పెద్ది మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే భారీస్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్‌కు ఒక్క రోజు ముందే థియేటర్లలో పెద్ది పండుగ వాతావరణం నెలకొంది. దీంతో హైదరాబాద్‌లో నగరంలో ప్రముఖ థియేటర్ల వద్ద అభిమాన హీరో రామ్ చరణ్ కటౌట్స్‌తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే రామ్ చరణ్ విగ్రహం కాస్తా ట్రోలింగ్‌కు గురైంది. అస్సలు రామ్ చరణ్‌లా లేదంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ్ చరణ్‌లా లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం విమర్శించారు. విగ్రహంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన అభిమాన సంఘం తమ పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం.. రామ్ చరణ్ విగ్రహంతో మా ప్రేమ, అభిమానం, భక్తిని ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాం అని క్లారిటీ ఇచ్చారు.
ఆ విగ్రహం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు జోజు జార్జ్‌లా ఉందని కొందరు ట్రోల్స్ చేశారు. మరికొందరు నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం? అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి.. రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.
— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026


