పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం..! | Fans disappoint at Peddi Pre Release event police are not allowed | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం.!

Jun 1 2026 6:56 PM | Updated on Jun 1 2026 7:36 PM

Fans disappoint at Peddi Pre Release event police are not allowed

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. దీంతో పాస్‌లు పొందిన ఫ్యాన్స్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే ఐదున్నర గంటలకే గేట్లు మూసేయడంతో ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు.

p

దీంతో పెద్ది సినిమా రిలీజ్ ఈవెంట్ వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. పాసులు ఉన్నవారిని అనుమతించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సెలబ్రిటీ పాసులు తీసుకుని వివిధ జిల్లాల నుంచి అభిమానులు విజయవాడ చేరుకున్నారు.  తిరుపతి, నెల్లూరు వంటి సుదూరప్రాంతాల నుంచి ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. స్టేడియం ఫుల్ అయిపోందంటూ పోలీసులు అభిమానులను అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులతో అభిమానుల వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. 

p
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement