breaking news
Ram Charan
-
యాసలందు అన్నియాసలూ భేషు
రోల్ డిమాండ్ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్. రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్ తేజ్ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్ దేవరకొండ అయితే ఈస్ట్ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్ కావ్యా థాపర్ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాంసేసేయాల... ‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్‌చరణ్ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్ లుక్‌తో రామ్‌చరణ్ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరో యిన్‌గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది.సామి సాచ్చిగా...‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్ తేజ్ తన కెరీర్‌లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు వరుణ్ తేజ్. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండో–కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ కామెడీ సినిమా ఇది. ఈస్ట్ గోదావరి... రాయలసీమ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్న విజయ్ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్‌లో విజయ్ దేవరకొండ నటిస్తుండటం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఏంది మీ లొల్లి...‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్ కానుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘లెనిన్’ కోసం అక్కినేని అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్ తేజ్ సంభాషణలు పలికారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ‘డెకాయిట్’ సినిమా కోసం అడివి శేష్ రాయలసీమ యాసలో, ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు. -
వన్స్ మోర్
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీస్‌ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగానే రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్‌చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.పదమూడేళ్ల తర్వాత... ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్‌ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్‌కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్‌లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.పదిహేనేళ్ల తర్వాత... ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్‌రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్‌చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్‌లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్‌ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్‌చరణ్, జాను క్యారెక్టర్లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. పద్నాలుగేళ్ల తర్వాత... ‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఆయన లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మి హీరోయిన్గా నటించారు. శరత్‌కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్‌గా నిలిచింది. ప్రత్యేకించి శరత్‌కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్‌లక్ష్మి తనదైన గ్లామర్‌తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా... రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఈ లవ్‌స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట. పదిహేనేళ్ల తర్వాత... కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. 24 ఏళ్ల తర్వాత... ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రామ్ చరణ్ దంపతులకు ట్విన్స్.. అభిమానులకు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్స్..!
మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10) -
క్లీంకార ఫోటోలు పోస్ట్ చెయ్యొద్దు.. రాంచరణ్ వార్నింగ్..
-
"ది ప్యారడైజ్" రిలీజ్‌పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్‌లోనే!
నాని, రామ్ చరణ్ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్‌లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్‌నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ "పెద్ది" సినిమా రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్‌బీర్ కెరీర్లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్‌బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్‌బీర్‌కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా యానిమల్ పార్క్ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్లో మరో స్టార్ జోడీ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్వీర్ కెరీర్‌కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్‌బస్టర్!టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్‌కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్‌కు మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్‌ను గెస్ చేస్తే రూ.50 లక్షలు! -
రామ్ చరణ్ దంపతులకు బన్నీ విషెస్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే?
రామ్ చరణ్ దంపతులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…— Allu Arjun (@alluarjun) February 2, 2026 -
రామ్ చరణ్ పెద్ది స్టోరీ లీక్..! ఎవరూ ఊహించి ఉండరు..!
-
మన జీవితాల్లోని మహిళలే మనకు బలం: రామ్‌చరణ్
జనవరి 31న (శనివారం) రామ్‌చరణ్–ఉపాసన కవలలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామ్‌చరణ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచి, ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప జన్మించారన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటాన్ని ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం.మన జీవితాల్లోని మహిళలే మనకు అత్యంత బలం. ప్రతి క్షణం మాకు అండగా నిలుస్తున్న మా అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అని రామ్‌చరణ్ షేర్ చేశారు. ఇక 2023 జూన్ 20న ఈ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. చాలా సంతోషంగా ఉన్నాం: చిరంజీవి ఆదివారం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భగవంతుడు, హనుమాన్ కృప వల్ల ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఉపాసన, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరితో ఈ శుభవార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొణిదెల, కామినేని... రెండు కుటుంబాల సభ్యులు సంతోషంగా ఉన్నాం. ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అ΄ోలో వైద్యులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు. -
కవలలు పుట్టాక రామ్‌చరణ్-ఉపాసన ఫస్ట్ పోస్ట్
కవలల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్‌చరణ్- ఉపాసనలకు జనవరి 31న రాత్రి బాబు, పాప పుట్టాడని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గుడ్‌న్యూస్ చెప్పాడు. తాజాగా ఈ శుభవార్తను చరణ్- ఉపాసన దంపతులు ఓ స్పెషల్ ఫోటో ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.వాళ్లే గొప్ప బలంబాబు, పాప పుట్టారన్న విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడిని కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు భార్య గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫోటోను జత చేశారు. పెళ్లిఅందులో చరణ్ దంపతులు బ్లాక్ డ్రెస్ ధరించగా.. రెండు శునకాలను పట్టుకుని ఠీవీగా నిల్చున్నారు. కాగా రామ్‌చరణ్, ఉపాసన 2011 డిసెంబర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2012 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో కూతురు క్లీంకార జన్మించింది. ఇప్పుడు క్లీంకారతో ఆడుకునేందుకు మరో బుజ్జి పాపాయి, బుడ్డోడు కుటుంబంలో చేరారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)చదవండి: తండ్రి బాటలో రామ్‌చరణ్.. ఎంత గొప్ప మనసు -
వారసుడొచ్చాడు మెగాస్టార్ ఎమోషనల్...
-
'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం
రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార ఫొటోను పూర్తిగా ఇప్పటికీ వారు రివీల్ చేయలేదు. కానీ, ఏదైన వారు ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు కెమెరాలతో క్లిక్‌మనిపించి సోషల్‌మీడియాలో షేర్ చేసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. అయితే, తాజాగా ఇప్పుడు కూడా రామ్ చరణ్‌తో క్లీంకార ఉన్న ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఉపాసన పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీంతో పెద్ద కూతురు క్లీంకారను తీసుకుని తాజాగా రామ్ చరణ్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీ ఎత్తున చుట్టుముట్టడంతో అతి కష్టం మీద ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయింది. చరణ్ చేతిలో రెండేళ్ల బిడ్డ ఉంది అనే కామన్సెన్స్ కూడా మెగా ఫ్యాన్స్ ప్రవర్తించారు. వారు చేసిన హంగామాకు ఆ చిన్నారి కూడా ఆందోళన చెందింది. దీంతో తొలిసారి చరణ్ కూడా సహనం కోల్పోవాల్సి వచ్చింది. సిబ్బంది రక్షణలో క్లీంకారను ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఆసుపత్రిలోకి చరణ్ వెళ్లారు. ఈ క్రమంలో క్లీంకార వీడియోను కొందరు తమ మొబైల్స్‌తో చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాపీరైట్స్ చర్యలుక్లీంకారకు సంబంధించిన Klin Kaara విజువల్స్ ఎవరైనా పబ్లిష్ చేస్తే కాపీరైట్స్ చర్యలు తీసుకుంటామని రామ్ చరణ్ టీమ్ హెచ్చరించింది. ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల క్లీంకార విజువల్స్ పలు కెమెరాలలో దొరికాయి. దీంతో అవి సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. (క్లీంకార పూర్తి ఫోటోలను కాకుండా తన మొఖం కనిపించని వీడియో, ఫోటోను మాత్రమే ఇక్కడ షేర్ చేశామని గమనించగలరు)This is yet another reckless act by fans. They mobbed #RamCharan while he was carrying his child into the hospital, completely ignoring basic safety and privacy. pic.twitter.com/Y73DymwaDN— Gulte (@GulteOfficial) February 1, 2026 -
కవల పిల్లలు.. ముందుగా ఎవరు జన్మించారంటే: చిరంజీవి
రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారికి ఇప్పటికే క్లీంకార కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక మగ, ఆడ బిడ్డ జన్మించడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపించారు. ఇద్దరూ మెగా క్వీన్స్‌తో పాటు మెగా వారసుడు వచ్చాడని అభిమానులు కేరింతలకు చిరు మరింత సంతోషంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.'కవల పిల్లల రాకతో మాలో మరింత సంతోషం పెరిగింది. ఈ వార్త తెలుసుకున్న తర్వాత కొణిదెల ఫ్యామిలీతో పాటు కామినేని కుటుంబ సభ్యులందరం చాలా సంతోషంగా ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన , బిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలని కోరుకున్నారు. ఆ భగవంతుడు దయ వల్ల హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ ఒక మగ బిడ్డ జన్మించారు. ఈ వార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సందర్భాన్ని అభిమానులు పండుగ లాగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల ఆనందానికి అవధులు లేవు. మా కుటుంబంపై ప్రేమను చూపించే అందరికీ కృతజ్ఞతలు' అంటూ చిరంజీవి పేర్కొన్నారు. అయితే, కవల పిల్లల్లో ముందుగా అబ్బాయి జన్మించాడని.. కొన్ని నిమిషాల తర్వాతే అమ్మాయి జన్మించదని కామినేని కుటుంబ సభ్యులు తెలిపారు. -
క్లీంకారకు ప్రమోషన్.. మెగా కోడలు ఆసక్తికర ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ దంపతులు మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఓ పాప, బాబు పుట్టారని చిరు రివీల్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సైతం ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.తాజాగా హీరో రామ్ చరణ్ దంపతులకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభినందనలు తెలిపారు. ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలో మీకు స్వాగతం.. ఇప్పటికే మిమల్ని అందరూ చాలా ప్రేమిస్తున్నారంటూ లావణ్య రాసుకొచ్చింది. క్లీంకార ఇప్పుడు అఫీషియల్‌గా అక్కగా ప్రమోషన్ పొందిందని లావణ్య త్రిపాఠి ట్లీట్ చేసింది. మీ చిన్న కజిన్ వాయువ్ మీతో కలిసి పెరిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ గతేడాది ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి వాయువ్ అని నామకరణం చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. లావణ్య త్రిపాఠి మాత్రం ఎలాంటి కొత్త సినిమాలైతే ప్రకటించలేదు. Hi tiny twins 💫💙💖Welcome to this world, you’re already soo loved!Big hugs to Kaara, now officially promoted to big sister 🌸A huge congratulations to @upasanakonidela & @AlwaysRamCharan on this double blessing 🤍✨Love, cuddles, and lots of fun coming your way from…— Lavanya konidela tripathi (@Itslavanya) February 1, 2026 -
మరోసారి అత్తయ్యను అయ్యాను: సుస్మిత
మెగా ఫ్యామిలీలో ట్విన్స్ రాకతో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. జనవరి 31న ఉపాసనకు ఓ మగ, ఆడ శిశువు జన్మించారు. ఇదే విషయాన్ని అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తల్లీ, ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా ట్విన్స్ రాకతో సుస్మిత స్పందించారు.మరోసారి అత్తయ్యను అయ్యానురామ్ చరణ్ దంపతులకు సుస్మిత కొణిదెల తన సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది.2026 సంవత్సరం ప్రారంభం నుంచే తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిందని పేర్కొంది. సోదరుడు చరణ్, ఉపాసనలు తనను మరోసారి అత్తయ్యను చేశారని సంతోషంగా చెప్పుకొచ్చింది. అయితే, ఈసారి తన ఆనందం రెట్టింపుగా ఉందని సుస్మిత తెలిపింది.మీ అన్నయ్య ఎదురుచూస్తున్నాడురామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో నటి లావణ్య త్రిపాఠి సంతోషం వ్యక్తం చేసింది. 'చిన్న కవలలకు స్వాగతం. మీరిద్దరూ ఇప్పటికే ఎంతో ప్రేమను పొందారు. క్లింకార ఇప్పడు అందరికంటే పెద్ద అక్కగా ప్రమోట్ అయిపోయింది. మీతో కలిసి ఆడుకునేందుకు మీ అన్నయ్య వాయువ్ ఎదురుచూస్తున్నాడు. రామ్ చరణ్, ఉపాసనలకు డబుల్ అభినందనలు' అంటూ లావణ్య ట్వీట్ చేసింది. లావణ్య, వరుణ్ దంపతులకు గతేడాదిలో వాయువ్ జన్మించిన విషయం తెలిసిందే. -
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. కవలలు పుట్టిన సినీ దంపతులు వీళ్లే
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు కవలలు పుట్టారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఓ బాబు, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబురం నెలకొంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు.అయితే ఈ శుభ సందర్భంలో సినీ ఇండస్ట్రీలో కవలలు ఎవరెవరికీ పుట్టారనే విషయంపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దక్షిణదితో పాటు బాలీవుడ్‌లోనూ కొందరు సెలబ్రిటీలకు ట్విన్స్ పుట్టారు. ఆ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై నెటిజన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ కవల పిల్లలతో డబుల్ ఆనందం పొందిన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం. మంచు విష్ణు దంపతులకు ట్విన్స్..టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులకు కవలలు జన్మించారు. ఈ ట్విన్స్‌కు ఆరియానా- వివియానా అనే పేర్లు పెట్టారు. ఇటీవల కన్నప్ప చిత్రంలో వీరిద్దరు నటించారు. ఓ ప్రత్యేక సాంగ్‌లోనూ అరియానా- వివియానా కనిపించారు.నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు..కోలీవుడ్ భామ నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ జన్మించారు. వీరికి 2022లో సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వీరిద్దిరకి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టుకున్నారు.బాలీవుడ్ నటి ప్రీతి జింటా..బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు ట్విన్స్ జన్మించారు. ఆమె 2021లో సరోగసీ ద్వారానే పిల్లలకు జన్మనిచ్చారు. వీరిది జై, జియా అనే పేర్లు పెట్టారు. ప్రీతి జింటా హీరోయిన్గా దక్షిణాదితో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. సంజయ్ దత్ దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ -ఆయన భార్య మాన్యతా దత్‌కు ట్విన్స్ జన్మించారు. 2010లో వీరికి కవలలు పుట్టగా షహ్రాన్, ఇక్రా అనే పేర్లు పెట్టారు. సంజయ్ దత్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.సెలీనా జైట్లీకి కవలలు..బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ సైతం కవలలకు జన్మనిచ్చింది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్న స్కు 2012లో ట్విన్స్ పుట్టారు. ఇద్దరు అబ్బాయిలకు విన్స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టారు.శతృఘ్న సిన్హా దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా- పూనమ్ సిన్హా దంపతులకు కవలలు జన్మించారు. వీరిద్దరి కుమారులకు లవ్ సిన్హా, కుష్ సిన్హా అనే పేర్లు పెట్టారు. శతృఘ్న సిన్హాకు సోనాక్షి సిన్హా అనే మరో కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ నటిస్తోంది. సన్నీ లియోన్ దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటి సన్నీ లియోన్- ఆమె భర్త డేనియల్ దంపతులకు ట్విన్స్ పట్టారు. 2018లో వీరికి కవలలు పుట్టగా.. నోవా, ఆషర్ అనే పేర్లు పెట్టుకున్నారు. అంతకు ముందే సన్నీ లియోన్ నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు బిజీగా ఉంది. -
తండ్రి బాటలో రామ్ చరణ్.. మాట నిలబెట్టుకున్న గ్లోబల్ స్టార్
మెగా ఫ్యామిలీ ఇంట సంబురం నెలకొంది. మెగా కోడలు ఉపాసనకు కవలలు జన్మించారు. అర్ధరాత్రి ఉపాసన ఓ బిడ్డ, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసనకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురి క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్....గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి చేసిన ప్రతిపాదనను తాజాగా ఆమోదించారు. సినిమా షూటింగ్లలో ఎంతో శ్రమించే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు.ఈ పథకం ద్వారా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందనుంది. ఇందుకోసం ఆయన సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం 500 కుటుంబాలకు వైద్యపరమైన భరోసా లభించనుంది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్‌చరణ్, ఉపాసనకు కవలలు.. ఆనందంలో చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు రామ్‌చరణ్ మరోసారి తండ్రి అయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో ఆయన భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక పాప, బాబుకు ఉపాసన జన్మనిచ్చారని చిరంజీవి శనివారం ’ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, గ్రాండ్ పేరెంట్స్‌గా ఈ శిశువులను తమ ఫ్యామిలీలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రామ్‌చరణ్, ఉపాసనలకు 2023, జూన్ 20న తొలి సంతానంగా క్లీంకార కొణిదెల జన్మించిన విషయం తెలిసిందే. With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.Both the babies and the mother are healthy and doing well. ✨Welcoming these little ones into our family…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026 -
సినిమా బ్లాక్‌బస్టర్.. రామ్‌చరణ్ గిఫ్టిచ్చాడు: సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ హీరోగా రాణిస్తూ తండ్రిగి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరు కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. కాకపోతే తండ్రి, తమ్ముడిలా యాక్టింగ్‌ను కాకుండా తనకంటూ ఓ కొత్త పంథాను ఎంచుకుంది. మొదట్లో చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది.రాఖీ పండక్కి కానుకలుతాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుస్మిత కూడా చురుకుగా పాల్గొంటోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది రాఖీ పండక్కి రామ్‌చరణ్ నాకు ఏదో ఒక బహుమతిస్తుంటాడు. నాకు ఇష్టమైనవి తెలుసుకుని మరీ కొనిస్తాడు. దిష్టి తగులుతుందని..రాఖీ పండగ అనే కాదు.. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఒక బహుమతి ఇస్తూనే ఉంటాడు. మన శంకరవరప్రసాద్‌గారు సక్సెస్ అయ్యాక ఈవిల్ ఐ అని ఒక లాకెట్ చైన్ గిఫ్టిచ్చాడు. సినిమా చాలా సక్సెస్ అయింది. నీకు దిష్టి తగులుతుంది అక్కా, వేసుకో అని చెప్పి మరీ ఆ లాకెట్ ఇచ్చాడు అని సుస్మిత చెప్పుకొచ్చింది.చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు.. పారితోషికం ఎంతో బయటపెట్టిన హర్షవర్ధన్ -
మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!
మెగా ఫ్యామిలీలో సంబరాలకు టైమ్ దగ్గరపడినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు గతేడాది దీపావళి టైంలో రివీల్ చేశారు. అప్పుడే సీమంతం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఉపాసన డెలివరీ డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(ఇదీ చదవండి: హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ)జనవరి 31నే మెగాకోడలు ఉపాసన.. కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని మాట్లాడుకుంటున్నారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకోగా.. దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో వీళ్లకు పాప పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు క్లీంకారకు తమ్ముళ్లు లేదా చెల్లెళ్లు రాబోతున్నారనమాట.ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్చి చివరలో విడుదల ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ చెప్పిన తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉన్న దృష్ట్యా వేసవి తర్వాతే అంటే జూన్ నెలలో ఈ మూవీ రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఉపాసన డెలివరీ తర్వాత చరణ్.. షూటింగ్‌కి బ్రేక్ ఇస్తే గనక 'పెద్ది' రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ) -
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఊ అంటావా ని మించి..! పెద్దిలో మృణాల్ ఎంట్రీ
-
మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?
తెలుగులో చేసినవి రెండు మూడు సినిమాలే అయినా మృణాల్ ఠాకుర్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపించాయి. తమిళ హీరో ధనుష్‌ని పెళ్లి చేసుకోనుందని, ఫిబ్రవరి 14న డేట్ కూడా ఫిక్స్ చేశారని అన్నారు. తీరా చూస్తే ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని మృణాల్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. ఈ విషయాలని పక్కనబెడితే ఇప్పుడు మెగా హీరో మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందనే రూమర్ వినబడుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ 'డకాయిట్'లో మృణాల్ హీరోయిన్. మార్చి 19న ఈ మూవీ తెలుగు, హిందీలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో ఓ హిందీ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు రామ్ చరణ్ 'పెద్ది'లోనూ ఈమె స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనుందనే పుకారు తెగ వైరల్ అవుతోంది. 'జిగేలు రాణి' టైపులో దీన్ని ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. ఒకవేళ నిజమైతే మాత్రం అభిమానులకు పండగే!మరోవైపు 'పెద్ది' వాయిదా పడనుందనే రూమర్స్ గట్టిగా వినబడుతున్నాయి. లెక్క ప్రకారం అయితే మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ వర్క్ పెండింగ్ ఉండటం, మార్చిలోనే 'ధురంధర్ 2' రిలీజ్ కానుండటం తదితర కారణాల వల్ల వాయిదా గ్యారంటీ అని అంటున్నారు. మే లేదా జూన్‌లో 'పెద్ది' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 'పెద్ది' ఈ తేదీన రాకపోతే.. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి వీటిలో ఏదేది నిజమనేది తెలియల్సి ఉంది.(ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు) -
పెద్ది పోస్ట్ పోన్..!
-
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్‌ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. మహేష్ బాబు స్వంత బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్‌కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందని సమాచారం. ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్‌కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి. -
షూటింగ్ పోదాం చలో చలో...
ఓ వైపు నూతన సంవత్సరం జోరు. మరోవైపు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగలా భావించే సంక్రాంతి సందడి... ఈ సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతున్నాయి. థియేటర్లలో సంక్రాంతి పండగ సందడి ఇంకా కనిపిస్తోంది.ఈ పండగకి చిన్న విరామం తీసుకున్న మన హీరోలు సంక్రాంతి ముగియగానే ‘షూటింగ్ పోదాం చలో చలో’ అంటూ సెట్స్‌లో వాలిపోయారు. తమ సినిమాల చిత్రీకరణలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కొందరు హీరోలు విదేశాల్లో తమ మూవీ షూటింగ్స్‌లో జాయిన్ కాగా... వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, విజయ్ దేవరకొండ, సాయిదుర్గా తేజ్ వంటి పలువురు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా హుషారుగా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.... వెంకటేశ్ బేగంపేటలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు సం పాదించుకున్న త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట చిరాగ్ పోర్ట్‌లో జరుగుతోంది.వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి’ కి త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ మూవీస్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.మహేశ్‌బాబు గండిపేటలో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రియాంకా చో్ర పా హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.అక్కడ ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారట రాజమౌళి. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నారు. గత నవంబరులో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వారణాసి’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరేలా చేసింది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని హాలీవుడ్‌కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారట రాజమౌళి. ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పక్కా డేట్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ అప్డేట్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుందని ఫిల్మ్‌నగర్ టాక్.‘వారణాసి’ విడుదల తేదీని ఈ ఏడాది శ్రీరామ నవమి (మార్చి 26న) సందర్భంగా ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాపై మహేశ్‌బాబు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ‘‘వారణాసి’ నా కలల ్ర పాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో మహేశ్‌బాబు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఎఫ్సీలో... ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. అక్కడి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఈ సెట్లోనే జరిగిన గత షెడ్యూల్స్‌లో ఓ నైట్ సాంగ్‌ని, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారని తెలిసింది. ప్రస్తుత షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ జనవరి ఆఖరు వరకు సాగుతుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట... సుమారు పదిహేను కోట్ల రూ పాయలతో వేసిన ఎన్టీఆర్ ఇంటి సెట్... ఇలా అన్నీ హైలెట్‌గా మారాయి. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ‘కేజీఎఫ్, సలార్, మార్కో’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రామ్‌చరణ్ అజీజ్‌నగర్‌లో... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది.రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట బుచ్చిబాబు. ‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ‘పెద్ది’ చిత్రంలోనూ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు రామ్‌చరణ్. ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో చరణ్ చేస్తున్న క్యారెక్టర్ తన కెరీర్లోనే ఇంట్రస్టింగ్ అని టాక్.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే షూటింగ్ శరవేగంగా సాగుతోందని టాక్. అయితే ఓ వైపు షూటింగ్ జరగుతుండటం, మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. కానీ ముందుగా ప్రకటించిన మార్చి 27నే ‘పెద్ది’ విడుదలవుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు రామ్‌చరణ్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి...’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభని నిరూపించుకున్న రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, కీర్తీ సురేష్‌లపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రవికిరణ్ కోలా. ‘‘రౌడీ జనార్థన’ కథ 1980 దశకం నేపథ్యంలో సాగుతుంది. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం విజయ్ తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో డైలాగులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ని ఆయన చేయలేదు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ విడుదల కానుంది. సాయిదుర్గాతేజ్ తుక్కుగూడలో..‘విరూ పాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో సాయిదుర్గా తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు.ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా 2025 అక్టోబరు 15న ‘అసుర ఆగమన’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం సాయిదుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో, గుబురు గెడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. ఈ మూవీకి బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. నాని ముచ్చింతల్‌లో.. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. జనవరి నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశముందని తెలిసింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది.నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మార్చి 27న రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఈ విషయాలపై చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పష్టత ఇచ్చారు. ‘‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ 60 శాతం పూర్తయింది. సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశాం. పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయ్యాయి. అయితే టాకీ పార్ట్ మాత్రమే పూర్తవ్వాల్సి ఉంది. అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. అయితే ‘పెద్ది’ సినిమాతో పోటీ పడి మా ‘ది ప్యారడైజ్’ని విడుదల చేయం. రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయకుండా వేర్వేరు తేదీల్లో రిలీజ్ చేసే ΄్లాన్ చేసే ఆలోచన కూడా ఉంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలి పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిన్న, పెద్ద సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రామ్‌చరణ్ కండల సీక్రెట్ అతడే
టాలీవుడ్లో ఇప్పుడు బెస్ట్ ఫిజిక్‌ను స్క్రీన్‌పై చూపించడానికి స్టార్స్ పోటీపడుతున్నారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన కసరత్తులతో ఫిజిక్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్గా బయటకు వచ్చిన ఆయన ఫిట్ లుక్ బాగా వైరల్ అయింది. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్లకు ట్రైనర్ కూడా అంతే. మరి రామ్ చరణ్ లుక్‌ని ఈ రేంజ్లో క్లిక్ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?ఆయనే ముంబయికి చెందిన రాకేష్ ఉడియార్. ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్‌గా బాలీవుడ్‌కి సుపరిచితుడైన రాకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్‌లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.రాకేష్ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్ లోకల్ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు. అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది, ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.‘‘నాకు ఎప్పుడూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉండేది దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్‌లో స్వీపర్‌గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్ ట్రైనర్‌గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్‌గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్నెస్ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ రాకేష్ ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను అర్బాజ్ ఖాన్(సల్మాన్ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్ నాకు ఫోన్ చేసి, బాడీగార్డ్ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుంచీ రాకేష్ సల్మాన్‌కు పర్సనల్ ట్రైనర్‌గా కొనసాగుతున్నాడు. ఇక మరో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్‌ఖాన్ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్‌కు ఫోన్ చేసి తన ట్రైనర్‌గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.రామ్‌చరణ్‌తో పరిచయం అలా...‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్‌కు రాకేష్ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్ సల్మాన్ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్ ఫిజిక్‌తో ఫిట్‌గా కనపడాలని చరణ్ అనుకున్నాడు’’ అని రాకేష్ చెప్పాడు. అప్పటి నుంచి రామ్ చరణ్‌తో రాకేష్ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్‌కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్ వివరిస్తున్నాడు.రామ్‌చరణ్ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్ కపూర్, డైసీ షా పుల్కిత్ సామ్రాట్‌తో సహా తారలెందరికో రాకేష్ శిక్షణ ఇచ్చాడు. ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్ పొందడానికి ఒక ఫిట్నెస్ ప్రణాళిక ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్ సినిమా కోసం, ఆమిర్‌ఖాన్ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్ చరణ్ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్ సల్మాన్, రామ్ చరణ్ లు ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్ సెషన్ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్ వెల్లడించాడు. ‘సల్మాన్ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా, జిమ్‌కు వెళ్లడం మానడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్ చెప్పాడు. -
సీనియర్ హీరోలకు బ్లాక్‌బస్టర్.. అనిల్ 10వ సినిమా ఎవరితో?
కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్ హిట్లు కొట్టేసి శెభాష్ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..ఫస్ట్ సినిమా నుంచే..అనిల్ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్ 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్ హిట్లే అందుకున్నాడు. బ్లాక్‌బస్టర్ సినిమాలుగతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్ పండగను క్యాష్ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్‌ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది. సీనియర్ హీరోలతో సినిమాలుఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్‌కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. చిరంజీవి బంపరాఫర్మరోవైపు మెగాస్టార్.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్ ఇచ్చాడు. అనిల్ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే అనిల్ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.రామ్‌చరణ్‌తో సినిమా!మన శంకరవరప్రసాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'రామ్‌చరణ్‌తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ చేయండి.. వెంటనే రామ్‌చరణ్ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్.. చరణ్‌తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!పదో సినిమాపై బజ్అసలే అనిల్ రావిపూడి కెరీర్లో 10వ సినిమా.. హిట్ స్ట్రీక్ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్‌తోనా? చిరు-వెంకీతోనా? నాగ్తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి! -
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్’ ఏ స్థానంలో ఉందంటే..
సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్లో షారుఖ్‌ఖాన్ కింగ్ సినిమా ఉండగా.. ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఐఎండీబీ ప్రకటించిన టాప్ 20 సినిమాలివే...1) కింగ్ (హిందీ) :‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.2) రామాయణ (హిందీ)రణ్‌బీర్ ప్రధాన పాత్రలో నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్ హీరో యశ్.. రావణుడిగా కనిపించబోతున్నాడు.3) జననాయగన్(తమిళ్)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.4) స్పిరిట్(తెలుగు)ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.5) టాక్సిక్(కన్నడ)యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.6) బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్సల్మాన్ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఇందులో సల్మాన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.7) ఆల్ఫా(హిందీ)అలియా భట్. శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.8) దురంధర్ 2 (హిందీ)బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.9) బోర్డర్ 2 (హిందీ)1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.10) ఫౌజీహను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్) : ప్రదీప్ రంగనాథన్(హీరో)12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని13) పెద్ది(తెలుగు): రామ్ చరణ్14) డ్రాగన్(తెలుగు): ఎన్టీఆర్15) లవ్ అండ్ వార్(హిందీ): రన్బీర్ కపూర్16) బూత్ బంగ్లా(హిందీ): అక్షయ్ కుమార్17) బెంజ్(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ19) ‘పేట్రియాట్ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్‌లాల్20) ఓ రోమియో (హిందీ): షాహిద్ కపూర్ -
మెగా ఫ్యామిలీ ఇంట భోగి.. చరణ్ ఏం చేశాడంటే?
కుటుంబమంతా ఒకచోట చేరితేనే అసలు సిసలైన పండగ. ఈ విషయం మెగా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే అంతా కలిసి భోగి పండగను ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసింది.దోశలు వేసిన మెగా ఫ్యామిలీఅందులో వైష్ణవ్ తేజ్, వరుణ్- లావణ్య, రామ్‌చరణ్, సుస్మిత దోశలు వేస్తున్నారు. సాయిదుర్గతేజ్ టీ/కాఫీ తాగుతుంటే రామ్‌చరణ్ అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయాడు. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సూపర్ హిట్ అవడంతో మరింత జోష్‌తో పండగ జరుపుకున్నారు.భోగిలా లేదుఇది భోగిలా లేదు, దోశ రోజుగా ఉంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే.. మా కుటుంబమంతా ఒక చోట చేరి మన సాంప్రదాయాలను, పండగలను అద్భుతంగా జరుపుకుంటాం అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో కూడా భోగి సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఇలా ఒకే చోట చేరింది. చిరంజీవికూడా స్వయంగా దోశలు వేసి వడ్డించేవాడు.సినిమాచిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "మన శంకరవరప్రసాద్‌గారు". అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా దూసుకెళ్తోంది. దీంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే కన్నీళ్లాగలేదు -
ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. మెగా హీరోలు..
-
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
హీరో రామ్‌చరణ్ ఇంట జపాన్ చెఫ్ చేతి బిర్యానీ..!
బిర్యానీ ఎవ్వరినైనా ఇట్టే తన రుచికి ఫిదా చేసేస్తుంది. యావత్తు ప్రపంచాన్ని తన ఘుమఘమలు వైపుకి లాగేసుకుంటుంది. అసలు ఒక్కసారి రుచి చూసిన వారెవ్వరైనా..మరోసారి తినేలా ఊరించే వంటకం ఇంది. అలాంటి వంటకానికి ఎందరెందరో ఫిదా అయ్యారు. అచ్చం అలానే బిర్యానీ ప్రియుడిగా మారి అందులో స్పెషలిస్ట్‌గా అవతరించాడు ఈ జపనీస్ చెఫ్. ఆ ఇష్టమే హైదరాబాద్‌కి రప్పించి ..మన చిరు తనయడు ఇంటికి వచ్చేలా చేయడమే కాదు..హీరో రామ్‌చరణ్‌కి రుచి చూపించాడు కూడా. ఔనా ఏంటా కథా అని కుంటున్నారా..!. అయితే తక్షణమే చదివేయండి ఆ సంగతేంటో..ప్రత్యేక బిర్యానీలకు సంబంధించి వరల్డ్ పేమస్ జపనీస్ చెఫ్ మాస్టర్ తకమాసా ఒసావా ఇటీవల హైదరాబాద్‌లోని మన రామ్‌చరణ్ ఇంటికే వచ్చి మరి వండుకున్నాడు. ఇదేంటి అనుకోకండి బహిరంగంగా వండుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసుకునే ఈ చెఫ్ తకమాసా..అలానే మన చరణ్ ఇంట్లో కూడా బిర్యానీ వండి ఆ వీడియోని నెట్టింట షేర్ చేసుకున్నాడు. ఇది క్షణాలో ఆహారప్రియులను, రామ్‌చరణ్ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏంటి మేటర్ అంటే..ఆయన రామ్ చరణ్ నివాసానికి వచ్చి..అక్కడ బ్యూటిఫుల్ లోకేషన్స్‌ని షేర్ చేస్తూ..అక్కడే తన స్పెషల్బిర్యానీ వండాడండోయ్. అక్కడితో ఆగలేదు రామ్‌చరణ్‌కి, వాళ్ల అమ్మ సురేఖమ్మకి కూడా టేస్ట్ చేయమని పెట్టాడు కూడా. మన హీరో రామ్‌చరణ్ అయితే బాస్ ఇది చాలా రుచిగా ఉంది గ్రేవీలా లేదంటూ చమత్కరించాడు. ఎందుకంటే జపాన్ వాళ్లు ఏదైనా సూప్ మాదిరిగా అదేనండి పులుసు టైపులో తింటుంటారు కథా అందుకని మన హీరో చరణ్ సరదాగా అలా అన్నారు. మన జపాన్ చెఫ్ తకమాసాకి ఈ బిర్యానీ వండడం ఎలా తెలిసిదంటారా..?అలా తెలుసుకుని..ఇలా గరిటపట్టేశాడు..టోక్యోకు చెందిన చెఫ్ తకమాసా సింగిల్ పాట్ బిర్యానీ స్పెషలిస్ట్ అట. అంతేగాదు ట్యోక్కోలో బిర్యానీ రెస్టారెంట్‌ని కూడా నడుపుతున్నాడు. అతని బిర్యానీ వండే స్కిల్‌కి, టేస్ట్‌కి మిచెలిన్ బిబ్ గౌర్మాండ్ అనే మంచి అవార్డు సైతం వచ్చింది ఈ చెఫ్‌కి. మన తకమాసాకి బిర్యానీ గురించి తెలిసింది 2009లోనట. తమిళనాడులో ఆఫీస్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడూ..స్థానిక తినుబండారాలపై బిర్యానీ అని రాసి ఉడంట చూశాడట తకమాసాక. ఆసక్తిగా అనిపించి ఆర్డర్ చేసి తిన్నాడట. అంతే ఆక్షణమే దానిపై మనసు పారేసుకుని ఇలా బిర్యానీ చెఫ్‌గా సెటిల్ అయ్యిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్ని పర్యటించి మరి అక్కడ బిర్యానీ వంట పద్ధతులను తెలుసుకుంటూ, దీని రుచిపై అధ్యయనం చేస్తున్నాడట ఈ చెఫ్ తకమాసా. బిర్యానీపై ఉన్న అతని ప్రేమ చూస్తుంటే భోజనప్రియులకు ఆహారమే సార్వత్రికభాష అని నిరూపితమైంది కదూ..!Famous Japanese biryani chef Osawa Takamasa (awarded Bib Gourmand in the Michelin Guide) visited @AlwaysRamCharan's home yesterday and cooked biryani for him and his family. He postedan Instagram story about the occasion.🥘🔥🤩 pic.twitter.com/xLR3k1XbT5— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 5, 2026 (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..) -
జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)
-
మెగా హీరో స్పెషల్ బిర్యానీ పార్టీ.. అట్రాక్షన్‌గా ఉపాసన..!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు కాస్తా గ్యాప్ దొరికింది. దీంతో మన మెగా హీరో చెర్రీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు.తాజాగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మెగా హీరో రామ్ చరణ్ స్పెషల్‌గా పార్టీ చేసుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన ప్రముఖ చెఫ్ ఒసావా టకమసా తయారు చేసిన బిర్యానీ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఈ పార్టీలో కనిపించారు. ఇంట్లోనే జపాన్ చెఫ్ వండిన బిర్యానీ తింటూ కనిపించారు. ఈ పార్టీలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించిన ఉపాసన.. బేబీ బంప్‌తో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.@ #RamCharan 🏦 pic.twitter.com/0AsYvJiJwm— Trends RamCharan ™ (@TweetRamCharan) January 5, 2026 -
చరణ్‌తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్‌ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్‌కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్‌తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్టే. -
గడియారం వెనక్కి...
కాలం ముందుకు వెళ్తుంది. 2026కి కూడా వెల్కమ్ చెప్పాం. కానీ తెలుగుతెరపై సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. వెండితెరపై గడియారాన్ని వెనక్కి తిప్పి, కొన్ని కథలను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు హీరోలు. ఇలా ఆడియన్స్ ను ఎంటర్టైన్స్ చేసేందుకు గడియారాన్ని వెనక్కి మళ్లించిన కొంతమంది హీరోల గురించి ఓ లుక్ వేయండి.టైమ్ ట్రోటర్హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్స్ లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో మహేశ్‌బాబు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రధానంగా రుద్ర పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తే, కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపిస్తారు. మరికొన్ని సన్నివేశాల్లో శివుడుగా కూడా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కథ రీత్యా ఈ సినిమా కథనం విభిన్న మైన కాలమానాల్లో సాగుతుంది.భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి టైమ్ ట్రోటర్, గ్లోబ్ ట్రోటర్ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్స్ , ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ వారణాసి చిత్రం 2027 వేసవిలో రిలీజ్ కానుంది.పుట్టకతోనే యోధుడు‘‘పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువులేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతనో యోధుడు..’’.. ‘ఫౌజి’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్ గురించే ఇదంతా. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం.. వంటి అంశాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.జయప్రద, అనుపమ్‌ఖేర్, మిథున్స్ చక్రవర్తి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘ఫౌజి’ సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ సందర్భంగా పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ లోని ‘సలార్’ ఫ్రాంచైజీ సినిమా సెమీ పీరియాడికల్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇంకా నాగ్ అశ్విన్స్ డైరెక్షన్స్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ్రపారంభం కానుందని తెలిసింది.డ్రాగన్స్ రాక ఈ ఏడాదేనా..ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ. 1960 సమయంలో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా, సరిహద్దుల్లో అక్రమ రవాణా వంటి అంశాల నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో కథ రీత్యా ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. తాజాగా చిత్రీకరిస్తున్న సన్నివేశాల కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు.ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ గా నటి స్తున్నారు. మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కాజోల్, అనిల్ కపూర్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్స్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్స్ ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈ ఏడాది జూన్స్ 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ విడుదల తేదీలో కూడా మార్చు ఉండొచ్చనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి..‘ఎన్టీఆర్‌నీల్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.పెద్ది ఆటరామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో జాన్వీకపూర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్వేందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.కథ రీత్యా ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగుతుంది. 1980 టైమ్‌లైన్స్ తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ ‘పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీలో రామ్‌చరణ్ పాల్గొనగా, ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు కూడా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది.బ్రిటీషర్లపైపోరాటంమంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘డేవిడ్‌రెడ్డి’. ఈ హిస్టారికల్ యాక్షన్స్ డ్రామా కథనం 1897–1922 నేపథ్యంతో సాగుతుంది. బ్రిటీషర్లకు ఎదురుతిరిగిన రెబల్ డేవిడ్‌రెడ్డి పాత్రలో మంచు మనోజ్ కనిపిస్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన డేవిడ్‌రెడ్డి బ్రిటీషర్లకు ఎలా ఎదురు నిలిచాడు? అనేది సినిమాలో చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలోని డేవిడ్ పాత్ర ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఈ చిత్ర దర్శకుడు హనుమరెడ్డి పేర్కొన్నారు. భరత్, నల్లగంగుళ వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఉత్తర తెలంగాణలో భోగిశర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. 1960 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్స్ , డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. కేకే రాధామోహన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మరో సినిమా ‘బైకర్’. మూడు తరాల నేపథ్యంతో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కథనం 1990, 2000 టైమ్ పీరియడ్‌లో సాగుతుంది.ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్‌లో శర్వానంద్ రేసర్ విక్రమ్ పాత్రలో నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులోనే విడుదల కావాల్సింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, ఆడియన్స్ కు మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. త్వరలోనే ఈ ‘బైకర్’ సినిమా కొత్త విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.జడల్ జమానా‘దసరా’ పీరియాడికల్ రూరల్ యాక్షన్స్ డ్రామా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్స్ లో వస్తున్న తాజా సినిమా ‘ది ΄్యారడైజ్’. 1980 నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా ఇది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. మోహన్స్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్‌బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ వర్గం కోసం ఓ నాయకుడు చేసే వీరోచితపోరాటం నేపథ్యంతో ఈ మూవీ స్టోరీ సాగుతుందని తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.రౌడీ జనార్ధన‘కలింగపట్నంలో ఇంటొకకడు రౌడీనని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటి పేర్నే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన’’ అంటూ గంభీరంగా చెబుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి.. ఈ రౌడీ జనార్ధన స్టోరీని ఈ ఏడాది డిసెంబరులో థియేటర్స్‌లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘రౌడీ జనార్ధన’. కీర్తీసురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈస్ట్ గోదావరి నేపథ్యంతో 1980 కాలమానంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ గోదావరి యాసలో మాట్లాడతారు. ఈ రూరల్ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా, ఈ ‘రౌడీ జనార్ధన’ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా విజయ్ దేవరకొండ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు ‘టాక్సీ వాలా’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్స్ కాంబినేషన్స్ లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది.ఈ సినిమా ప్రధాన కథాంశం 1854–1878 నేపథ్యంతో సాగుతుంది. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తారని, రష్మికా మందన్నా హీరోయిన్స్ గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ్రపారంభం కానుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారు.ఆకాశంలో ఒకతార‘మహానటి, సీతారామం, కాంత’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్సల్మాన్స్ . ఎంతలా అంటే ఆయన ఏ భాషలో సినిమా చేసినా, ఆ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేంతలా. తాజాగా దుల్కర్సల్మాన్స్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒకతార’. పవన్స్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమాస్ల సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా కథనం ప్రధానంగా ఓ పల్లెటూరి నేపథ్యంతో సాగుతుందని, ఇందులో దుల్కర్ సల్మాన్స్ ఓ రైతు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.స్వాతంత్య్రానికి పూర్వం..నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1905 టైమ్‌లో జరుగుతుందని తెలిసింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం లండన్స్ ఉన్న కొందరు భారతీయులు ఎలాంటి వ్యూహరచన చేశారు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో నిఖిల్, మరో కీలక పాత్రలో అనుపమ్‌ఖేర్ నటిస్తున్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు వీర్సవార్కర్ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సినిమాలో చూపిస్తారట మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ మధ్య సెట్స్‌లో చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అప్పట్లో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అధికా రికంగా మరో అప్డేట్ రావాల్సి ఉంది. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ కోవలో పీరియాడికల్ ఫిల్మ్స్ చేస్తున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. -
'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)Honoured and super glad to be 'APPALASOORI' in #Peddi ❤🔥Thoroughly enjoyed playing this role. #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025 -
సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
చరణ్-ధోనీ-సల్మాన్ ఒకేచోట... ఫొటో వైరల్
మెగా హీరో రామ్ చరణ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కనిపించాడు. వీళ్లకు తోడుగా 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కూడా సందడి చేశాడు. వీళ్లంతా కలిసి చిల్ అవుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు ఎక్కడ ఎప్పుడు కలిశారు?(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం జరిగాయి. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరగ్గా.. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కనిపించాడు. క్రికెటర్ ధోనీ, నటుడు బాబీ డియోల్ కూడా వీళ్లతో పాటు కనిపించారు.మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్‌కి మంచి అనుబంధం ఉంది. కొన్నేళ్ల క్రితం చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సల్మాన్ మూవీ 'కిసీ కా బాయ్ కిసీ కా జాన్'లో చరణ్ అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా ఆ అనుబంధం దృష్ట్యా సల్మాన్ బర్త్ డే పార్టీలో చరణ్ సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్
-
రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
-
ఢిల్లీలో పెద్ది
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు.ఈ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. చేతిలో సంచితో మాస్ లుక్‌లో నడుచుకుంటూ వెళుతున్న రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’పాట 150 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్. -
పెద్ది మూవీపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఫైర్..!
సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి ఓనమాలు తెలియనివాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్ చిత్రాలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసి చాలామంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ రివ్యూవర్స్‌పై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఫైరయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇండస్ట్రీని ప్రయోజనం పొందుతూ కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉందని విశ్వక్ సేన్ ఫైరయ్యారు.ఈ వీడియో ఓ వ్యక్తి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడారు. పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ ఎగతాళి చేశాడు. ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో వీరికి ఇచ్చిపడేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.Isn’t it fair to call someone like him a parasite to cinema? He benefits from the industry, feeds himself and his family through it, yet tries to destroy a film even before it’s released. It’s like spitting on the very plate he eats from. pic.twitter.com/WcLPOGA69k— VishwakSen (@VishwakSenActor) December 19, 2025 -
మగధీరలా చాంపియన్ పెద్ద హిట్ కావాలి: రామ్ చరణ్
‘‘చాంపియన్’ సినిమా కోసం మూడున్నరేళ్లు పట్టిందని రోషన్ చెప్పాడు. మేము కూడా కొన్ని సినిమాలకు మూడు, నాలుగైదేళ్లు ఉన్నాం. అయితే ఎన్ని రోజులు తీశాం అన్నది కాదు. ‘చాంపియన్’ ట్రైలర్ చూస్తుంటే సినిమా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. నా సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయిందో... రోషన్‌కి ‘చాంపియన్’ అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్‌చరణ్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్‌పై ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ‘చాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఎన్టీఆర్‌కి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’, అల్లు అర్జున్‌కి తొలి చిత్రం ‘గంగోత్రి’, మహేశ్‌బాబుకి ‘రాజకుమారుడు’, నాకు ‘చిరుత’... ఇలా మాకు ముఖ్యమైన వ్యక్తి అశ్వినీదత్‌గారు. మేం కెరీర్ మొదలు పెట్టినప్పుడు అందరి నిర్మాతలకంటే ముందు ధైర్యంగా వచ్చి... అఫ్కోర్స్... మా వెనక ఫ్యామిలీ ఉండొచ్చు కానీ, మేం ఎలా యాక్ట్ చేస్తామో తెలీదు, మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియని టైమ్‌లో వచ్చి, నటుడిగా పరిచయం చేసి మరచిపోలేని జర్నీ ఇచ్చిన దత్‌గారికి, ఆయన ఫ్యామిలీకి థ్యాంక్స్. ఇప్పుడు రోషన్ కూడా ‘చాంపియన్’తో వస్తున్నాడు. తను హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు... అందంగా ఉన్నాడు. ‘చాంపియన్’ చిత్ర నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఇంత ప్యాషనేట్‌గా, హార్డ్ వర్క్‌తో పని చేస్తుండటం ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే దత్‌గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి. నాగ్ అశ్విన్గారితో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ (‘కల్కి 2898 ఏడీ’) మూవీ ఇచ్చారు. అవకాశం ఉంటే స్వప్న సినిమాస్‌లో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ఇంత ప్యాషనేట్ పీపుల్స్‌తో పని చేస్తే సరదాగా షూటింగ్‌కి వెళ్లి వచ్చేయొచ్చు. ఇక ‘చాంపియన్’కి ప్రదీప్ అద్వైతంగారి కష్టం కనిపిస్తోంది. రోషన్ పరిణతి ఉన్న నటుడిలా నటించాడంటే తనని పాత్ర కోసం చాలా బాగా తీర్చిదిద్దారు. అనస్వర మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని, డబ్బింగ్ చెప్పడం చూసి ఇంప్రెస్ అయ్యాను. అన్ని విభాగాల వాళ్లు ఎంతో కష్టపడి పని చేశారు. ఈ సినిమాని ఈ నెల 25న చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
‘ఛాంపియన్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'యాక్టింగ్ తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు'.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్‌కు గంగోత్రి, మహేశ్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్‌లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్ను, రాజకుమారుడుతో మహేశ్‌బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్ రెండో చిత్రం ఛాంపియన్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ ఈవెంట్లో శ్రీకాంత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు. -
చికిరి చికిరి 100M వ్యూస్..
-
చికిరి రికార్డ్
‘చికిరి చికిరి...’ అంటూ ‘పెద్ది’ సినిమా లో రామ్‌చరణ్ వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన నెలలోనే తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ దాటిందని, అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఓ రికార్డ్ అని చిత్రబృందం పేర్కొంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను నవంబరులో విడుదల చేశారు. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.చాంపియన్‌కి అతిథిగా... రోషన్, అనస్వర రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నెల 18న జరగనున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని యూనిట్ ప్రకటించింది. -
మెగా కోడలికి ప్రతిష్టాత్మక అవార్డ్.. సోషల్ మీడియాలో పోస్ట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణికి అవార్డ్ వరించింది. మోస్ట్ పవర్‌పుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఉపాసన. అయితే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల అవార్డ్ తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. Receiving the Most Powerful Women in Business Award by @business_today is truly humbling 🧿 @NSEIndia Sorry, I couldn’t make it in person, unable to travel due to my pregnancy. 🤰🏼 🥰At @_ur_life_ , our focus has always been on creating positive change mentally & physically.… pic.twitter.com/ZrInWT93QG— Upasana Konidela (@upasanakonidela) December 15, 2025 -
2026లో ‘మెగా’ బ్లాస్ట్.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!
ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్,ఫ్లాప్ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్‌తో అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ పక్కకు పెడితే.. చరణ్(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్ డిబెట్ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ కానుంది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్ ’కూడా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. -
హైదరాబాద్ టు ఢిల్లీ
చిన్న బ్రేక్ తర్వాత పెద్ది’ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘పెద్ది’ టీమ్ చిన్న బ్రేక్ తీసుకుంది. కొత్త షెడ్యూల్ మళ్లీ హైదరాబాద్లోనేప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేసింది.జనవరి నెలాఖరు వరకు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా టీమ్ ప్లాన్ చేసింది. ‘‘పెద్ది’ షూటింగ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. -
పెద్ది, ప్యారడైజ్ కి పోటీగా వెంకటేష్ సినిమా
-
పెద్దికి పెద్ద కష్టం..! పాన్ ఇండియా స్టార్స్
-
రామ్ చరణ్ బంగారం.. వైరల్ అవుతోన్న బండ్ల గణేష్ కామెంట్స్
-
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ 'ఆట' మొదలైంది!
సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ జానర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్ వేయండి.క్రికెట్... కబడ్డీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్ పాత్ర ఏ విధంగా కనెక్ట్ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ (బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.బైకర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్ సినిమా చూసిన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్’ సినిమా టీమ్ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ ‘బైకర్’. ఈ చిత్రంలో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తనను తాను కొత్తగా మలచుకున్నారు.వెండితెరపై పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్నెస్ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్ పీరియడ్‌లో ‘బైకర్’ సినిమా ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తొలిసారి స్పోర్ట్స్ డ్రామా దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే ఓ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండకు ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ నచ్చిందట.‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్ కె. కుమార్. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యాన్లతో విజయ్ చేయాల్సిన సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ కె. కుమార్ సినిమాను విజయ్ టేకప్ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్ దేవరకొండకు విక్రమ్ కె. కుమార్ ఎలాంటి కథ చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. లబ్బరు పందు మేక్... క్రికెట్ నేపథ్యానికి లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండం విశేషం.థండర్ హీరో ఆది పినిశెట్టి ఫిట్నెస్, కటౌట్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.మట్టి కుస్తీ సీక్వెల్ విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.మండాడి తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్ గురించి మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇటు క్రికెట్... అటు లవ్ ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్ నేపథ్యంలో సాగినా, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.పతంగుల పోటీ ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన తారాగణంగా, సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్’. ఈ కామెడీ స్పోర్ట్స్ మూవీకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!
మెగాహీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'చికిరి' హిట్ కాగా.. డిసెంబరులో మరో పాట వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి సాంగ్ రాబోతుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇది బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో తీస్తుండటం విశేషం. ఇంతకీ సంగతేంటి?'పెద్ది' మూవీ ప్రకటించినప్పుడు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ వచ్చిందో.. తర్వాత నుంచి హైప్ పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు పనిచేస్తున్నాడని తెలుస్తోంది. మూవీలో ఏకంగా ఎనిమిది ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారట. దీనంతటినీ హిందీ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఈయన గతంలో 'దంగల్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫీ చేశారు.'పెద్ది' చిత్రాన్ని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. క్రికెట్, కబడ్డీ లాంటి గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అని అన్నారు. రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాలన్నీ చెప్పిన తేదీకి అస్సలు రావడం లేదు. మరి 'పెద్ది' చెప్పిన టైంకి వస్తాడా లేదంటే వాయిదా వేస్తాడా అనేది చూడాలి? -
రామ్ చరణ్-సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ రూమర్స్ నిజమా
-
'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత
ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్‌పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?) -
పెద్ది ప్రమోషన్స్ కు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కి పండగే...
-
'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష్మీ) -
బిజినెస్‌మ్యాన్ కుమార్తె పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ (ఫొటోలు)
-
పెద్ది పోస్ట్ పోన్ అంటున్న కన్నడ ఇండస్ట్రీ..!
-
సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ సతీమణిగా..మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చిట్‌చాట్ సందర్భంగా ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది? అని ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించగా.. వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు అమ్మాయిల కంటే యువకులే ఎక్కువమంది చేతులు ఎత్తారని ఉపాసన తెలిపింది. దీంతో మహిళలు కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపించిందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ పరిణామం చూస్తుంటే సరికొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ కితాబిచ్చింది. మీ దార్శనికతను నిర్దేశించుకోండి.. మీ లక్ష్యాలను నిర్వచించుకోండి.. మీ పాత్రను సొంతం చేసుకోండి. మిమ్మల్న ఎవరూ ఆపలేని వ్యక్తిగా మారండి అంటూ యువతను ఉద్దేశించి మాట్లాడింది.అయితే ఉపాసన షేర్ చేసిన వీడియోలో మహిళల గురించి మాట్లాడింది. మీరు మీ కాళ్లపై ఆర్థికంగా నిలబడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ సూచించింది. అప్పటి వరకు ఒక్కరూ తమ అండాలను భద్రపరచుకోవాలంటూ ఉపాసన మాట్లాడారు. ఈ రోజు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డానని.. నా సంపాదనతో ఆర్థికంగా ఎదిగానని తెలిపింది. ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడిందని పేర్కొంది. మీ జీవితంలో 30 ఏళ్లు వచ్చేసరికి కెరీర్లో నిలదొక్కుకోవాలని ఉపాసన వివరించింది. నీ కెరీర్లో విజన్, గోల్ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరంటూ మాట్లాడింది.అయితే ఉపాసన కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ బిజినెస్ కోసం యువతకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అపోలో ఫెర్టిలిటీ సెంటర్ ప్రమోట్ కోసం ఇలా చెప్పడం సరికాదని హితవు పలుకుతుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.కాగా.. ఉపాసన, రామ్ చరణ్‌కు దాదాపు పెళ్లయిన 12 ఏళ్లకు క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఇంతకీ సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు??You are just promoting your apollo ferlity centre that's it..Sorry @upasanakonidelaGaaru, you are misleading the young generations with this message.After 30 women loose intrest to have kids...Kindly spare our younger… pic.twitter.com/1JbRQhudVX— 𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్🇮 (@Mani_Karnika06) November 18, 2025 -
ప్రపంచ వ్యాప్తంగా చితకొడ్తున్న చికిరి..!
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
సుకుమార్ మాస్టర్ ప్లాన్.. RC17 సెట్స్ పైకి అప్పుడే..!
-
రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..
-
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10వ తేదీ రాత్రి జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇది ఉగ్రచర్య అని కేంద్రం ప్రకటించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన నుంచి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ టీమ్ కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)ఈనెల 15, 16 తేదీల్లో పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకుగానూ 'పెద్ది' టీమ్ అనుమతి తీసుకుందట. కానీ ఇప్పుడిలా జరగడంతో మరో ఆలోచన లేకుండా చిత్రీకరణ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ షూటింగ్ చేయడానికి కొన్నిరోజుల ముందే ఇలా జరగడంతో టీమ్ అంతా షాక్‌కి గురవుతున్నారట. రష్మిక కొత్త సినిమా షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇంకొన్నిరోజుల పాటు ఎర్రకోట ప్రాంతంలో ఎలాంటి షూటింగ్ ఉండే అవకాశం లేదు.'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ మధ్యే 'చికిరి.. చికిరి' అనే పాటని రిలీజ్ చేశారు. అదెంత వైరల్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?) -
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెద్ది తో టాలీవుడ్ లో రెహమాన్ రీ-ఎంట్రీ.. బద్దలవుతున్న మ్యూజిక్ రికార్డ్స్
-
ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)
-
నా చిన్ననాటి కల.. 'పెద్ది'తో నిజమవుతుంది: రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న చిత్రం పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఏర్పడ్డ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. అందులో రెహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. భారీగా జరిగిన ఈ కాన్సర్ట్‌కు పెద్ది సినిమా టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్ననాటి కల.. ఆ అవకాశం నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తాజాగా రిలీజైన చికిరి సాంగ్ అదిరిపోయింది. పెద్ది సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది, అంటూ రెహమాన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కామెంట్స్‌తో పెద్ది సినిమా చరణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి. -
ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)
-
సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న మెగాస్టార్.. మెగాపవర్ స్టార్
ఈ ఇద్దరు తండ్రీకొడుకులు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి తన 46 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించగా, రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా 'మీసాల పిల్ల' పాటలో చిరంజీవి డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఇక ఈ పాట పెద్ద హిట్ అవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్,ఫ్యాన్ ఎడిట్స్‌తో ఉత్సాహంగా రాణిస్తున్నారు.భీమ్స్ సంగీతం అధించిన ఈ పాట నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగింది. అలా ఈ పాట తాజాగా 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు కొల్లగొట్టింది.ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' పాట తాజాగా విడుదలైంది. అయితే ఈ పాట ఒక్క రోజులోనే 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజైన గంటల వ్యవదిలోనే 30 మిలియన్ వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ డాన్స్ మూవ్స్‌తో అభిమానులు రీల్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమా పాటలతో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు. -
పెద్ది పాటలో చరణ్ స్టెప్స్, సలామ్ అనాలిని గుర్తు చేస్తున్నాయా?
-
పెద్ది 'చికిరి' బాగుంది.. కానీ, బిగ్ డౌట్
‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ రామ్ చరణ్ క్లాసిక్ స్టెప్పులేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ విషయంలో చాలామందిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. సోషల్‌మీడియాలో పెద్ద చర్చగా సాగుతుంది. చికిరి అంటూ చరణ్ వేసిన స్టెప్పులు చాలా యూనిక్‌గా ఉన్నాయని అభిమానులు చెబుతున్నప్పటికీ వారిలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది.పెద్ది సినిమా నుంచి శుక్రవారం తొలి పాటని విడుదల చేశారు. చికిరి చికిరి... అంటూ సాగే ఈ పాటని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ సాహిత్యం అందించారు. సాంగ్ బాగుందని ప్రశంసలు కూడా వస్తున్నాయి. యూట్యూబ్‌లో అన్ని భాషలలో కలిపి 50 మిలియన్ల వ్యూస్‌కు చేరుకుంది. అయితే, అందరి మనస్సులలో ఒక ప్రశ్న ఉంది. ఈ పాటను తెలుగు, హిందీ, కన్నడ , మలయాళంలో విడుదల చేశారు. కానీ, తమిళ వెర్షన్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే, దానికి కారణం మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.తమిళ ప్రేక్షకులు కూడా ఈ విషయంపై ట్వీట్లు చేస్తున్నారు. చరణ్, A.R. రెహమాన్ అభిమానులు కూడా సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వమని కోరుతున్నారు. ప్రస్తుతానికి, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే, కొంతమంది A.R. రెహమాన్ తన హైదరాబాద్ కచేరీలో తమిళ వెర్షన్‌ను ప్రత్యక్షంగా పాడవచ్చని ఊహిస్తున్నారు. చికిరి చికిరి తమిళ వెర్షన్‌ను మేకర్స్ ఎలా మార్కెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా!
‘చికిరి చికిరి...’ అంటూ హుషారైన స్టెప్పులేశారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు.‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ ఈ పాట సాగుతుంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫోక్ ఎనర్జీ, మోడ్రన్ బీట్స్‌తో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట అదిరిపోతుంది. రామ్‌చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూమెంట్స్, హుక్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్రేస్, చార్మ్ అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
పెద్ది 'చికిరి' ఫుల్ సాంగ్ విడుదల
రామ్‌చరణ్- బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ‘చికిరి చికిరి..’ (Chikiri Chikiri Song)అంటూ సాగే ఈ పాటకు చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌ను బాలాజీ రచించారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా తమ గ్రామంలో చికిరి అని పిలుస్తారని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్
-
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్‌ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్లోనూ అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారని సమాచారం. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో ఏ1 స్టార్ అనే ట్యాగ్ ను ఎన్టీయార్ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్ అవడంతో మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో ఈ ట్యాగ్‌ను స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే దారిలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్యాగ్ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ పోతినేని కి ముందు ఉస్తాద్ అని ట్యాగ్‌ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 2 సహా పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడట రామ్. తన పాత ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. రాబోతున్న ఆంధ్ర కింగ్ సినిమా పోస్టర్ లోను ఆ పాత ట్యాగ్‌తోనే వస్తున్నాడు. వేలం వెర్రి కాకూడదుమరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్లో ఈ స్టార్ టైటిల్స్ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్ చేసే మార్కెటింగ్ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్‌స్టార్, రెబల్ స్టార్...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్‌కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?ఉదాహరణకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్‌గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌ను రామ్ చరణ్ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి. ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే ట్యాగ్ అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది. -
పెద్ది ఫస్ట్ సింగిల్ కోసం బుచ్చిబాబు కష్టాలు
-
రామ్ చరణ్.. మళ్లీ ఎందుకు మార్చేశారు?
మెగా అభిమానులు గమనించారో లేదో గానీ రామ్ చరణ్ విషయంలో చిన్న మార్పు జరిగింది. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే సోషల్ మీడియాలో దీన్ని గమనించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి సంగతి?చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్‌తోనే తొలి నుంచి సినిమాలు చేశాడు. కానీ 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'గ్లోబల్ స్టార్' అనే ట్యాగ్‌ని అటు చిత్ర నిర్మాతలు గానీ ఇటు అభిమానులు గానీ గట్టిగానే ప్రమోట్ చేశారు. మొన్నటి వరకు ఈ ట్యాగ్ తరచుగా కనిపించేది. కానీ ఇప్పుడది మాయమైపోయింది. అవును మీరు విన్నది నిజమే.(ఇదీ చదవండి: పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం మాధురి ఎలిమినేట్!)ప్రస్తుతం చరణ్ 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. శ్రీలంకలో ఈ మధ్యే సాంగ్ షూట్ కూడా చేశారు. తాజాగా శనివారం హఠాత్తుగా హీరోయిన్ జాన్వీ కపూర్ పోస్టర్స్ రెండు రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ.. అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుందని ప్రకటించారు. ఈ పోస్టర్స్‌లో రామ్ చరణ్ పేరుకి ముందు మళ్లీ పాత ట్యాగ్ 'మెగా పవర్ స్టార్' అని కనిపించింది. దీంతో మళ్లీ ఎందుకు మార్చేశారా అని మాట్లాడుకుంటున్నారు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం చరణ్ అంగీకారంతోనే ఈ ట్యాగ్ మార్పు జరిగిందని, ఇకపై ఇదే ట్యాగ్ వాడాలని అనుకుంటున్నారట. ఇదేనా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. 'పెద్ది' సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) -
'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తెలుగులో చేస్తున్న రెండో సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ నెలలో తొలి పాట రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)'దేవర'లో ఎన్టీఆర్ సరసన పల్లెటూరి అమ్మాయిలా చేసిన జాన్వీ కపూర్.. 'పెద్ది'లోనూ దాదాపు అలాంటి రోల్ లోనే కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్‌తో క్లారిటీ వచ్చేసింది. అచ్చియమ్మ అనేది జాన్వీ పాత్ర పేరు. చూస్తుంటే ఈమెది మైక్ సెట్టింగ్ నిర్వహించే పాత్రలా కనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.'పెద్ది' మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా కాగా.. 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమన్ సంగీతమందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే మార్చి 27న మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్స్‌లో కాస్త ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తుంది. మరి అనుకున్న తేదీకి వస్తారా లేదంటే వాయిదా పడొచ్చా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)Our #Peddi's love with a firebrand attitude 😎🔥Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/mdU2a3oxp6— BuchiBabuSana (@BuchiBabuSana) November 1, 2025 -
విన్నారా... విన్నారా?
ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్‌కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్‌తో... హీరో రవితేజ జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్‌తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్‌తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్‌తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్‌కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి గురువారం రామ్‌చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్‌చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్‌చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్‌తో రామ్‌చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్‌చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్‌తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్‌కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్‌హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్‌కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్‌కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్‌తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్‌ను చేయనున్నారట. అలాగే శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్‌కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్‌తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
"జైలర్" డైరెక్టర్ నెల్సన్ ఇప్పుడు రామ్ చరణ్ తో
-
శ్రీలంకలో పెద్ది పాట
ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్‌చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్‌లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్‌చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్‌చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని చరణ్‌ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఉపాసన గుడ్ న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
-
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్‌లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్‌కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్‌లాల్ వంటి యాక్టర్స్‌తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్‌తో చేయాల్సిన మూవీని సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్‌చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్‌కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్‌తో చేసే చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్‌లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్‌గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?
మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు వెల్లివిరాశాయి. హీరో రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడే ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్‌చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకోగా 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే! కవలలు రాబోతున్నారుమళ్లీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం (కవలలు) రాబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అని పేర్కొన్నారు. ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం వెనక కారణం ఉంది. ఆమె కవలలకు జన్మనివ్వనున్నారు.చిరంజీవి కుటుంబంచిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు రామ్‌చరణ్, సుస్మిత, శ్రీజ.. అని ముగ్గురు సంతానం.. సుష్మితకు విష్ణుప్రసాద్‌తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీజకు శిరీష్ భరద్వాజ్‌తో పెళ్లవగా వీరికి నివృతి పాప పుట్టింది. తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం కల్యాణ్ దేవ్‌ను పెళ్లాడగా.. ఈ జంటకు కూతురు నవిష్క జన్మించింది. కొంతకాలానికి శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయపభేదాలు రావడంతో విడిపోయారు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప పుట్టింది. అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.చిరంజీవి కోరిక నెరవేరేనా?దీంతో ఓ ఈవెంట్లో చిరు.. ఇంట్లో ఉంటే నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లే.. ఒక్క మగాడు కూడా లేడు. చరణ్.. ఈసారైనా ఒక అబ్బాయిని కనరా.. నా వారసత్వం ముందుకెళ్లాలని కోరిక.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కాబట్టి ఓ మగపిల్లాడిని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఆడపిల్ల పుడుతుందని భయపడటమే తప్పని పలువురూ అభిప్రాయపడ్డారు. మరి ఈసారి పుట్టే కవలల్లో ఒక్కరైనా మగపిల్లాడు ఉంటాడేమో చూడాలి! View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్! -
'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన కొణిదెల
-
ఉపాసన గుడ్‌న్యూస్.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్ చేశారు. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెసింగ్స్ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన మొదటిసారి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి ఇంట్లో ఇలాగే ఒక వేడుకలా చేశారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం చూడొచ్చు. ఆపై ఆమెకు పూలు, పండ్లు, కానుకలు అందించిన పెద్దలు ఆశీర్వదించారు. మెగా కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సందడిగా కనిపించారు.మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే 'సింబా' వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
చిరుతో రామ్ చరణ్ మరో భారీ ప్లాన్..
-
రంగస్థలం - 2 సినిమాకు రంగం సిద్ధం
-
చెర్రీ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త.. సుక్కు సినిమాకు ముహూర్తం ఫిక్స్..!
-
ఫిబ్రవరిలో ప్రారంభం
‘రంగస్థలం’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దుబాయ్‌లో జోరుగా జరుగుతున్నాయని తెలిసింది. గతంలో రామ్‌చరణ్, సుకుమార్ కలిసి ఈ సినిమా కథా చర్చల కోసం దుబాయ్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దుబాయ్‌లో ఉంటూ, ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట.ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కృతీ సనన్, సమంత వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలోని ఈ సినిమా వచ్చే మార్చి 27న రిలీజ్ కానుంది. -
శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్‌చరణ్.. వీడియో చూశారా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ చిరుత (2007) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ శ్రియ 2001లో వచ్చిన ఇష్టం చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. అంటే చరణ్ కంటే శ్రియ సీనియర్. వీరిద్దరూ జంటగా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్లో చరణ్ తల్లిగా కనిపించింది.తొలిసారి కెమెరా ముందు రామ్చరణ్దానికంటే ముందు కూడా వీరు కలిసి యాక్ట్ చేశారు. అదెప్పుడంటారా? ఓ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఓ సీన్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సదరు ఇన్స్టిట్యూట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యాక్టింగ్ కోచ్ కిశోర్ నమిత్ కపూర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ (Ram Charan), శ్రియా శరణ్‌లపై ఓ సీన్ చిత్రీకరించాం. చరణ్ కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి.ఇబ్బందిపడ్డ చరణ్చెప్పాలంటే అది ఒక వరంలాంటిది. ఫస్ట్ టైం కావడంతో చరణ్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. శ్రియా (Shriya Saran) అప్పటికే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలా సినిమాలు చేసింది. కానీ శిక్షణ తీసుకుంటే మరింత రాటుదేలుతుందని నా అభిప్రాయం. కోచ్‌గా తనకెప్పుడూ పాజిటివ్ ఫీడ్‌బ్యాకే ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్‌గా మారింది. అందులో చరణ్ కాస్త పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, కళ్లజోడుతో కనిపించాడు. కెమెరా వంక చూసేందుకు సిగ్గుపడ్డాడు. డైలాగులు చెప్పేందుకు తనలో తానే ఘర్షణకు లోనయ్యాడు.అప్పటికీ, ఇప్పటికీ అంతే అందం!అప్పటికే శ్రియ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ కావడంతో ఏమాత్రం బెరుకు లేకుండా యాక్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. చరణ్ ఇలా ఉన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెలా ఉన్నాడు? ఇప్పుడే రేంజ్‌కు ఎదిగిపోయాడు అని కొందరు అబ్బురపడుతున్నారు. శ్రియ.. అప్పటికీ, ఇప్పటికీ అంతే అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. శ్రియ చివరగా మిరాయ్ సినిమాలో నటించింది. రామ్‌చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ మూవీ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) చదవండి: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో -
మరోసారి చిరు - రామ్ చరణ్ మూవీ ఫిక్స్..!
-
పెద్ది తర్వాత నీల్ తో .. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.'మన ప్రధానమంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుకున్న విజన్‌ని పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఏపీఎల్ ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు.మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్‌కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
రాజమౌళికి 'జక్కన్న' పేరు ఎవరు పెట్టారో తెలుసా? (ఫోటోలు)
-
పుణేకి పెద్ది
ప్రేయసితో కలిసి పుణేలో ల్యాండ్ అయ్యాడు పెద్ది. అక్కడి అందమైన పరిసరాల్లో ఇద్దరూ ఆటా పాటా మొదలుపెట్టారు. రామ్‌చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించినదే ఈ ఆటా పాటా. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పుణేలో ఆరంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ పై ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ రత్నవేలు. -
దుర్గాష్టమి వేడుకల్లో మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
రామ్ చరణ్ - ప్రశాంత్ నీల్ డేట్స్ లాక్..!
-
క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మెగా గారాలపట్టి క్లీంకార పుట్టింది. అయితే పుట్టి ఏడాది దాటిపోయినా సరే ఇప్పటికీ చిన్నారి ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది.'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్‌కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)అలానే స్టార్ హీరోకు భార్య అనే ట్యాగ్ గురించి మాట్లాడిన ఉపాసన.. సానుకూలంగానే స్పందించింది. 'నన్ను ఎలాంటి ట్యాగ్‌తో పిలిచినా ఇష్టమే. ఎవరైనా మనకు ఓ ట్యాగ్ ఇచ్చారంటే వాళ్లు మనల్ని ఇష్టపడుతున్నట్లే కదా. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. అలానే ఇది ఓ బాధ్యత కూడా' అని చెప్పింది.ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్' సినిమాతో వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఉపాసన విషయానికొస్తే.. తల్లిగా క్లీంకారని చూసుకుంటూనే మరోవైపు ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటోంది. ఈ మధ్యే ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో ఛైర్మన్‌గానూ ఉపాసనని నియమించారు. ఇలా పలు పనులు చేస్తూనే తల్లిగానూ క్లీంకారని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
పెద్ది లుక్‌తో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన రామ్ చరణ్ (ఫొటోలు)
-
ఫ్లాప్ హీరోయిన్ కు రామ్ చరణ్ బంపర్ ఆఫర్
-
తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ పోస్ట్ చేశారు.రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
మెగాస్టార్ 47.. రామ్ చరణ్ 18.. బుచ్చిబాబు స్పెషల్ విషెస్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన సినీ ప్రయాణంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన చిరు.. తన మొదటి సినిమా ప్రాణం ఖరీదును గుర్తు చేసుకుంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేటికి సరిగ్గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చెర్రీకి అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు స్పెషల్ డే కావడంతో పెద్ది మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. అరంగేట్రం నుంచి మీ సినీప్రయాణం అద్భుతమంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన జర్నీలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కెరీర్లో పెద్ది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెర్రీ అభిమానులకు బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా అలరించనుంది. మెగా హీరో రామ్ చరణ్.. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 18 YEARS OF “MEGA POWER STAR” IN CINEMA ❤🔥From the most awaited debut to one of the most celebrated actors, your journey in cinema has been sensational @AlwaysRamCharan Sir ❤️I'm so happy to be a part of this incredible journey Sir ❤️🤗🙏Dear @AlwaysRamCharan fans, #Peddi… pic.twitter.com/QCLQFCRGqt— BuchiBabuSana (@BuchiBabuSana) September 28, 2025 -
రామ్ చరణ్ - సుకుమార్ మూవీ అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగే
-
రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?
మెగాహీరో రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన గ్లింప్స్ చూసి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఇది ఓకే అయింది. తాజాగా ఈ సినిమా పనులు కూడా షురూ అయ్యాయి. అయితే హీరోయిన్ గురించి వినిపిస్తున్న రూమర్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది.చరణ్-సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మరోసారి ఈ కాంబో అనేసరికి అంచనాలు గట్టిగానే ఏర్పడుతున్నాయి. మరోవైపు 'పుష్ప' ఫ్రాంచైజీ తర్వాత సుకుమార్ తీస్తున్న ప్రాజెక్ట్ కావడం కూడా హైప్‌కి కారణం. ఈ మూవీలో హీరోయిన్గా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని లాక్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయని, త్వరలోనే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రియుడి వల్ల ప్రతిరోజూ శారీరకంగా టార్చర్: ఆర్జీవీ హీరోయిన్)కృతి సనన్ విషయానికొస్తే సుకుమార్ తీసిన 'వన్ నేనొక్కడినే' సినిమాతోనే హీరోయిన్ అయింది. తర్వాత తెలుగులో 'దోచెయ్' చేసింది గానీ ఈ రెండూ ఫెయిలయ్యాయి. దీంతో పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మధ్యలో కొన్ని హిట్స్ కొట్టినప్పటికీ.. గత రెండు మూడేళ్లలో మాత్రం ఈమె చేసిన సినిమాలు చేసినట్లు ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఇలాంటి ఈమెని ఇప్పుడు చరణ్ సరసన హీరోయిన్గా తీసుకుంటున్నారనేసరికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.అయితే సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడ ఇంపార్టెన్స్ కచ్చితంగా ఉంటుంది. బహుశా పాన్ ఇండియా ఇమేజ్ దృష్ట్యా కృతి సనన్ పేరు పరిశీలిస్తున్నారా అనే సందేహం కూడా వస్తోంది. చూడాల మరి ఎవరిని ఫైనల్ చేస్తారో? ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలున్నాయి. 2027లో రిలీజ్ కావొచ్చని టాక్.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా ట్రైలర్ రిలీజ్) -
రామ్‌చరణ్‌తో జోడీ?
హీరో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పాన్ఇండియా సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్. ‘ఆర్సీ 17’ అన్నది వర్కింగ్ టైటిల్. ‘రంగస్థలం’(2018) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు సుకుమార్. ‘పెద్ది’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఏమాత్రం విరామం లేకుండా ‘ఆర్సీ 17’ని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట రామ్‌చరణ్– సుకుమార్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.అయితే రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమా ద్వారా కృతీసనన్ని తెలుగుకి పరిచయం చేశారు సుకుమార్. ఆ తర్వాత ‘దోచెయ్, ఆదిపురుష్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారు కృతీసనన్. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీని ‘ఆర్సీ 17’ ద్వారా మరోసారి టాలీవుడ్‌కి తీసుకురానున్నారట సుకుమార్. మరి రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
కుమ్మేస్తున్న రామ్ చరణ్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే
-
ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు వేళాయె!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)... అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)... రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్)... టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)... ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)... ఇలా అన్ని ఆటల్లో లీగ్‌ల హవా సాగుతున్న వేళ...కొత్తగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు కూడా వచ్చే నెలలో తెరలేవనుంది. న్యూఢిల్లీ: ప్రతిభకు పట్టం కడుతూ... ఆటకు మరింత విస్తృత ప్రచారం కల్పిస్తూ... ప్రపంచ ఆర్చరీలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యంగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు అంకురార్పణ జరిగింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగునున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వివరాలను గురువారం నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్‌లో 48 మంది ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు. వారిలో 12 మంది విదేశీయులు కాగా... మిగిలిన 36 మంది స్వదేశీ ఆర్చర్లు. ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్లు ఆండ్రియా బెకెర్రా (కాంపౌండ్), బ్రాడీ ఎలీసన్ (రికర్వ్) ఈ లీగ్‌లో భాగం కానున్నారు. భారత్ నుంచి స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, బొమ్మదేవర ధీరజ్ ఇలా పలువురు ఆర్చర్లు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్, మాదాల సూర్య హంసిని, తెలంగాణ అమ్మాయి తనపర్తి చికిత కూడా ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ లీగ్‌తో భారత ఆర్చరీ ముఖచిత్రం మారిపోతుందని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) భావిస్తోంది. ‘ఆర్చరీలో మనకు ఘన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి మన దేశంలో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వరల్డ్‌కప్, వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్స్ ఇలా ప్రతి పోటీలోనూ భారత ఆర్చర్లు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో మాత్రం పతకం ఇంకా బాకీ ఉంది. ఈ లీగ్ ద్వారా ఆ ముచ్చట కూడా తీరడం ఖాయమే’ అని ఏఏఐ కార్యదర్శి వీరేంద్ర సచ్దేవ్ అన్నారు. » ఒక్కో జట్టులో నలుగురు మహిళలు, నలుగురు పురుష ఆర్చర్ల చొప్పున 8 మంది ఉంటారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఆరుగురు భారత ఆర్చర్లు ఉంటారు. విదేశీయుల్లో ఒకరు పురుష ఆర్చర్, మరొకరు మహిళా ఆర్చర్ ఉంటారు. » భారత ఆర్చరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆర్చర్లను ఎంపిక చేశారు. » కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఒలింపిక్ ప్రమాణాలకు తగ్గట్లు 70 మీటర్లు, 50 మీటర్లలో పోటీలు జరుగుతాయి. ఈ లీగ్ మొత్తం ప్రైజ్‌మనీ 2 కోట్ల రూపాయలు. » రౌండ్ రాబిన్ పద్ధతిలో రోజుకు మూడు మ్యాచ్‌లు (20 నిమిషాలు) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాణం సంధించేందుకు 20 సెకన్ల సమయం ఇస్తుండగా... ఈ లీగ్‌లో 15 సెకన్లకు తగ్గించారు. » రికర్వ్ విభాగంలో మూడో ర్యాంకర్ దీపిక కుమారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌తో పాటు వెటరన్స్ అతాను దాస్, తరుణ్‌దీప్ ఉన్నారు. » కాంపౌండ్ విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ రిషభ్ యాదవ్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్, పర్ణీత్ కౌర్ బరిలో ఉన్నారు. ఏ జట్టులో ఎవరున్నారంటే...పృథ్వీరాజ్ యోధాస్ (ఢిల్లీ): మాటియస్ గ్రాండె, ఆండ్రియా బికెర్రా, అభిషేక్ వర్మ, గాథ, ప్రియాంశ్, శర్వరి, క్రిష్ కుమార్, ప్రాంజల్. చెరో ఆర్చర్స్ (జార్ఖండ్): మాథియస్ ఫుల్లెర్టన్, క్యాథరినా బ్యూర్, రాహుల్, ప్రీతిక ప్రదీప్, అతాను దాస్, మాదాల సూర్య హంసిని, సాహిల్ రాజేశ్, కుంకుమ్ మొహొద్. కాకతీయ నైట్స్ (తెలంగాణ): నికో వైనెర్, ఎలియా క్యానల్స్, నీరజ్, వెన్నం జ్యోతి సురేఖ, రోహిత్, అవ్నీత్, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, తిషా పునియా. చోళా చీఫ్స్ (తమిళనాడు): బ్రాడీ ఎలీసన్, మీరి మారిటా, రిషభ్ యాదవ్, దీపిక కుమారి, తరుణ్‌దీప్ రాయ్, తనిపర్తి చికిత, పులకిత్, అన్షిక కుమారి. మైటీ మరాఠాస్ (మహారాష్ట్ర): మైక్ స్కాలెస్సర్, అలెగ్జాండ్రా వాలెన్సియా, బొమ్మదేవర ధీరజ్, పరీ్ణత్ కౌర్, అమన్ సైనీ, భజన్ కౌర్, మృణాల్ చౌహాన్, మధుర. రాజ్‌పుతానా రాయల్స్ (రాజస్తాన్): మెటా గాజోజ్, ఎల్లా గిబ్సన్, ప్రథమేశ్, అంకిత, ఓజస్ ప్రవీణ్, బసంతి, సచిన్ గుప్తా, స్వాతి. ఏపీఎల్ డైరెక్టర్‌గా అనిల్ కామినేని ఈ లీగ్‌కు రూపకల్పన చేసిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ కామినేని... ఏపీఎల్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొంటున్న ఈ లీగ్‌తో భారత ఆర్చర్లకు ఎంతో లాభం జరుగుతుందని అనిల్ వెల్లడించారు. ‘ప్రపంచ ఆర్చరీ సంఘంతో ఈ లీగ్ గురించి చర్చించాం. ఇకపై ప్రతీఏటా దీన్ని నిర్వహిస్తామని అందుకు తగ్గట్లు అంతర్జాతీయ షెడ్యూల్ రూపొందించాలని చెప్పాం. ప్రస్తుతం ఆర్చరీలో దక్షిణ కొరియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆరంభ లీగ్‌లో పలువురు కొరియా స్టార్లు పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. అయితే ఈ లీగ్ సమయంలో వారి దేశంలో సెలెక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. ఫలితంగా ఈసారి నుంచి కాకుండా వచ్చే ఏడాది కొరియా ప్లేయర్లను కూడా చూడవచ్చు’ అని అనిల్ తెలిపారు. సినీనటుడు రామ్‌చరణ్ ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. ప్రపంచ ఆర్చరీలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ఈ లీగ్ రూపకల్పన చేసినట్లు డైరెక్టర్ అనిల్ కామినేని వెల్లడించారు. ఆర్చరీలో కొత్త విప్లవం తీసుకొచ్చి తద్వారా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలపడమే తమ ధ్యేయమని తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్చరీని మరింత మందికి చేరువ చేసేందుకు రామ్‌చరణ్‌ను అంబాసిడర్‌గా ఎంపికచేసినట్లు వివరించారు. -
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
భారత్‌లో తొలిసారి జరుగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)కు గ్లోబల్ ఐకాన్ రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఏపీఎల్ అరంగేట్రం ఎడిషన్ న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జరుగనుంది.ఈ లీగ్‌లో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లు పోటీ పడనున్నారు. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ లీగ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. ఇందులో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడనున్నారు. ఈ లీగ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీ పడతారు. View this post on Instagram A post shared by Archery Premier League (@archerypremierleague)ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఫోకస్, స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే ఏపీఎల్‌తో బంధం ఏర్పరచుకున్నాను. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ లీగ్ భారత ఆర్చర్లకు గ్లోబల్ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు ప్రతిభ నిరూపించుకునేందుకు ఏపీఎల్ వేదికగా ఉపయోగపడనుంది. ఈ లీగ్ వారి భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు తోడ్పడుతుందన్న గట్టి నమ్మకం మాకుంది. ఆర్చరీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ లీగ్ దోహదపడుతుంది. రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో బ్రాండ్ అంబాసీడర్‌గా ఉండటం వల్ల దేశంలోని చాలా మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితులయ్యే ఆస్కారం ఉంటుందని అన్నారు.ఏఏఐ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. దేశంలోని మిగతా లీగ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్చరీ లీగ్‌ను ఏర్పాటు చేశాం. ఏపీఎల్‌ను ప్రొఫెషనల్ స్థాయికి తగ్గట్లుగా నిర్వహిస్తాం. ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు, భారత ఒలింపిక్ స్వప్నాన్ని సాకారం చేసే మెట్టుగా మారనుంది. రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్ ఉండటం ద్వారా ఈ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. -
పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.పెద్దిలో పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అంతే రేంజ్లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్ నటి విజి చంద్రశేఖర్‌ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటిస్తుందని టాక్ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్‌బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్‌స్టోన్స్, డైమండ్స్ వాచ్‌ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్‌తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్‌బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్‌గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్‌టైల్ ఆటోమేటిక్ టూర్‌బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్‌లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్‌ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.మహేశ్ బాబుకి ఏఎమ్‌బీ, అల్లు అర్జున్‌కి ఏఏఏ, రవితేజకు ఏఆర్టీ, విజయ్ దేవరకొండకు ఏవీడీ పేరుతో మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆసియన్ సునీల్‌తో కలిసి ఈ హీరోలందరూ థియేటర్ బిజినెస్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ రంగంలోకి రాబోతున్నారట. త్వరలో లాంఛనంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు)అయితే పైన చెప్పిన హీరోలందరికీ మల్టీప్లెక్స్‌లు తెలంగాణలోనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్.. తన ఏఏఏ సినిమాస్‌ని వైజాగ్‌లోనూ లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆంధ్రాలోనే ఏఆర్సీ(ARC) సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం చర్చలో దశలో ఉందని, త్వరలో ఎక్కడ నిర్మించాలనేది ఫిక్సవుతారని టాక్ వినిపిస్తోంది. మరి బన్నీలానే చరణ్ కూడా వైజాగ్‌లోనే థియేటర్ నిర్మిస్తాడా? లేదంటే విజయవాడ, తిరుపతి లాంటి ఆప్షన్స్ చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఘోరమైన దెబ్బ పడింది. దీంతో 'పెద్ది' హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి 2' ఇంటర్వెల్ చూసి భయపడ్డా..: సందీప్ రెడ్డి వంగా) -
ధూమ్ 4 లో ప్రభాస్, ఎన్టీఆర్..? LCU లోకి రామ్ చరణ్..?
-
9 వారాల వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. వీడియో పోస్ట్ చేసిన మెగా కోడలు
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు చేసింది. గురు పౌర్ణమి రోజున ప్రారంభించిన సాయిబాబా వ్రతం పూర్తి చేసుకుంది. తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశానని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వ్రతాన్ని లతా సిస్టర్‌తో(క్లీంకార నర్సు) కలిసి ప్రారంభించినట్లు తెలిపింది.ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..' గురు పూర్ణిమ నాడు ప్రారంభమైన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింగి. శాంతి, విశ్వాసం, స్వస్థతతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్సు లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించా. నేను అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఆశీర్వదించినందుకు బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు. మీ కృపతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నా. అత్తమ్మాస్ కిచెన్ తరఫున ఈ రోజు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నాము. జై సాయిరామ్' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మొదటి పాటకి వేళాయె
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి మొదటి పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు రామ్‌చరణ్, బుచ్చిబాబు, వెంకట సతీష్ కలిసి ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఉన్న ఫోటోని షేర్ చేసింది యూనిట్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్. -
Sukumar: పెద్ది కోసం ఊహించని కొత్త స్టోరీ రెడీ..!
-
'మోగ్లీ' గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్
-
కర్ణాటక సీఎంతో రామ్‌చరణ్ భేటీ
కర్ణాటక: మైసూరు వద్ద సినిమా షూటింగ్లో ఉన్న సినీ నటుడు రామ్‌చరణ్ ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా మైసూరు నగరం చుట్టుపక్కల ‘పెద్ది’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మైసూరులోని నివాసంలో సీఎం సిద్దరామయ్య ఉన్నట్లు తెలుసుకున్న రామ్‌చరణ్ వచ్చి ఆయన్ను కలిశారు. శాలువాతో సిద్దరామయ్యను సన్మానించి కొంతసేపు ముచ్చటించారు. -
అమ్మమ్మని చివరి చూపు చూడటానికి వచ్చిన రామ్ చరణ్
-
రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్‌తో స్పెషల్ సాంగ్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్‌ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. May Lord Ganesha bring peace, success and positivity into your lives.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ✨@PeddiMovieOffl pic.twitter.com/DmGpC7wbuZ— Ram Charan (@AlwaysRamCharan) August 27, 2025 -
వారి కోసం రెండు షిఫ్టులు పని చేస్తాను: శ్రీలీల
ఈ మధ్య సీనియర్ హీరో జగపతిబాబు కొత్తగా టాక్ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల తన తల్లితో కలిసి పాల్గొంది. కాగా ఈ షోలో శ్రీలీలకు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒకేసారి కాల్షీట్లు అడిగితే ముందు ఎవరికి కాల్షీట్ ఇస్తావ్? అనే ప్రశ్న ఎదురైంది. దానికి శ్రీలీల ఎప్పట్లానే తన స్టైల్లో గడసరి సమాధానం చెప్పింది. ఈ ఇద్దరి కోసం రెండు షిఫ్టులు పనిచేస్తుందట. ఇక మహేష్ బాబు, రవితేజలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారనే ప్రశ్నకు రవితేజ పేరు చెప్పింది.పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, రాబిన్‌హుడ్, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది. -
Yash Raj Films: ధూమ్-4 లో విలన్ ఎవరు
-
ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించా.. నాకు పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు!
'వారసత్వం వల్లో, నేను ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్లో ఈ స్థాయికి రాలేదు, నా స్వశక్తితో ఎదిగాను' అంటోంది రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Kamineni Konidela). 'ద ఖాస్ ఆద్మీ' పార్టీ పేరిట తన ఆలోచనలను సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. సంపద, హోదా, విజయం, పాపులారిటీ.. ఏది మనల్ని గొప్పవారిని చేస్తుంది? అంతర్గత లక్షణాలైన భావోద్వేగాలపై స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం గొప్పవారిని చేస్తాయా? దీనికి ఎక్కడా సరైన సమాధానం ఉండదు. ఎవరికి వారే తమలోనే సమాధానం వెతుక్కోవాలి. నిన్ను నువ్వు నమ్మడం, నిన్ను నువ్వు ప్రేమించి, నీకంటూ విలువ ఇచ్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యం అని నా అభిప్రాయం.సమాజం ప్రోత్సహించదుసమాజం ఎప్పుడూ ఆడవారిని వినయంతో మసులుకోమనే చెప్తుంది. ఏదైనా సరే.. మనవంతు వచ్చేవరకు ఆగమంటుంది. నిస్వార్థంగా ఉండటమే మంచిదని చెప్తుంది. పెద్ద కలలు కనేందుకు ఎంకరేజ్ చేయదు. మనం ఎదగడానికి ప్రోత్సహించదు. అయినా నేను మంచి స్థాయిలో నిలబడ్డాను. దీనికి నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం కారణం కాదు. అలాగే రామ్‌చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ నిలబడలేదు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించాను.కిందపడ్డ ప్రతిసారి లేచా..ఎలాగైనా సరే, జీవితంలో ఎదగాలని తాపత్రయపడ్డాను, పాటుపడ్డాను. కొన్నిసార్లు నాపై నాకే అనుమానం వేసేది. కిందపడ్డ ప్రతిసారి మళ్లీ లేచి నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంది. దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదు. అహంకారం గుర్తింపును కోరుతుంది. కానీ ఆత్మగౌరవం.. నిశ్శబ్ధంగా గుర్తింపును సృష్టిస్తుంది అని ఉపాసన రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ -
రామ్ చరణ్‌కి అమ్మగా ఛాన్స్.. రిజెక్ట్ చేసేశా: ప్రముఖ నటి
సినిమాల్లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. నిజ జీవితంలో హీరోల కంటే తక్కువ వయసులో ఉన్న కొందరు.. అదే హీరోలకు తల్లి-పిన్ని తరహా పాత్రలు చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మలయాళ నటికి ఏకంగా రామ్ చరణ్ తల్లిగా నటించే ఛాన్స్ వచ్చింది కానీ ఆమె దాన్ని మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఎవరామె? ఏంటి సంగతి?మలయాళ నటి స్వాసిక తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. రీసెంట్గా రిలీజైన నితిన్ 'తమ్ముడు' సినిమాలో చుట్ట కాలుస్తూ విలన్‌గా చేసింది ఈమెనే. 2009లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. మలయాళ, తమిళ సినిమాలు చేసింది. రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది రిలీజైన తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్‌కి తల్లిగా అద్భుతంగా నటించింది. ఈ మూవీ వచ్చిన తర్వాత నుంచి ఈమె తల్లి పాత్రలే చాలా వస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))'తల్లి పాత్రల ఆఫర్స్ వరసపెట్టి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కాదు గానీ రామ్ చరణ్‌కి తల్లిగా నటించే ఛాన్స్ రావడం మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చింది. 'పెద్ది' మూవీ కోసమే అడిగారు. కానీ నేను చేయనని చెప్పేశాను. చేసుంటే ఎలా ఉండేదే ఏమో గానీ ఇప్పుడు ఒప్పుకోవడం కరెక్ట్ కాదనిపించింది. భవిష్యత్తులో ఇదే అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తాను' అని స్వాసిక చెప్పుకొచ్చింది.ప్రస్తుతం స్వాసిక వయసు 33 ఏళ్లే. రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు. ఒకవేళ చేసుంటే మాత్రం క్రేజీగా ఉండేదేమో. స్వాసిక వ్యక్తిగత విషయానికొస్తే.. నటుడు ప్రేమ్ జాకబ్‌ని గత కొన్నేళ్లుగా ప్రేమించింది. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా వచ్చిన రెట్రో, మామన్, తమ్ముడు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సూర్య 'కరుప్పు' మూవీలో కీలక పాత్ర చేస్తోంది.'పెద్ది' విషయానికొస్తే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఓ గ్లింప్స్ రాగా అంచనాలు పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)🔥 #Swasika’s BOLD response to being offered a mother’s role in #RamCharan’s movie! 😱 #Swasika #RamCharan #Kollywood #TamilCinema #RamCharan𓃵 #Ramcharan #Peddi #Peddi #swasika pic.twitter.com/4JQoobYtHE— Mix Show (@MixShow1016584) August 24, 2025 -
‘అన్నయ్య’ రెండు..‘అబ్బాయ్’ ఒకటి.. మెగా ఫ్యాన్స్‌కి పండగే
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ (2023) కూడా డిజాస్టర్ అయింది. దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాకు లోనయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ‘అన్నయ్య’ నుంచి సినిమా రాకున్నా పర్లేదు..‘అబ్బాయ్’ నుంచి వస్తుంది కదా అనుకొని ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇలా ఈ ఏడాది అటు చిరు..ఇటు చరణ్ తమ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. కానీ వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్‌కి పండగ అనే చెప్పాలి. 2026లో చరణ్ ఒక చిత్రంతో పలకరిస్తే.. మెగాస్టార్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పండగకి వచ్చేస్తున్నాడుమెగాస్టార్ చిరంజీవి ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిరు స్థాయికి తగ్గ విజయమే లేదు. అందుకే 2026వ సంవత్సరాన్ని పక్కా ప్లాన్‌తో సెట్ చేసుకున్నాడు. సంక్రాంతి నుంచే అభిమానులను అలరించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది. చిరంజీవి నుంచి పుల్ ఫన్ మూవీ వచ్చి చాలా కాలమైంది. అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సింది. ఇందులో కూడా చిరుతో కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. పండగ వేళ వస్తున్న చిత్రం... కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యతను మెగా అభిమానులు తీసుకోవడం గ్యారెంటీ. సమ్మర్ స్పెషల్ఇక ఇదే ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా రాబోతుంది. అదే విశ్వంభర. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రమిది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అయితే గతంలో విడుదైన టీజర్‌లోని వీఎఫెక్స్ సీన్లపై విమర్శలు రావడంతో రిలీజ్‌ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తో అబ్బాయ్.. ఇక 2026లో మెగా ఫ్యాన్స్‌కి ‘అబ్బాయ్’(రామ్ చరణ్) కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌తో భారీ అపజయాన్ని అందుకున్న చరణ్.. ‘పెద్ది’తో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది చిరంజీవి రెండు, చరణ్ ఒక చిత్రంలో ఫ్యాన్స్‌ని అలరించబోతున్నారు. -
నువ్వు నా హీరో.. తండ్రి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన రామ్‌చరణ్
తండ్రే తనకు ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan). నేడు (ఆగస్టు 22) చిరంజీవి (Chiranjeevi Konidela) 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కేక్ కట్ చేయించి, బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు చరణ్. తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన్ను మనసారా హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవికి కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.నా హీరో..నాన్నా.. ఈరోజు కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు. నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు. నా హీరో, నా గైడ్, నా ఇన్స్పిరేషన్.. అన్నీ నువ్వే! నా ప్రతి విజయం, నేను పాటించే విలువలన్నీ నీ నుంచి వచ్చినవే.. 70 ఏళ్ల వయసు వచ్చినా నీ మనసు మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతోంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మరెన్నో యేళ్లు గడపాలని కోరుకుంటున్నాను. ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ నాన్న.. అంటూ రామ్‌చరణ్ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్ -
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన ముద్దల కూతురు క్లీంకార ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటికీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆమె ముఖం కనిపించకుండా తీసిన ఫొటోల్ని ఇన్‌స్టాలో ఉపాసన పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైన పండుగ లేదా ఇంట్లో శుభకార్యం ఉంటే ఆ విశేషాలతో పాటు తమ కూతురి ఫోటోలను అభిమానులతో ఉపాసన షేర్ చేస్తారు. ఈసారి క్లీంకార తీసుకునే ఆహారం గురించి ఉపాసన చెప్పారు. రోజూ తన డైట్లో ఒక పదార్థం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.క్లీంకార రోజూ తీసుకునే డైట్లో 'రాగులు' తప్పకుండా ఉంటాయని ఉపాసన ఇలా చెప్పారు.' రాగులతో తయారు అయిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నప్పట్నుంచి నాకు చాలా ఇష్టమైన ఆహారం కూడా ఇదే. దీంతో క్లీంకారకు కూడా దీనినే అలవాటు చేశాను. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా నాతో ఒకసారి మాట్లాడుతూ.. క్లీంకారకు రోజూ రాగుల్ని ఏదో రూపంలో అందించమని సూచించారు. ఆయన కూతరు రాధే జగ్గీ కూడా ఇదే మాట చెప్పింది. తను కూడా చిన్నప్పట్నుంచీ రాగి జావ తాగేదానినని పేర్కొంది. అందికే వారిద్దరూ ఫిట్‌గా ఉన్నారు. భవిష్యత్‌లో నా కూతురు కూడా హెల్దీగా ఉండాలని తన రోజువారి డైట్లో రాగుల్ని చేర్చాను' అంటూ ఆమె చెప్పారు. అయితే, వైద్యుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మోతాదుకు మించకుండా ఉపయోగించాలని లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయిని తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే రాగుల్ని అలవాటు చేయడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. -
'ధూమ్ 4'లో చెర్రీ, ఎన్టీఆర్..?
-
సరికొత్త పెద్ది
‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలోని మరొక లుక్ కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రామ్‌చరణ్‌ను సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేయనున్నారు. ‘‘ఈ లుక్‌లో రామ్‌చరణ్ స్టైల్, స్వాగ్ వినూత్నంగా, ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రంగస్థలం -2 ప్లాన్ స్టార్ట్?
-
ఉపాసన కోసం 200 నంబర్స్ మార్చిన చెర్రీ..!
-
ఉపాసన ఫోన్లో చరణ్ నెంబర్ ఏ పేరుతో ఉంటుందో తెలుసా?
సినిమా సెలబ్రిటీల జీవనశైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను, సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు? రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లు ఏమిటి? జీవిత భాగస్వామితో వాళ్లు ఎలా ఉంటారు? తదితర విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.ఆ పేరుతో చరణ్ మొబైల్ నెంబర్సాధారణంగా భార్యభర్తలు తమ భాగస్వామి మొబైల్ నెంబర్లను ముద్దు పేరుతో సేవ్ చేసుకుంటారు. మహిళలు అయితే తమ భర్త పేరుని హబ్బీ, బేబీ, స్వీట్హార్ట్, మై లవ్..తదితర పేర్లతో సేవ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం చరణ్ నెంబర్ని వెరైటీ పేరుతో సేవ్ చేసుకుంది. తన ఫోన్లో చరణ్ నెంబర్ని ‘రామ్ చరణ్ 200(Ram Charan 200)’ అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఉపాసననే తెలియజేస్తూ..ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా చెప్పింది.అందుకే ఆ పేరు.. చరణ్ నెంబర్ని రామ్ చరణ్ 200 అని ఎందుకు సేవ్ చేసుకుందో ఉపాసన వివరించింది. ప్రస్తుతం చరణ్ వాడుతున్న సిమ్ సంఖ్య ఇదట. ఇప్పటి వరకు ఆయన 199 సార్లు తన మొబైల్ నెంబర్ని మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్ అట. అందుకే రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నానని నవ్వూతూ చెప్పింది ఉపాసన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చరణ్ 200 సార్లు మొబైల్ నెంబర్స్ మార్చారా? అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఊ అంటారా?
బ్లాక్‌బస్టర్ సినిమా ‘రంగస్థలం’ తర్వాత హీరో రామ్‌చరణ్, హీరోయిన్ సమంత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ... వీరిద్దరూ ఈసారి హీరో, హీరోయిన్లుగా నటించడంలేదట. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీల వంటి హీరోయిన్ల పేర్లు వినిపించగా, తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ (2021) సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావ...’ స్పెషల్ సాంగ్ బాగాపాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఈపాట తర్వాత సమంత మరో స్పెషల్ సాంగ్ చేయలేదు. మరి... రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేకపాటకు సమంత ‘ఊ’ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్ -
షూటింగులు బంద్.. పెద్ది సినిమాకు ఎఫెక్ట్
-
బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన రామ్ చరణ్ - ఉపాసన (ఫొటోలు)
-
ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?
మెగా హీరో రామ్ చరణ్.. 13 ఏళ్ల క్రితం ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం తర్వాత లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ వచ్చారు గానీ గత కొన్నేళ్లలో మాత్రం సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ ఫుడ్ వ్లాగ్స్ చేసే హిందీ యూట్యూబర్.. ఉపాసనని ఇంటర్వ్యూ చేసింది. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి, ఫుడ్ తింటూ ఆనాటి సంగతుల్ని అడిగింది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు రామ్ చరణ్‌కి పెట్టిన లవ్ టెస్ట్ గురించి ఉపాసన బయటపెట్టింది.(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)చరణ్-ఉపాసనలది పెద్దల కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. పెళ్లికి ముందే కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఓ రోజు ఉపాసన.. 'చరణ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే 'ఫేమస్ ఐస్ క్రీమ్' షాప్‌కి తీసుకెళ్లు అని అడిగాను. అప్పుడు మా ఫ్యామిలీ ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉండేవాళ్లం. అక్కడే మొజంజాహి మార్కెట్లో ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అది నా ఫేవరెట్' 'హైదరాబాద్‌లో ఉన్న పాత ఐస్ క్రీమ్ షాప్స్‌లో అదొకటి. అది మార్కెట్ మధ్యలో ఉంటుంది. అప్పటికే చరణ్ స్టార్. అందరూ గుర్తుపడతారు. అయినా సరే నేను అడిగానని ఓకే చెప్పి తీసుకెళ్లాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. కానీ అక్కడి జనాలు చరణ్‌ని గుర్తుపట్టి మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను అతడికి పెట్టిన నిజమైన లవ్ టెస్ట్ అదే' అని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మెగా కోడలికి తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)అలానే తమ కుటుంబంలో ప్రారంభించిన 'అత్తమ్మాస్ కిచెన్' ఎలా ప్రారంభమైందో కూడా ఉపాసన చెప్పుకొచ్చింది. 'మా ఇంట్లో అందరూ బాగా తింటారు. బాగా వండుతారు కూడా. మేం వేరే దేశాలకు వెళ్లినప్పుడు బెస్ట్ రెస్టారెంట్స్‌కి వెళ్తాం. అయినా సరే అక్కడ రాత్రయ్యేసరికి.. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని చరణ్ అడుగుతాడు. ఆ టైంలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. బయట దేశాలకు వెళ్లినప్పుడు ఇలా చరణ్ చాలా కష్టపడేవాడు. అలా అత్తమ్మాస్ కిచెన్ ఆలోచన వచ్చింది' అని చెప్పింది.'అయితే ఈ బిజినెస్ గురించి తొలుత మా అత్తమ్మకు(సురేఖ) చెబితే ఎందుకు అని అన్నారు. విదేశాలకు వెళ్లినా మనలానే చాలామంది సౌత్ ఇండియన్ ఫుడ్ వెతుక్కోవడం కష్టం. అందుకే ఈ బిజినెస్ అని చెప్పాను. ఈ బిజినెస్‌కి చాలా పేర్లు అనుకున్నాం కానీ చివరకు అత్తమ్మాస్ కిచెన్ అని ఫిక్సయ్యాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?) -
వీకెండ్ వర్కవుట్.. ఓకే ఫోటోలో మెగా హీరోలు!
మెగా హీరోలంతా ఓకే చోట సందడి చేశారు. జిమ్‌లో చెమట్చోస్తూ కనిపించారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీకెండ్లో ఇలా అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఏకంగా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పిక్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్నారు. సాయి దుర్గా తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టుకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
క్రికెట్ టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న పెద్ది షాట్!
ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీమ్‌కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. విజయవాడ సన్ షైనర్స్ టీమ్‌కు అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో పాటు పెద్ది మూవీలోని క్రికెట్ షాట్‌ను రీ క్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో విజయవాడ సన్ షైనర్స్ టీమ్ లీగ్‌లో పాల్గొంటొంది. ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు ఆడనున్నాయి.మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రూరల్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్ది మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయగా.. రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్లో డిఫరెంట్ షాట్‌ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.All the best to the teams participating. Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025 -
RC 17 స్టోరీ లైన్ లీక్.. హాలీవుడ్ రేంజ్ లో మూవీ
-
విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్


