దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం RRR. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ఈ సినిమాలో “మల్లి” అనే చిన్నారి పాత్రను ట్వింకిల్ శర్మ పోషించింది. బ్రిటిష్ అధికారుల చేతిలో చిక్కుకున్న ఆ చిన్నారి పాత్ర కథలో భావోద్వేగాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆమెను విడిపించేందుకు భీమ్ చేసే ప్రయత్నాలు కథలో కీలక మలుపుకు దారి తీస్తాయి. సినిమా విడుదలైన నాలుగేళ్ల తర్వాత ఆ చిన్నారి “మల్లి” ఇప్పుడు ఎలా మారిపోయిందో ఓ లుక్కేయండి.


