
పాట్నా: బిహార్ రాజకీయాల్లో సీఎం నితీశ్ కుమార్ తీరు మరోసారి చర్చాంశనీయంగా మారింది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభంలో ఓ కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు. దీంతో నితీశ్ పరిపాలనపై ప్రశ్నలు తలెత్తాయి.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ టాపర్ల కోసం దేశవ్యాప్తంగా జరిగే నైపుణ్య స్నాతకోత్సవం Kaushal Deekshant Samaroh 2025లో నితీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ దాదాపు ఒక నిమిషం పాటు చేతులు ముడుచుకుని కూర్చుని కనిపించారు. ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను వ్యాఖ్యాత చదువుతుండగా.. నితీష్ తన చేతులను ఒకదానికొకటి పట్టుకుని కూర్చున్నారు. కొద్దిగా కదిలించి పక్కకు చూశారు. అయితే ఆయన ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీఎం ఆరోగ్యం బాగానే ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ అబ్బే ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరంటూ’ ఘాటు వ్యాఖ్యలే చేశారు.
ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం నడపలేరు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి స్థిరంగా మాట్లాడలేకపోతే ఎలా?’అని ప్రశ్నించారు. అలాగే, ఆయన పాలనలో బిహార్ పూర్తిగా గందరగోళంగా మారిందని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
నితీశ్‌పై తేజస్వీ చేసిన విమర్శల్ని జేడీయూ నేతలు ఖండిస్తున్నారు. నితీశ్ కుమార్ అనుభవజ్ఞుడు. ఆయనపై ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేశారు. బిహార్ రాజకీయాల్లో ఈ ఘటన మరో మలుపు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వానికి పారదర్శకత అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Nitish Kumar theek toh hai na ? Ye jo kar rahe hai ye bilkul achha nahi lagta hai dekhne mein !pic.twitter.com/Etev7K8tKG
— Surbhi (@SurrbhiM) October 5, 2025