపీఎస్సీ టాపర్ల కేరాఫ్ అడ్రస్ మారింది. బిహార్ పొరుగు రాష్ట్రమైన యూపీ 'టాప్' లేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు సివిల్స్‌లో విజయపతాకం ఎగురువేశారు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక సంఖ్యలో టాపర్లను అందించి ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ అవతరించింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. గత ఐదు UPSC టాపర్లలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు.యూపీఎస్సీ టాపర్లు2021: శ్రుతి శర్మ (ఉత్తరప్రదేశ్)2022: ఇషితా కిషోర్ (ఉత్తరప్రదేశ్)2023: ఆదిత్య శ్రీవాస్తవ (ఉత్తరప్రదేశ్)2024: శక్తి దుబే (ఉత్తరప్రదేశ్)ఎలా సాధ్యమైంది?ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా యూపీ ఎదగడానికి గల కారణాలు ఏంటని చూస్తే.. ఆ రాష్ట్రం ప్రధాన బలం అధిక జనాభా. ప్రభుత్వ సేవను విలువైనదిగా భావించే సాంస్కృతిక వాతావరణం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాగ్‌రాజ్, లక్నో(Lucknow) వంటి నగరాలు సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగా మారడం మూడో కారణం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండడంతో అక్కడి కోచింగ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల యూపీ వాసులకు ఎక్కువగా సివిల్స్ యోగం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతవరుసగా నాలుగేళ్ల నుంచి సివిల్స్ టాపర్లలో యూపీ ముందున్నా, బిహార్ (Bihar) ఘనమైన వారసత్వం మరుగన పడదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా విజేతలు ఉద్భవిస్తారనే వాస్తవాన్ని తాజా గణింకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు విజయం ఎప్పుడూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదన్న నిజాన్ని చాటి చెబుతున్నాయి. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
243 సీట్లు.. 2,300 దరఖాస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 243 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆమోద ముద్ర వేసేవరకూ ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొనసాగనున్నది. ఆశావహుల నుంచి ఇప్పటికే 2,300పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల ఆధారంగా పార్టీ బలం, బలహీనతలపై ఒక అవగాహనతోపాటు.. కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించడమే రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. 14వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను పంపాలని రాష్ట్ర పార్టీ కోరింది. 16న జరిగే సమావేశంలో ఈ పేర్లపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు పోటీ: రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ మొత్తం 243అసెంబ్లీ స్థానా ల్లో ఒక్కో సీటు నుంచి ముగ్గురి పేర్లను సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నది. ఈ నెల 19న జరగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీ లించనున్నారు. అంతిమంగా ఒకరి పేరును ఎంపిక చేసి ఆమోదం కోసం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించనున్నారు. ఇదే జాబి తాను యథాతథంగా లేదా కొద్ది మార్పులతో అధిష్టానం ప్రటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీహార్‌పై వరాల జల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్‌లో ముకామ- ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.బక్సర్ బగ్లాపూర్ కారిడార్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.4447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీంతో పాటు బీహార్‌లోని భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు రూ.3,169 కోట్ల రూపాయల్ని కేంద్రం ఖర్చు చేయనుంది. -
17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం
న్యూఢిల్లీ: బీహార్‌లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించడంతోపాటు పూర్ణియా విమానాశ్రయాన్ని, పట్నా మెట్రోను ప్రారంభించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పట్నా జిల్లా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు పితృపక్ష మేళాకు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పట్నా మెట్రో బీహార్ అభివృద్ధిలో ఒక మైలురాయి కానుంది. ప్రధాని మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ఇంకా ధృవీకరించనప్పటికీ, పలు సూచనల మేరకు బీహార్ అధికారులు ప్రధాని రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మరొకరి వీపుపై కూర్చుని.. వరద ప్రాంతాల్లో ఎంపీ పర్యటన
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్తుండగా, వరద ప్రభావిత ప్రాంతాలను తిలకిస్తున్నట్లుగా ఉన్న ఎంపీ తారిఖ్ అన్వర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. కాంగ్రెస్ నేత, బిహార్‌లోని కటిహార్ ఎంపీ అయిన తారిఖ్ అన్వర్ తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సోమవారం బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించాలనుకున్నారు. అయితే, ఓ వ్యక్తి మోస్తుండగా ఆయన పర్యటన కొనసాగించారు. ఎంపీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ వ్యక్తి వీపుపై మోసుకెళ్తూండగా వరదలతో నష్టపోయిన ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకున్నా మారుమూల ప్రాంతాలకు వెళ్లారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఎంపీ తారిఖ్ అన్వర్ తీరును బీజేపీ తప్పుబట్టింది. వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లినా కాంగ్రెస్ నేతలకు వీవీఐపీ ప్రొటోకాల్ కావాల్సి వచ్చిందా? అని ఆ పార్టీ నేత పూనావాలా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఎంపీ వీవీఐపీ మోడ్. రాహుల్ గాంధీ వెకేషన్ మోడ్. ఆమ్ఆద్మీ పార్టీ హైడింగ్ మోడ్. ప్రధాని మోదీ మాత్రమే వర్క్ మోడ్’అని వ్యాఖ్యానించారు. -
గుర్తింపు కార్డుగా ఆధార్
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) అంశంలో ఆధార్ గుర్తింపు కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులొచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డ్‌గా ఆధార్‌నూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ధృవీకరణ పత్రాల జాబితాలో 12వ గుర్తింపు డాక్యుమెంట్‌గా ఆధార్‌ను పరిగణించాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. ‘‘బిహార్ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు విషయంలో ఆధార్‌నూ అనుమతించండి. అయితే ఆ ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపునకు రుజువుగా భావించాలని మేం చెప్పట్లేదు. ఎస్ఐఆర్లో ఇకపై ఆధార్‌ను సైతం అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు మీరు అవసరమైన ఆదేశాలను జారీచేయండి. మా ఆదేశాలను సెపె్టంబర్ 9వ తేదీలోపు అమలుచేయండి’’అని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ‘‘అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో కలపాలని ఎవరూ కోరుకోరు. కేవలం నిజమైన భారతీయ పౌరులను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలి. తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్ల ఆధార్ కార్డ్‌ను ఎందుకు ఆమోదించట్లేదో సంజాయిషీ ఇవ్వాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఇచ్చిన వివరణను కోర్టు సోమవారం ఆలకించింది. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. ‘‘ముసాయిదా జాబితాలోని 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ సంబంధిత డాక్యుమెంట్లను ఇప్పటికే సమర్పించారు. ఇక 12వ ధృవీకరణ పత్రంగా ఆధార్‌ను అనుమతించాలంటూ పలువురు పిటిషన్లు ఇచ్చారు. అయితే ఇందులో ఆధార్‌ను ఒక రుజువుగా అంగీకరిస్తామని ఈసీ గతంలోనే పేర్కొంది. అయినాసరే ఆధార్‌ను కచ్చితంగా 12వ ధ్రువీకరణ పత్రంగా చేర్చాలని కోరడంలో అర్థంలేదు’’అని ఆయన వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ప్రజాప్రతినిధుల చట్టం–1950లోని 23(4) సెక్షన్, ఆధార్ చట్టం–2016లోని నియమ,నిబంధనల ప్రకారమే ఓటరు గుర్తింపు కోసం ఆధార్‌ను పరిగణించవచ్చని నిర్ధారించాం. అయితే ఆధార్ అనేది పౌరసత్వాన్ని రుజువుచేయబోదు’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.ఎస్ఐఆర్పై తగ్గుతున్న నమ్మకం! ‘‘ఎస్ఐఆర్ క్రతువుపై పిటిషన్‌దారులు, విపక్షాల్లో నమ్మకం తగ్గుతున్నట్లుగా తోస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ రంగంలోకి దిగాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లకు పారాలీగల్ వలంటీర్లు సాయపడాలి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులపై చేసే దరఖాస్తుల విషయంలో వలంటీర్లు సాయం అందించాలి’’అని కోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30వ తేదీన ముద్రించనున్నారు. ఈసీ సిగ్గుపడాలి: కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆధార్‌ను ధృవీకరణ జాబితాలో చేర్చకుండా నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్న ఈసీ సిగ్గుపడాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ సోమవారం తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఓటర్ల నమోదుకోసం ఆధార్‌నూ గుర్తింపు పత్రంగా పరిగణించాలని కోర్టు ఇప్పటికి మూడుసార్లు ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఈసీ పెడచెవినపెట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈసీ ఈ విషయంలో సిగ్గుపడాలి. విపక్ష రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లనూ ఈసీ గుర్తించట్లేదు. ఇవన్నీ ఈసీ సారథి సొంత నిర్ణయాల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు’’అని ఆయన అన్నారు. -
Bihar Polls:‘మహాఘట్ బంధన్’లో లొల్లి.. జేఎంఎం, ఆర్‌ఎల్‌జేపీలతో సీట్ల చిచ్చు
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ పార్టీల ‘మహాఘట్ బంధన్’కు కొత్తచిక్కులు వచ్చిపడ్డాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశం ఉంది. దీంతో సీట్ల షేరింగ్ ‘మహాఘట్ బంధన్’కు పెద్ద సవాల్‌గా నిలవనుంది.బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో మరో రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగం కానున్నాయన్నారు. వీరి కోసం తమ సీట్ల వాటాను త్యాగం చేయాల్సి వస్తుందన్నారు. కూటమిలో ఆధిపత్య పార్టీ అయిన ఆర్జేడీ కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అప్పుడు భాగస్వాములకు కేవలం 93 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనీసం 40 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్న వామపక్షాల పార్టీలకు కొత్తగా చేరే పార్టీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.2020 బీహార్ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) పోటీ చేసిన 19 సీట్లలో 12 గెలుచుకుంది. సీపీఎం పోటీ చేసిన 4 సీట్లలో 2 గెలుచుకుంది. సీపీఐ పోటీ చేసిన 6 సీట్లలో 2 గెలుచుకుంది. సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలతో ‘మహాఘట్ బంధన్’ ను వీడి ఎన్డీఏలో చేరిన వీఐపీ ఈసారి 60 సీట్లను అభ్యర్థించినట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 2020 ఎన్నికల కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. -
మాకు 40 సీట్లివ్వాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పక్షం, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్ పాశ్వాన్)తో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. బిహార్ భవిష్యత్ ముఖచిత్రంలో తన మార్కును చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న చిరాగ్ తన పారీ్టకి ఎక్కువ సీట్లు సాధించుకునేందుకు బీజేపీ, ఆర్జేడీలతో బేరసారాలు సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా 40 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో సీట్ల పంపిణీ పెండింగ్‌లో పడిందని సమాచారం. పాశ్వాన్ అడుగులు పెద్ద పదవి వైపే... 2020 బిహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 134 స్థానాల్లో పోటీ చేసినా ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎల్జేపీ ఎన్డీయే కూటమి పొత్తుతో 6 శాతం ఓట్లతో 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. హాజీపూర్ స్థానం నుంచి చిరాగ్ ఆర్జేడీ అభ్యరి్థపై ఏకంగా 1.70 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. బిహార్ ఎన్నికల్లో సైతం బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. బీజేపీ, జేడీయూలకు చెరో 100 సీట్ల చొప్పున 200 సీట్లు పోగా మిగిలిన 20–25 స్థానాలను ఎల్జేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన కనీసంగా 40 సీట్లు అడుగుతున్నారనే వాదనలు వినిపించాయి. ఇదే సమయంలో చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించవచ్చనే వార్తలూ వస్తు న్నాయి. ఈ సమయంలోనే ఆయన ‘బిహార్ ఫస్ట్..బిహారీ ఫస్ట్’నినాదాన్ని ఎత్తుకొని తనకు బిహార్ రాష్ట్రంలోనే రాజకీయాలు ఎక్కువ మక్కువని చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేరును చెప్పకుండానే, తనను రాష్ట్రానికి రాకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవ్వరికీ భయపడబోనని పేర్కొన్నారు. పటా్నలో ఇటీవల జరిగిన వ్యాపారవేత్త గోపాల ఖేమ్కా హత్యను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సుపరిపాలను పేరుగాంచిన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని నితీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాశ్వాన్ ప్రకటనల వెనక ప్రధానంగా రాష్ట్రంలో బలహీన వర్గాల్లో తమ పార్టీకి ఉన్న పట్టు కోల్పోరాదని, ఢిల్లీ పేరు చెప్పి..క్షేత్రస్థాయిలో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకోరాదనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పట్టున్న తమ వర్గాలను జేడీయూ పూర్తిగా తనవైపు తిప్పుకుంటుండటం, మరికొందరు కీలక నేతలు ఎన్డీయే కూటమిలో ఇమడలేక ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతుండటాన్ని ఇష్టపడని పాశ్వాన్ రాష్ట్రంలో పట్టును నిలుపుకునేందుకే 40 సీట్లపై పట్టు వదలడం లేదని అంటున్నారు. అయితే, సీట్ల పంపకాలపై మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
Bihar: నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్‌లో తేదీల వెల్లడి?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది చూచాయిగా వెల్లడయ్యింది. అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉండగా, నవంబర్‌లో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కింద నవీకరించిన ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాత, అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.దసరా తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 15- 20 మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 22 గడువుకు ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ బీహార్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్.. సీఎం నితీష్ కుమార్‌ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 243 మంది సభ్యులున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో, ఎన్డీఏలో 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ)-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీ 77లో మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-ఇద్దరు, సీపీఐ-ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. -
పరువుతీస్తున్న ‘ప్రక్షాళన’!
అనుకున్నదొకటైతే అయింది మరోటి. బిహార్‌లో ఆఖరి నిమిషంలో ఆదరాబాదరాగా ఎన్నికల సంఘం (ఈసీ) తలపెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత దెబ్బ తీసింది. ఓటర్లలో దొంగలున్నారన్న నిర్ణయానికొచ్చి, వారందరినీ ఏరిపారేయాలను కోవటం దీనంతటికీ కారణం. పోనీ అందుకు ప్రాతిపదికేమిటో ఎవరికీ తెలియదు. ఏడెనిమిది నెలల క్రితం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తానే రూపొందించిన జాబితాలో అవకతవకలున్నాయని అంగీకరించటమంటే తన పనితీరు సరిగా లేదని ఒప్పు కోవటమేనని ఆ సంస్థకు తోచలేదు. 2.74 కోట్ల మంది ఓటర్లలో 99.5 శాతం మంది తమ అర్హతలకు సంబంధించిన పత్రాలు సమర్పించారని ఈసీ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పగా ముసాయిదా జాబితా అవకతవకలు ఒక్కోటే బయటపడి దిగ్భ్రాంతి కలిగి స్తున్నాయి. అర్హులైన ఓటర్లు ఈసీ అడిగిన 11 పత్రాల్లో ఏదో ఒకటైనా దాఖలు చేయటానికి తిప్పలు పడుతుంటే అనర్హులైనవారు, అనుమానాస్పద వ్యక్తులు దర్జాగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీడియా సంస్థ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ నిశితంగా పరిశీలిస్తే అనేక అవకతవకలు బయటపడ్డాయి. ఒకే పేరు,తండ్రి/భర్త పేర్లు ఉండి కనీసం రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాకెక్కిన 1,87,643 కేసుల్ని ఆ సంస్థ బయటపెట్టింది. కొందరైతే ఒక నియోజకవర్గంలోనే నదురూ బెదురూ లేకుండా ఆ పని చేశారు. మరికొందరు చిరునామాలు మార్చే శ్రమ కూడా తీసుకోలేదు.‘స్వచ్ఛమైన జాబితా’ రూపకల్పనే ధ్యేయమంటున్న ఈసీ ఈ దొంగ ఓటర్ల విజృంభణకు ఏం సంజాయిషీ ఇస్తుంది? కనీసం అలాంటి విపరీతాలకు కారణమైనవారిపై చర్య తీసుకుంటామని చెప్పటం లేదు. పైగా బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన అంశాలను ఖండించారు. ఈ క్రమంలో వారు ఎక్కడెక్కడ పొరబడ్డారో చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు. తనకున్న పరిమిత వనరులతో కేవలం 39 చోట్ల ముసాయిదాలో ఒక సంస్థ ఇన్ని లోపాల్ని పసిగట్టగలిగితే, ఓటర్లు అందజేసిన అర్హతా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిగ్గుదేల్చే పనిలో తలమునకలైవున్న వేలాదిమంది ఎన్నికల సిబ్బంది ఏం పనిచేస్తున్నట్టు? వారిపై అధికార పక్షాల ఒత్తిళ్లు న్నాయా? ముసాయిదాలో తొలగించిన 65 లక్షల మందీ ఈసీ దృష్టిలో నకిలీ ఓటర్లు.అందుకోసమే వారి వినతుల్ని పరిశీలించటానికి మొదట్లో ఆ సంస్థ సిద్ధపడలేదు. అందు కోసం సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన సోమ వారం నాటికి కేవలం 33,000 మంది మాత్రమే పత్రాలు సమర్పించారని ఈసీ చెబుతోంది. పొట్ట చేతబట్టుకుని నలు మూలలకూ పోయే సాధారణ కూలీలు, కార్మికులు తమ చిరునామాల్లో ఉండటం, ఈసీ అడిగిన పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించటం అంత తేలికా? చిరునామాల్లో లేకపోతే మరణించినట్టు లేదా శాశ్వతంగా ఆ చిరునామా నుంచి నిష్క్రమించినట్టు ఎన్నికల సిబ్బంది రాసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ‘ఓట్ చోరీ’ నినాదంతో ఉద్యమిస్తున్న విపక్షాలు సైతం ఆ సమస్య విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు రాజకీయ పక్షాలు చురుగ్గా కదలాలి. తమ కార్యకర్తల సాయంతో అర్హులైనవారు ఓటర్ల జాబితాలకెక్కేలా సాయపడాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందన్న ప్రశ్న అర్థరహితం. ఎన్నికల నిర్వహణ క్రతువులో తలమునకలై ఉండాల్సిన ఈసీ జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలి. నిలదీస్తున్నదెవరన్న విచికిత్సకు పోకుండా నిజాన్ని నిగ్గుతేల్చి తేల్చాలి.ఎందుకంటే రాగల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘సర్’ అమలు ప్రారంభ మవుతుందని ఆ సంస్థే చెబుతోంది. ప్రతిచోటా ఇదే మాదిరి తప్పుల తడకలతో ఆ ప్రక్రియను సాగిస్తే ఈసీ దేశ ప్రజల దృష్టిలో మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ముందు కూడా పలచనవుతుంది. ఓటర్ల జాబితాలో చేరటానికి విధించిన గడువును పొడిగించుకుంటూ పోతే మొత్తం ప్రక్రియ గందరగోళంగా తయారై, తుది జాబితా ఖరారు సమస్యా త్మకమవుతుందంటున్న ఈసీ వాదనల్లో నిజం లేకపోలేదు. కానీ అందుకు బాధ్యత వహించాల్సింది తాను కాదా? అసలు ఎవరూ కోరకుండానే చివరి నిమిషంలో ఈ పెనుభారాన్ని నెత్తిన వేసుకున్నదెవరు? ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
99.5% ఓటర్లు సరైన ధ్రువీకరణలను సమర్పించారు
న్యూఢిల్లీ: బిహార్‌లోని 7.24 కోట్ల మంది ఓటర్లకుగాను ఇప్పటి వరకు 99.5 శాతం మంది వెరిఫికేషన్ కోసం ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు ఎన్నికల కమిషన్(ఈసీ) సోమవారం వెల్లడించింది. ముసాయిదా ఓటరు జాబితాలో అనర్హుల పేర్ల తొలగింపులో ఆర్జేడీ, సీపీఐఎంఎల్‌లు మాత్రమే తమకు సాయం చేశాయని ఈసీ వివరించింది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన సీపీఐ ఎంఎల్ 103 మంది పేర్లను తొలగించాలని కోరగా, ఆర్జేడీ, సీపీఐఎంఎల్‌లు కలిసి 25 పేర్లను కలపాలని దరఖాస్తులను అందించాయని పేర్కొంది. గుర్తింపు జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రమే ఓటరు ముసాయిదాకు సంబంధించిన 16 అభ్యంతరాలను అందజేసిందని వివరించింది. బిహార్ ఎస్ఐఆర్పై మార్పులు, చేర్పులకు ఆఖరు రోజైన సోమవారం భారీగా దరఖాస్తులు అందాయని వెల్లడించింది. జాబితా నుంచి తొలగించాలని ఏకంగా 2.17 లక్షల దరఖాస్తులు అందగా, తమ పేర్లను చేర్చాలని 36 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించింది. ముసాయిదా జాబితాలో పారపాటున చేర్చిన తమ పేర్లను తొలగించాలంటూ 2.17 లక్షల మంది వ్యక్తులు ఇప్పటి వరకు దరఖాస్తులను అందజేశారని ఈసీ అధికారులు తెలిపారు. బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసాయిదాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత కూడా అవకాశమిస్తున్నట్లు ఈసీ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుస్తా!: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు ‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది. ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్‌ను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు. -
‘సర్’పై నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించడానికి సీఈసీ విధించిన డెడ్‌లైన్ గడువు సెప్టెంబర్ 1 తేదీని పొడిగించాలంటూ బీహార్ రాజకీయ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు చేసిన ‘సర్’ నమ్మక లోపం వల్లే ఇంత పెద్ద అనిశ్చితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ‘సర్’ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే రాజకీయం పార్టీలు తమను తాము యాక్టివేట్ చేసుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. అభ్యర్థనలు, ఫిర్యాదులకు డెడ్‌లైన్ అనేది అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అభ్యర్థనలకు సెప్టెంబర్1 వ తేదీ చివరి తేదీగా ఉన్నప్పటికీ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఈసీ నిర్దేశించిన డెడ్‌లైన్ ముగింపు తేదీ తర్వాత కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా డెడ్‌లైన్ పొడిగింపు తేదీ అంటూ ఏమీ అవసరం లేదని తెలిపింది. ఫలితంగా అభ్యంతరాలను యథావిధిగా స్వీకరిస్తామని కోర్టుకు ఈసీ హామీ ఇచ్చింది. నామినేషన్ చివరి తేదీ వరకూ కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టుకు సీఈసీ తెలిపింది. అదే సమయంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వీసెస్ అధారిటీకి కోర్టు ఆదేశించింది. ఓటర్లకు సహాయం చేసే క్రమంలో పారా లీగల్ వాలంటీర్లను నియమించడమే సరైనదిగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారా లీగల్ వాలంటీర్లు ఇచ్చే రిపోర్ట్‌ను జిల్లా స్థాయి జడ్జిలు సమీక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులకు ఆధార్‌ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా ఉపయోగించవచ్చని, కానీ అది పౌరసత్వం నిర్ధారణకు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, బీహార్‌లో ‘సర్’ తొలగించిన 65లక్షల ఓట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. దీన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించింది. ఇది ఎన్నికల కమిషన్‌తో కలిసి కేంద్రం చేస్తున్న ఓట్ చోరీ అంశంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఇప్పటికే బీహార్‌లో రాహుల్ గాంధీ యాత్ర చేశారు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైంది. నేడు ఓట్ అధికార్ యాత్ర పాట్నాలో ప్రారంభమైంది. ‘సర్’లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, దానిని తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా ‘సర్’ పట్టించుకోలేదు!
బీహార్‌లో ‘సర్’ వేడి ఇంకా తగ్గలేదు. దొంగ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. బీహిర్లో మళ్లీ సర్‌ను నిర్వహించాలని పట్టుబబుతోంది. ఈసీ ఏర్పాటు చేసిన సర్‌కు కాంగ్రెస్ 89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదని బీహార్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో లక్షల్లో ఫిర్యాదులు ఇస్తే దానిని సర్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు కాబట్టే వాటిని వారు తీసుకోలేదన్నారాయన. దాంతో సర్‌ను కచ్చితంగా బీహార్‌లో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఇప్పటికే 60లక్షలకు పైగా ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై ఈసీపై సైతం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. కేంద్రంతో కలిసి ఈసీ చేస్తున్న ఓట్ చోరీ అంటూ ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా ఆగస్టు 17వ తేదీన బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా ససారామ్ నుంచి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ యాత్రకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ యాత్ర తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ(సోమవారం) నుంచి పాట్నాలో ప్రారంభం కానుంది. -
ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ బోణీ..
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం సాధించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 8–3 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లా (4వ, 26వ నిమిషాల్లో), రకీబుల్ హసన్ (42వ, 43వ నిమిషాల్లో), అష్రఫుల్ ఇస్లామ్ (45వ, 48వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ సాధించగా... సోహనుర్ సోబుజ్ (36వ నిమిషంలో), రిజావుల్ బాబు (56వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. చైనీస్ తైపీ జట్టు తరఫున సుంగ్ యూ (10వ, 18వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా... సుంగ్ జెన్ షిహ్ (60వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. తొలి పోరులో మలేసియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్... ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మరో మ్యాచ్‌లో మలేసియా 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై గెలిచింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే గెనెహో జిన్ గోల్‌తో ఖాతా తెరిచిన ఐదు సార్లు చాంపియన్ దక్షిణ కొరియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది.మలేసియా తరఫున అఖీముల్లా అన్వర్ (29వ, 34వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. అష్రాన్ హమ్సాని (33వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జపాన్‌తో భారత్, కజకిస్తాన్‌తో చైనా తలపడనున్నాయి. -
బిహార్ సీఎం అభ్యర్థిని నేనే
ఆరా(బిహార్): బిహార్‌లో మహాఘఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించుకున్నారు. శనివారం ఆరా జిల్లాలో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బిహార్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆరా ర్యాలీలో తేజస్వీ మాట్లాడుతూ..తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్నే సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనుక వస్తోంది. కాపీ కొట్టే సీఎం కావాలా? ఒరిజినల్ సీఎం కావాలా?’అంటూ ప్రజలను ప్రశ్నించారు. మహాఘఠ్ బంధన్ తరఫున అసలైన సీఎం అభ్యర్థి తానేనంటూ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో తేజస్వి...కాంగ్రెస్ జాతీయ పారీ్టయే అయినప్పటికీ బిహార్‌లో ఆర్జేడీ పెద్దన్న అని, తమదే పైచేయి అన్న అర్థంలో మాట్లాడారు. -
‘నేనే ఒరిజినల్ సీఎం..’ బీహార్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం
బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర పాట్నా సభతో పూర్తి కానుంది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘కాపీక్యాట్ సీఎంగా’ అభివర్ణిస్తూ ఆరాలో నిర్వహించిన ర్యాలీలో తేజస్వి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నితీశ్ నా విధానాలను కాపీ కొడుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తేజస్వి ప్రజల్లోకి దూసుకుపోతుంటే.. ఈ ప్రభుత్వం మాత్రం వెనుకబడిపోయింది. మీకు సిసలైన సీఎం కావాలా? లేదంటే నకిలీ సీఎం కావాలా? అంటూ తేజస్వి మాట్లాడారు. తద్వారా తనను తాను సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నట్లైంది. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు తేజస్విని చూస్తూ ఉండిపోయారు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ.. బీహార్‌కు ఆర్జేడీనే పెద్దన్నగా తేజస్వి గతంలో వ్యాఖ్యానించారు. ఓటర్ అధికార్ యాత్రలో ఈ ఇద్దరు నేతలూ కలిసే ముందుకు సాగారు. కానీ ఎక్కడా కాంగ్రెస్‌గానీ, రాహుల్ గాంధీగానీ అధికారికంగా బీహార్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే..కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తాజాగా కథనం ఇచ్చింది. తాము ఆశించినన్ని సీట్లు ఆర్జేడీ ఇవ్వకపోవచ్చనే యోచనలో ఉన్న కాంగ్రెస్.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసేందుకు ముందుకు రావడం లేదన్నది ఆ కథనం సారాంశం.2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక మహాఘట్బంధన్ కూటమి తరఫున కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 19 స్థానాల్లో ెగ్గింది. అయితే ఈసారి కూడా అన్నే స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదంటే నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 35 ఏళ్ల తేజస్వి యాదవ్ గతంలో రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు.ఓటర్ అధికార్ యాత్ర బీహార్‌లో ఆరా (Ara) పట్టణంలో 2025 ఆగస్టు 30న జరిగింది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు. అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా? తరచుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు. -
Bihar: మూడు లక్షల ఓటర్లకు ఈసీ నోటీసులు
పట్నా: బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మరో మలుపు తీసుకుంది. తాజాగా భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) బీహార్‌లో ఉంటున్న మూడు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా అనుమానిస్తూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓ)నోటీసులను పంపారు.రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఓటరు సవరణల కోసం సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలు కనిపించిన దరిమిలా వారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. మొత్తం మూడు లక్షలమంది ఈ తరహా నోటీసులు అందుకున్నారు. వారి పత్రాలలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో వివరించేందుకు వారికి ఈసీఐ ఏడు రోజులు గడువు ఇచ్చింది. ‘మూడు లక్షల మంది ఎస్ఐఆర్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే వారి పత్రాల పరిశీలనలో వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిగాయి. ఫలితంగా వీరు బంగ్లాదేశ్, మయన్మార్ లేదా నేపాల్ నుండి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు నెలకొన్నాయని అని ఒక అధికారి మీడియాకు తెలిపారు.ఈసీ నోటీసులు పంపి, వివరణ కోరిన ఓటర్లలో అత్యధికులు తూర్పు చంపారణ్, పశ్చిమ చంపారణ్, మధుబని, కిషన్‌గంజ్, పూర్ణియా, కతిహార్, అరారియా సుపాల్ జిల్లాలకు చెందినవారున్నారు. ఈసీఐ భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేసిన దరిమిలా, బీజేపీ దీనిపై స్పందిస్తూ, ఈ ప్రాంతం బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలకు కేంద్రంగా ఉందని ఆరోపించింది. కాగా ఎన్నికల జాబితాపై కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. -
Bihar: ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చల తర్వాత, బీహార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపును ఖరారు చేసింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఎన్డీఏలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) 102 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 101 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 20 సీట్లలో పోటీ చేయనుంది. హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏ ఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం)10 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కు 20 సీట్లు కేటాయించడం గమనార్హం.పెద్దన్న పాత్రలో జేడీయూసీట్ల పంపకంలో ఎన్డీఏ ఒక వ్యూహాన్ని అనుసరించింది. దానిలో భాగంగా జేడీయూ కూటమికి పెద్దన్నయ్య పాత్ర అప్పగించింది. నితీష్ కుమార్ నాయకత్వంలోని కూటమి ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈసారి చిన్న పార్టీలకు కూడా తగినన్ని సీట్లు కేటాయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో సమతుల్యతను కాపాడుకునేందుకు, ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎన్డీఏ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది.చిరాగ్ పాశ్వాన్‌కు పెద్దపీటఈ అసెంబ్లీ లోక్ జనశక్తి పార్టీ (చిరాగ్ పాశ్వాన్) 40కి మించిన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది. కానీ జేడీయూ ఆ పార్టీకి 20 సీట్లు కేటాయించింది. కూటమిలో ఆ పార్టీ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏతో పొత్తు లేకుండా 134 స్థానాల్లో పోటీ చేశారు. అయితే అతని పార్టీ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. నాటి ఎన్నికల్లో చిరాగ్ వ్యూహం జేడీయూకి దాదాపు 30 స్థానాల్లో ఓటమి అందించిందనే వాదన ఉంది. ఈసారి చిరాగ్ పాశ్వాన్ ఎన్న్డీఏలో భాగస్వామి.నితీష్ కుమార్ నాయకత్వంరాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరగనున్నాయని ఎన్డీఏ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. నితీష్ కుమార్ నాయకత్వం ఎన్నికల్లో ఎన్డీఏకి బలాన్ని అందిస్తుందని కూటమిలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు.మహా కూటమి సన్నాహాలుమరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో కూడిన మహా కూటమి కూడా తన ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ‘ఓటర్ అధికార్ యాత్ర’తో ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కు వ్యతిరేకంగా ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార లక్ష్యం ఓటర్లకు అవగాహన కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో వారు చురుకుగా పాల్గొనేలా చూడటమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
వినాయక చవితి రోజు.. మంత్రిని పరిగెత్తించి కొట్టిన గ్రామస్తులు
పాట్నా: వారం రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఇటువంటి విషాద ఘటనల తర్వాత జిల్లా స్థాయి నేతలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కానీ తాజాగా జరిగిన ఘటన అందుకు భిన్నంగా ఉంది. ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న వినాయక చవితి రోజు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి వచ్చారు. ఈ ఆలస్యంపై వినాయక చవితి రోజు.. మంత్రిని పరిగెత్తించి కొట్టిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఆయనను కిలోమీటర్ దూరానికి పైగా వెంబడించి దాడి చేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత శనివారం (ఆగస్టు 23న) బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 6:45 గంటల సమయంలో షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డానియావాన్ – హిల్సా రహదారిపై ఎదురెదురుగా లారీ- ఆటో ఢీకొన్నాయి. గంగానదిలో పుణ్యస్నానం కోసం ఫతుహాకు వెళుతున్న ఆటోని ప్రయాణికుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు నలందా జిల్లా జోగిపూర్ మలవాన్ గ్రామస్థులని పోలీసులు నిర్ధారించారు.అయితే,ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల్ని ఓదార్చేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్ బుధవారం గ్రామానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు వారి వాహనాన్ని చుట్టుముట్టారు. కిలోమీటర్ దూరం మంత్రి కాన్వాయ్‌ని వెంబడించారు. బాధితులు మరణించింది ఎప్పుడు? మంత్రి పరామర్శకు వచ్చేది ఎప్పుడు? ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రిపై దాడికి తెగబడ్డారు.పోలీసుల సహాయంతో గ్రామస్థుల నుంచి మంత్రి,ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఈ సంఘటనలో మంత్రి సహాయకుడు గాయపడ్డాడు. ఆయనను హిల్సా సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. రాజకీయ నాయకులు బాధితుల కుటుంబాల్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదని, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. बिहार: नालंदा में मंत्री श्रवण कुमार पर ग्रामीणों ने हमला किया, सुरक्षाकर्मी घायल◆ मंत्री जी को भीड़ ने दौड़ाया, धोती पकड़कर भागते दिखे श्रवण कुमार #Nalanda #NitishKumar #ShrawanKumar || Shrawan Kumar Bihar Minister pic.twitter.com/7fZgwpbbxe— बाबा टुल्लू जी (@abhaysingh147) August 27, 2025 -
అర్రే... క్షణంలో రూ. 25 లక్షలు మిస్.. కానీ అదే తెలివైన పని!
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వస్తున్న టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 17' (KBC 17) తాజా ఎపిసోడ్లో, బీహార్‌కు చెందిన మిథిలేష్ దురదృష్టవశాత్తూ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీని పోగొట్టుకున్నాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినప్పటికీ కేవలం రూ. 25 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్లో గెలిచిన తర్వాత, షోలో హాట్ సీట్లో కూర్చుని అన్ని వరుసగా అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చాడు. రూ. 50 లక్షల బహుమతిని గెల్చుకునే సమాధానం వద్ద సందిగ్ధంలో పడిపోయాడు.(భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్)ప్రశ్న: "ఢిల్లీ ఎర్రకోటను రూపొందించిన ఆర్కిటెక్ట్ తన పేరు మీద ఒక నగరం పేరును కలిగి ఉన్నాడు. అది ఏ నగరం?" ఆప్షన్స్ "ఎ. ఇస్తాంబుల్, బి. హెరాత్, సి. లాహోర్, డి. మషాద్"సరైన సమాధానం లాహోర్. సమాధానం ఇవ్వలేకపోయాడు షో నుంచి నిష్క్రమించి రూ. 25 లక్షలతో వెళ్ళిపోవలసి వచ్చింది. ఆట నుండి నిష్క్రమించే ముందు, సమాధానం ఎంచుకోమని అడిగారు బిగ్‌బీ. అయితే మిథిలేష్ కరెక్ట్ సమాధానం లాహోర్నే ఎంచుకున్నాడు. కానీ అప్పటికే షో నుంచి వైదొలిగాడు కాబట్టి. అతనికి రూ. 25 లక్షలే ముట్టాయి. ఒక వేళ షోనుంచి నిష్ర్రమించకుండా సమాధానం తప్పుగా చెప్పి ఉంటే అతని ప్రైజ్‌మనీ రూ. 3.2 లక్షలకు పడిపోతుంది. (బాయ్ ఫ్రెండ్‌తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్)ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట 17వ శతాబ్దపు ప్రఖ్యాత మొఘల్ వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరికి దక్కింది. తాజ్ మహల్ ప్రధాన వాస్తుశిల్పిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ.అంతుకుముందు అమితాబ్‌తో సంభాషణలో భాగంగా మిథిలేష్ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేశాడు. ఎన్ని కష్టాలెదురైనా, తన సోదరుడిని చదివించి, మంచి భవిష్యత్తునివ్వాలనేది తన డ్రీమ్ అని మిథిలేష్ తెలిపాడు. అలాగే పుట్టినరోజును తనతో జరుపుకోవాలని పట్టుబట్టే వైనాన్ని గురించి కూడా చెప్పుకొచ్చాడు.ఇదీ చదవండి: అత్తి పండ్లతో అదిరిపోయే ప్రయోజనాలు.. లైంగికశక్తికి కూడా! -
తెలంగాణలో వర్ష బీభత్సం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్‌లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లిందిఅధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారుచాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్‌ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నదిప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారుసీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడుఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసంతెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025 -
‘ఆ దమ్ముందా స్టాలిన్?’
బీహార్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన వేళ.. రాజకీయ విమర్శలతో దుమారం చెలరేగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే ఒకప్పుడు బీహారీలను అవమానించినవారే.. ఇప్పుడు ఓట్ల కోసం అక్కడికి వెళ్తున్నారా? అంటూ అధికార జేడీయూ, బీజేపీ కూటమి విమర్శలు గుప్పించింది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి స్టాలిన్ బీహార్ చేరుకున్నారు. అయితే, గతంలో డీఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటు సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ స్టాలిన్‌ను సవాల్ విసిరింది.బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి, ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా? ద్రవిడ మోడల్‌కు సింహం లాంటోడిని అంటారు కదా?. అదే నిజమైతే.. గతంలో మీ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో మీరూ చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారాయన. రెండేళ్ల కిందట.. ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఉదయ్‌నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోలుస్తూ.. నిర్మూలించాల్సిన అవసరం ఉందటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్‌పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అలాగే.. డీఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలనూ బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు.. అశ్లీలంగా ఉంటారు. అజ్ఞానులు. పానిపూరి అమ్మేపనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్‌లో మళ్లీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ, "ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వీ యాదవ్‌కు మైనస్ అవుతుంది" అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికల వేళ, ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. -
చిరాగ్, పెళ్లి చేసుకో!
‘ఓటర్ అధికార్ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు. ‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్‌ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్‌లో మేం డ్యాన్స్ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే. బుల్లెట్ ర్యాలీలో... రాహుల్‌కు ముద్దు అరారియాలో బుల్లెట్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్‌ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్ టాప్ కారుపైకి ఎక్కాడు. -
బీజేపీ, ఈసీ మిలాఖత్
అరారియా: మోదీ సర్కారు, కేంద్రం ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో బిహార్‌లో ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్‌లో ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా అరారియా జిల్లాలో ఆదివారం బహిరంగ సభలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు చోర్, గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగా, దిగిపో) అంటూ ఆరేళ్ల బాలుడు సైతం నినదిస్తున్నాడు’’ అన్నారు. ‘‘బిహార్‌లో ఎస్ఐఆర్ ముసుగులో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. దీనిపై బీజేపీ నోరువిప్పడం లేదు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నానంటూ నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ను బిహార్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు. ‘ఇండియా’దే గెలుపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విపక్ష ‘ఇండియా’ కూటమిదేనని రాహుల్ ధీమా వెలిబుచ్చారు. ‘‘కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి. పరస్పరం గౌరవించుకుంటున్నాయి. మేం కలిసి పోటీ చేస్తాం. గెలుస్తాం. దీనిపై మా మేనిఫెస్టో కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం’’ అని వెల్లడించారు. -
Bihar: ఓటర్ లిస్టులో ఇద్దరు పాక్ మహిళలు.. దర్యాప్తు షురూ
పట్నా: బీహార్ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్‌లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్‌లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.భాగల్పూర్కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్‌పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్‌పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్‌లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. #WATCH | Bhagalpur, Bihar: A Pakistani woman, who came to India in 1956, has been found to be in Bihar's voter list and was even verified in the SIR carried out in the state. When the Home Ministry started carrying out an investigation regarding foreign nationals who had… pic.twitter.com/CodczsabaD— ANI (@ANI) August 24, 2025కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని దానిలో కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓటరు కార్డుల సవరణ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇవి జరగుతున్నాయని ఆరోపించాయి. అయితే నిస్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యతతోన ఈ సవరణ చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు. -
తేజస్వీ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
గడ్చిరోలి/కటిహార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరొటే ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు శుక్రవారం చెప్పారు.ఈ పరిణామంపై తాజా తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘కేసులను చూసి భయపడను, ఇకపైనా నిజమే మాట్లాడుతా’అని ఆయన ప్రకటించారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీహార్ పర్యటన వేళ తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’లో బీహార్ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలన్నీ వట్టి భూటకమని విమర్శించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా తేజస్వీ కటిహార్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని హామీలను భూటకమనడం అభ్యంతరకరమైన మాటలు ఎలా అవుతాయి అంటూ ఎదురుదాడి చేశారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు విచారణ
-
ఫిర్యాదులకు ‘ఆధార’మే
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన వాళ్లు దాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసే ఫిర్యాదులకు మద్దతుగా ఆధార్‌ను కూడా సమర్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై ఎన్నికల సంఘం పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా ముసాయిదాపై సకాలంలో అభ్యంతరాలు లేవనెత్తడంలో బిహార్‌లోని 12 రాజకీయ పార్టీలూ విఫలమయ్యాయంటూ గట్టిగా తలంటింది. ఈ విషయంలో వాటిది పూర్తిగా చేతగానితనమేనంటూ ఆక్షేపించింది. బిహార్‌లో తాము చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సందర్భంగా ముసాయిదాపై ఒక్క పార్టీ కూడా తమవద్ద అభ్యంతరాలు దాఖలు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను ఉటంకిస్తూ ఈ మేరకు పార్టీలను గట్టిగా మందలించింది. పైపెచ్చు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన పౌరులకు కనీసం ఈసీ వద్ద అభ్యంతరాలు దాఖలు చేయడంలో ఒక్క పార్టీ కూడా చురుగ్గా వ్యవహరించి సాయం చేయలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలతో ఇంతటి దూరం ఎందుకు ఏర్పడిందంటూ ప్రశ్నించింది. ఈ విషయమై పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఉద్బోధించింది. ఎస్ఐఆర్ కసరత్తును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఓటర్ల ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారికి ఫారం–6 సాయంతో ఈసీ వద్ద ఫిర్యాదులు చేయడంలో పూర్తిస్థాయిలో సహకరించండి. ఆ మేరకు మీ పార్టీల కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వండి’’ అంటూ బిహార్‌లోని 12 పార్టీల నూ ఆదేశించింది. వ్యక్తిగతంగా అభ్యంతరా లను ఆన్లైన్లో దాఖలు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ కసరత్తు గడువు విషయమై ఈ దశలో ఎలాంటి మార్పుచేర్పులూ చేయలేదని స్పష్టం చేసింది. బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు?బిహార్‌లో ఏకంగా 1.68 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లున్నట్టు ఈసీ నివేదించింది. అలాంటప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండే అభ్యంతరాలు దాఖలవడంపై ధర్మాసనానికి విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పార్టీలు, అవి నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించింది. ‘‘తొలగించిన 65 లక్షల ఓటర్లు మరణించారా, నివాసాలు మార్చారా, మరేమైనా జరిగిందా అన్నది తేలాలి. ఈ దిశగా అన్ని పార్టీల ఏజెంట్లు పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలి’’ అని ఆదేశించింది. -
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
గయాజీ: అవినీతికి పాల్పడి జైలుపాలైన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తప్పించడానికి చట్టం తీసుకొస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అధికారం వెలగబెడుతున్న వ్యక్తులు జైలుకెళ్లి, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు చూసి మనం నిజంగా బాధపడాలని అన్నారు. ఒకవైపు ఊచలు లెక్కిస్తూ మరోవైపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలని చెప్పారు. అలాంటి వ్యక్తులు(ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ) రాజ్యాంగ విలువలను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరగాళ్లు జైలు నుంచే పరిపాలన చేస్తామంటే మనం చూస్తూ ఉండిపోవాలా? అని నిలదీశారు. 11 ఏళ్ల మా పాలనలో ఎలాంటి అవినీతి మరక లేదని గర్వంగా చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, బిహార్‌లో ఆర్జేడీ అవినీతి బాగోతాలు ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. అందుకే అవినీతి ముఖ్యమంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచే తొలగించేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి సైతం వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పుచేసి 50 గంటలు జైల్లో ఉంటే పోస్టు నుంచి తొలగిస్తారని, మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు వదిలిపెట్టాలి? అని ప్రశ్నించారు. తాము తీసుకొస్తున్న కఠినమైన చట్టాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, చేసిన పాపాలకు శిక్ష పడుతుందని భయపడుతున్నాయని విమర్శించారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే తప్ప పదవుల్లో కాదన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ముతో బొజ్జలు నింపుకున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్, పశి్చమ బెంగాల్లో పర్యటించారు. బిహార్‌లోని గయాజీ జిల్లాలో రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మూడు మెట్రో రైలు మార్గాలను ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130 సవరణ) బిల్లు– 2025తోపాటు బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పరోక్షంగా సమరి్థంచారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... ‘‘పహల్గాంలో మన పర్యాటకులను బలి తీసుకున్న ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని బిహార్ గడ్డపైనే ప్రతిజ్ఞ చేసి, నెరవేర్చి చూపించా. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టాం.ఓట్ల కోసమే విపక్షాల ఆరాటం: దేశంలో జనాభా స్వరూపం మారకుండా చూడాలన్న లక్ష్యంతో అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లపై చర్యలు తీసుకుంటే విపక్షాలకు ఉలుకెందుకు? మన దేశానికి వలసదార్లు, చొరబాటుదార్లు అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ సమస్య గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించా. కొన్ని రాష్ట్రాల్లో జనాభా స్వరూపమే మారిపోతోంది. స్థానికులు మైనారీ్టలుగా మారుతున్నారు. ఇది ఇకపై సాగడానికి వీల్లేదు. అందుకే డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను ప్రోత్సహిస్తోంది. కేవలం అధికారం దాహంతో దేశ భద్రతను పణంగా పెడుతోంది. చొరబాటుదార్లను గుర్తించి, వెనక్కి పంపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. వారు మన దేశంలో తిష్ట వేస్తామంటే ఒప్పుకోం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నాయి. అక్రమంగా వచ్చినవారంతా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి సాగనంపాలి’’. -
Asia Cup 2025: పాక్ అవుట్.. భారత జట్టు ఇదే
స్వదేశంలో ఈనెల 29 నుంచి జరిగే ఆసియాకప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయ కత్వం వహిస్తాడు. సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.టైటిల్ పోరు బాట ఇలాచైనాతో ఈనెల 29న జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో భారత్ తమ టైటిల్ వేటను మొదలుపెడుతుంది. అనంతరం ఆగస్టు 31న జపాన్‌తో, సెప్టెంబరు 1న కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ‘సూపర్–4’ దశకు చేరుకోనున్నాయి. ‘సూపర్–4’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు 7న టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే.. భారత్‌లో జరిగే ఈ ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్ గ్రూప్-‘బి’లో చేరింది.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్‌ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్స్). -
ఓట్ అధికార్ యాత్ర.. రాహుల్ కారు ఢీకొని గాయపడ్డ కానిస్టేబుల్
పాట్నా: కేంద్రంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడిందంటూ గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ.. బిహార్‌లో ఓట్ అధికార్ యాత్ర చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగింపును వ్యతిరేకిస్తూ రాహుల్.. ఓట్ అధికార్ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర ప్రస్తుతం బీహార్‌లోని నవాడా జిల్లాలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. ర్యాలీలో జనాన్ని నియంత్రిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కాలు కారు కింద చిక్కుకుపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైతే రాహుల్ కనీసం అతన్ని కారు కిందకు దిగి పలకరించలేదని విమర్శలు గుప్పించింది. ఈ ప్రమాద వీడియోను షేర్ చేస్తూ రాహుల్‌పై విరుచుకు పడింది.Voter Adhikar Yatra ❎Crush Janta Yatra ✅✅Rahul Gandhi’s car crushed a police constable who was critically injured.Dynast did not even get down to check on him pic.twitter.com/cTx7ynXmCC— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) August 19, 2025 గత 40 గంటలుగా రాహుల్ బీహార్‌లో చేస్తున్న యాత్రలో ఒక్క నిజంగా మాట్లాడటం లేదని బీజేపీ ధ్వజమెత్తింది. ఎలక్షన్ కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్.. ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఆధారాలు చూపెట్టాలని డిమాండ్ చేసింది. ప్రజల విశ్వాసాన్ని రాహుల్ గాయపరుస్తున్నాని మండిపడింది. ఒక విషయాన్ని నిజమని నమ్మాలంటే ఆధారాలు ఉండాలి కదా అని బీహార్ బీజేపీ ప్రశ్నించింది. -
ఫోన్ల రిక'వర్రీస్'
వేలు కాదు.. లక్షలు పోసి ఫోన్ కొంటున్నాం. ఎడాపెడా వాడేస్తున్నాం. అంతేనా? అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేస్తాం. డేటాని బ్యాకప్ పెట్టేస్తున్నాం. కానీ, అనుకోకుండా ఫోన్ పోతే? ఏముందీ.. రికవర్ చేసేయొచ్చులే అనుకుంటే మీది ఓవర్ కాన్ఫిడెన్సే. ఎందుకంటే.. పోయిన ఫోన్ల రికవరీ రేట్ మీరు అనుకునేంత స్థాయిలో లేదు. దేశ రాజధాని ఢిల్లీనే అందుకు సాక్ష్యం. అక్కడ పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ రేటు ఎంతో తెలుసా? 1.87%. అంటే.. వంద ఫోన్లు పోతే.. ఒకటో రెండో రికవర్ చేస్తున్నారట. దేశ రాజధానిలో పరిస్థితి సరే, మరి మన దగ్గర ఎలా ఉంది?– సాక్షి, స్పెషల్ డెస్క్ఫోన్ పోగానే ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం. ట్రాక్ చేస్తారులే అని భరోసాతో ఎదురు చూస్తాం. కానీ, పోయిన ఫోన్లు దొరికే అవకాశం చాలా తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో సగటున 100 ఫోన్లు పోతే 25 ఫోన్లనే తిరిగి తీసుకురాగలుగుతున్నారట. టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన సంచార్ సాథీ పోర్టల్ చెబుతున్న వాస్తవాలివి. ఢిల్లీలో మొత్తంగా 8.22 లక్షలకు పైగా ఫోన్లను బ్లాక్ చేశారు. కానీ, వాటిలో తిరిగి దొరికినవి కేవలం 9,871 మాత్రమే. ఈ తక్కువ రికవరీ జాబితాలో పంజాబ్, బిహార్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో 36.35 లక్షలకుపైగా ఫోన్లను బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 22.14 లక్షలు. రికవరీ చేసినవి 5.45 లక్షలు. రికవరీ రేటు 24.5 శాతం. అంటే 100లో 25 ఫోన్లు మాత్రమే రికవరీ అవుతున్నాయన్నమాట. ఈ గణాంకాల విషయంలో యూజర్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఎందుకీ అలసత్వం అంటూ సోషల్ మీడియా వేదికలపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.మన పరిస్థితేంటి?తెలంగాణలో 3.76 లక్షల ఫోన్లు బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 2.13 లక్షలు. వాటిలో 91,306 ఫోన్లు రికవరీ అయ్యాయి. అంటే, రికవరీ రేటు 42.8%. ఆంధ్రప్రదేశ్‌లో 1.26 ఫోన్లు బ్లాక్ చేస్తే.. 79వేలకుపైగా ట్రేస్ చేయగలిగారు. తిరిగి తీసుకొచ్చినవి 31,478. రికవరీ రేటు 39.66% శాతం. మరోవైపు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. రికవరీ ఫోన్లను పోలీసులు రాబట్టే క్రమంలో కొందరు అమాయకులు బయటపడుతున్నారు. ఎవరా అమాయకులు అంటే.. దొంగిలించిన ఫోన్ ని కొన్నవాళ్లు. చాలా తక్కువ ధరకే దొరుకుతుందని ఆన్ లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అనధికారికంగా ఇలాంటి ఫోన్లు కొంటున్నారు. పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుపోలీసు స్టేషన్లు అంటే ఫిర్యాదులు, విచారణలు, కేసులు. కానీ, కొన్ని స్టేషన్లకు ఇటీవల విచిత్రమైన పార్సిళ్లు వస్తున్నాయి. అవేంటో తెలుసా..దొంగిలించిన మొబైల్ ఫోన్లు. వాటిని కొనుక్కున్న కొత్త యజమానులు వాటిని తిరిగి పోగొట్టుకున్న వారికి పంపేందుకు పోలీస్ స్టేషన్లకు కొరియర్ చేస్తున్నారట. అంతలా స్వచ్ఛందంగా ఎందుకు పంపుతున్నారనేగా మీ సందేహం? ఎందుకంటే.. ఈ చిత్రమైన ట్రెండ్ వెనుక ఒక కొత్త టెక్నాలజీ ఉంది. దానిపేరే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్). ఫోన్ల దొంగతనాల్ని కట్టడి చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఫోన్ పోగొట్టుకున్నవారు ఐఎంఈఐ నంబర్ సాయంతో.. ఈ పోర్టల్ ద్వారా ఆ ఫోన్‌ని బ్లాక్ చేయొచ్చు. దీంతో ఆ ఫోన్ దేశంలో ఎక్కడున్నా.. ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా పోతుంది. అంటే అది దొంగల చేతిలో ఉన్నా పనికిరాదన్నమాట. అందుకే అలాంటి ఫోన్లు పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుగా వెళ్తున్నాయి.స్వచ్ఛందంగా డిస్కనెక్ట్ కావాల్సిన ప్రూఫ్‌లతో విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకుని వాడేసిన రోజులు దాటుకుని.. నా పేరు మీద ఏదైనా నంబర్లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయా? అని మనమే వెతుక్కునే రోజులకి వచ్చాం. అందుకు కారణం లేకపోలేదు. ఫేక్ ప్రూఫ్‌లు, దొంగిలించిన సిమ్‌లతో సైబర్ క్రై మ్‌లకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు స్వచ్ఛందంగానే వారి పేరు, అడ్రస్ ప్రూఫ్‌తో ఉన్న ఫోన్ నంబర్లను వెతికి ‘సంచార్ సాథీ’ పోర్టల్ ద్వారా బ్లాక్ / డిస్కనెక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.07 కోట్లు. -
అఫిడవిట్ ఇస్తారా... క్షమాపణలు చెప్తారా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమరి్పంచాలి. లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ఆదివారం ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమరి్పంచాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఈసీ చెప్పారు. ‘‘దీనిపై కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయి. శాశ్వత స్థిరనివాసంలో ఒకటి, వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల మరోటి... ఇలా కొందరికి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండొచ్చు. ఇలాంటి తప్పిదాలను సరిచేసేందుకు పోలింగ్ యంత్రాంగం కృషిచేస్తోంది. ప్రతి ఎన్నికకు ముందూ ఓటరు జాబితాలో తప్పులు దిద్దడం ఈసీ విధి. సవరణపై సలహాలిచ్చేందుకు ఈసీ తలుపులు అందరికీ తెరచే ఉంటాయి’’ అని సీఈసీ అన్నారు. ‘‘అధికార, విపక్షాలనే తేడా లేకుండా అందరినీ ఈసీ ఒకేలా పరిగణిస్తుంది. విపక్ష పార్టీలపై ఎలాంటి వివక్షా ఉండదు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఆరోపణలు, ఫిర్యాదులు సెప్టెంబర్ 1 లోపే చేసేయండి. తర్వాత స్వీకరించబోం’’ అన్నారు.వాళ్ల ఇంటి నంబర్ సున్నాయే ‘‘దొంగ, నకిలీ ఓట్లను చేర్చి వాటి చిరునామాలో ఇంటి నంబర్‌ను సున్నాగా పేర్కొన్నట్టు రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఇల్లు లేని, వంతెనలు, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, అనధికార కాలనీల్లో నివసించే వారికి నిర్దిష్టమైన చిరునామా, నంబర్ ఉండవు. అందుకే ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేయకుండా ఇంటి నంబర్‌ను ‘సున్నా’గా పేర్కొంటాం. ఓటేసేందుకు చిరునామా ముఖ్యంకాదు. ఓటరు ఏ బూత్‌లో ఓటేస్తాడనేదే ముఖ్యం’’ అన్నారు. ‘‘వేర్వేరు బూత్‌ల్లో ఒకే వ్యక్తి పేర్లు నమోదైనట్లు ఆరోపణలే తప్ప ఆ మేరకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. గత ఆరు నెలల్లో బిహార్‌లో 22 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇవన్నీ గత 20 ఏళ్లలో సంభవించినవి. ఎస్ఐఆర్ వల్లే ఈ గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. మెషీన్ రీడబుల్ ఓటర్ జాబితా ఫార్మాట్‌ను పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదు. అలా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఫార్మాట్లో డేటా బయటికొస్తే ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముంది’’ అని చెప్పారు. -
‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్‌కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్‌లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్‌లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్‌పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్‌ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్‌ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు. -
Bihar: కోటి ఉద్యోగాలు.. పరిశ్రమలకు ఉచిత భూములు.. నితీష్ ఎన్నికల హామీలివే..
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో సీఎం నితీష్ కుమార్ పలు ఎన్నికల హామీలను గుప్పించారు. తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. 2020లో ‘సాత్ నిశ్చయ్-2’ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి మార్గాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని సిఎం వివరించారు.2020 में सात निश्चय-2 के तहत की गई घोषणा के क्रम में हमारी सरकार ने 50 लाख युवाओं को सरकारी नौकरी एवं रोजगार देने के लक्ष्य को पूरा कर लिया है। अब हमारी सरकार ने अगले 5 वर्षों में 1 करोड़ युवाओं को नौकरी एवं रोजगार देने का लक्ष्य रखा है। राज्य में उद्योग लगाने और स्वरोजगार करने…— Nitish Kumar (@NitishKumar) August 16, 2025సీఎం నితీష్ కుమార్ తన ‘ఎక్స్’ ఖాతాలో తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేశారు. తమ ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని, బీహార్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యవస్థాపకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బీహార్‌లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సీఎం నితీష్ కుమార్ చేసిన ప్రధాన హామీలివే.. ప్రోత్సాహకాలు రెట్టింపు మూలధన సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, జీఎస్టీ రీయంబర్స్మెంట్ కోసం అందించిన మొత్తాన్ని రెట్టింపు చేయడం.పరిశ్రమలకు భూమి పరిశ్రమల స్థాపన కోసం ప్రతి జిల్లాలో భూమిని కేటాయించనున్నారు.ఉపాధికి ఉచిత భూమి అధికంగా ఉపాధిని కల్పించే పరిశ్రమలకు ఉచితంగా భూమి ఇవ్వనున్నారు.భూ వివాదాల పరిష్కారం పరిశ్రమల కోసం కేటాయించిన భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు వెంటనే పరిష్కరించనున్నారు.కాలపరిమితి ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు రాబోయే ఆరు నెలల్లో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు అందనున్నాయి. -
అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది
న్యూఢిల్లీ: వెలుగులోకి వస్తున్న ఎన్నికల అక్రమాలను చూస్తే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జెండా ఎగురవేసిన అనంతరం నాయకులు, శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తుండగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలు జెండా వందనం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా ధ్రువీకరించడం ద్వారా ప్రతిపక్షాలకు పడే ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగింపునకు గురైన 65 లక్షల ఓట్లకు సంబంధించి బీజేపీ ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎస్ఐఆర్తో లాభం కలిగేది బీజేపీకి మాత్రమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ప్రాతిపదికన ఓట్లను రద్దు చేసిందో తెలిపేందుకు ఈసీ సైతం సిద్ధంగా లేదని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎంత అనైతికతకయినా సిద్ధమవుతోందని దీంతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందే తప్ప, ఎన్నికల్లో విజయం కోసం కాదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు విభాగాలైన ఈడీ, సీబీఐలతోపాటు ఆదాయపన్ను శాఖను సైతం బీజేపీ సర్కార్ బాహాటంగా దుర్వినియోగం చేస్తోన్న విషయాన్ని ప్రత్యక్షంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన అన్నారు. అలీన విధానం ద్వారా కూడగట్టుకున్న ప్రతిçష్టను బీజేపీ సర్కార్ హయాంలో మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని ఖర్గే విమర్శించారు.వర్షంలో తడుస్తూ రాహుల్ జెండా వందనంఇందిరా భవన్ ప్రాంగణంలో పార్టీ చీఫ్ ఖర్గే జెండా ఎగురవేస్తుండగా ఆయన పక్కనే అగ్రనేత రాహుల్ గాంధీ వర్షంలో మిగతా వారితో కలిసి తడుస్తూనే నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. వీటి పరిరక్షణ కోసం ఇకపైనా పోరాడుతాం’అని ఆ పార్టీ పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
పారదర్శకతకు ‘సుప్రీం’ పట్టం
ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ సంఘం ఆదరా బాదరాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలెట్టింది. ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది. అసలు ఈ సవరణ తీరే వేరు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవటం, జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవటం, చిరునామాలో లేనివారిని తొలగించటం సాగిపోయేది. కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ జరిగిన 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారిని ఈసీ సంశయ ఓటర్లుగా పరిగణిస్తోంది. వారినుంచి రకరకాల ధ్రువపత్రాలు అడుగుతోంది. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఆధార్, గతంలో ఈసీయే జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికిరాదట. పనికొచ్చే పత్రాల్లో పాస్‌పోర్టు ఉంది. కానీ ఆ పాస్‌పోర్టు సాధించటానికి పౌరులు ఆధార్ కార్డే చూపుతారని ఈసీ మరిచింది. ఒకపక్కఆందోళనలు సాగుతుండగానే సాగిన ఈ ‘సర్’ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా 65 లక్షలమంది పేర్లు గల్లంతయ్యాయి. 22 లక్షలమంది మరణించారని తేలిందని, రెండు చోట్ల ఓటుహక్కున్నవారు 7 లక్షల మంది కాగా, వలసపోవటం వల్లనో, ఇతర కారణాల వల్లనో 35 లక్షలమంది జాడలేదని అంటున్నది. అలాంటివారి పేర్లు తొలగించామని చెబుతోంది. నోటీసులిచ్చి, వాదనలు విని తొలగించామంటోంది. నిరుడు జూలై నుంచి డిసెంబర్ వరకూ ఓటర్ల జాబితాలను సరిచూసి, అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసీ తుది జాబితా ప్రకటించింది. అందులో 7.90 కోట్లమంది ఓటర్లుండగా, తాజా ముసా యిదాలో 7.24 కోట్లమంది పేర్లున్నాయి. ఈ ఆర్నెల్లలో 22 లక్షల మరణాలు, మరో 35 లక్షల మంది వలసలు లేదా ఆచూకీ లేకపోవటం మాయాజాలం అనిపించటం లేదా? పైగా ఈసారి కేవలం నెల్లాళ్ల వ్యవధిలో... అంటే జూన్ 24న మొదలై జూలై 25 వరకే ఈ ప్రక్రియ సాగింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లమంది అర్హతల్ని తేల్చిపారేయటం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలామందికొచ్చాయి. ఈ విషయంలో నిందలు పడుతున్నా ఈసీ గంభీర వదనంతో ‘మీ దగ్గర ఆధారాలున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించటం మరిన్ని సంశయాలకు దారి తీసింది. ఇది ఈసీకీ, ఆరోపణలు చేస్తున్న నేతలకూ మధ్య పంచాయతీ కాదు. ఆ ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతే పెరుగుతుంది. లేనట్టయితే విపక్షాలు చేసే ‘ఓట్ చోరీ’ ఆరోపణను జనం నమ్ముతారు. సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే! తొలగించినవారి పేర్ల ఎదురుగా కారణమేమిటో పేర్కొంటూ జాబితా విడుదల చేయాలనీ, పేరు లేదా ఓటర్ క్రమ సంఖ్య టైప్ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలనీ ధర్మాసనం ఆదే శించింది. నిజానికి ‘ఓట్ చోరీ’ ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది. అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి? ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పస లేదు. ఓటుహక్కు కోల్పోయినవారు కారణం తెలుసుకోవటానికి పార్టీల చుట్టూ తిరగాలా? జాబితా వెల్లడైతే ఓటర్ల గోప్యత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం. చనిపోయినవారి, ఆచూకీ లేనివారి హక్కులకై ఈసీకి ఎందుకంత తాపత్రయం?‘సర్’ వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో ఆ సంస్థకు అర్థమైనట్టు లేదు. బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించగా దిగ్భ్రాంతి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 24 చోట్ల నెగ్గినవారి మెజారిటీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం! ఉదాహరణకు బెగుసరాయ్‌లో విజేత మెజారిటీ 81,480. కానీ అక్కడ తొలగించిన ఓటర్లు 1,23,178 మంది. షోహర్ స్థానంలో తొలగించిన వారు 1,09,723 అయితే, ఆ ఎన్నికల్లో విజేత మెజారిటీ 29,143! ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు, నిరుద్యోగం వంటివి చర్చకొస్తాయి. ఈసీ నిర్వాకంతో రాగల బిహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతోంది. ఇది ఎన్డీయే కూటమికి మంచి పరిణామమైతే కాదు.ఓటర్ల జాబితాలో పేరు తొలగించటమంటే పోటీ చేయటానికిగల హక్కును నిరాకరించటం కూడా. ఇది బిహార్‌తో ఆగదు. ఎన్నికలు జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళ నాడులకు కూడా విస్తరిస్తుంది. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకూ ఈసీ సాధించదల్చుకున్నదేమిటి? -
ఓట్ల చోరీపై ఇక ప్రత్యక్ష యుద్ధం: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల చోరీపై తమ ఆందోళన అనేది కేవలం రాజకీయ అంశం కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తే ల్చిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ‘ఒక్కరికి ఒక ఓటు’అనే విధానాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న నిర్ణయాత్మక పోరాటం అని స్పష్టంచేశారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’ద్వారా ఓట్ల చోరీపై బిహార్ గడ్డపైనుంచే ప్రత్యక్ష యుద్ధం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం తమ పార్టీ పోరాడుతోందని ఉద్ఘాటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభమవుతుందని, యువత, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇదొ క ప్రజా ఉద్యమం అని పేర్కొన్నారు. ఓట్ల దొంగల ను ఎన్నికల్లో ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల చోరు లు ఓడిపోతేనే ప్రజలకు, రాజ్యాంగానికి విజయం లభిస్తుందన్నారు. ఓటర్ అధికార్ యాత్రకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాను షేర్ చేశారు. -
తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్‌లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం ప్రశ్నించింది. బూత్ లెవెల్ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్సైట్లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.కాగా, బీహార్‌లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయ.మరొకవైపు ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇస్తూ వస్తోంది.. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ కూడా చదవండి'దేశ'మంత మందికి ఓటుండదా? -
ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తున్నారు
పాట్నా: ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ప్రయోగాలు పనిచేయడం లేదని తేలాక బీజేపీ ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టడానికే ఈసీ ఈ ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం ఇలాగే ద్రోహం చేయాలని నిర్ణయించుకుంటే తాము ఎన్నికలను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని మరోమారు స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఈసీ నిస్సంకోచంగా ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థులను బెదిరించడానికి సీబీఐ, ఈడీ, ఆదాయపు ప్ను శాఖ వంటి ఏజెన్సీలన్నింటిని ప్రయోగించిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన ఈసీని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఈ ఆటలో భాగంగా ఈసీ చాలామంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తోంది. గతేడాది నేను విజయ్ కుమార్ సిన్హా కేసును బయటపెట్టాను. ఈ రోజు ముజఫర్‌పూర్ మేయర్ నిర్మలా దేవీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు’ అని తేజస్వి అన్నారు. ఇంత వివాదం నడస్తున్నా ఈసీ ఎప్పుడూ మీడియా ముందుకు రాకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, బీహార్ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడరు, చివరకు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా వారినే అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందని తేజస్వి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందన్నారు. ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లాలో ప్రారంభమయ్యే ఓటర్ల హక్కు యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిఖూభాయ్ దల్సానియా బీహార్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంపై తేజస్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
సమగ్ర సవరణ సబబే
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల విమర్శలు, అత్యంత అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్)) సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలుచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో మార్పు లు, చేర్పులు, సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో య్మాల్య బాగ్చీల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఓటర్ల జాబితా ఎప్పు డూ స్థిర సంఖ్యతో కొనసాగడం సహే తుకం అనిపించుకోదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి. గతంలో ఓటరుగా నిరూపించుకోవడానికి ఏడు రకాల ధ్రువీక రణ పత్రాలను ఈసీ అనుమతించేది. ఇప్పు డు ఏకంగా 11 రకాల ధ్రువీకరణ పత్రా లను అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ ధ్రువపత్రాలను అనుమతించడం చూస్తుంటే ఈ ప్రక్రియ మరింతగా ఓటరుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓటర్లను జాబితా నుంచి తప్పించేలా ఇది కనిపించట్లేదు’’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎస్ఐఆర్ తప్పులతడకగా ఉందని, దీన్ని వెంటనే ఆపాలంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టిన వేల సుప్రీంకోర్టు ఈసీ అనుకూ ల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవస రమై నప్పుడు ఓటరు జాబితాకు సవరణలు చేసే సర్వాధికారం ఈసీకి ఉంది. చట్టానికి వ్యతిరే కంగా ఎస్ఐఆర్ చేపడుతు న్నారని, దీనిని ఆపేయాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసి పుచ్చింది. బిహార్‌లో ఎస్ఐఆర్ను వ్యతి రేకిస్తూ రాష్ట్రీయలోక్‌దళ్, కాంగ్రెస్ నేత లు సహా రాజకీయ సంస్కరణ సంస ్థ(ఏడీ ఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.సవరణ లేకుండా ఎలా?‘‘బిహార్‌లో మొదలెట్టిన ఎస్ఐఆర్ను దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకోవాలి. ఎస్‌ఐఆర్‌లాంటి ప్రక్రియను ఈసీ గతంలో ఏనాడూ చేపట్టలేదు. అసలు ఇది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలియాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అన్నారు. దీంతో కోర్టు స్పందించింది. ‘‘ మీ తర్కం ప్రకారం ప్రత్యేకంగా ఓటరు సమగ్ర సవరణ చేపట్ట కూడదు. మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం సేకరించిన వాస్తవిక ఓటర్ల జాబితాను మాత్రమే కొనసాగించాలంటున్నారు. మా అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా అనేది ఎలాంటి సవరణలు జరపకుండా అలాగే కొనసాగించడం సబబు కాదు. ఈ జాబితా ఎప్పటికప్పుడు సవరణకు బద్దమై ఉండాల్సిందే. సవరణ చేయకుంటే చనిపోయిన వారి పేర్లను తొలగించేదెలా? వేరే రాష్ట్రానికి వలసవెళ్లిన ఓటర్లు, మరో నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పర్చు కున్న వారి పేర్లను పాత నియోజక వర్గంలో తొలగించొద్దా?’’ అని ధర్మాసనం సూటి ప్రశ్నలు వేసింది. ‘‘ దృవపత్రంగా ఆధార్‌ను అంగీకరించట్లేదని మాకు అర్థమవుతోంది. కానీ ఏకంగా 11 ఇతర రకాల దృవపత్రాలను అంగీకరిస్తు న్నారుగా?’’ అని పిటిషనర్ల తరఫున హాజరైన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనితో పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విభేదించారు. ‘‘ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి పూర్తిస్తాయిలో ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు. ధ్రువపత్రాల్లో ఒకటైన పాస్‌పోర్టు విషయానికే వస్తే రాష్ట్రంలో కేవలం ఒకటి, రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి’’అని వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘‘ రాష్ట్రంలో 36,00,000 మందికి పాస్‌పోర్టు ఉంది. ఇది మంచి సంఖ్య మాదిరిగానే కనిపిస్తోంది’’ అని కోర్టు గుర్తుచేసింది. వాటి మధ్య యుద్ధంలా తయారైంది‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటరు జాబితాలో ఇప్పుడు సవరణలు అవసరమని ఈసీ భావిస్తే అప్పుడు వెంటనే ప్రత్యేక సవరణ మొదలెట్టే సర్వాధికారం ఈసీకి దఖలుపడింది. వాస్తవానికి ఈ అంశం రాజ్యాంగబద్ధ హక్కుకు, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన అధికారానికి మధ్య పోరాటంలా తయారైంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు అభిప్రాయంతో లాయర్ శంకరనారాయణన్ విబేధించారు. చట్టప్రకారం రాష్ట్రంలో ఏదైనా కేవలం ఒక నియోజకవర్గంలో లేదంటే ఒక నియోజకవర్గంలోని కొంత భాగంలో మాత్రమే జాబితా సవరణ చేపట్టాలి. అంతేగానీ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సవరణ చేపట్టకూడదు’’ అని వాదించారు. దీనిపై జడ్జి మళ్లీ స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా ఈసీకి సవరణ అధికారాలు దఖలుపడ్డాయి’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. వెతికే అవకాశం లేకుండా చేశారు‘‘ముసాయిదా జాబితాలో సెర్చ్ ఆప్షన్‌ను ఈసీ దురుద్దేశంతో తొలగించింది. దీంతో గత జాబితాతో పోలిస్తే ముసాయిదా లిస్ట్‌లో ఎవరి పేర్లను తొలగించారో తెలియకుండా పోయింది. తొలగించిన, మరణించిన, వలసవెళ్లిన వాళ్ల జాబితా తెలీకుండా దాచిపెట్టేందుకే ఈసీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో లక్ష నకిలీ ఓట్లను గుర్తించామని రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సెర్చ్ ఆప్షన్ తీసేశారు’’ అని ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
'దేశ'మంత మందికి ఓటుండదా?
బిహార్ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్–సర్)లో భాగంగా ఎంత మంది పేర్లు గల్లంతయ్యాయి? దానికంటే ముఖ్యంగా, ఎంతమంది పేర్లు ఈ తాజా జాబితాల్లో నమోదు కాలేదు? ఈ సంఖ్యలు చాలా ముఖ్యం. వీటిని బట్టే ‘సర్’ పట్ల నా అభిప్రాయం ఉంటుంది. నేననుకోవడం, మనకు చెప్పిన దానికంటే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్దాం.ఎన్నికల కమిషన్ ఒకటో తేదీన ముసాయిదా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, 65.6 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందున్న మొత్తం ఓటర్లలో వీరు దాదాపు 9 శాతం ఉంటారు. ఈ తాత్కాలిక సంఖ్య చిన్నదేం కాదు. ఇప్పటికే ఇది ఆందోళన కలిగిస్తోంది.పెరగాల్సింది పోయి...మరొక విషయం ఏమిటంటే – 2024 సాధారణ ఎన్నికలతో, 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినట్లయితే ఈ దఫా నమోదైన ఓటర్లు తక్కువగా ఉన్నారు. 2005లో రెండు సార్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు మినహా, 1977 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలకూ మొత్తం ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.బిహార్ రాష్ట్ర అధిక సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్)ను దృష్టిలో పెట్టుకుంటే, ఇది మరింత కలవరపెడుతోంది. 2001, 2011 మధ్య కాలంలో వయోజనులు 28.5 శాతం పెరిగారు. అయినా 2025లో మొత్తం రిజిస్ట్టర్డ్ ఓటర్ల సంఖ్య పెరగటానికి బదులు తగ్గటం వింతే!కొద్ది రోజుల క్రితం ప్రకటించిన దానికంటే అంతిమంగా ప్రకటించే వాస్తవ తొలగింపులు పెరిగే అవకాశం ఉంది. ‘భారత్ జోడో అభియాన్’ నేషనల్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 65.6 లక్షలు అనే సంఖ్య ఇంకా పెరుగుతుందన డానికి ఆయన మూడు కారణాలు చెబుతున్నారు. ఒకటి – బూత్ లెవెల్ ఆఫీసర్స్ ముసాయిదాలోని పలు పేర్లను తిరస్కరించే అవ కాశం ఉంది. వారికా అధికారం ఉంది. రెండు – తమ దరఖాస్తు ఫారాలను అప్లోడ్ చేసిన అనేక మంది వాటిలో పొందుపరచిన వివరాలకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఉండరు. అలాంటి వారి పేర్లను మలి విడతలో తొలగిస్తారు. మూడు – ఎల క్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు స్థానికంగా విచారణ చేసి మరికొన్ని పేర్లను కొట్టేసే వీలుంది. ఈ మూడు కారణాల ప్రకారం, 65.6 లక్షలు అనేది ఆరంభ సంఖ్య మాత్రమే. చివరి లెక్కల్లో ఇది తప్పనిసరిగా చాలా ఎక్కువ ఉంటుంది.నమోదు కానివారి మాటో?ఓటర్ల జాబితాలపై, అంతిమంగా బిహార్ ఎన్నికలపై ఈ పేర్ల తొలగింపు ప్రభావం గురించి మాత్రమే విశ్లేషణ జరిగింది. మరి, జాబితాల్లో కొత్త ఓటర్ల నమోదు మాటేమిటి? ఈ అంశానికి దక్కా ల్సినంత ప్రాధాన్యం దక్కలేదు.యోగేంద్ర యాదవ్ దీనిపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ అధికారిక జనాభా అంచనాలనే ఆయన తన అధ్యయనానికి ఆధా రంగా తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం ఓటరు జాబితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, ధ్రువీకరించుకోవడానికి వీటినే ప్రాతిపదికగా తీసుకుంటోంది.బిహార్ ఓటర్ల జాబితాల్లో నమోదైన వయోజన జనాభా (18 ఏళ్ల లేదా అంతకు మించిన వయసు ఉన్నవారు) శాతం వారి వాస్తవ జనాభాలో ఎంత ఉందో యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ‘సర్’కు ముందు, జూన్ 24న ఇది 97 శాతం. ‘సర్’ తర్వాత, ఇప్పుడు 88 శాతం! అంటే, 9 శాతం తగ్గింది. ఇది 94 లక్షలకు సమానం. జాబితాల నుంచి తొలగించిన 65.6 లక్షల పేర్ల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే, 30 లక్షల మంది వయోజనులు అర్హత ఉండీ ఓటర్లుగా నమోదు కాలేదు.యోగేంద్ర యాదవ్ తన అధ్యయన ఫలితాలు ప్రచురించి పది రోజులు దాటింది. ఎన్నికల కమిషన్ వీటిని ఖండించలేదు, ప్రశ్నించలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?దేశమే అదృశ్యం?యోగేంద్ర యాదవ్ తన అధ్యయనంలో రెండు నిర్ధారణలకు వచ్చారు. బిహార్ ఓటర్ల జాబితాల్లో పేర్లు అదృశ్యమైన వారూ, పేర్లు నమోదు కాని వారూ కలిసి 1.5 కోట్ల మంది ఉంటారని ఆయన అంచనా. ఇది నిజం కాకపోతే బాగుండని అనుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. ఇక రెండో నిర్ధారణ మనందరికీ ఆందో ళన కలిగించక మానదు. అధికారిక ప్రకటన ప్రకారం, 9 శాతం పేర్ల తొలగింపునే పరిగణనలోకి తీసుకున్నా సరే, ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ‘సర్’ నిర్వహిస్తే ఈ లెక్కన 9 కోట్ల మంది పేర్లు అదృశ్యమవుతాయి. వీరి సంఖ్య బ్రిటన్ లేదా ఫ్రాన్స్ జనాభాకు ఒకటి న్నర రెట్లు! బిహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ గురించి ఒక అభిప్రాయానికి వచ్చేందుకు ప్రధానంగా ఈ వివరాలు సరిపోతాయని అనుకుంటున్నాను. మీరేమంటారు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Bihar: ఓటరు జాబితా సవరణపై సుప్రీం సీరియస్.. ఈసీకి వార్నింగ్
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే, ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించేందుకు సమయం కూడా ఉండదని పేర్కొంది.బీహార్‌లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటుచేసుకున్నట్లు తేలితే. ఎన్నికలు సమీపించే సెప్టెంబర్‌లో అయినా ఆ జాబితాను పక్కనపెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈసీ గతంలో.. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి, ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిని నిర్ణయించేది ఐదు కోట్ల మంది ఓటర్లని, ఈసీ కాదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా బీహార్‌లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయ. ఈ నేపధ్యంలో ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.దీనిపై స్పందించిన ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం ప్రతిపక్షాలను ఊరటనిచ్చింది. -
సభలో కొనసాగిన సవరణ సమరం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశం మరోమారు పార్లమెంట్‌ను కుదిపేసింది. కొన్ని బిల్లులకు మోక్షం లభించడం మినమా సభలో కీలక అంశాలేవీ చర్చలకు నోచుకోలేదు. ఎస్ఐఆ ర్‌పై చర్చ జరపాలన్న డిమాండ్ నుంచి విపక్ష సభ్యులు మొండిపట్టు పట్టడంతో పలు మార్లు వాయిదాల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా పడ్డాయి. స్వాతంత్రదినోత్స వేడుకలను పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయసభల్లో సభా కార్యక్రమాలకు ఆగస్ట్ 13 నుంచి 17వ తేదీదాకా తాత్కాలిక విరామం ఇచ్చారు.లోక్‌సభ మంగళవారం ఉదయం ప్రారంభంకాగానే విపక్షసభ్యులు ఎస్ఐఆర్ అనుకూల నినాదా లిస్తూ సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో తర్వాత ఇదే పునరా వృతమైంది. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటలకు వాయి దావేశారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లులకు పార్ల మెంట్ ఆమోదం ఆరు దశా బ్దాలనాటి పాత ఇన్క మ్‌ట్యాక్స్ చట్టం,1961కు బదులుగా తీసుకొచ్చిన నూతన ఆదాయపన్ను చట్టా నికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.కొత్త పన్ను రేట్లు మోపడంలేదని, కేవలం కఠిన పదాలను తొలగించి సరళమైన పదాలతో బిల్లును తీసు కొచ్చామని రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1961నాటి చ ట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటి ని 536కు కుదించాం. పదేపదే ప్రస్తావిస్తూ ఉన్న పదాలతో పాటు కఠిన పదాలను తొలగించాం. దీంతో బిల్లులోని 5.12 లక్షల పదాలకు ఏకంగా 2.6 లక్షల పదాలకు తగ్గాయి. 39 కొత్త టేబుళ్లను, 40 కొత్త ఫార్ములా లను జతచేశాం’’ అని సీతారామన్ పేర్కొన్నారు. ట్యాక్సేషన్ ట్టాలు (సవరణ) బిల్లు, 2025సహా మొత్తంగా ఆరు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. పేపర్లు చింపి.. అంతకముందు లోక్‌సభలో కొంత అనూహ్యఘటన చోటుచేసుకుంది. ఎస్ఐఆర్ సంబంధ నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి కొన్ని పేపర్లు చింపేసి అధ్యక్ష పీఠం వైపు చిందరవందరగా విసిరారు. దీనిపై ఎన్డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.మింతా దేవి ఫొటో టీ–షర్ట్లు ధరించి నిరసన35 ఏళ్ల బిహార్ మహిళా ఓటరు వయసును 124 ఏళ్లుగా ఎస్ఐఆర్లో పేర్కొనడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు వినూత్న నిరసనకు దిగారు. మింతా దేవి ఫొటో ముద్రించిన తెలుపురంగు టీ–షర్ట్‌లను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ సహాపలువురు ఎంపీలు ధరించి ఈసీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. 124 నాట్అవుట్ అని ఆ టీ–షర్ట్‌పై రాసి ఉంది.మన ఓటు, మన హక్కు, మన పోరాటం అనే బ్యానర్‌తో ముందుకు కదిలారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్సోనియాగాంధీ, టీఎంసీ నేత డిరేక్ ఓబ్రియాన్, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎన్సీపీ(ఎస్పీ) సుప్రియాసూలే తదితర ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్దకు చేరుకుని ఎస్ఐఆర్ను తక్షణం నిలిపివేయాలని నినాదాలిచ్చారు. ఎస్ఐఆర్ అంశాన్ని విపక్ష ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించడం ఇది 15వ రోజు. -
ఓట్ల చోరీపై పోరుబాట
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)తోపాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై విపక్ష ‘ఇండియా’ కూటమి పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ‘ఒక్కరికి ఒక ఓటు’ అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధానిలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెల్లటోపీలు ధరించి పార్లమెంట్ మకరద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన ‘ఇండియా’ కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పీటీఐ భవనం ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. కేవలం 30 మందిని అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు రోడ్డుపై బైఠాయించి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చయడం ఆపాలన్నారు. మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జోతిమణితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ బారీకేడ్లపైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బేగ్ స్పృహ తప్పిపడిపోగా, రాహుల్ గాంధీ వారికి సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు. రాజకీయ పోరాటం కాదు: రాహుల్ ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టంచేశారు. నిరసన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్‌పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేíÙంచి, ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టంచేశారు.బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం: ఖర్గే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓట్ల చోరీని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను కచి్చతంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ మేరకు ఖర్గే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశంలో బీజేపీ నిరంకుశత్వం చెల్లదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఎదుటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ డిమాండ్లపై ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం దొంగతనం చేసే సంఘంగా మారొద్దని జైరాం రామేశ్ హితవు పలికారు. నిరసన ర్యాలీలో శరద్ పవార్(ఎన్సీపీ–ఎస్పీ), టి.ఆర్.బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన–ఉద్ధవ్), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ)తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, నిరసన ర్యాలీ కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్ దాటేసిన అఖిలేశ్ నిరసన ర్యాలీలో తమను అడ్డుకున్న పోలీసులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారీకేడ్ ఎక్కి అవతలికి దూకేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఉద్యమంలా మారింది: రాహుల్న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. -
పిల్లికి ఇంటి ధృవీకరణ పత్రం?.. నవ్వులు పూయిస్తున్న దరఖాస్తు!
పాట్నా: బీహార్ రాష్ట్రం మరోసారి విచిత్రమైన ఘటనతో వార్తల్లో నిలిచింది. రోహ్తాస్ జిల్లాలో ‘క్యాట్ కుమార్’ అనే పేరుతో ఒక పిల్లికి నివాస ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. ఈ దరఖాస్తులో తండ్రి పేరు క్యాటీ బాస్,తల్లిపేరు కటియా దేవిగా పేర్కొనడం గమనార్హం.జూలై 29 రోహ్తాస్ జిల్లా నస్రిగంజ్ బ్లాక్ అటిమిగంజ్ గ్రామ నివాసి రైట్ టూ పబ్లిక్ సర్వీస్ డొమైన్లో తన పిల్లికి ఇంటి సర్టిఫికెట్ కావాలని ధరఖాస్తు చేశారు. ధరఖాస్తులో పిల్లి ఫోటో, ఇమెయిల్, ఫోన్ నంబర్ వివరాలు సైతం వెల్లడించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ ఆదేశాల మేరకు నస్రిగంజ్ రెవెన్యూ అధికారి కౌశల్ పటేల్ కేసు నమోదు చేశారు. నస్రిగంజ్ పోలీస్ స్టేషన్లో తన పిల్లికి ఇంటి అడ్రస్ కోసం హౌస్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆర్టీపీఎస్ డొమైన్లో అప్లయి చేసుకున్న అజ్ఞాత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ దరఖాస్తును ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేయడానికి చేసిన ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘డాగ్ బాబు’, ‘డాగేష్ బాబు’ పేరుతో నివాస ధృవీకరణ పత్రాల కోసం ధరఖాస్తు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది. Rohtas, Bihar | An application has been made for obtaining a residential certificate in the name of a cat. The applicant's name is Cat Kumar, with Catty Boss as the father and Catiya Devi as the mother.Following the instructions of Rohtas DM Udita Singh, Nasriganj Revenue… pic.twitter.com/wq599ihfLv— ANI (@ANI) August 11, 2025 -
బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..
పట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన వివాదం ఇప్పుడు డబుల్ ఓటరు ఐడీ నోటీసుల వరకూ దారి తీసింది. తాజాగా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు పోల్ బాడీ నోటీసు జారీ చేసింది. నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తున్న తరుణంలో విజయ్ కుమార్ సిన్హా ఎన్నికల కమిషన్ నుండి నోటీసు రావడం గమనార్హం.తాజాగా బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫారం‘ఎక్స్’లోచేసిన ఒక పోస్ట్‌లో తన అసెంబ్లీ సీటు అయిన లఖిసరైలో ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ, దానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అలాగే పట్నాలోని బంకిపూర్‌లో కూడా ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ ఆధారం చూపించారు. ఈ నేపధ్యంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం ఐదు గంటలలోపు దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు.రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన తేజస్వి యాదవ్ తాజాగా ఉప ముఖ్యమంత్రికి రెండు ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, సిన్హాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిన్హా మాట్లాడుతూ తాను ఒకేచోట నుండి ఓటు వేశానని, తేజశ్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన పేరు ఒటరు జాబితాలో రెండు చోట్ల ఉండటానికిగల కారణాలను వివరిస్తూ.. తొలుత తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే 2024 ఏప్రిల్ లో, తాను లఖిసరైలో తన పేరును జతచేర్చుకునేందుకు దరఖాస్తు చేశానన్నారు. అదే సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ నుండి తొలగించేందుకు ఫారమ్‌ను కూడా నింపి సమర్పించానన్నారు. అయితే ఏవో కారణాలతో బంకిపూర్ నుండి తన పేరు తొలగించలేదని విజయ్ కుమార్ సిన్హా వివరణ ఇచ్చారు. -
వెట్టి చాకిరీ నుంచి తప్పించుకోవడానికి...
గురుగ్రామ్: ప్రాథమిక విద్య హక్కుగా ఉన్నా... అది ఆచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక నిర్మూలనకు ప్రభుత్వాలెన్ని పథకాలు పెడుతున్నా.. అమలులో విఫలమవుతూనే ఉందని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. తాజాగా బీహార్‌కు చెందిన ఓ బాలుడు.. ఆ వెట్టి నుంచి తప్పించుకోవడానికి 150 కిలోమీటర్లు నడిచాడు. చివరకు తన చేయి కూడా పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్ల బాలుడు హర్యానా, జింద్ జిల్లాలోని ఒక పాడి పరిశ్రమలో కార్మికుగా పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం బీహార్‌లోని కిషన్‌గంజ్ జిలా. నెలకు రూ.10,000 వేతనం ఇస్తామన్న హామీతో అతడిని పనిలోకి తీసుకెళ్లారు. డైరీ ఫామ్‌లో అతన్ని మోటరైజ్డ్ ఫీడర్ చాపర్ ఆపరేటర్‌గా పెట్టారు. ఆ ఫామ్ దగ్గరే ఓ గదిలో నివాసం. వేతనం మాట అటుంచితే.. సరైన ఆహారం కూడా పెట్టలేదు. చాపర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్ను సమయంలో అతని చేతికి గాయమైంది. ఆ తరువాత అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చేసరికి అతను డిస్పెన్సరీలో ఉన్నాడు. ప్రాథమిక చికిత్స చేసిన డిస్పెన్సరీ సిబ్బంది బాలుడిని వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మళ్లీ ఫామ్‌కు వెళ్లడం ఇష్టం లేని బాలుడు బీహార్‌కు నడక మొదలు పెట్టాడు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం మొండిగా వెళ్లాలి. దాదాపు 150 కిలోమీటర్లు నడిచిన తరువాత నుహ్జిల్లాలోని టౌరు సమీపంలో అతన్ని ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చూశారు. భోజనం పెట్టి, పోలీసులకు అప్పగించారు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. చేతి గాయానికి చికిత్స కోసం నుహ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అతని సోదరుడు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబం హుటాహుటిన వచి్చన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరి్పంచారు. గాయం తీవ్రమవ్వడంతో మోచేతి వరకు చేయిని తొలగించాల్సి వచి్చంది. -
పార్లమెంట్లో మిన్నంటిన నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. శుక్రవారం సైతం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రభుత్వం వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో నిరసన వ్యక్తంచేశాయి. దాంతో లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మృతిపట్ల స్పీకర్ ఓంబిర్లా నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం గురించి ప్రస్తావించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని తేల్చిచెప్పారు. ఈ సమయంలో స్పీకర్ కొంతసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. విపక్షాల రగడ ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాలు ఆగలేదు. విపక్షాల ఆందోళన ఆగకపోవడంతో చేసేది లేక సభాపతి లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఇన్‌కం ట్యాక్స్ బిల్లు–2025’ను ఉపసంహరించుకున్నారు. నూతన బిల్లును ఈ నెల 11 లోక్‌సభలో ప్రవేశపెట్ట బోతున్నారు. ఎస్ఐఆర్పై సభలో నినానాలు మిన్నంటడంతో స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. ఓట్లు చోరీ చేసింది కాంగ్రెస్ నేతలే: రవనీత్ సింగ్ బిట్టూ బిహార్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్తోపాటు గత లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చౌర్యంపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలపాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. చర్చ కోసం రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన 20 నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. దాంతో విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి యథాతథంగా కొనసాగింది. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న ఘన్‌శ్యామ్ తివారీ విజ్ఞప్తి చేయగా, విపక్షాలు పట్టించుకోలేదు. కర్ణాటకలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ డిమాండ్‌చేశారు. ఓట్ల దొంగతనానికి పాల్పడింది కాంగ్రెస్ నేతలేనని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. -
మరో ‘అమృత్ భారత్’కు పచ్చజెండా.. ఎక్కడి నుంచి? సమయాలేమిటి?
న్యూఢిల్లీ: దేశంలో నేటి(శుక్రవారం) నుంచి మరో అమృత్ భారత్ రైలు పరుగులు తీయనుంది. బీహార్‌లోని సీతామర్హిని ఢిల్లీకి అనుసంధానించే ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్‌లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచనుంది. అలాగే మధ్యతరగతి వర్గానికి ఆధునిక రైల్వే సేవల అనుభవాన్ని అందించనుంది.సీతామర్హి-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీతామర్హిలోని పునౌరా ధామ్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని తూర్పు మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 20 గంటల 45 నిమిషాల్లో దాదాపు 1,100 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది గంటకు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగుల తీయగలదు. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంది.ఇది శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి, ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతామర్హి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 10.15 గంటలకు సీతామర్హి నుండి బయలుదేరి, సోమవారం రాత్రి 10.40 గంటలకు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఢిల్లీ-సీతామర్హి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 13 స్టాప్‌లున్నాయి. అవి ఘజియాబాద్, తుండ్ల, కాన్పూర్, లక్నో, గోండా, బస్తీ, గోరఖ్‌పూర్, కప్తాన్‌గంజ్, సిస్వా బజార్, బాగహా, సిక్తా, నర్కటియాగంజ్, రక్సౌల్ బైర్గానియా. -
ఎస్ఐఆర్పై ఆగని ఆందోళన
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో రగడ ఆగడం లేదు. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకు న్నాయి. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. మణిపూర్‌కు నిధులు కేటాయించేందుకు ఉద్దేశించిన మణిపూర్ అప్రొప్రియేషన్ బిల్లు–2025లో లోక్‌సభలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. దేశ ప్రయోజనాల కోసమే మా పోరాటం: ఖర్గే రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనలు కొనసాగాయి. సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నినాదాలు ఆపలేదు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండానే మరోవైపు కోస్టల్ షిప్పింగ్ బిల్లు–2025ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కొందరు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్‌పై సభాపతి స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు మాట్లాడారు. ఎస్ఐఆర్పై చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ఎస్ఐఆర్పై ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐఆర్ అంటే కంటికి కనిపించని రహస్య రిగ్గింగ్ అని ఆరోపించారు. -
మా వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయ్.. ఓట్ చోరీపై రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారుకొన్ని ఓటర్ ఐడీ కార్డ్‌లలో ఇంటి నెంబర్ జీరో ఉందినాలుగు పోలింగ్ బూత్‌లలో ఒకరి పేరు ఎలా వస్తుందిఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైందికర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాంసింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయిఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయిబెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చిందిబెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిమహదేవ్ పూర్లో ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయిమహదేవ్పూర్లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చిందిమహదేవ్పూర్లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయిఅలాంటి ఓట్లు వేలల్లోనే..బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలికర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయిఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందిఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయిఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయిసింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయిఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయిమహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయిమహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందిజనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయిపోలింగ్నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందిపోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయిఅంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయిఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాంహర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయిమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయిప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయిఅంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయికాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుధవారం నిలదీశాయి. నిరసన వ్యక్తంచేశాయి. వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని స్పీకర్‌స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలు యథాతథంగా కొనసాగాయి. చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. అంతకుముందు లోక్‌సభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఎస్ఐఆర్పై చర్చించే ప్రసక్తే లేదు: రిజిజు ఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఆయన బుధవారం సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. అందుకే సభలో చర్చించలేమని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించేందుకు పార్లమెంట్ నియమ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. అలాగే స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కార్యకలాపాల గురించి సభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు. రాజ్యసభలోనూ అదే అలజడి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఎగవ సభలోనూ అలజడి కొనసాగింది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రూల్ 267 కింద 35 నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభలో నినాదాలు, నిరసనలు మిన్నంటాయి. సభను హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు కొనసాగించారు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండగానే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్‌కు సంబంధించిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను సభలో ప్రవేశపెట్టారు. తర్వాత ‘క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు–2025’మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో స్వల్ప చర్చ జరిగింది. మరోవైపు విపక్షాలు ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ చైర్మన్ పోడియంపైకి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా వెల్లడించారు. -
బిహార్‌లో నివసిస్తున్న ట్రంప్ !!
సమస్తీపూర్: కుక్కలకూ నివాస ధృవీకరణ పత్రాలను జారీచేస్తున్న బిహార్ స్థానిక యంత్రాంగం ఈసారి వినూత్నంగా ట్రంప్‌కు రెసిడెన్సీ సర్టీఫికేట్ ఇస్తారని ఓ ఆకతాయి భావించాడు. అనుకున్నదే తడవుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రెసిడెన్సీ సర్టీఫికేట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేశాడు. ఇప్పటికే బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో బిజీగా ఉన్న అధికారుల కంట్లో ఈ దరఖాస్తు పడింది. హసన్‌పూర్‌లో ట్రంప్ నివసిస్తున్నట్లుగా ఈ అప్లికేషన్లో పేర్కొనడం చూసిన అధికారులు హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆ దరఖాస్తును ఆగస్ట్ నాలుగో తేదీన బుట్టదాఖలు చేశారు. జులై 29వ తేదీన ఈ దరఖాస్తు వచ్చింది. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడరిక్ క్రిస్ట్ అని, తల్లి మేరీ మెక్లాయిడ్ అని నిజమైన పేర్లనే పేర్కొనడం విశేషం. -
బిహార్‌లో తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది. ఈ ప్రక్రియలో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఈ నెల 9వ తేదీలోగా సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్‌లో ఎస్ఐఆర్ చేపట్టాలని జూన్ 24న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ(ఏడీఆర్) అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. వారు మరణించారా? లేక వలస వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియజేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం అందజేయాలని, ఒక కాపీని ఏడీఆర్‌కు ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించింది. -
‘నా భర్తను నా తండ్రే కాల్చి చంపాడు’
పాట్నా: కులాంతర వివాహం డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రికుడైన తండ్రి… అల్లుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల మేరకు.. బీహార్‌లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఘోరం జరిగింది. దర్భంగ మెడికల్ కాలేజీలో బీఎస్సీ (నర్సింగ్)రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్‌ను కాలేజీ ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవల రాహుల్ కుమార్‌కు అదే కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన్ను ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే, ఈ క్రమంలో కాలేజీ క్యాంపస్‌లో ఉండగా.. తన్ను ప్రియా చూస్తుండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్.. అల్లుడు రాహుల్‌ను కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు, సిబ్బంది రాహుల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రేమ్శంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియా గుండెలవిసేలా రోదించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు. అతను నా ఒడిలోనే కుప్పకూలిపోయాడు’ అని కన్నీటీ పర్యంతరమయ్యారు. రాహుల్, తన్ను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఒకే హాస్టల్ భవనంలో వేర్వేరు అంతస్తులలో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ‘మేం కాలేజీలో ఉండగా.. హూడీ ధరించిన ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది. ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమ్‌శంకర్ ఝానే. నా తండ్రి ప్రేమ్‌శంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. కులాంతర వివాహ చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాం. నాకు నా భర్తకు.. నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని చెప్పాం. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతరమయ్యారుకాల్పుల తర్వాత, రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితుడు శంకర్‌పై దాడికి దిగారు. రాహుల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భాంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎస్పీ జగన్నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత, అతను, అతని తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారని మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. ఝాకు చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము’అని హామీ ఇచ్చారు. दरभंगा जिला के बेंता थाना क्षेत्र अंतर्गत DMCH में घटित घटना के संदर्भ में अद्यतन घटना का संक्षिप्त विवरण :-दिनांक - 05.08.25 को समय करीब 04:40 PM बजे सूचना मिली कि बेंता थाना क्षेत्र अंतर्गत एक छात्र की गोली मारकर हत्या कर दी गई है। sho and sdpo visited spot and enquired— Darbhanga Police (@DarbhangaPolice) August 5, 2025 -
ఎస్ఐఆర్పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడడం లేదు. గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వెంటనే చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం పార్లమెంట్లో అలజడి సృష్టించాయి. ఈ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాలని విపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. నిరసనలు, నినాదాలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. లోక్‌సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నినాదాల హోరు లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ సహా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులరి్పంచారు. అనంతరం విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఇంతలో స్పీక ర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. సభకు సహకరించాలని కోరారు.విపక్ష ఎంపీలు వినిపించుకోకపోవడంతో సభను మ« ద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు శాంతించకపోవడంతో సభను బుధవారానికి వాయి దా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజ్యసభలోనూ రగడ యథాతథంగా కొనసాగించింది.ఎస్ఐఆర్పై చర్చకు రూల్ 267 కింద విపక్షాలు 34 వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వెంటనే చర్చ ప్రారంభించాలన్న విపక్షాల డిమాండ్ పట్ల సభాపతి సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభ తొలుత రెండుసార్లు.. చివరకు బుధవారానికి వాయిదా పడింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ తీర్మానం లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందగా, రాజ్యసభలో మంగళవారం ఆమోదించారు. అలాగే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్–1975లోని రెండో షెడ్యూల్‌ను సవరిస్తూ మరో తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించారు. మేము ఉగ్రవాదులమా?: ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీరుపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతవారం తనకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడం సరైంది కాదని అన్నారు. గతవారం రాజ్యసభ వెల్‌లో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి వారిని బటయకు తీసుకెళ్లారు. రాజ్యసభలోకి పారామిలటరీ సిబ్బంది రావడం పట్ల ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపించారు.సభలో పారామిలటరీ దళాన్ని అనుమతించకూడదని కోరుతూ హరివంశ్‌కు లేఖ రాశారు. అనంతరం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖ సభాహక్కుల పరిధిలోకి వస్తుందని, దాన్ని బయటపెట్టడం ఏమిటని హరివంశ్ ప్రశ్నించారు. పార్లమెంట్లో పారామిలటరీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. ఖర్గే స్పందిస్తూ.. తాము ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలిపామని, ఇకపై కూడా నిరసన కొనసాగిస్తామని బదులిచ్చారు. సభలో సీఐఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, మేము ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖపై ప్రెస్‌నోట్ మాత్రమే మీడియాకు విడుదల చేశానని పేర్కొన్నారు. సభ్యులందరి కోసమే ఈ పని చేశానన్నారు.పోలీసులను, సైన్యాన్ని తీసుకొచ్చి సభను నడిపిస్తారా? అని నిలదీశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతవారం మార్షల్స్ మాత్రమే లోపలికి వచ్చారని, పారామిలటరీ సిబ్బంది రాలేదని స్పష్టంచేశారు. సభలో తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ.. తాను గతంలో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఎలా పని చేయాలో నేర్చుకోవాలంటే తన వద్దకు ట్యూషన్‌కు రావాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. -
తేజస్వీ యాదవ్‌పై కేసు నమోదు
పట్నా: బిహార్‌లో ఓటరు జాబితా ముసాయిదాపై వివాదం నేపథ్యంలో ఆర్జేడీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై పట్నాలో కేసు నమోదైంది. ఓటరు గుర్తింపు కార్డులు రెండింటిని కలిగి ఉన్న తేజస్వీ యాదవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ లాయర్ రాజీవ్ రంజన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు గుర్తింపు కార్డు, అధికారికంగా అందజేసింది కాదని దానిపై విచారణ జరిపేందుకు తమకు అందజేయాలంటూ పట్నాలోని ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారి ఆదివారం తేజస్వీని కోరడం తెల్సిందే. ఈసీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్‌పై చట్టపరంగా ముందుకెళతామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. -
ఎస్ఐఆర్పై చర్చకు పట్టు స్తంభించిన లోక్‌సభ
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశం మరోసారి పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. పార్లమెంట్ ఉభయ సభల సభాకార్యకలాపాలకు బదులు ఎస్ఐఆర్ అంశంపైనే చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభలో విపక్షసభ్యుల నిరసనల కారణంగా కనీసం ఒక్క బిల్లు కూడా సభామోదానికి నోచుకోలేదని అధ్యక్షస్థానంలో ఉన్న స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలు మాని విపక్షసభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం లోక్‌సభ మొదలుకాగానే విపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక, ఎస్ఐఆర్ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటల వరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ ఇదే అంశంపై చర్చకు మొండిపట్టుబట్టారు. దీంతో సభాధ్యక్షస్థానంలో కూర్చున్న జగదాంబికాపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈరోజు రెండు కీలక క్రీడా బిల్లులను సభలో చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఇలా నినాదాలు, ఆందోళన చేయడంతో భారతీయ క్రీడాకారులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం’’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నినాదాల హోరు మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకాలకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘‘వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీన మొదలైనప్పటి నుంచీ మీరు సభ జరక్కుండా ఆటంకం కల్గిస్తున్నారు. ఇలా వరసగా గత మూడు వారాలుగా అవరోధాలు సృష్టిస్తున్నారు’’అని జగదాంబికాపాల్ వ్యాఖ్యానించి సభను మంగళవారానికి వాయిదావేశారు. ‘‘తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నారన్న ఆశతో మిమ్మల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని లోక్‌సభకు పంపించారు. మీరేమో ఇలా నినాదాలు చేస్తూ ముఖ్యమైన బిల్లులు చర్చకు రాకుండా, సభామోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. సభా గౌరవాన్ని మీరంతా కించపరుస్తున్నారు’’అని ఓం బిర్లా సైతం వ్యాఖ్యానించడం తెల్సిందే.సోరెన్ మరణంతో రాజ్యసభ వాయిదా రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణానికి సంతాప సూచికగా రాజ్యసభలో ఎలాంటి అంశాలను చర్చకు స్వీకరించలేదు. బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. రాజ్యసభ సోమవారం ఉదయం ప్రారంభంకాగానే సోరెన్ మరణ వార్త, సంతాప సందేశాన్ని సభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులందరికీ చదివి వినిపించారు. ‘‘గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా సోరెన్ పోరాడారు’’అని సోరెన్‌ను హరివంశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి గౌరవ సూచికగా సభలో ఎలాంటి చర్చను డెప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. సభను మంగళవారానికి వాయిదావేశారు. 2020 జూన్‌లో సోరెన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. -
7న ‘ఇండియా’ కూటమి విందు భేటీ
సాక్షి, న్యూఢిలీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) విషయంలో విపక్ష ‘ఇండియా’కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం స్తంభింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సమావేశం కావాలని విపక్ష కూటమి నేతలు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఈ విందు భేటీ జరుగనుంది. ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేస్తారని సమాచారం. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 70–80 సీట్లు రిగ్గింగ్‌కు గురయ్యాయని రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. నరేంద్ర మోదీ అత్యంత తక్కువ మెజారీ్టతో ఈసారి ప్రధానమంత్రి అయ్యారని, రిగ్గింగ్ జరగకపోయి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంతోపాటు ఆపరేషన్ సిందూర్, భారత్‌పై అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందం తదితర అంశాలు విందు భేటీ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు శరద్ పవార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరు కానున్నారు. ‘ఇండియా’కూటమి నేతలు చివరి సమావేశం జూలై 19న వర్చువల్‌గా జరిగింది. -
తేజస్వీ యాదవ్‌కి రెండు ఓటర్ ఐడీలా?
పట్నా: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)అనంతరం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు గల్లంతయిందంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన తీవ్ర ఆరోపణలను ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఓటరు ఐడీ నంబర్ మారిందని తేజస్వీ శనివారం వ్యాఖ్యానించగా ఈసీ వెంటనే ఖండించడం తెల్సిందే. ముసాయిదా ఓటరు జాబితాలో తేజస్వీ పేరు ఉందని స్పష్టం చేసింది. తేజస్వీ చూపుతున్న ఓటరు ఐడీ కార్డు తాము జారీ చేసిందేనని భావించడం లేదని, దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తామని పట్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, దిఘా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి త్యాగరాజ పేర్కొన్నారు. ఈ మేరకు తేజస్వీకి ఆయన ఒక నోటీస్ పంపారు. కొత్త ఓటరు కార్డును తమకు అందజేయాలని కోరారు. రెండు వేర్వేరు నంబర్లతో కూడిన రెండు కార్డులను ఆయన కలిగి ఉండటంపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 204 పరిధిలో ఓటరు సీరియల్ నంబర్ 416 తేజస్వీదేనని వివరించింది. ఆయన ఓటరు కార్డు నంబర్ ఆర్ఏబీ0456228 అని పేర్కొంది. ‘మీరు మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు ఐడీ నంబర్ ఆర్ఏబీ2916120. ఆ ఎపిక్ నంబర్ మేం అధికారికంగా జారీ చేసింది కాదని దర్యాప్తులో వెల్లడైంది. మీరు చూపిన ఆ ఎపిక్ కార్డు ఒరిజినల్ కాపీని మాకు అందజేయండి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది’ అని ఈసీ ఆ నోటీసులో తేజస్వీని కోరింది. తేజస్వీపై కేసు పెట్టాలి: బీజేపీరెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్న తేజస్వీ యాదవ్ నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. అధికారికంగా వెల్లడించిన ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తేజస్వీ మీడియా ఎదుట ప్రదర్శించిన కార్డు నంబర్ ఒక్కటి కాదని తెలిపింది. ‘ఈ వ్యవహారం ఆర్జేడీ, కాంగ్రెస్‌ల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఎన్నికల కమిషన్‌కు అబద్ధాలు చెప్పి, వాగ్దాన భంగానికి పాల్పడ్డారు’ అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. శనివారం తేజస్వీ మీడియాకు చూపిన ఓటరు ఐడీ నంబర్ 2020లో జారీ చేసిన ఓటరు ఐడీ నంబర్ ఒక్కటి కాదన్నారు. రెండు ఓటరు ఐడీలు కలిగి నేరానికి పాల్పడిన తేజస్వీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 65 లక్షల మంది అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించడం, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగడం తెల్సిందే. -
ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
ఢిల్లీ: ఓటర్ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్ లిస్ట్‌పై కొత్త చర్చ మొదలైంది.బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్ వేదికగా.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.The SIR exercise is getting curiouser and curiouserWhile 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegalCalling them "permanently migrated" is an insult to the…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. Every Indian has a right to live and work in any state where he has a permanent home. That is obvious and rightHow did the ECI come to the conclusion that several lakh persons, whose names are in the current electoral rolls of Bihar, must be excluded because they had…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025 -
ఆయన చేతిలో తోలుబొమ్మ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. బిహార్‌లో బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటర్ల జాబితాను మార్చేందుకు ప్రధాని మోదీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని దురి్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు’’సదస్సులో ప్రసంగిస్తూ ‘‘భారతరాజ్యాంగం అనేది కేవలం చట్టపరమైన పత్రం కాదు. అది మన ప్రజాస్వామ్య ఆత్మ. ప్రతి భారతీయుడికి రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రసాదించింది. అలాంటి రాజ్యాంగం ఇప్పుడు మోదీ సర్కార్ ఏలుబడిలో ప్రమాదంలో పడింది. రాజ్యాంగంలో సవరణలు చేయాలన్న దుస్సాహసానాకి నేటి పాలకులు తెగిస్తున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో బీజేపీ పెను మార్పులు చేసేది. కానీ ప్రజాశీస్సులు లేని ఎన్డీఏ కూటమికి అన్ని సీట్లు రాలేదు. ఓటర్లు 400సీట్లు అని పాటపాడి వారి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘనత అంతా కాంగ్రెస్ నేత రాహుల్గాందీకే దక్కుతుంది. రాజ్యాంగంలో మార్పులు చేస్తామన్న ఎన్డీఏ సర్కార్‌కు ఎదురునిలిచి నెలలతరబడి పోరాటంచేశారు. ప్రతి సమావేశంలో రాజ్యంగ ప్రతిని చేతబూని రాజ్యాంగ గొప్పదనాన్ని మరోసారి గుర్తుచేశారు’’అని ఖర్గే అన్నారు. ఏకంగా 65 లక్షల ఓట్లు ఎలా తీసేస్తారు? ‘‘బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) వేళ 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు దరఖాస్తును మరోసారి సమర్పించంత మాత్రాన అంత మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి ఈసీ ఎలా తొలగిస్తుంది?. పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ఈ ఓటర్ల ఓటు హక్కులను ఈసీ ఉద్దేశపూర్వకంగా లాగేసుకుంటోంది. బీజేపీ పాలనతో విసిగిపోయిన కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్న ఓటర్ల ఓట్లను తొలగించాలన్న కుట్ర జరుగుతోంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో ‘మార్పులు’జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల వేళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు జరిగాయనేదానిపై ఇప్పుడు కాంగ్రెస్ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. ఒక్క గదిలో 9 ఓట్లు, ఒకే హాస్టల్లో 9,000 ఓట్లు ఎలా ఉంటాయి? ఇలాంటి అక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘమా? లేదంటే మోదీ చేతిలో కీలుబొమ్మనా?’’అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులను వివక్షకు గురిచేయడం నిత్యకృత్యమైంది. ఎన్నికల వేళ కేవలం ఒక పక్షానికి అనుకూలంగా ప్రధాని ప్రకటనలు చేస్తూ భారత్‌లో ఏకధృవ సమాజాన్ని సృష్టించాలని ఆయన ఆశపడుతున్నారు. తరచూ చికెన్, మొఘలులు, మంగళసూత్రం అంశాలపై మోదీ మాట్లాడుతూ సమాజంలో విభజన తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడనే ఆయనను ప్రజలు ఎన్నుకుంటే ఆయనను ఏకంగా రాజ్యాంగ విలువలనే కాలరాస్తున్నారు’’అని ఖర్గే ఆరోపించారు. మోదీకి చురక ‘‘పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చి ఆయన ఆఫీస్‌లోనే కూర్చుంటారు. టీవీలో రాజ్యసభ, లోక్‌సభ చర్చలు, సభా కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారాలు చూస్తారు. పార్లమెంట్ ప్రోసీడింగ్స్ తెలియాలంటే అలా టీవీలో చూడకుండా నేరుగా సభలోకి వచ్చి కూర్చోవాలి. అప్పుడు ప్రత్యక్ష అనుభవం కల్గుతుంది’’అని మోదీకి ఖర్గే చురక అంటించారు. రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్నూ.. ‘‘రాజ్యసభలో నాటి డెప్యూటీ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌నూ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. రాజ్యసభలో వి పక్షాల గొంతు నొక్కేందుకు ధన్‌ఖడ్‌నూ ఓ పా వులా వాడుకున్నారు. విపక్ష నేతలకు ధన్‌ఖడ్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆయన సభా కార్యకలాపాలను పర్యవేక్షించినప్పుడు పెద్దసంఖ్యలో విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేశారు. చిట్టచివర్లో ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుందామని భావించినా ఆయనపై ప్రభుత్వ పెద్దలు మరింత ఒత్తిడి పెంచారు’’అని ఖర్గే వ్యాఖ్యానించారు.సామ్యవాదం, లౌకికవాదంను తొలగించాలనుకున్నారు ‘‘రాజ్యాంగ పీఠికలో దశాబ్దాల క్రితం చేర్చిన సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించాలని బీజేపీ ప్రభుత్వం నిశ్చయంగా ఉందిన ఆ పార్టీ కీలక నేతలే సెలవిస్తున్నారు. రాజ్యాంగం నుంచి ఈ పదాలను తీసేయాలని చూస్తున్న ఇదే పార్టీ తమ సొంత పార్టీ సిద్ధాంతాలు, నియమనిబంధనల్లో మాత్రం సామ్యవాదం, లౌకికవాదం పదాలను కొనసాగించడం విడ్డూరం. ఆ పదాలను బీజేపీ–ఆర్ఎస్ఎస్ శక్తులు తొలగించలేవు. ఎందుకంటే అంతటి శక్తిని వాళ్లకు ప్రజలు కట్టబెట్టలేదు’’అని ఖర్గే అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడే పవిత్రబాధ్యతలు రాజ్యాంగం న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషిన్, మీడియాకూ ఇచ్చింది. కానీ ఒక మతాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్జీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక క్రతువు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం కంటే నియంతృత్వం ఉందనడం నయం’’అని అన్నారు. -
ఓటరు జాబితాలో నా పేరు మిస్సయ్యింది: ఆర్జేడీ నేత
పట్నా: ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన బిహార్ ఓటరు ముసాయిదా జాబితాలో తన పేరు గల్లంతైందని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తనకు కేటాయించిన ఎపిక్ నంబర్ సైతం మారిందన్నారు. ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తన పేరు కోసం సోధించగా ‘నో రికార్డ్స్ ఫౌండ్’అని సూచిస్తోందని ఆరోపించారు. మా ఏరియాకు వచ్చిన బూత్ లెవల్ అధికారి తాను నింపి అందజేసిన ఎన్యుమరేషన్ ఫారానికి సంబంధించి ఎలాంటి రిసిప్టును ఇవ్వలేదన్నారు. ఎన్యు మరేషన్ ఫారంలను బూత్ లెవల్ అధికారి ఇచ్చేటప్పుడు తన ఫొటోను తానే తీసుకున్నానన్నారు. ‘ఇప్పుడు చూడండి.. నా పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. దేశ పౌరుడిగా నేను గుర్తింపు పొందలేదు. మా ఇంట్లో ఉండే హక్కు కూడా లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు. తమ వంటి వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల విషయం ఎవరు పట్టించు కుంటారంటూ ఈసీపై ఆయన ధ్వజమెత్తారు. తేజస్వీ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా ఖండించింది. ‘ఓటరు జాబితాలో ఆయన పేరుంది. గతంలో మాదిరిగా వెటరినరీ కాలేజీలోని బూత్‌లోనే ఆయన పేరుంది. ఇదే సాక్ష్యం.. అంటూ జాబితాలో ఆయన పేరున్న జాబితా ఫొటో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. -
దమ్ముంటే బాంబు పేల్చు
పట్నా: ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న ఎన్నికల సంఘంపై అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. దమ్ముంటే ఒక్కసారి అణు బాంబు పేల్చి చూపించాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. అది పేలేటప్పుడు హాని జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్లో భూకంపం సృష్టిస్తానని రాహుల్ గతంలో హెచ్చరించారని, చివరకు తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్ రాజధాని పాటా్నలో ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని రాహుల్ కించపరుస్తున్నారని ఆరోపించారు. నిజానికి రాహుల్ పార్టీ చేతులే రక్తంతో తడిశాయని విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయతి్నంచిందని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు. -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు పదో రోజు సైతం యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉభయసభల్లో నిరసనలు, నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోకపోవడంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను పారామిలటరీ దళం అదుపులోకి తీసుకుందని మండిపడ్డారు. మరోవైపు లోక్‌సభలో రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కానిస్టిట్యూయెన్స్ ఆఫ్ ద స్టేట్ గోవా బిల్లు–2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2025, మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్ ఓం బిర్లాకు విపక్షాల లేఖ బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తక్షణమే లోక్‌సభలో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష సభ్యులు లేఖ రాశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సవరణ ప్రక్రియ నిర్వహించడంపై వారు అనుమానాలు వ్యక్తంచేశారు. దేశంలో గతం ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం సంకేతాలిస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ఉద్దేశం పట్ల సందేహాలున్నాయని వెల్లడించారు. స్పీకర్‌కు రాసిన లేఖపై రాహుల్ గాం«దీ(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ), లాల్జీ వర్మ(సమాజ్‌వాదీ పార్టీ) తదితరులు సంతకాలు చేశారు. హరివంశ్‌కు మల్లికార్జున ఖర్గే లేఖ రాజ్యసభలో వెల్‌లో భద్రతా సిబ్బంది తమను అడ్డుకోవడం పట్ల విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది కనిపించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఖర్గే శుక్రవారం లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలిపే హక్కుకు కాలరాసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది రాజ్యసభ వెల్‌లోకి రాకుండా నియంత్రించాలని హరివంశ్‌ను కోరారు. పార్లమెంట్ ఉభయసభల లోపల భద్రతపై ప్రభుత్వానికి సంబంధం లేదని, అది సభాపతుల పరిధిలోని అంశమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. -
బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై చర్చకు విపక్షాల డిమాండ్
-
సవరణపై సభా సమరం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ క్రతువును తక్షణం నిలిపివేయాలన్న విపక్షాల డిమాండ్లతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గురువారం ఉదయం రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలవగానే విపక్షసభ్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల చర్యకు ప్రధాని మోదీ ఎందుకు రాజ్యసభలో సమాధానం ఇవ్వలేదని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ వెంటనే ఆపేయాలనీ విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు. దీంతో సభను సభాధ్యక్షుడు మధ్యా హ్నం 2 గంటలవరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే విపక్షాల డిమాండ్ల పర్వం కొనసాగింది. వెంటనే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్‌పై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సభాధ్యక్షుడు సస్మిత్ పాత్రా అనుమతించారు. ‘‘ 2008లో ముంబై ఉగ్రదాడులపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో వివరణ ఇవ్వనప్పుడు నాట హోం మంత్రి వివరణ ఇచ్చారు. అంతేగానీ హోం మంత్రి అమిత్ షా లాగా ‘‘ నేనొక్కడినే మీ అందరినీ అదమాయించగలను. హ్యాండిల్ చేస్తాను’’ అని అందర్నీ తూలనాడలేదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని ఖర్గే డిమాండ్‌చేశారు. ఈయన మాటలకు విపక్షసభ్యులు గొంతు కలిపారు. దీంతో చేసేదిలేక సభను సాయంత్రం నాలుగున్నర గంటలదాకా వాయిదావేశారు. 4.30 గంటలకు సభ మొదలయ్యాక ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు వాణిజ్యమంత్రి గోయల్ ఘాటుగా స్పందిస్తూ ప్రకటనచేశారు. అయినాసరే విపక్షసభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో చివరకు సభను శుక్రవారానికి వాయిదావేశారు. లోక్‌సభలోనూ అదే తీరు..లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. లోక్‌సభ ఉదయం మొదలుకాగానే జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు సభ అభినందించింది. తర్వాత వెంటనే బిహార్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు మొదలెట్టారు. ‘‘ ఇలా నినాదాలు చేయడానికి మనల్ని ఓటర్లు ఓట్లేసి గెలిపించుకున్నారా? దయచేసి మీమీ సీట్లలో కూర్చోండి’’ అని లోక్‌సభ స్పీకర్ బిర్లా మందలించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. తొలుత రెండు గంటల దాకా సభ వాయిదాపడింది. తర్వాత ఇదే పునరావృతంకావడంతో అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చన్న అవదేశ్ ప్రసాద్ సభను నాలుగు గంటలకువాయిదావేశారు. నాలుగు గంటలకు సభ మొదలవగానే మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడారు. ఆ తర్వాత నినాదాలు కొనసాగడంతో స్పీకర్ బిర్లా సభను శుక్రవారానికి వాయిదావేశారు. -
మొన్న ‘డాగ్ బాబు’ ఇప్పుడు ‘డాగేశ్’
పట్నా: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థలకే తలనొప్పిగా మారింది. రెవెన్యూ వ్యవస్థలో లోపాలను తనిఖీ చేయాలనుకున్నారో ఏమో తెలియదు! ఓ వ్యక్తి మరో శునకానికి నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. ఇటీవలే ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి రెసిడెన్స్ సర్టీఫికెట్ జారీచేయడం, దీంతో సంబంధిత విభాగంపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. అయితే తాజాగా అదే బిహార్‌లోని నవాడా జిల్లాలో ఉన్న సిర్దాల బ్లాక్‌లో ‘డాగేశ్ బాబు’పేరుతో మరో దరఖాస్తు ఆర్టీపీఎస్ కార్యాలయానికి చేరింది. అందులో దరఖాస్తుదారు కాలమ్‌లో కుక్క ఫొటోను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ విషయం ఏకంగా నవాడా జిల్లా కలెక్టర్ రవి ప్రకాశ్ దృష్టికి వెళ్లింది. రాష్ట్రంలో మరో కుక్కకు స్థానిక నివాస దృవీకరణ పత్రం కావాలని అభ్యర్థన రావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఈ దరఖాస్తు చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సరదాగా చేసే ఇలాంటి పనుల వల్ల ప్రభుత్వ వ్యవస్థ సమయం వృథా అవ్వడరమే కాదు, అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వ సేవల దురి్వనియోగాన్ని సహించబోమన్న కలెక్టర్.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీన మసౌరీ రెవెన్యూ అధికారులు ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి నివాస పత్రాన్ని జారీ చేశారు. అందులో ‘డాగ్ బాబు’తండ్రిపేరు కుత్తా బాబు, తల్లి పేరును కుతియాదేవిగా పేర్కొన్నారు. ఈ సర్టీఫికెట్ ఆన్లైన్లో తెగ వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు.. విషయం తమ దృష్టికి రాగానే సర్టీఫికెట్ రద్దు చేశామని తెలిపారు. ఈ దరఖాస్తు చేసిన వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్పైనా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. -
సుప్రీంకోర్టు సంశయించకూడదు!
బిహార్‌లో ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సునిశిత సవరణ (ఎస్.ఐ.ఆర్.–సర్) నిర్వ హించాలన్న భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదోపవాదాలను వింటోంది. ఈలోగా, ఆ తతంగానికి సంబంధించిన మొదటి దశ ఇటీవలే పూర్తయింది.రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోగా జాబితా లను మెరుగుపరచాలని ‘సర్’ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పూర్తయ్యేనాటికి జాబితాలో చేర్చాలని కోరుతూ 7.24 కోట్ల దర ఖాస్తులు వచ్చాయని కమిషన్ వెల్లడించింది. జాబితాల సవరణ మొదలుపెట్టిన జూన్ 24 నాటికి రాష్ట్రంలో నమోదై ఉన్న ఓటర్లసంఖ్య కన్నా అది 65 లక్షలు తక్కువ. పిటిషనర్ల ఆగ్రహానికి కారణాలు1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్ కింద ఓటర్ల జాబితాలను సవరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. కానీ, రెండు ముఖ్యమైన అంశాలు పిటిషనర్లకు కోపం తెప్పించాయి. ఒకటి – 2003 తర్వాత నమోదైన ఓటర్లు అందరూ తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవాలనీ, అందుకు తగిన అర్హతను చూపాలనీ కోరడం. రెండు – వారు ఆ పని చేయడానికి ఒక నెల వ్యవధి మాత్రమే ఇవ్వడం. తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు తక్కువ వ్యవధినివ్వడం, వేగంగా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చూడటం వల్ల ఈ విధానం అపారదర్శకంగా తయారైంది. మూకుమ్మడిగా పేర్లు తొల గింపునకు గురవుతాయనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయినా, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోర్టు తిరస్కరించింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను కూడా ‘పరిగణన’లోకి తీసుకోవలసిందని మాత్రమే కోర్టు కోరింది. ఆ విధంగా చాలా మందిని అనర్హులుగా చేయనున్నారనే విమర్శలకు తావు ఇవ్వకుండా ప్రయత్నించింది. ఓటర్ల జాబితా ఎందుకు కీలకం?భారతదేశంలో ప్రజాస్వామ్య హృదయాన్ని పదిలపరచేది ఓటు హక్కేనని, దాన్ని వినియోగించుకోవడంలోని ప్రాధాన్యాన్ని వివరిస్తూ గతంలో కొన్ని తీర్పులు వెలువడ్డాయి. అయితే, ఓటు హక్కు చట్ట పరమైన హక్కుగానే మిగిలిపోయింది. దాని అస్తిత్వం ఒక ప్రత్యేక శాసనంతో ముడిపడి ఉంది. దానివల్ల వచ్చిన చిక్కేమిటంటే, ఆ హక్కు విషయంలో జోక్యం చేసుకోవచ్చు లేదా అది కొన్ని షరతులకు లోబడి ఉండేటట్లు చేయవచ్చు. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62వ సెక్షన్ పేర్కోంటోంది. ఫలితంగా, అర్హులైన ఓటర్లను గుర్తించడంలో ఓటర్ల జాబితాలను రూపొందించడం లేదా సవరించడం ముఖ్యమైన ప్రక్రియగా మారింది. గడువు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాలను సవరించడానికి అనుమతించబోమని ఒకసారి బిహార్ విషయంలోనే బైద్యనాథ్ పంజియార్ వర్సెస్ సీతారామ్ మహతో (1969) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.నమోదుకు కడపటి తేదీ ముగిసిన తర్వాత, ఓటర్ల జాబితా లకు సవరణ తేవడం, చేర్చడం లేదా తొలగించడం, ఒకచోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం చేయకుండా 1960 నాటి నిబంధనలు నివారిస్తున్నాయి. జాబితాల సవరణపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం బట్టి, ప్రస్తుత కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఫలితం వస్తుందని ఆశించడానికి అటువంటి పూర్వ ప్రమాణాలు, నిబంధనలు స్ఫూర్తినిచ్చేవిగా లేవు. పైగా, సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రెండు కారణాల రీత్యా తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకటి– అటువంటి కేసులను సమీక్షించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న పరిధులు పరిమితం. రెండు– ఎన్నికలను జాప్యం చేసేందుకే అలాంటి కేసులు పెట్టే ఎత్తుగడ అనుసరిస్తూ ఉంటారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఫిర్యాదులు చేయడం సాధ్యమేనా?ఫిర్యాదులు చేసేందుకు లేదా సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వీలుగా ఒక ఆంతరంగిక సమీక్షా యంత్రాంగాన్ని 1950 నాటి చట్టం సమకూరుస్తోంది. ఎన్నికల అధికారులపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తదుపరి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కమిషన్‌ను కోరవచ్చు. కోర్టులను ఆశ్రయించడానికి ముందు ఆ మార్గాలను అనుసరించవలసిందిగా కోర్టు గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి ఎన్నికల జాబితాలను రూపొందించడం, మార్పు చేర్పులు చేయడంలో అవకతవకలు జరిగాయని, జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం (1996)పై అనురాగ్ నారాయణ్ సింగ్ పెట్టిన కేసులో తలదూర్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బిహార్ సవరణ ప్రక్రియలోని న్యాయ బద్ధతను విశ్లేషించేటపుడు కోర్టు ఈసారి కూడా అదే రీతిలో, ఫిర్యాదు దారులందరినీ ఆ యా చట్టపరమైన ప్రక్రియల వైపు మళ్ళవలసిందిగా సూచించి చేతులు దులుపుకోవచ్చు. ఈ ఆంతరంగిక పరిష్కార యంత్రాంగాలలో వేళ్ళూనుకు పోయిన సమస్యలు చాలా ఉన్నాయని గతంలో వచ్చిన కేసులు చెబు తున్నాయి. ఫిర్యాదులతో వెళ్ళడం అధికారులకు రుచించకపోవడం వల్ల, వారు తమ అభ్యంతరాలను చెవికెక్కించుకున్నది లేదనికొందరు వాపోయిన సందర్భాలున్నాయి. పైగా, మురికివాడనివాసుల వంటి బలహీన వర్గాల పౌరులలో కొన్ని వర్గాలకు ఈ ప్రక్రియ అందని మావిపండుగానే ఉంది. ఓటరుగా అనర్హుడవని వచ్చిన నోటీసులను చదువు సంధ్యలు లేనివారు అర్థం చేసుకోగలరా? ఎన్నికల అధికారి ముందుకు వెళ్ళడం కోసమని దినసరి వేతన కార్మికుడు ఒక రోజు పనిని వదులు కోగలడా? న్యాయ పరిరక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత బిహార్ ‘సర్’ కేసులో సుప్రీంకోర్టు గణనీయంగా కల్పించుకుని సరైన తీర్పరిగా వ్యవహరించవలసి ఉంది. ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో...లక్ష్మీ చంద్రసేన్ వర్సెస్ ఏ.కె.ఎం. హసన్ (1985) కేసులో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశించడానికి సుప్రీంకోర్టు వెనుకాడింది. అది ఎన్నికలపై న్యాయవ్యవస్థ అవాంఛనీయ జోక్యానికి కార ణమవుతుందనీ, ఒక్కోసారి ఎన్నికల నిరవధిక వాయిదాకు దారి తీస్తుందనీ కోర్టు కలవరపడింది. ఎన్నికలు ఎంత ఎక్కువగా అనివా ర్యమైతే, దానిలో జోక్యం చేసుకునేందుకు కోర్టు అంత ఎక్కువగా విముఖత చూపుతుందన్న అప్రకటిత సూత్రం ఒకటి ఉంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటే మాత్రం, అది మొత్తం ఎన్నికలను విషపూరితం చేసే అవకాశం ఉంటుంది కనుక కోర్టు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటుంది. దాన్ని పరిష్క రించేందుకు తదనంతరం, కోర్టు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందనే సాకుతో బిహార్ విషయంలో తలదూర్చేందుకు కోర్టు మొదట తిరస్కరించవచ్చు. ఓటర్ల జాబితాల సవరణ అక్రమమని ఒకవేళ కోర్టు భావించినా కూడా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం కానీ, అనర్హులుగా చేసే విధానాన్ని నివారించడం కానీ చేయకపోవచ్చు. భారతీయ ప్రజాస్వామ్యానికి కించిత్తు హాని జరుగుతుందని తలచినా అప్రమ త్తంగా ఉండే కాపలాదారు పాత్రనే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో నిర్వహిస్తూ వచ్చింది. ఓటు వేసేందుకు ప్రజలకు ఉన్న హక్కు ప్రజా స్వామ్యానికి ప్రాథమిక పునాది కనుక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సుప్రీం కోర్టు చేపట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం.-వ్యాసకర్త ‘విధి సెంటర్ ఫర్ లీగల్ స్టడీస్’ రిసెర్చ్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అంశుల్ డాల్మియా -
భారీగా ఓట్లను తొలగిస్తే మేం జోక్యం చేసుకుంటాం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితాలో సమూల ప్రక్షాళన ధ్యేయంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము కచి్చతంగా జోక్యంచేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓటర్ల గుర్తింపును తనిఖీచేసే ప్రక్రియలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులను చేర్చాలన్న పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం వాదోపవాదనలను ఆలకించింది. చట్టప్రకారం ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అసాధారణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ‘‘తమకు ఇప్పటికే ఓటు ఉందని తెలియజేస్తూ ఎనుమరేషన్ దరఖాస్తును 65 లక్షల మంది సమరి్పంచలేదు. అంతమాత్రం చేత వీళ్లందరి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా? వీళ్లంతా ఎవరో ఈసీకి తెలియదా?’’ అని పిటిషనర్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకుని రండి. ముసాయిదాలో పేర్లు లేకపోవడం కారణంగా ఓట్లను కోల్పోతున్న ఒక 15 మందిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి. దరఖాస్తు ఇవ్వనంత మాత్రాన చనిపోయారని ఆ జాబితా నుంచి ఎవరి పేర్లయితే తీసేశారో వాళ్ల వివరాలు మాకు ఇవ్వండి. అలాగే దరఖాస్తు ఇవ్వని కారణంగా జాబితాలో పేరు గల్లంతైన వారి వివరాలూ సమర్పించండి’’ అని సిబల్‌కు ధర్మాసనం సూచించింది. -
డాగ్ బాబు సన్నాఫ్ కుత్తా బాబు!
పట్నా: బిహార్‌లో రెవెన్యూ అధికారులు ఓ శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు. డాగ్ బాబు పేరిట ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయింది. ఇందులో అభ్యర్థి పేరు డాగ్‌బాబు అని, అతని తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి అని రాసి ఉంది. వీళ్ల ఇంటి చిరునామా కాలమ్‌లో ‘మొహల్లా కౌలిచక్, వార్డు నంబర్–15, నగర పరిషత్, మసౌరీ పట్టణం’’అని రాసి ఉంది. గోల్డెన్ రిట్రీవర్ జాతి వీధి శునకం ఫొటోతో ఈ ధృవపత్రం జారీచేశారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్‌పై అక్కడి రెవెన్యూ అధికారి మురారీ చౌహాన్ డిజటల్ సంతకం ఉంది. ఇది 2025 జూలై 24న ఈ సర్టిఫికేట్‌ను జారీచేశారు. సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ఈ అంశం ఇప్పుడు బిహార్‌లో చర్చనీయాంశమైంది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ పత్రాలకు ఈ సర్టిఫికేట్ జారీ కోసం దురి్వనియోగం చేసినట్లు తెలుస్తోంది. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) నేపథ్యంలో శునకానికీ రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో ఇలాంటి వింతలు ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ‘మీరే చూడండి. జూలై 24వ తేదీన ఒక శునకానికి బిహార్‌లో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్న ఓటర్లకు గతంలో జారీ అయిన ఆధార్, రేషన్ కార్డులు నకిలీవని అధికారులు ఓవైపు చె బుతూనే మరోవైపు ఇలా శునకాలకు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు’’అని విమర్శకులు సంబంధిత శునకం సర్టిఫికెట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. సర్టిఫికెట్ జారీపై అంతటి విమర్శలు రావడంతో పట్నా జిల్లా మేజి్రస్టేట్ వెంటనే స్పందించారు. ‘మసౌరీ జోన్లో డాగ్ బాబు పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. దోషులైన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’అని జిల్లా మేజి్రస్టేట్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. -
ఎస్ఐఆర్పై స్టే ఇవ్వలేం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియపై ఇప్పటికిప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఓటరు జాబితా సవరణకు ఆధార్‌తోపాటు ఓటరు గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ధ్రువీకరణలను వాస్తవమై నవిగా భావిస్తున్నామంది. ‘రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే వీటిని తేలిగ్గా ఫోర్జరీ చేయొచ్చు. కానీ, ఆధార్, ఓటర్ కార్డులను వాస్తవమైనవిగా భావించొచ్చు. ఈ రెండు ధ్రువీకరణలను అనుమతించండి’అని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తుది విచారణను ఈ నెల 29వ తేదీన చేపడతామని తెలిపింది. పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ అనే ఎన్జీవో తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడే మధ్యంతర జాబితాను ఖరారు చేయవద్దని, ఆగస్ట్ ఒకటో తేదీన ఈసీ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, దీనివల్ల మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొన్న ధర్మాసనం ఆయన వాదనను తోసిపుచ్చింది. ‘న్యాయస్థానం అధికారాన్ని తక్కువగా చూడకండి. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకమని తేలిన పక్షంలో మీ వాదనను అంగీకరిస్తాం. అప్పుడే ఎస్ఐఆర్ ప్రక్రియ ఆసాంతంగా రద్దు చేసేస్తాం’అని ధర్మాసనం కరాఖండిగా చెప్పింది. బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్కు ఆధార్‌తోపాటు ఓటరు ఐడీని అంగీకరించాలంటూ ఈసీని ఈ నెల 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ మేరకు ప్రాథమికంగా అంగీకరిస్తూ ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సోమవారం ధర్మాసనం పరిశీలించి, పై వ్యాఖ్యలు చేసింది. ఆధార్, ఓటరు కార్డును అంగీకరిస్తూ ఈసీ అఫిడవిట్ వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఈ సందర్భంగా లాయర్ శంకరనారాయణన్ తెలపగా.. ఎస్ఐఆర్ కోసం అంగీకరిస్తున్న 11 ధ్రువీకరణలతోపాటు ఆధార్, ఓటరు ఐడీ కూడా ఉంటాయని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది..ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, అదేవిధంగా, ఓటరు ఐడీని ఓటరు సవరణ ప్రక్రియలో నమ్మకమైందిగా భావించలేమన్నారు. ఓటరు ఐడీని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ప్రక్రియతో ఎటువంటి లాభం ఉండదని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘ఈ ప్రపంచంలో ఏ ధ్రువీకరణ పత్రాన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. ఫోర్జరీ కేసుల విషయాన్ని ఈసీ చూసుకోవాలి. అన్ని పేర్లను తొలగించడానికి బదులుగా అందరినీ జాబితాలో చేర్చేలా చూడాలి. -
భూమ్మీద దేన్నైనా ఫోర్జరీ చేస్తారు కదా?: ఈసీకి ‘సుప్రీం’ ప్రశ్న
బీహార్ ఓటరు జాబితా సవరణలో.. ఆధార్ కార్డుకు పౌరసత్వ గుర్తింపుకార్డుల జాబితా నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా పరిగణించింది. ఆధార్‌తో పాటు ఓటర్ ఐడీ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(EPIC)ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల కింద పరిగణించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్లో భాగంగా ఆధార్‌ను గుర్తింపుకార్డుగా ఈసీ పరిగణించడం లేదు. తద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేసింది. ‘‘భూమ్మీద దేనినైనా ఫోర్జరీ చేస్తారు కదా?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలపై సూటిగా ప్రశ్నను సంధించింది. ఈ క్రమంలో..ఆధార్‌ను తిరస్కరిస్తూ.. బీహార్ ఓటర్ల రివిజన్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తూ వస్తోంది ఎన్నికల సంఘం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ్టి వాదనల సందర్భంగా ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ సిటిజన్‌షిప్‌గా పరిగణించడం కుదరదని, రేషన్ కార్డులు నకిలీవి సృష్టించే అవకాశం లేకపోలేదని.. కాబట్టి వాటి మీద ఆధారపడలేమని ఈసీ వాదనలు వినిపించింది. అలాగే ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్‌ను కేవలం ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది.దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించింది. ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉంటున్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఈ క్రమంలో.. ఆధార్, ఎపిక్‌ని బీహార్ ఓటర్ రోల్ రివిజిన్కు చేర్చాలంటూ ఆదేశించింది.ఎన్నికల సంఘం (EC) జాబితాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్యవస్థ ఎక్కడ? అని ఈసీకి ప్రశ్న ఎదురైంది. అదే సమయంలో.. ఆగస్టు 1వ తేదీన ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్‌పై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ కోరారు. అయితే.. రేపటి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది. -
పామును కరిచి బతికిన పిల్లాడు.. అసలు జరిగింది ఇదే!
పట్నా: బిహార్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన విషయం తెలిసిందే. బొమ్మ అనుకుని పామును పట్టుకున్న పిల్లవాడు. దానిని నోటితో కొరికి చంపాడు. స్వల్ప విష ప్రభావంతో ఆస్పత్రిపాలైన బుడ్డోడు.. చివరకు ప్రాణాలతో బయపడ్డాడు. అయితే పామును కొరికినప్పటికీ పిల్లాడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై సర్వత్రా ఆశ్యర్చానికి గురవుతున్నారు.తాజాగా చిన్న పిల్లాడు బతికి బయటపడటంపై గల కారణాలను వైద్యులు వెల్లడించారు. సాధారణంగా పాము వ్యక్తులను కరిచినప్పుడు దానికున్న విషం రక్తంలోకి ప్రసరిస్తుందని, ఇది , నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దీనివల్ల అనారోగ్యానికి గురికావడం లేదా కొన్నిసార్లు మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అయితే గోవింద్ విషయంలో విషం నోటి ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిందన్నారు. మానవ జీర్ణవ్యవస్థ కొన్ని సందర్భాల్లో విషాన్ని విచ్ఛిన్నం చేసి తట్టుకోగలదని, ప్రాణాపాయాన్ని నివారిస్తుందన్నారు. ఒకవేళ శరీరంలో అంతర్గత రక్తస్రావం అయితే.. బాలుడుపరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ అదృష్టవశాత్తు అలాంటి సమస్యలు ఏం రాలేదని అన్నారు. అసలేం జరిగిందంటే.. బీహార్‌లో, ఏప్రిల్ 2023 మరియు మార్చి 2024 మధ్య 934 మంది పాముకాటు కారణంగా మరణించారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. అదే సమయంలో, 17,800 మందికి పైగా రాష్ట్ర ఆసుపత్రులలో పాముకాటుకు చికిత్స పొందారు వెస్ట్చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే పిల్లాడు నీరసించిపోయి తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెలుసుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. -
చెత్తతో విమానం చేసి.. గాలిలో చక్కర్లు కొట్టి..
పట్నా: నేటి తరం యువత ఆధునిక సాంకేతికతను ఆకళింపు చేసుకుని, నూతన ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మన చుట్టుపక్కల దొరికే వస్తువులతోనే నూతన వస్తువులు రూపొందుతున్నాయి. ఇవి చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. బీహార్‌కు చెందిన ఒక యువకుడు చేసిన అద్భుతం ఇప్పుడు అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది.బీహార్ కుర్రాడు అవనీష్ కుమార్ తనకు ఎటువంటి డిగ్రీ లేకున్నా, అపారమైన సాంకేతిక నైపుణ్యాలను ఆకళింపు చేసుకున్నాడు. పెద్దపెద్ద శాస్త్రవేత్తలే ఆశ్యర్యపోయేలాంటి ఆవిష్కరణను మన ముందుకు తెచ్చాడు. కేవలం చెత్తతో(వ్యర్థాలతో) ఏకంగా విమానాన్ని తయారు చేశాడు. ఇందుకోసం అతనేమీ ఎటువంటి ల్యాబ్ పైనకూడా ఆధారపడలేదు. తగినంత డబ్బులు కూడా లేని అవనీష్ విమానాన్ని తయారుచేసి, దాన్ని విజయవంతంగా ప్రయోగించాడు. ఈ విమానం తయారీకి అవనీష్ కేవలం ఏడు వేల రూపాయలు ఖర్చుచేశాడు. 🚨 Bihar teen Avanish Kumar, has created a flying plane using only scrap in just a week with a cost of around Rs 7,000. pic.twitter.com/Xf2CuAD0dH— Indian Tech & Infra (@IndianTechGuide) July 28, 2025దీనికి సంబంధించిన వీడియో అందరినీ అలరిస్తోంది. ఏదో చేయాలన్న తపన ఉండి పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యమన్నది ఏదీ ఉండదని అవనీష్ నిరూపించాడు. అవనీస్ రూపొందించిన విమానాన్ని, దానిలో ప్రయాణిస్తున్న అతనిని చూసేందుకు వందలాదిమంది తరలిరావడాన్ని మనం ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. వారంతా అవనీష్‌ను ఉత్సాహపరచడాన్ని గమనించవచ్చు. -
నితీశ్ సర్కారుపై కేంద్రమంత్రి చిరాన్ పాసవాన్ ఘాటు విమర్శలు
-
ఎన్నికల వేళ బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. నితీశ్‌కు చిరాగ్ పాశ్వాన్ ఝలక్!
పట్నా/గయా: బీహార్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎల్జేపీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యథేచ్ఛగా కొనసాగుతున్న నేరాలను ఆపలేని నితీశ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరాలను అడ్డుకోవడంలో విఫలమైన సర్కారు వాటిని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.శనివారం గయాలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగం సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనను ప్రస్తావిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, ఇటువంటి ఘోరాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందన్నారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. పోలీసు యంత్రాంగం నేరగాళ్లకు దాసోహమంటోందని విమర్శించారు. అదేవిధంగా, తనను బాంబులతో చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ మరోమారు చిరాగ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తా..ఎన్నికలయ్యాక ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ‘బీహార్ ఫస్ట్–బీహారీ ఫస్ట్’ లక్ష్యంతో పనిచేస్తుందని, నేరగాళ్లను కటకటాల్లోకి నెడుతుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా బిహార్ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసినందుకు ఢిల్లీలో ఉంటే తన లక్ష్యం నెరవేరదని తెలుసుకున్నానని చెప్పారు. అందుకే, కేంద్ర రాజకీయాలను వదిలి రాష్ట్రానికి రావాలనుకుంటున్నానని, ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీయే తీసుకుంటుందని చిరాగ్ తెలిపారు.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నూటికి నూరు శాతం ఫలితాలను సాధించిందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేస్తానంటూ ప్రకటించిన చిరాగ్.. తనకు సీఎం కుర్చీపై ఎటువంటి మోజు లేదని ఇప్పటికే చెప్పారు. ప్రతిపక్ష ఆర్జేడీపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేరగాళ్లను పోషిస్తూ విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముస్లింల ఓట్లు తమవేనంటూ ఆర్జేడీ గొప్పగా చెప్పుకుంటోందని, తమ పారీ్టకి కూడా సొంత ఓటు బ్యాంకు ఉందని చిరాగ్ అన్నారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేలో విభేదాలు ముదురుతున్నాయనేందుకు చిరాగ్ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు. -
పామును కొరికి చంపిన పిల్లాడు
పట్నా: బతికే రాత ఉంటే ఆకాశం నుంచి పడినా ఏమీ కాదని కొందరంటారు. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన అరుదైన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. బొమ్మ అనుకుని పామును పట్టుకోవడం, అది చేతికి చుట్టుకోవడం, తర్వాత దానిని నోటితో కొరికి చంపడం, స్వల్ప విష ప్రభావంతో పిల్లాడు ఆస్పత్రిపాలై చివరకు ప్రాణాలతో బయటపడటం అంతా నమ్మశక్యంకాని రీతిలో జరిగాయి. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వెస్ట్చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే అప్పుడు హుషారుగా కనిపించిన పిల్లాడు సమయం గడిచేకొద్దీ నీరసించిపోయాడు. తర్వాత స్పృహకోల్పోయాడు. విషయం తెల్సుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడని, పాము అతడిని కాటువేయలేదని, నోట్లో పెట్టుకుని కొరకడం వల్ల విషం కొంత పాకి నోట్లోకి వెళ్లి ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ దువాకాంత్ మిశ్రా చెప్పారు. -
ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోబెట్టాహ్ జిల్లాలోని వెస్ట్ చాంపరన్‌లో చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు. ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే యోచనలో చిరాగ్
-
ఆంబులెన్స్‌లో గ్యాంగ్‌రేప్
ఆమె హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు హాజరైంది. ఆ సమయంలో ఎక్కువ సేపు లైన్లో ఉండడంతో.. కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడి నిర్వాహకులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్‌లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.బీహార్ గయ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు వెళ్లిన యువతి(26)పై అఘాయిత్యం జరిగింది. ఫిజికల్ టెస్టులో పాల్గొంటున్న ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్‌లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. జులై 24వ తేదీన బోధగయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పృహలోని తనపై ఆంబులెన్స్‌లో నలుగురు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని(ఆంబులెన్స్ డ్రైవర్‌తో సహా) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగానూ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో సిట్‌ను, ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. -
ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్‌సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. -
అరకోటి మంది ఓటర్లెక్కడ?
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా నవీకరణ సుప్రీంకోర్టులో విచారణ దశలోనే వున్నా, పార్లమెంటులో అలజడి రేగుతున్నాఆ ప్రక్రియ తన దోవన తాను ముందుకెళ్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ గురువారం ఆ వ్యవహారం గురించి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్షమందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 21.6 లక్షల మంది మరణించారు. మరో 31.5 లక్షల మంది శాశ్వతంగా వేరే చోటుకు వలసపోయారు. పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అడుగుతున్నా, మరో ఏడు లక్షల మంది ఇంతవరకూ తమ పత్రాలు దాఖలు చేయలేదు. తాము ఫలానా చోట ఉంటు న్నామని రుజువులు చూపక పోయినా, బతికే ఉన్నామని చెప్పకపోయినా లేదా తగిన పత్రాలుఅందజేయక పోయినా ఈ 61 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి శాశ్వతంగా కనుమరుగవుతారు. రాష్ట్ర ఓటర్లలో వీరు 7.7 శాతం. శుక్రవారం సాయంత్రంతో వీరందరికీ గడువు ముగిసిపోయింది. సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది. అయితే సెప్టెంబర్ 1లోగా ఎవరైనా జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి, తగిన పత్రాలున్న పక్షంలో వారిని చేర్చి తుది జాబితా విడుదల చేస్తారు. నకిలీ లేదా విదేశీయులుగా గుర్తించిన వారిని తొలగించటం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ‘పరిశుద్ధమైన’ ఓటర్ల జాబితా రూప కల్పనే తమ లక్ష్యమని జ్ఞానేశ్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే మెజారిటీ ఆమోదం పొందిన ప్రభుత్వాలు ఏర్పడాలి.ప్రజల ఆదరణ ఉన్నవారే పాలకులు కావాలి. నకిలీ ఓటర్లు లేదా ఈ దేశ పౌరులు కానివారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థితి ఉంటే ఆ ఎన్నికలే ప్రహసన ప్రాయమవుతాయి. ఎన్నికలు సజావుగా పూర్తవుతున్నాయన్న భావన వల్లే ఫలితాలు వెలువడ్డాక అధికార మార్పిడి శాంతియుతంగా పూర్తవుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే ఎన్నికల హింస గణనీయంగా తగ్గింది. ఇలాంటి కారణాల వల్లే విదేశాల ఎన్నికలకు మన ఈసీ అధికారులు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారు సూచిస్తున్న మార్పులకు ఎంతో విలువ ఉంటున్నది. కానీ గత ఏడాది, రెండేళ్లుగా ఈసీ వ్యవహార శైలిపై విమర్శలూ, ఆరోపణలూ వెల్లువెత్తు తున్నాయి. వాటిపై అసలే స్పందించకపోవటం లేదా మరిన్ని సందేహాలు కలిగే రీతిలో జవాబీ యటం రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. బిహార్ ఎన్నికల జాబితా సంగతే తీసుకుంటే సుప్రీంకోర్టు సూచించిన ఆధార్, రేషన్ కార్డు వగైరాలు పరిశీలనకు పనికి రావని అది ఎందుకు తిరస్కరించిందో అంతుపట్టదు. ఆధార్‌ను ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమని, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినాఉంటుందన్నారు. కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం. మరి విశ్వసనీయత లేని ఆధార్‌ను అన్నిటికీ అనుసంధానం చేయటం ఎందుకు? ఇప్పటికీ ఆ కార్డు సంపాదించటానికి సాధారణ పౌరులు తలకిందులవుతున్నారు. పుట్టిన చోటే నవజాత శిశువులకు ఆధార్ అందేలా తాజాగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటువంటి కార్డు ఓటరు గుర్తింపునకు పనికిరాదని ఈసీ ఎలా చెబుతుందో అర్థంకాని విషయం. పౌరుల్ని గుర్తించటమనే ప్రక్రియ అన్యులకు ఆసాధ్యమని, కేవలం తామే సమర్థులమని ఆ సంస్థ చెప్పదల్చుకుంటే దాన్నెవరూ అంగీకరించరు.ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటంపై ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, హరియాణాల వరకూ ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. ఏపీ సంగతే తీసుకుంటే... అక్కడ ఓటింగ్‌కు గడువు ముగిసి కేవలం ప్రాంగణంలో ఉన్న వారితో పోలింగ్ పూర్తి చేయటానికి అర్ధరాత్రి వరకూ సమయం పట్టింది. అలా వేచివున్నవారి సంఖ్య ఏకంగా 51 లక్షలు! ఇది నమ్మేలా ఉందా? ఇక పోలింగ్ శాతంపై మొదటి, చివరి ఈసీ ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడావచ్చింది. ఇది గతంలో ఎప్పుడూ ఒక శాతం మించిలేదు. ఇందువల్ల సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో అదనంగా 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానంలో 1.96 లక్షల ఓట్లు అమాంతం పెరిగి పోయాయి. తటస్థ సంస్థల లెక్కల ప్రకారం ఇది 87 అసెంబ్లీ స్థానాల గెలుపోటముల్ని తారుమారు చేసింది! వేరే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణే కనబడిందని అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సందేహాలకు సక్రమమైన జవాబు చెబితే బిహార్‌లో చేపట్టిన ‘సర్’పై పెద్దగా అభ్యంతరాలు వచ్చేవి కాదేమో! కానీ ఆ సంస్థ తనకు తోచినప్పుడు మాట్లాడటం తప్ప జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత వర్తననూ కనబరచటం లేదు. సందేహాలు పటాపంచలు చేద్దామన్న పట్టుదలను ప్రదర్శించటం లేదు. ఈసీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాననుకోవచ్చు. కానీ అలా అందరూ అనుకునేలా తన వ్యవహార శైలి వుండాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకైనా ఇది తప్పనిసరి.అందునా ప్రభుత్వాల తలరాతలను మార్చే కీలకమైన వ్యవస్థగా ఉన్న ఈసీకి ఇది మరింత ప్రాణప్రదం. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి వలసలు ఎక్కువుంటాయి. అలాంటిచోటఇంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడినుంచో పనులు మానుకుని వచ్చి ఓటర్లుగా నమోదు చేసు కోవటానికి అవసరమైన పత్రాలు సేకరించి సమర్పించటం బడుగు జీవులకు సాధ్యమేనా? అందుకే సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈసీ పరిశీలించాలి. ఈ మాదిరి సవరణకు దేశవ్యాప్త ఆదరణ లభించాలంటే ఇది తప్పనిసరి. -
పార్లమెంట్లో రచ్చ రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు గురువారం ఎలాంటి కార్యకలాపాలు చోటుచేసుకోలేదు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించాలని తేలి్చచెప్పాయి. నిరసనలు, నినాదాలు యథావిధిగా కొనసాగించాయి. ఉభయ సభలకు అంతరాయం కలిగించాయి. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు సహకరించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా కోరినా వారు వినిపించుకోలేదు. సభకు అంతరాయం సరైన పద్ధతి కాదని స్పీకర్ హితవు పలికారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. గోవా అసెంబ్లీలో ఎస్టీలకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చలో పాల్గొనాలని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్æ విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. ఎస్టీలకు సంబంధించిన బిల్లుపై చర్చకు అడ్డుపడడం పట్ల విపక్షాలపై న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో సభాపతి లోక్‌సభను శుక్రవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ గందరగోళం బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు అలజడి సృష్టించడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లుపై చర్చ మొదలైంది. దీనిపై ఏఐఏడీఎంకే నేత తంబిదురై మాట్లాడారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. తంబిదురై తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. విపక్ష ఎంపీలు తమ నినాదాలు ఆపలేదు. సభలో వారి ప్రవర్తన పట్ల బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితాను కోరారు. ప్రతిపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ విన్నవించారు. అందుకు సభాపతి అంగీకరింకపోవడంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దాంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రాంగణంలో నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఓటు బందీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియా గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విపక్షాలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో లోక్తంత్ర బదులు లోక్‌తంతర్ అని రాసి ఉండడంతో బీజేపీ‡ నేత మాలవీయా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ఏది ఎలా రాయాలో తెలియనివారు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. -
నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తాం.. విమర్శలపై ఈసీ క్లారిటీ
ఢిల్లీ : బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న వేళ ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటర్ల జాబితా విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బీహార్‌లో నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈసీ సమర్థించుకుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను ఆరోపణలను తోసిపుచ్చారు.ఈ సందర్భంగా జ్ఞానేశ్‌కుమార్..‘భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది. బీహార్‌లో నకిలీ ఓట్లను తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు చేయడంతో అర్థం లేదు. నకిలీ ఓటర్లకు ఎన్నికల సంఘం ఎందుకు అవకాశం ఇస్తుంది?. ఎస్ఐఆర్ నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే జరిగింది. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చడమన్నది పూర్తిగా నిరాధారమైంది. చనిపోయిన ఓటర్లు పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారు.. నకిలీ ఓటర్లు లేదా విదేశీ ఓటర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ మొదట బీహార్‌లో రానున్న రోజుల్లో మొత్తం దేశంలో జరుగుతుంది అని వెల్లడించారు. #BreakingNews | CEC backs #Bihar voters rolls revisionGyanesh Kumar, CEC: Should EC allow dead voters to be on voter list? Should people with duplicate epic be allowed?. Should EC not weed them out to make a strong base for electoral democracy?@Arunima24 @toyasingh pic.twitter.com/wyNNn2CtgS— News18 (@CNNnews18) July 24, 2025లక్ష మంది ఓటర్లు ‘దొరకట్లేదు’..ఇదిలా ఉండగా.. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగిస్తోంది. బీహార్‌లో 7.17 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. అనర్హులైన ఓటర్లు బయటపడుతున్నట్లు తెలిసింది. సుమారు లక్ష మంది ఓటర్ల జాడ తెలియట్లేదని ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నప్పటికీ భౌతికంగా ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతున్నామని స్పష్టంచేసింది. 20 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు ఈ ప్రత్యేక సవరణలో తేలిందని పేర్కొంది. అలాగే మరో 28 లక్షల మంది చిరునామాలు శాశ్వతంగా మారాయని తెలిపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ తొలి దశ ఆగస్టు ఒకటో తేదీ నాటికి పూర్తికానుంది. తర్వాత ముసాయిదా ఎన్నికల జాబితాను ప్రచురిస్తారు. ఇందులో లోపాలు ఉన్నట్లు ఎవరైనా గుర్తిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే సెపె్టంబర్ ఒకటో తేదీ దాకా ఫిర్యాదులు సమర్పించవచ్చు. -
పట్టువీడని ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు. ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే తీరు రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. నల్ల దుస్తులతో నిరసన తమ డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), జేఎంఎం, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్‌పై 28న ప్రత్యేక చర్చ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో తొలుత లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు. -
బిహార్ ఎన్నికల దిక్సూచి ఎటువైపు?
దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పట్నా రాజధానిగా గల బిహార్... సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో దేశ వ్యాప్తంగా బిహార్‌పై ఆసక్తి నెలకొంది. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రంబిహార్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. రూ. 28,485 తలసరి ఆదాయంతో దేశంలోనే పేద రాష్ట్రంగా నిలిచిన బిహార్ అస్థిరమైన ప్రభుత్వాలతో మరింత వెనుకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కొద్ది కాలం తర్వాత మహాఘట్ బంధన్‌తో చేతులు కలిపింది. అనంతరం తిరిగి ఎన్డీఏతో జత కట్టింది. తొమ్మిది సార్లు బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. నితీశ్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్నా, కూటమిలోని బీజేపీ ఎత్తుగడలను అంచనా వేయలేము. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న మహాఘట్ బంధన్ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ, జేడీ (యూ) సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండటంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 43 స్థానాల్లో గెలవగా, 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూపుతూ, సమ స్థానాల్లో పోటీ చేయాలని జేడీ(యూ) వాదిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో, జేడీ (యూ) 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. సీఎం నితీశ్ బిహార్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధం, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ధి చేకూర్చనున్నాయి. నితీశ్ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారు. పార్టీల బలాబలాలుబలం సంగతి అలా ఉంటే, నిజానికి పాలక ఎన్డీఏ కూటమికి బిహార్‌లో ఆశించినంత సానుకూలత లేదు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారముంది. మరో పార్టీ హిందుస్థాని అవామ్ మోర్చ (హెచ్ఏఎమ్) ఎక్కువ స్థానాలు కోరుతుండటంతో గందరగోళం నెలకొంది. అలాగే 20 ఏళ్లుగా జేడీ (యూ) అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత గుదిబండగా మారనుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ ఆశించిన మేర జరగకపోవడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని మహాఘట్ బంధన్ సానుకూలంగా మలచుకుంటే ఎన్డీఏకు తిప్పలు తప్పవు. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. నిరుద్యోగం, ఉపాధి కోసం బిహారీ యువత వలసలు, ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను యువనేత తేజస్వీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలం. మైనారిటీ, ఓబీసీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఈ కూటమి భవితవ్యం ముస్లిం, యాదవ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)ల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య పైనే మహాఘట్ బంధన్ విజయావకాశాలు ఆధారపడ్డాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ గెలుపు 19 చోట్లకు పరిమితం అవడం వల్లే అధికారానికి దూరమయ్యామనే భావన ఉంది. ఆ ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి జాగ్రత్త పడుతోంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ప్రజాదరణ ఉన్నా, ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో ‘జంగల్ రాజ్’గా ముద్రపడటం ఆర్జేడీకి నష్టం చేకూర్చే అంశం. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్ కిశోర్ బిహార్‌లో రాజకీయ అదృష్టంపై దేశ వ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆదరణ ఉన్నా రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తు జిత్తుల మధ్య ఆయన వ్యూహాలు ఫలించడం అంత తేలిక కాదు. సోషల్ మీడియా వేదికలపై జన్ సురాజ్ బలంగా కనిపిస్తున్నా, సంస్థాగతంగా బలహీనంగా ఉంది. జన్ సురాజ్ గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయం.‘సర్’ వివాదంఅసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బిహార్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం... బిహార్‌లో 40 లక్షలకుపైగా ఓటర్లపై అనుమానాలున్నాయి. వీటిలో 14 లక్షలకుపైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయంటున్నారు. 19 లక్షలకు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 7 లక్షల మంది ఇతర చోట్ల కూడా ఓటర్లుగా నమోదయ్యారు. 11 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్లలో బంగ్లాదేశ్, మయాన్మార్, నేపాల్ దేశస్థులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఏడాది కిందటి లోక్‌సభ ఎన్నికలప్పుడు రాని ఈ అంశాలన్నీ ఇప్పుడే రావడం వివాదాస్పదమవుతోంది. ((నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.)) ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడావస్తే మాత్రం నితీశ్ వైఖరిలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి. ఎన్డీఏకు మెజారిటీ వచ్చినా నితీశ్ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఈ సమీకరణాల దృష్ట్యా బిహార్ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటు వైపు మళ్లేనో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ -
తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించే యోచనలో ఉన్నాం. ఇండియా కూటమితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటోంది. నిజమైన ఓటర్లను తొలగిస్తూ, తప్పుడు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారని అన్నారు. ఇంతకుముందు ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎంచుకుంటోంది’అని వ్యాఖ్యానించారు.కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోంది. ఎన్నికలు మోసపూరితంగా జరుగుతున్నాయని భావిస్తున్నామని.. అందుకే ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నామన్నారు. అలయన్స్ పార్టీలతో చర్చించి, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
బిహార్ ఓటరు జాబితా నుంచి 52 లక్షల పేర్లు తొలగింపు: ఈసీ
న్యూఢిల్లీ: బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో ఇప్ప టి వరకు దాదాపు 52 లక్షల మంది పేర్లను తొలగించినట్లు మంగళవారం ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది.ఇందులో 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షలు మంది వేరే నియోజకవర్గాల్లో ఉంటున్నవారు, 7 లక్షల మంది ఒకటికి మించి ప్రాంతాల్లో నమోదైన వారని వివరించింది. ‘ఎస్ఐఆర్లో భాగంగా అర్హులైన ఓటర్లందరి పేర్లను ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసే ముసాయిదా జాబితాలో చేర్చేందుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
కాబోయే ఉపరాష్ట్రపతి నితీష్? వేడెక్కిన బీహార్ రాజకీయాలు
పట్నా: భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో, తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిని చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ డిమాండ్ చేయడంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటువంటి డిమాండ్ రావడం సంచలనంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే నితీష్ కుమార్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా చేస్తే అది బీహార్‌కు గర్వకారణంగా మారుతుందని ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ వ్యాఖ్యానించారు. సీఎం నితీష్ విషయంలో తరచూ ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఒక ప్రసంగంలో నితీష్ కుమార్‌ను దేశ ఉప ప్రధానిని చేయాలంటూ డిమాండ్ చేశారు. చౌబే చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే సీఎం నితీష్ దీనిపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. మరోవైపు ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలో పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే వెల్లడించింది.సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాలో ఆయన రాష్ట్రపతి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా నేపధ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున నూతన ఉపరాష్ట్రపతి బీహార్‌కు చెందినవారై ఉంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. -
ప్రశాంత్ కిషోర్‌కు గాయం.. విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిక
పాట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడ్డారు. పీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ బీహార్‌లోని ఆరా జిల్లాలో బద్లావ్ సభకు రోడ్ షోగా వెళ్లారు. ఈ సమయంలో ఆయన పక్కటెముక భాగంలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో, పీకే విలవిల్లాడిపోయారు. అనంతరం, వైద్య చికిత్స కోసం పీకేను పాట్నాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, ఆయన గాయంతో బాధపడుతూ నడవలేకపోతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. Arrah, Bihar: Jan Suraaj Founder Prashant Kishor suffered an injury in his ribs during his roadshow in Arrah today. He was brought to the party's stage following the injury.#PrashantKishore pic.twitter.com/gaG4V0kmVs— 𝑺𝒂𝒊𝒚𝒂𝒂𝒓𝒂✨️ (@sam303T) July 18, 2025आज एक योद्धा बीमार है। "जो नेता जनता के लिए बिना थके चलता रहा, आज थोड़ा थम गया है "ये सिर्फ शरीर की थकान है, आत्मा तो आज भी बिहार के लिए लड़ी जा रही है।प्रशांत किशोर की तबीयत गिरी है, हौसला नहींदुआ करें, वो जल्दी खड़ा हो। 🙏@PrashantKishor @jansuraajonline pic.twitter.com/l531WutJ9S— AY abhishek yadav (@AYabhishek49602) July 18, 2025