అది చాలా కష్టం.. కానీ రామ్ చరణ్‌ సాధించాడు: ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ | A R Rahman Comments On Mega Hero Ram Charan At Chennai Event, Calls Him A Proud Legacy Bearer, Deets Inside | Sakshi
Sakshi News home page

AR Rahman: రామ్ చరణ్‌లా ఎదగాలని కోరుకుంటున్నా: ఏఆర్ రెహమాన్ కామెంట్స్ వైరల్

May 31 2026 1:23 PM | Updated on May 31 2026 3:51 PM

A R Rahman Comments Mega Hero Ram Charan at chennai event

మెగా హీరో రామ్ చరణ్‌పై పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన చెర్రీపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ రామ్ చరణ్ అది సాధించి చూపించాడని రెహమాన్ అన్నారు. తండ్రి పేరును నిలబెట్టే కొడుకులా రామ్ చరణ్ నిలిచాడని కొనియాడారు. చరణ్‌లాగే నా కుమారుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే పెద్ది ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌ సైతం ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. జూన్ 3 వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement