
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ.
తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్‌కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w
— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025
రెండు రోజుల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఇచ్చారు. ఇదిలా ఉంచితే బిహార్‌లో నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఒప్పందం ఇలా..
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు
హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు
ఇదీ చదవండి: