కేసీఆర్.. నిన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం: సీఎం రేవంత్
సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తాకేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు.
రాహుల్‌నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
ఉన్నావ్ కేసు రాజకీయ మలుపు తీసుకుంటోంది. నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్ రావడంపై అభ్యంతరాలతో బాధితురాలు, ఆమె తల్లి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వాళ్లను మీడియాతో మాట్లాడనీయకుండా.. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ తల్లీకూతుళ్లు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. జర్మనీ పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చిన రాహుల్.. ఈ కేసు పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు బెయిల్.. బాధితులను నేరస్తుల్లా చూస్తారా?.. ఇదెక్కడి న్యాయం??. భారతదేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా(డెడ్ ఎకానమీ) మాత్రమే కాకుండా.. మృత సమాజంగా(డెడ్ సొసైటీ) కూడా మారుతోందని అంటూ ఇండియన్ గేట్ పరిణామంపై ఓ ట్వీట్ చేశారు. क्या एक गैंगरेप पीड़िता के साथ ऐसा व्यवहार उचित है?क्या उसकी “गलती” ये है कि वो न्याय के लिए अपनी आवाज़ उठाने की हिम्मत कर रही है?उसके अपराधी (पूर्व BJP MLA) को ज़मानत मिलना बेहद निराशाजनक और शर्मनाक है - खासकर तब, जब पीड़िता को बार-बार प्रताड़ित किया जा रहा हो, और वो डर के… https://t.co/BZqrVNXMOy— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025బుధవారం సాయంత్రం జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన బాధితురాలు, ఆమె తల్లి.. రాహుల్ గాంధీని కలిసి ఉన్నావ్ కేసు పురోగతిని.. తమకు ప్రాణహాని పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా పారామిలిటరీ సిబ్బంది తమతో ఎంత దురుసుగా ప్రవర్తించింది కూడా వివరించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసమే తానింకా బతికి ఉన్నానని.. తన పోరాటం ఆగదని బాధితురాలు రాహుల్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. ప్రతిపక్ష నేతనే కాదు.. ప్రధానిని కూడా కలిసే ప్రయత్నం చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలవాలని ఉంది. వాళ్లను కలిసి మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం.. అంతే’’ అని చెప్పిందామె. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఈ తీర్పుతో దేశంలోని అడబిడ్డలు తమ మానప్రాణాల కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని మా ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అంటే.. మేం ఇంటిలోనే బంధీగా ఉండాలని కోర్టు ఉద్దేశమా?’’ అని ఆందోళన వ్యక్తం చేసిందామె. అయితే తమ ఆశలు చావలేదని.. సుప్రీం కోర్టులో న్యాయం దక్కుతుందనే ఆశ నెలకొందని బాధితురాలు అంటోంది. ఇదిలా ఉంటే.. సెంగర్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో బాధితురాలు ఓ పిటిషన్ వేసింది.2017లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆనాడ.. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆపై ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఈ ఘటనతో పార్టీ అంతేకాదు.. ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఆమె తండ్రి హత్యకు గురికావడంతో పాటు బాధితురాలిపైనా హత్యాయత్నం జరిగాయి. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడగా ఇద్దరు బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం.. ఈ అభియోగాలన్నింటిని నిజాలుగా నిర్ధారించుకున్న ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్లో సెంగర్‌కి జీవితఖైదు విధించింది. ఆ సమయంలో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అయితే ఈ శిక్షను సెంగర్ సవాల్ చేయగా.. మంగళవారం(డిసెంబర్ 23, 2025) ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో నిందితుడు బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని ఆ తల్లీకూతుళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగుతుండడం.. సెంగార్ వర్గ ఓట్లను ఆకర్షించేందుకే కుల్దీప్ను బయటకు తెచ్చారనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంత్రి వ్యాఖ్యల దుమారంఉన్నావ్ బాధిత కుటుంబం నిరసన తెలపకుండా ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోవడంపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వెటకారంగా స్పందించారు. ‘‘ఆమెది ఉన్నావ్ కదా.. ఢిల్లీలో ఏం పని?’’ అంటూ యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో నెట్టింటకు చేరడంతో జనం ఆయన్ని తిట్టిపోస్తున్నారు.
ఇయర్‌ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్‌ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్‌ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్‌లో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్‌ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్‌ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్‌ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్‌తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్‌ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్‌ఫోన్స్‌ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?)
దారి కాచి మరీ భువనేశ్వరిని కాల్చి చంపిన భర్త
నీతో కలిసి జీవించలేను విడాకులు ఇవ్వమని నోటీసులిచ్చిన భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపాడో భర్త. వైవాహిక విభేదాలతో ఆమె భర్తను విడాకులు అడిగింది. అదే ఆమె చేసిన నేరం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.బాధితురాలిని భువనేశ్వరి (39)గా గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వర నగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త, నిందితుడు బాలమురుగన్ (40) ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఒక పనిచేసేవాడు. వీళ్లిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. వీరికి 2011లో వివాహమైంది. 2018లో బెంగళూరుకు మకాం మార్చారు. వీరికిద్దరు సంతానం. అయితే గత నాలుగేళ్లుగా బాలమురుగన్‌కు ఉద్యోగం లేదు. నెమ్మదిగా తగాదాలు మొదలయ్యాయి. దీంతో భార్యపై అనుమానం మొదలైంది. భువనేశ్వరి చట్టబద్ధంగా విడిపోవాలని కోరింది, దానిని బాల మురుగన్ వ్యతిరేకించాడు దీంతో వేరే బ్రాంచ్‌కు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకున్న భువనేశ్వరి గత ఏడాదికాలంగా 12 ఏళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి రాజాజీ నగర్లో వేరుగా నివాసముంటోంది. బాలమురుగన్ కేపీ అగ్రహారలో ఒంటరిగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం భువనేశ్వరి బాలమురుగన్‌కు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్అటు ఉద్యోగం లేదు, ఇటు భార్యతో గొడవలు, అనుమానం, విడాకుల నోటీసులు దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న బాలమురుగన్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. భార్య కదలికలను పసిగట్టి, సరిగ్గా ఆమె ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయంలో కాపుగాసి ఆమెను అడ్డుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, రాజాజీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1వ ప్రధాన రోడ్డులో చాలా సమీపంనుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పిస్టల్‌తో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.హొయసల పెట్రోల్ సిబ్బంది గాయపడిన భువనేశ్వరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికేఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన కాల్పులను భయాందోళనలు రేకెత్తించాయి. జనం పరుగులు తీశారు. రెండు బుల్లెట్లు భువనేశ్వరి తలపై దూసుకుపోగా, మిగిలిన రెండు బుల్లెట్లు ఆమె చేతికి తగిలాయి. నిందితుడు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇదే గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అతనికి ఆయుధం ఎలా వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
VHT.. విరాట్, రోహిత్ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక
ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం
'అంత పెద్ద మాటలొద్దు సార్.. మేం చిన్నపిల్లలం కాదు'..: శివాజీకి అనసూయ కౌంటర్
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
రాహుల్‌నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
శివాజీ వల్గర్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన రాజాసాబ్ బ్యూటీ..!
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
ఒకే ఒక్క రూల్.. ఎంతో మందిని ‘రిచ్’ చేసింది!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. వన్‌టైమ్ సెటిల్ మెంట్
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
సాక్షి కార్టూన్ 23-12-2025
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
VHT.. విరాట్, రోహిత్ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక
ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం
'అంత పెద్ద మాటలొద్దు సార్.. మేం చిన్నపిల్లలం కాదు'..: శివాజీకి అనసూయ కౌంటర్
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
రాహుల్‌నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
శివాజీ వల్గర్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన రాజాసాబ్ బ్యూటీ..!
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
ఒకే ఒక్క రూల్.. ఎంతో మందిని ‘రిచ్’ చేసింది!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. వన్‌టైమ్ సెటిల్ మెంట్
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
సాక్షి కార్టూన్ 23-12-2025
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
ఫొటోలు
వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)
అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)
గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్ కమెడియన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వైఎస్ జగన్ ప్రజాదర్బార్: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)
నా సూపర్‌స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
సినిమా
టాలీవుడ్ చిన్న చిత్రాలు.. సూపర్ హిట్స్.. అందువల్లే సక్సెస్..!
టాలీవుడ్లో ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలతో చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. భారీ తారాగణ, పెద్ద బడ్జెట్ సినిమాలకు కలెక్షన్స్ వస్తాయి. మరి చిన్న సినిమాల సంగతేంటి? అగ్రతారలు లేకపోయినా సినిమాలకు ఆదరణ దక్కడం అంతా ఈజీ కాదు. కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద రాణిస్తాయి. లేకపోతే వారం రోజుల్లోనే కనుమరుగవుతుంటాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు మాత్రం ఈ ఏడాది సత్తా చాటాయి. ఈ ఏడాదిలో పెద్ద స్టార్స్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన వచ్చిన ఆ చిన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం.కోర్ట్ మూవీ..ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో కోర్టు ఒకటి. మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని నిర్మించిన ఈ మూవీ.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్-శ్రీదేవి జంటగా అలరించారు. రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. ఈ మూవీ కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. దాదాపు రూ. 55 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.8 వసంతాలు..ఈ ఏడాగి సినీ ప్రియులను అలరించిన ప్రేమ కథా చిత్రం '8 వసంతాలు'. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొట్టింది. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.లిటిల్ హార్ట్స్..ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన మరో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల వద్ద అదరగొట్టిది. కేవలం మౌత్ టాక్‌తో పుంజుకుని ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.మ్యాడ్ స్క్వేర్..గతంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ అంతా సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సుమారు రూ. 65 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో మెప్పించారు.రాజు వెడ్స్ రాంబాయి..ఇటీవలే రిలీజైన సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు దాదాపు రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కించారు.
పెద్ద టైటిల్.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గురూ!
టైటిల్ క్యాచీగా ఉంటే ఆడియన్స్ అటెన్షన్‌ని ఈజీగా క్యాచ్ చేస్తుంది... అది చిన్న టైటిలా? పెద్ద టైటిలా? అన్నది కాదు. అయితే ఒక్కోసారి రెండక్షరాలతోనే టైటిల్ కుదరొచ్చు... ఇరవై అక్షరాలతోనూ కుదరొచ్చు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ చూస్తే మాత్రం ‘పెద్ద’ టైటిల్ ట్రెండ్ సాగుతున్నట్లనిపిస్తోంది. ఆ లెంగ్తీ టైటిల్స్ అన్నీ అచ్చ తెలుగులో చక్కగా క్యాచీగా ఉన్నాయి. ఆ టైటిల్స్, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు, ఆ కథా కమామీషులోకి వెళదాం. మన శంకరవరప్రసాద్‌గారు... ‘ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, విశ్వంభర’ వంటి చిన్న టైటిల్స్ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పెద్ద టైటిల్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కావడం విశేషం. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్, శశిరేఖల ప్రేమకథ, కుటుంబ గాథల కహానీ ఏంటి? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ (2019) చిత్రం తర్వాత చిరంజీవి–నయనతార జోడీగా నటిస్తున్న సినిమా ఇది (‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో అన్న, చెల్లెలుగా నటించారు). ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కేథరీన్ , సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార (శశిరేఖ), చిరంజీవి (వరప్రసాద్ పాత్రలో) భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అన్నది ‘మీసాల పిల్ల...’ అనే పాటలో చూపించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. అంతేకాదు... తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి–వెంకటేశ్ కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటస్తుండటంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి΄ాట ‘మీసాల పిల్ల...’, ద్వితీయ పాట ‘శశిరేఖ...’ ఏ స్థాయిలో శ్రోతలను అలరించాయో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47... కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని., మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించడంలో వెంకటేశ్ దిట్ట. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు... కెరీర్లో తొలిసారి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సాధించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక– హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ఈ నెల 10న ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో రానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా వెండితెరపై వినోదాల విందుని అందించనుంది. వెంకటేశ్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘నారప్ప, దశ్యం 2, ఎఫ్ 3, సైంధవ్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి షార్ట్ టైటిల్స్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న బిగ్ టైటిల్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి.... హీరో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ కెరీర్లో 76వ సినిమాగా రూ΄÷ందుతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో.. ‘‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను.. ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు రవితేజ. కిషోర్ తిరుమల టచ్‌తో ఈ టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. మా సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత హీరో రవితేజ–సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బెల్లా బెల్లా...’, ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే...’ వంటి ΄ాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ‘ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ వంటి చిన్న టైటిల్స్ సినిమాల తర్వాత రవితేజ నటిస్తున్న పెద్ద టైటిల్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వీరి కలయికలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ ΄ాటను భాస్కరభట్ల రాయగా, విశాల్ దడ్లానీ ΄ాడారు. ఇప్పటికే టాకీ ΄ార్ట్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నారీ నారీ నడుమ మురారి బాలకృష్ణ హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా రూ΄÷ందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నరసింహ నాయుడు నిర్మించిన ఈ మూవీ 1990 ఏప్రిల్ 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజైన ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ‘నారీ నారీ నడుమ మురారి’ పేరుతో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త, సాక్షీ వైద్య బావా మరదల్లుగా నటించారట. మరి... ఇద్దరు మరదల్లు కలిసి బావని ఎలా ఆటపట్టించారు? ఈ బావా–మరదల్లు వెండితెరపై చేసిన సందడి ఏ స్థాయిలో నవ్వులు పంచింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016’, ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి హిట్స్ అందుకున్న శర్వానంద్, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో 2026 సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియ¯Œ ్సను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అనగనగా ఒకరాజు ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీ¯Œ ΄÷లిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రోమోస్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి సంక్రాంతి ప్రోమో అంటూ రిలీజ్ చేసిన నవీన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి కళ్లజోడు పెట్టుకుని పక్కా సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు నవీన్. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో జాయింట్ వీల్, భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ పోస్టర్ పక్కాగా సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నవంబరు 27న విడుదలైన ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే ΄ాటకి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా మా చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ప్రేక్షకులముందుకొస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన నటుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్–మూవీవెర్స్ స్టూడియోస్‌పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషించారు. మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని తొలుత ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల వాయిదా పడింది. 2026 జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి ΄ాత్ర చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. అంబటి, ప్రశాంతిల పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఈ సమయంలో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?’’ అనేది మా సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మా మూవీ ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆకాశంలో ఒక తార ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. అంతేకాదు... మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు కథానాయకుడే అన్నట్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారాయన. మలయాళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళుతున్న ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి ఫ్యాన్ బేస్ సం΄ాదించుకున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌కి చక్కని స్పందన వచ్చినట్లు చిత్రబందం పేర్కొంది. దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ రైతు ΄ాత్ర చేశారు. ఓ పల్లెటూరికి చెందిన ఆయన అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలని ఎలా నెరవేర్చుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ‘‘సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళుతున్న దుల్కర్ సల్మాన్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం మా సినిమాకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్ మాత్రమే కాదు... ఇంకా లెంగ్తీ టైటిల్ ఉన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్
ఆ సంఘటన చూశాకే మాట్లాడా.. అదే నేను చేసిన తప్పు: శివాజీ
దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్‌పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్‌ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనాలనే ప్రెస్‌మీట్‌కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు.
‘దండోరా’ సెన్సార్ రిపోర్ట్.. బూతు పదంతో సహా 15 మార్పులు!
రవికృష్ణ, నవదీప్, నందు, మనికా చిక్కాల, బింధు మాధవి, రాధ్య, అదితీ భావరాజు, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఓ బూతు పదంతో సహా మొత్తంగా 15 మార్పులు సూచిస్తూ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. 2.16 గంటల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో వాడిన కొన్ని బూతు పదాలను కచ్చితంగా తొలగించాలని ఆదేశించారు. అలాగే సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్‌తో ఇందులోని పాత్రలు కల్పితనమి పేర్కొనాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. కొన్ని సన్నివేశాలను బ్లర్ చేయాలని ఆదేశించారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌కు ముందే బిజినెస్‌ను పూర్తి చేసుకోవటం విశేషం. చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో 200కు పైగా థియేటర్స్‌లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో అయితే నిన్ననే(డిసెంబర్ 23) ప్రీమియర్స్ పడ్డాయి.
క్రీడలు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ 10, 11, 12, 13, 14, 15 వేల పరుగులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. విరాట్ 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని కేవలం 343 మ్యాచ్‌ల్లో తాకాడు.విరాట్‌కు ముందు భారత్ తరఫున సచిన్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్ 551 మ్యాచ్‌ల్లో 21999 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రహాం గూచ్ (22211), గ్రేమ్ హిక్ (22059) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కూడా చేశాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ జట్టు ఢిల్లీ గెలవాలంటే ఇంకా 79 పరుగులు చేయాలి. విరాట్‌తో పాటు నితీశ్ రాణా (37) క్రీజ్‌లో ఉన్నాడు. 27.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 220/2గా ఉంది. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్ కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆంధ్ర తరఫున రికీ భుయ్ (122) సెంచరీ చేశాడు. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23 పరుగులకు ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
శతక్కొట్టిన విరాట్ కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.298 పరుగులుఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్ (122) సెంచరీ చేయగా.. షేక్ రషీద్ 31, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23, హేమంత్ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.శతక్కొట్టిన విరాట్ కోహ్లిఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్పిత్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 131 పరుగులు చేశాడు. రాజు బౌలింగ్‌లో షేక్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.చదవండి: తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర
రోహిత్ శర్మ మెరుపు శతకం
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రారంభమైన తొలి రోజే సెంచరీల మోత మోగుతుంది. తొలుత యువ చిచ్చరపిడుగు, ఆతర్వాత పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకాలు బాదారు.సిక్కింతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ కేవలం 61 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 91 బంతుల్లో 150 పరుగుల మార్కును కూడా దాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ 17 ఏళ్ల తర్వాత సాధించిన శతకం ఇది.సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ ఈ సూపర్ ప్రదర్శన చేశాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై కూడా పరుగుల వరద పారించాడు. ఆసీస్‌పై సెంచరీ, హాఫ్ సెంచరీ.. ఆతర్వాత సౌతాఫ్రికాపై రెండు హాఫ్ సెంచరీలు చేసి, 38 ఏళ్ల లేటు వయసులోనూ శభాష్ అనిపించుకున్నాడు.సిక్కింతో మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శతక్కొట్టుడుతో ముంబై విజయానికి చేరువగా ఉంది. 29.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 226 పరుగులు చేసి, లక్ష్యానికి 11 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ 93 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా ముషీర్ ఖాన్ (25) ఉన్నాడు.
32 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ కెప్టెన్
దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో తొలి రోజే రికార్డుల మోత మోగింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు బిహార్ ఆటగాళ్లు (వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ లోహారుకా, సకీబుల్ గనీ) విధ్వంసకర శతకాలు బాదారు. ఫలితంగా లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ (574/6)నమోదైంది.ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ సూర్యవంశీబిహార్ ఇన్నింగ్స్‌లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీది తొలి శతకం. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల 272 రోజులు) ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతులు) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (29 బంతులు) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానంలో ఏబీ డివిలియర్స్ (31 బంతులు) ఉన్నాడు.ప్రపంచ రికార్డు బద్దలుసెంచరీ తర్వాత కూడా జోరు కొనసాగించిన వైభవ్.. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 150 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా, ఏబీ డివిలియర్స్ (64 బంతులు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 150 పరుగుల తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన వైభవ్.. దురదృష్టవశాత్తు డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 190 పరుగులు చేసి ఔటయ్యాడు.కొద్ది నిమిషాల్లోనే బద్దలైన రికార్డువైభవ్ విధ్వంసం కళ్ల ముందు మెదులుతూ ఉండగానే మరో భారీ రికార్డు నమోదైంది. ఇదే మ్యాచ్‌లో వైభవ్ కెప్టెన్ (బిహార్ కెప్టెన్) సకీబుల్ గనీ కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. కొద్ది నిమిషాల ముందే వైభవ్ 36 బంతుల్లో శతక్కొట్టి, అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతులు) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజా ప్రదర్శన తర్వాత అన్మోల్ప్రీత్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సకీబుల్ గనీ ఖాతాలోకి చేరింది. ఈమ్యాచ్‌లో సకీబుల్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స సాయంతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీలు (టాప్-5)..జేక్ ఫ్రేజర్- 29 బంతులుఏబీ డివిలియర్స్- 31సకీబుల్ గనీ- 32ఇషాన్ కిషన్- 33అన్మోల్ప్రీత్ సింగ్- 35ఆయుశ్ మెరుపు సెంచరీఇదే మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన ఆటగాడు ఆయుశ్ లోమాకురా. ఆయుశ్ 56 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బిహార్ చేసిన స్కోర్ (574) లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. దీనికి ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. 2022 ఎడిషన్ విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టు ఇదే అరుణాచల్ ప్రదేశ్‌పై రెండు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు👉బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6👉తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2👉ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4👉సర్రే- గ్లౌసెస్టర్షైర్ మీద 2007లో 496/4 👉ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
బిజినెస్
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్‌కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
భారత రూపాయి విలువ గత కొన్ని నెలలుగా ఒత్తిడికి లోనవుతోంది. అందుకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. వంటివి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో రూపాయి మరింత నేలచూపులు చూడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చురుకైన చర్యలు చేపట్టింది.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయిలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ రూ.91 మార్కును తాకి స్వల్పంగా పుంజుకుంది. ఈ తీవ్ర ఒడిదుడుకులను అరికట్టడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉపయోగించి మార్కెట్లో డాలర్లను విక్రయిస్తోంది.ఆర్బీఐ జోక్యంతాజా అధికారిక సమాచారం ప్రకారం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ భారీ స్థాయిలో డాలర్లను విక్రయించింది. అక్టోబర్ నెలలో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. రూపాయి విలువ రూ.89 మార్కును దాటకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ పరిస్థితులు దృష్ట్యా రూపాయి విలువ రూ.91కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు ఆర్బీఐ దాదాపు 34.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.91 లక్షల కోట్లు) విలువైన డాలర్లను అమ్మి రూపాయి పతనాన్ని అడ్డుకుంది. డిసెంబర్ 12, 2025 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 688.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఉన్న 704 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఇవి దేశానికి పటిష్టమైన రక్షణను కల్పిస్తున్నాయి.రూపాయి బలహీనపడటానికి కారణాలుట్రంప్ ప్రభుత్వ సుంకాల పెంపు భారత ఎగుమతులపై ప్రభావం చూపడం రూపాయి బలహీనతకు ఒక కారణం.ఈ ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ల నుంచి సుమారు 17 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశం ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి రావడం రూపాయి విలువను తగ్గిస్తోంది.ఆర్బీఐ చర్యల పర్యావసానాలురూపాయి ఒక్కసారిగా పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువుల (పెట్రోల్, ఎలక్ట్రానిక్స్) ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకశం ఉంది. ఆర్బీఐ జోక్యం వల్ల ఈ ధరలు అదుపులో ఉంటాయి. రూపాయి విలువ మరీ అస్థిరంగా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు ఆందోళన చెందే ప్రమాదం ఉంటుంది. ఆర్బీఐ నియంత్రణ వారిలో నమ్మకాన్ని పెంచుతుంది.ప్రతికూలతలుడాలర్లను విక్రయించడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతాయి. ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆటంకం కావచ్చు. ఆర్బీఐ డాలర్లను అమ్మడం వల్ల మార్కెట్లో నగదు లభ్యత తగ్గుతుంది. దీన్ని సర్దుబాటు చేసేందుకు ఆర్బీఐ ఇటీవల రూ.2.90 లక్షల కోట్ల లిక్విడిటీ లభ్యత చర్యలను ప్రకటించింది.భారత రూపాయి ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, ఆర్బీఐ తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక నిల్వలతో రక్షణ గోడలా నిలుస్తోంది. కేవలం రూపాయి విలువను పెంచడం కంటే, మార్కెట్లో తీవ్రమైన అస్థిరత లేకుండా చూడటమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదిరితే రూపాయి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్‌గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్‌గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్‌లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్‌పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు.
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరిగాయి. వరుసగా మూడో రోజూ ఎగిసి పసిడి ధరలు హ్యాట్రిక్ కొట్టాయి. వెండి ధరలు రెండు రోజుల్లో పెరిగిన దానికి మించి దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) మోస్తరుగా పెరిగాయి. వెండి ధరలు అయితే రికార్డు స్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
ప్రకృతి సేద్యం పొలాల్లోంచి వర్సిటీల్లోకి!
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రయోగశీలురైన రైతు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆచరిస్తూ వస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలను చూసి తోటి రైతులు నేర్చుకుంటూ వచ్చారు. మొదట్లో సంశయించిన ప్రభుత్వమే తదనంతరం ప్రకృతి వ్యవసాయం బహుముఖ ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నియత వ్యవసాయ విద్యలోకి ప్రకృతి వ్యవసాయం చేరింది. దేశంలో 4 యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి. మరికొన్ని యూనివర్సిటీల్లో ప్రకృతి వ్యవసాయం ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులను విధిగా ప్రారంభించాలని సూచిస్తూ భారతీయ వ్యవసా య పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జన రల్ ఎం.ఎల్. జాట్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ హ యాంలో నడుస్తున్న, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యా లయాలన్నిటికీ ఇటీవల లేఖ రాశారు. ‘సుస్థిర వ్యవసాయం, రైతుల సంక్షేమం సాధించే క్రమంలో ప్రకృతి వ్యవసాయం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరో డీన్ల కమిటీ సిఫారసులు, జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ప్రకృతి సేద్యం కోర్సు పాఠ్యప్రణాళి కను రూపొందించి, ఆమోదించి, అన్ని యూనివర్సిటీలకూ పంపాం. ఇప్పటి కే కొన్ని యూనివర్సిటీలు కోర్సులు ప్రారంభించా యి. మిగతా యూనివర్సిటీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని ఆశిస్తు న్నాను’ అని డా. జాట్ పేర్కొన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. విపత్తులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు, భూమి ఆరోగ్యం పునరు ద్ధరణకు, తక్కువ ఉద్గారాలను వెలువరించే వ్యవ సాయ పద్ధతులకు ఆదరణ పెరుగుతున్నందున ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రకృతి సేద్య సంబంధమైన కోర్సుల ప్రాధా న్యం ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాంకేతి కతలో నిష్ణాతులైన నవతరం శాస్త్ర వేత్తలు, విస్తరణ సిబ్బంది, ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేసే బృహత్ కార్యంలో విశ్వవిద్యాలయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నానని డా. జాట్ పేర్కొ న్నారు. ఈ విషయంలో ఐసీఏఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. లాభదాయకతే గీటురాయి చెయ్యాలిప్రకృతి వ్యవసాయంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రారంభించమని ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కోరటం సంతోషదాయకమని ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ దేవేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. అయితే, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఆఖరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చేపట్టే ఫీల్డ్ వర్క్‌ను కేవలం లాంఛనప్రాయంగా మిగల్చ కూడదు. ఫీల్డ్ వర్క్‌లో భాగంగా స్వయంగా ప్రకృతి వ్యవసాయం ఆచరించి, అందులో లాభదాయకతను నిరూపించుకున్న విద్యార్థులకు మాత్రమే డిగ్రీని ప్రదానం చెయ్యటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు.
ఆనియన్ క్వీన్
వ్యవసాయంలో స్త్రీలు సాధిస్తున్న విజయాలు అందరూ చూస్తున్నవే. అయితే పంట నిల్వలో, వ్యవసాయ పనిముట్లలో ఆవిష్కరణలు చేస్తున్న మహిళలు తక్కువ.నాసిక్‌లో తండ్రి పండిస్తున్న ఉల్లిపాయ నిల్వ చేస్తే పాడవుతోందని గమనించిన కుమార్తె సొంతగా పరికరాన్ని కనిపెట్టి నిల్వలను కాపాడింది. అంతే కాదు నాసిక్, మహారాష్ట్రల్లో ఉల్లిపాయ గోదాముల నిర్వహణను పూర్తిగా మార్చేసింది. కిసాన్ దివస్ సందర్భంగా ఈనాటి రైతుబిడ్డ కల్యాణి షిండే పరిచయం.‘ఉల్లిపాయలు పాడయ్యాయన్న సంగతి చాలా నష్టపోయాకే తెలుస్తుంది’ అంటుంది కల్యాణి షిండే. 26 ఏళ్ల ఈ రైతుబిడ్డ నాసిక్, మహారాష్ట్రలలో ఉల్లిపాయల నిల్వకు విశేషమైన సహకారం అందించే పరికరాన్ని తయారు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ‘నాసిక్ దగ్గర ఉన్న లాసన్‌గావ్ మా ఊరు. అది ఆసియాలోనే అతి పెద్ద ఉల్లిపాయల కేంద్రం. మా తాత తండ్రులు, బంధువులు రైతులే. ఉల్లిపాయలు ప్రధానంగా పండిస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పంట చేతికి రావడం మార్కెట్ అయ్యేలోపు పాడైతే నష్టం రావడం వింటూనే పెరిగాను. మా ఇళ్లలో నేనే మొదటిసారి బి.టెక్కు వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతూ ఇంటికి ఫోన్ చేస్తే ఉల్లిపాయలు కుళ్లిపోయి నష్టం వచ్చిందని చెప్పేవారు. దీనిని ఆపలేమా... అని రీసెర్చ్‌లో దిగాను’ అని తెలిపింది ఆమె.కల్యాణి షిండే రీసెర్చ్‌లో మహారాష్ట్రలోనే కాదు... దేశంలోనే ఉల్లిపాయలకు సరైన గిడ్డంగులు లేవని తెలిసింది. చాలా కేంద్రాల్లో ఓపెన్ గోదాముల్లోనే ఉల్లిపాయలను నిల్వ ఉంచుతారు. ఆధునిక గోదాములు ఉన్నవి తక్కువ. ‘ఉల్లిపాయలు పాడయ్యాయని ఎలా తెలుసుకుంటారని రైతులను అడిగితే దుర్వాసన ద్వారా అని చెబుతారు. కాని దుర్వాసన మొదలయ్యే సమయానికి క్వింటాల్‌కు 20 శాతం పాడైపోయి ఉంటాయి. ఉల్లిపాయలకు ఆరడుగుల ఎత్తు అరలో నిల్వ చేస్తే ఎత్తు తగ్గి ఐదు అడుగులకు చేరినా ఉల్లిపాయలు పాడయ్యాయని అర్థం. ఈ దశలో 40 శాతం పాడైపోయి ఉంటాయి. మనుషులు దృష్టి, వాసన ద్వారా మాత్రమే ఉల్లిపాయల నిల్వలో నష్టాన్ని తెలుసుకుంటున్నారని నాకు అర్థమైంది. అప్పుడే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్నోవేటర్లుగా తర్ఫీదు ఇచ్చే ఒక సంస్థ గురించి తెలిసింది. అందులో చేరాను. అలా గాలిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా గిడ్డంగిలో ఏ వైపున పంట నష్టం మొదలయ్యిందో తెలుసుకునే పరికరం కనిపెట్టాను. దీనివల్ల ఒక శాతం నష్టం ఉండగానే నిల్వను కాపాడుకోవచ్చు’ అని చెప్తుంది కల్యాణి షింగ్.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది. ఈ పరికరాన్ని పదివేల రూపాయలకే తయారు చేసి రైతులకు చేరవేస్తోంది కల్యాణి. అంతేకాదు ఆధునిక గిడ్డంగుల ఏర్పాటులో ప్రయివేటు సంస్థలకు సూచనలు సలహాలు ఇస్తోంది. అందుకే అందురూ ఆమెను ‘ఆనియన్ క్వీన్’ అని పిలుస్తూ ఉన్నారు. రైతు కోసం రైతు బిడ్డలే కాదు ప్రతి విద్యార్థి, సాంకేతిక నిపుణుడు ఆలోచిస్తే మన దేశం మరింత సస్యశ్యామలం అవుతుంది.ఆమె తయారు చేసిన పరికరం పది మెట్రిక్ టన్నుల నిల్వకు ఒకటి చొప్పున అమరిస్తే నిల్వను పూర్తిగా సురక్షితం చేసినట్టే. నిల్వలో ఏ తేడా వచ్చినా ఆ పరికరం పసిగట్టి ఎలర్ట్ మెసేజెస్ పంపుతుంది.
చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం!
సినిమాలలో కొన్ని లొకేషన్స్ చూసి... ‘ఆహా’ అనిపిస్తుంది. ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు... ‘ఫలానా సినిమాలో ఈ సీన్ చూశాం కదా!’ అని గుర్తు తెచ్చుకుంటాం. ప్రయాణాలకు, చిత్రాలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రయాణ.. చిత్రం, చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం!తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఈ అద్భుత ప్రకృతి దృశ్యం బాలీవుడ్ సినిమా ‘3 ఇడియెట్స్’లో కనువిందు చేస్తుంది. కాలేజీ స్నేహాలు ముగిసి కలలు కనే ప్రదేశంగా ఈ ప్రదేశం దర్శనమిస్తుంది. పాంగాంగ్ లేక్ క్లైమాక్స్’గా ఈ ఎపిసోడ్‌కు పేరు వచ్చింది. యశ్ చోప్రా ‘జబ్ తక్ హై జాన్’ ఫర్హాన్ అక్తర్ ‘లక్ష్యా’ మణిరత్నం ‘దిల్ సే’లాంటి చిత్రాలలో లద్దాఖ్ కనిపిస్తుంది. ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో మిల్కాసింగ్ ట్రైనింగ్ దృశ్యాలను లద్దాఖ్‌లో చిత్రీకరించారు. ‘ట్యూబ్‌లైట్’ సినిమాను మూన్ల్యాండ్ ఏరియాలో చిత్రీకరించారు. ‘సనమ్ రే’ ‘రేస్ 3’ ‘హైదర్’ ‘తషాన్’ ‘ఎల్వోసీ: కార్గిల్’ సినిమాలలోనూ లద్దాఖ్ కనిపిస్తుంది. ‘రోడ్డ్ టు లద్దాఖ్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ వచ్చింది.సరస్సుల నగరం మెరిసింది!రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి ‘సరస్సుల నగరం’ అని పేరు. ఆడంబర వివాహాలకు కేరాఫ్ అడ్రస్.. ఉదయ్‌పూర్. ధర్మప్రొడక్షన్ ‘యే జవానీ హై దివానీ’ సినిమాలోని రాజసం ఉట్టిపడే సన్నివేశాలను ఈ అందాల నగరంలో చిత్రీకరించారు. చిత్రాలకు సంబంధించి భావోద్వేగ దృశ్యాలు పండాలంటే, పండగ సంతోషాలు వెల్లివిరియాలంటే ‘ఉదయ్‌పూర్’ సరిౖయెన నగరం అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. పీచోల సరస్సులో పడవలు వయ్యారంగా పరుగెడుతున్న దృశ్యాలు, సూర్యాస్తమయం తరువాత ప్యాలెస్ లైట్ల వెలుగులు నీటి అలలలో తేలియాడుతున్నప్పుడు.. ఉదయపూర్‌లో కనిపించిన క్షణాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. ‘యే జవానీ హై దివానీ’ ‘దడఖ్’ ‘జోదా అక్బర్’ ‘ఏక్లవ్య: ది రాయల్ గార్డ్’ ‘బాజీరావు మస్తానీ’లాంటి ఎన్నో సినిమాలలో ఉదయ్‌పూర్ కనిపిస్తుంది.గతంలోకి వెళితే...గైడ్(1965), మేరా సాయ(1966) చిత్రాలలోని సన్నివేశాలను ఉదయ్‌పూర్‌లో చిత్రీకరించారు. సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్, లేక్ పిచోలా, జగమందిర్, లేక్ ప్యాలెస్, ఫతే ఘర్, అంబ్రాయ్ ఘాట్.. మొదలైనవి సినిమాల చిత్రీకరణకు కీలకమైన లొకేషన్స్‌గా (Cinema Locations) మారాయి.ఆత్మశోధన అద్దం‘గోవా అనేది ఆత్మశోధనకు అద్దంలాంటిది’ అంటారు భావుకులు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ‘దిల్ చాహ్తా హై’లో గోవా కనువిందు చేస్తుంది. పోర్ట్ అగ్వాడా ఎంతోమందికి సినిమాటిక్ ల్యాండ్ మార్క్‌గా మారింది. గోవా బీచ్‌ల (Goa Beach) వెంట నడుస్తూ ఆలోచిస్తుంటే...అలలు ఎగిసి పడే శబ్దాలు వింటుంటే, నవ్వులు గాలిలో తేలుతుంటే, ఉరుకు పరుగుల జీవితం కాస్తా ఆ అలల ముందు ప్రశాంత చిత్తంతో చూస్తుంటే.. ఇలా ఎన్నో ఎన్నో భావాలకు గోవా కేరాఫ్ అడ్రస్ అవుతుంది. అందుకే సినీ దర్శకులకు గోవా బాగా నచ్చుతుంది. ‘డియర్ జిందగీ’ ‘గోల్మాల్ సిరీస్ (2006–2010), ‘దృశ్యం’ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ‘దిల్వాలే’ ‘ధమ్ మారో ధమ్’ ‘గో గోవా గాన్’లాంటి ఎన్నో చిత్రాలను గోవాలో చిత్రీకరించారు. గోవా ప్రత్యేకత ఏమిటంటే భారీ బడ్జెట్ సినిమాల దర్శకులకు నచ్చుతుంది. చిన్న నిర్మాతలకు సైతం అందుబాటులో ఉంటుంది.పొగమంచు కొండలలో...పొగమంచు కొండలతో స్నేహం చేసే డార్జిలింగ్ ఎన్నో సినిమాలలో కనిపించింది. నేత్రపర్వం చేసే హిమాలయ దృశ్యాలకు, విశాలమైన టీ తోటలకు డార్జిలింగ్ ప్రసిద్ధి పొందింది. డార్జిలింగ్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే, ఆ అందాలను ఆస్వాదించాలంటే బాలీవుడ్ (Bollywood) సినిమా ‘బర్ఫీ’ చూడాల్సిందే. ‘మై హూ నా’ ‘యారియాన్’ ‘పరిణిత’ ‘రాజు బన్ గయా జెంటిల్మెన్’ ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’లాంటి ఎన్నో చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్‌లో చిత్రీకరించారు. వెనక్కి వెళితే... బర్సాత్ కి ఏక్ రాత్(1982), ప్రొఫెసర్(1962), జబ్ ప్యార్ కైసీ సే హోతా హై(1961), ఆరాధన (1969) చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్‌లో చిత్రీకరించారు.అద్భుత కట్టడాలతో అలరించే..శతాబ్దాల సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకున్న అండలూసియా ప్రాంత చారిత్రక రాజధాని సెవిల్లె. సూర్యకాంతితో అద్భుతంగా వెలిగే కట్టడాలు, అద్భుతమైన మూరిష్ వాస్తు శిల్పానికి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది సెవిల్లె. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దోబారా’ ఇక్కడే చిత్రీకరించారు.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?వెనిస్ ఆఫ్ నార్త్వాయువ్య బెల్జియంలోని అందమైన చారిత్రక నగరం బ్రూజెస్. వంకర కాలువలు, మెట్ల–గేబుల్ ఇళ్ళు, రకరకాల శిల్పాలు, రాతి వంతెనలకు బ్రూజెస్ పెట్టింది పేరు. బ్రూజెస్ను ‘వెనిస్ ఆఫ్ నార్త్’గా పిలుచుకుంటారు. అమీర్‌ఖాన్ ‘పీకే’లో బ్రూజెస్ అందాలు కనువిందుచేస్తాయి. లవర్స్ బ్రిడ్జి, మిన్నె వాటర్ కాజిల్, మార్కెట్ స్క్వైర్, బ్రెల్ఫీ టవర్, వంకలు తిరిగే కాలువలు కనిపిస్తాయి. ‘పీకే’లోని ‘చార్ కదమ్’ పాటను ఇక్కడే చిత్రీకరించారు.వంద స్తంభాల నగరంఎత్తైన గోతిక్ స్తంభాలు, టెర్రకోట–ఎరుపు పైకప్పులు, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి పొందింది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. ‘వంద స్తంభాల నగరం’ అని పిలవబడే ప్రాగ్లో మధ్యయుగాలనాటి ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వల్తావా నది ప్రవాహాన్ని చూడడం అద్భుత అనుభవం. రాతి వీధుల్లో ఈల పాట పాడుతూ వేగంగా నడుస్తుంటే, ప్రాగ్ అందాలు ఇంతియాజ్ అలీ ‘రాక్‌స్టార్’ సినిమాలో కనిపిస్తాయి. సినిమాలోని రకరకాల భావోద్వేగాలకు ప్రాగ్ (Prague) సరిగ్గా సరిపోయింది. చార్లెస్ వంతెన కింద నది వయ్యరాలను చూడడం మరో అద్భుత అనుభూతి.– పాషా
వాటే ట్రయల్ రూమ్..! ఆ వైబ్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్‌లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్‌లోని H&M స్టోర్‌లోని హైటెక్ ట్రయల్ రూమ్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్‌దేవా. చక్కటి మ్యూజిక్‌ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్‌ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్‌లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva) (చదవండి: ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..)
అంతర్జాతీయం
‘బాబ్బాబు.. టన్నుల్లో బంగారం ఇస్తాం.. ఆ దీవిని మాకిచ్చేయండి!’
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నేశారు. అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ఆయన తాజాగా ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ అమెరికా దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించారు.గ్రీన్లాండ్లోని లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నాయి. 55–57 వేల మంది జనాభా ఉన్న ఈ దీవి, ఖనిజ సంపదతో పాటు భౌగోళికంగా కూడా కీలకంగా మారింది. 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపాలని ప్రయత్నాలు చేశారు. ‘గ్రీన్‌లాండ్‌ను మాకు ఇచ్చేయండి, 800 కోట్లు విలువ చేసే బంగారం ఇస్తాం’ అని ప్రతిపాదనలు పెట్టినా డెన్మార్క్ తిరస్కరించింది.అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదని పలు మార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రతా, వ్యూహాత్మక అంశాలను బలపరచాలని సంకేతం ఇచ్చారు.గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, డెన్మార్క్‌తో అనుబంధం కొనసాగుతోంది. దీనిపై డెన్మార్క్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ‘ఖనిజ సంపద కోసం కాదు, అమెరికా జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. ఈ నియామకం అమెరికా ఆర్కిటిక్ వ్యూహానికి కొత్త దిశను చూపిస్తోంది.
హెచ్-1బీ వీసాల జారీ.. కీలక మార్పులు చేసిన అమెరికా
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) రద్దు చేసింది. బదులుగా వెయిటేజ్ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఉన్నత ఉద్యోగాలు,అధిక శ్రేణి వేతన దారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27,2026 నుంచి ఈ కొత్త హెచ్-1బీ వీసా విధానం అమల్లోకి రానుంది. వీసా పరిమితి యథాతథంఅమెరికా ప్రభుత్వం ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం..ప్రతి సంవత్సరం 65,000 హెచ్‑1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20,000 వీసాలు యథాతథంగా కొనసాగన్నాయి. అయితే, ఈ కొత్త విధానం అమెరికన్ కార్మికులను రక్షించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ రంగానికి తీవ్ర సవాళ్లు విసరనుంది. పెద్ద కంపెనీలు లాభపడతాయి, కానీ స్టార్టప్‌లు, తక్కువ వేతన ఆఫర్లు ఇచ్చే సంస్థలు వెనుకబడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసాల జారీకి కీలక మార్పులుహెచ్-1బీ వీసాల జారీకి అమెరికా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం విదేశీ సాంకేతిక నిపుణులందరికీ సమాన అవకాశాలిచ్చే లాటరీ పద్దతిని పూర్తిగా మార్చింది. మొత్తం 85వేల హెచ్-1బీ వీసాల జారీకి నాలుగు నాలుగు కేటగిరీల్లో లాటరీ తీసే పద్దతి ఉండేది.ఇందులో అత్యధిక వేతనం కలిగినవారికి లెవల్ 4 కేటగిరిగా పరిగణింపు. వేతనాన్ని బట్టి లెవల్-1,లెవల్-2, లెవల్-3 కేటగిరి ఉండగా.. లెవల్-4 అర్హత సాధించిన వారికి ఈ ఏడాదిలో నాలుగు సార్లు లాటరీకి అవకాశం. లెవల్-3 అర్హత సాధించిన వారికి మూడుసార్లు, లెవల్-2 అర్హత సాధించిన వారికి 2 సార్లు లాటరీకి ఛాన్స్, ఎంట్రీలెవల్ ఉద్యోగులకు ఒక్కసారి మాత్రమే లాటరీకి ఛాన్స్. ఇచ్చేది.తాజాగా, ఆ లాటరీ సిస్టంను తొలగించింది. బదులుగా వెయిటేజీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఆధారంగా హెచ్-1బీ వీసాల జారీ ఉంటుంది.
ఘోర ప్రమాదం మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు, పెళ్లి వాయిదా
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.🚨🏥 María Sol (Lionel Messi’s sister) was involved in a car accident while driving in Miami and has been forced to postpone her wedding, which was scheduled for January 3, 2026.According to confirmed reports, she lost control of the vehicle and crashed into a wall. As a result… pic.twitter.com/Sae2Uy4Q1Q— FC Barcelona Fans Nation (@fcbfn_live) December 23, 2025 లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.
అమెరికా వదిలేస్తే.. ట్రంప్ ఆపర్
అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని అక్రమ వలసదారుల కోసం క్రేజీ డీల్ ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు దేశాన్ని వదిలి వెళితే వారికి మూడు వేల డాలర్లు అంటే అక్షరాల రూ. 2.68 లక్షలు ఇస్తానని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ ఏడాది చివరి వరకే ఉంటుందని కండీషన్ విధించింది.ట్రంప్ ఈ పేరు వింటే చాలు యుఎస్‌లో ఉంటున్న అక్రమ వలసదారులకు కంటిమీద కులుకు ఉండదు. వారిపై ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని బెంబేలిత్తిపోతారు. ఎందుకంటే అధికారం చేపట్టి నాటి నుంచి ట్రంప్ ఫస్ట్ టార్గెట్ ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని తరిమికొట్టడమే. వారిని దేశం నుంచి పంపించడానికి ట్రంప్ ఎన్నో కఠిన చట్టాలు తెచ్చారు. అయినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో వారు వెళ్లకపోవడంతో ప్రస్తుతం వారి కోసం యూఎస్ గవర్నమెంట్ ఒక డీల్ తెచ్చింది.డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు క్రిస్మస్ ఆపర్ ప్రకటించింది. యూఎస్‌లో ఉంటున్న అక్రమ వలసదారులు ఎవరైతే తమ దేశాన్ని విడిచి వెళ్లాలనుకుంటారో వారికి డిపార్ట్మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యురిటీ మూడు వేల డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వారిపైన ఏవైనా జరిమానాలు, ఇతరత్రా ఏమైనా ఉన్నా రద్దు చేస్తామని పేర్కొంది.దాని కోసం ఇది వరకే రూపొందించిన సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను ఉపయోగించాలని DHS తెలిపింది. అమెరికాను వదిలి వెళ్లాలనుకునేవారు CBP యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వారి వివరాలను అందులో నమోదు చేయాలని పేర్కొంది. ఆ తర్వాత వారి ప్రయాణ ఖర్చులు తదితర విషయాలను డిపార్ట్మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యురిటీ సంస్థ చూసుకుంటుందని తెలిపింది. అక్రమ వలసదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DHS సెక్రటరీ క్రిస్టి నోయోమ్ తెలిపారు.ఒకవేళ అక్రమంగా నివాసముంటూ తమకు పట్టుబడితే వారిని అరెస్టు చేసి బలవంతంగా వారి దేశాలకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా వదిలి అక్రమ వలసదారులకు ట్రంప్ వెయ్యి డాలర్లు చెల్లిస్తామని తెలిపారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1.9 మిలియన్ల మంది స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
జాతీయం
ఈ ఏడాది రబీ సాగు..భలే జోరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రబీ సీజన్ సాగు జోరందుకుంది. వాతావరణం అను కూలించడం, జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈసా రి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి అందిన సమాచా రం ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 5.80 కోట్ల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 5.72 కోట్ల హెక్టార్లుగా ఉండగా, ఈసారి అదనంగా 8.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయడం విశేషం. ఈ మేరకు మంగళవారం కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. పప్పుధాన్యాలపై పెరిగిన మక్కువఈ సీజన్లో రైతులు పప్పుధాన్యాల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పప్పుధాన్యాల మొత్తం సాగు విస్తీర్ణం 126.74 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇది 123.01 లక్షల హెక్టార్లు మాత్రమే. అంటే సుమారు 3.72 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. ఇందులో సెనగలదే సింహభాగంగా ఉంది. గత ఏడాది 86.81 లక్షల హెక్టార్లలో సెనగలు సాగు చేయగా, ఈసారి అది 91.70 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఒక్క సెనగ సాగులోనే దాదాపు 4.89 లక్షల హెక్టార్ల భారీ పెరుగుదల కనిపించింది. కాగా పెసలు, మినప పంటల సాగు కూడా నిలకడగా సాగుతోంది. కుల్తీ, ఇతర పప్పుధాన్యాల సాగు వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది.ఆహార భద్రతకు భరోసా.. ధుమ, వరిదేశ ఆహార భద్రతలో కీలకమైన గోధుమ, వరి సాగు కూడా ఆశాజనకంగా ఉంది. రబీ సీజన్లో ప్రధాన పంట అయిన గోధుమ సాగు 301.63 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది సుమారు 3 కోట్ల హెక్టార్లతో పోలిస్తే 1.29 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. అదే సమయంలో రబీ వరి సాగులోనూ మంచి వద్ధి కనిపిస్తోంది. గతేడాది 11.52 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడగా, ఈసారి అది 13.35 లక్షల హెక్టార్లకు పెరిగింది. 1.83 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పెరగడం వరి రైతుల ఉత్సాహానికి నిదర్శనమని వ్యవసాయ శాఖ పేర్కొంది.నూనెగింజలు, చిరుధాన్యాల తీరు ఇలా..వంటనూనెల కొరతను తగ్గించే దిశగా నూనెగింజల సాగు కూడా సానుకూలంగా ఉంది. మొత్తం 93.33 లక్షల హెక్టార్లలో నూనెగింజలు సాగవుతున్నాయి. ఇందులో ఆవాలు సాగు విస్తీర్ణం 87.95 లక్షల హెక్టార్లకు చేరాయి. చిరుధాన్యాల విషయంలో శ్రీ అన్న (మిల్లెట్స్) సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జొన్నలు, మొక్కజొన్న, రాగులు తదితర పంటలు కలిపి మొత్తం 45.65 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. జొన్నల సాగు 19.33 లక్షల హెక్టార్లుగా, మొక్కజొన్న సాగు 14.97 లక్షల హెక్టార్లుగా నమోదైంది. బార్లీ సాగు కూడా 6.94 లక్షల హెక్టార్లకు చేరింది.
‘మహా’ సంచలనం.. 20 ఏళ్లకు కలసిన ‘ఠాక్రేలు’
ముంబై: సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విభేదాలతో విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. నేడు (బుధవారం) జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఇద్దరూ కలసి పాల్గొన్నారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే వర్గం),మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో..ముంబైలోని ఒక వేదికపై ఇద్దరు సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. ఈ కలయికను ఉద్దేశించి సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దీనిని ఒక శుభప్రదమైన ప్రారంభంగా అభివర్ణించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)తో పాటు ఇతర కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలంటే ఈ కలయిక అనివార్యమని ఆయన అన్నారు.వారసత్వ పోరాటమే స్ఫూర్తిఈ సభలో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగంతో మాట్లాడారు. తమ తాత ప్రబోధన్కర్ ఠాక్రే, తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేల ఆశయాల గురించి గుర్తు చేసుకుంటూ, తాము ఇక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులుగా కాకుండా ఠాక్రే సోదరులుగా నిలుచున్నామని అన్నారు. శివసేన స్థాపించి 60 ఏళ్లు అవుతున్న తరుణంలో, మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ముంబై రక్షణే పరమావధిమాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. కొందరు నేతలు ముంబైని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము విడిపోయి పోరాడితే అది ఇక్కడి అమరవీరులకు చేసే అవమానమవుతుందన్నారు. రాజ్ ఠాక్రే తన ప్రసంగంలో సంఘీభావం చాటారు. వ్యక్తిగత అపార్థాల కన్నా మహారాష్ట్ర గౌరవమే గొప్పదన్నారు. సీట్ల పంపకాల కంటే ముంబై ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నాసిక్ వంటి ఇతర కార్పొరేషన్లలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ పొత్తు ద్వారా ముంబై పీఠాన్ని దక్కించుకుంటామని రాజ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత
చపాతి లేట్ అయిందనీ, భార్య, నాలుగేళ్ల కొడుకుపై పెనంతో దాడి
గోరఖ్‌పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్‌గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్ నాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్‌లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్‌చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్‌గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్లో సర్వర్‌కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్‌చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్‌చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్‌చంద్‌ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్‌నాథ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్
'కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే'
మంగళూరు: ఫ్రిడ్జ్, ఏసీ, ఆపిల్ ఐఫోన్, ల్యాప్‌టాప్, కారు, బైక్, వాషింగ్ మెషీన్, ఫర్నీచర్.. ఇలా నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులను ఈకాలంలో చాలా మంది ఈఎంఐ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. వాటి ఈఎంఐ గడువు తీరేలోపే వాటికి రిపేర్లు రావడమో, పాడవడమో, ఎవరో కొట్టేయడమో జరిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఆ బాధ పడొద్దనే ఉద్దేశంతో ఓ కారు యజమాని వినూత్న రీతిలో ఆలోచించారు.రోడ్లపై సర్రున దూసుకుపోయే వాహనదారుల్లో ఎవరైనా తన కారును ఢీకొడితే రిపేర్ల ఖర్చుల కోసం జేబుకు చిల్లు పడటం ఖాయమని భావించాడు. అనుకున్నదే తడవుగా కారుకు వెనకాల కొత్త తరహాలో బంపర్ స్టిక్కర్‌గా వినూత్న క్యాప్షన్ రాసి వెనకాల వచ్చే వాహనదారులందర్నీ ఆలోచనల్లో పడేశాడు. ‘‘నా కారును పొరపాటున ఢీకొట్టకండి. అసలే ఇది ఈఎంఐలో కొన్నా. అదింకా పూర్తవలేదు’’ అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ రాశారు.ఇది చూసి ‘కారు కష్టాలు’ అని కొందరు సానుభూతి వ్యక్తపరిస్తే మరికొందరేమో అతని సృజనాత్మకతను మెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తమ దారిలో వెళ్లిపోతున్నారు. ఇతనిలో ఎంతో హాస్యచతురత ఉందని లోలోపల పొగుడుతూనే మరోవైపు అతని నిజాయతీకి, విజ్ఞాపనకు ఫిదా అయిపోతున్నారు.కర్ణాటకలోని మంగళూరులో సర్క్యూట్ హౌస్ రోడ్డులో వెళ్తున్న ఒక తెలుపురంగు మారుతి సుజుకీ ఆల్టో కారుకు (Alto Car) సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే ఏకంగా 5.4 కోట్ల మంది ఈ వీడియోను ఆన్లైన్లో చూడడం విశేషం. 33.41 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. వేలాది మంది తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.ఎంత కష్టపడి కొనుకున్నాడో..‘‘కారు యజమాని తాను చెప్పదల్చుకున్న విషయాన్ని అత్యంత వైవిధ్యభరింతగా చెప్పారు’ అని ఒక నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఈఎంఐ (EMI) అనేది సగటు భారతీయుని జీవితంలో ఒక భాగమైపోయిందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఎంత కష్టపడి కొనుకున్నాడో. అందుకే కారంటే అతనికి అంత ప్రేమ’’ అని మరొకరు పోస్ట్ చేశారు.చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్‌కు 5 కోట్లు!అతిగొప్ప నినాదం ఇదే..‘‘ఈఎంఐ మంజూరుచేసిన బ్యాంక్‌కు ఇతను అసలు సిసలు నిఖార్సయిన కస్టమర్’ అని మరో నెటిజన్ (Netizen) వ్యాఖ్యానించారు. ‘‘గుంతల రోడ్డుపై వాయుకాలుష్యంలో కొట్టుకుపోతున్న నాకు ఎదురుగా ఈ క్యాప్షన్ ఎండాకాలంలో చల్లటి మజ్జిగలా హాయినిచ్చింది’’ అని ఇంకొకరు పోస్ట్‌చేశారు. ‘‘ఎన్నో బాధ్యతలున్న సగటు జీవి కారు ఇది’’, ‘‘కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే’’, ‘‘మోదం, ఖేదం కలబోత ఈ క్యాప్షన్’’ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు పోస్ట్లుపెట్టారు. View this post on Instagram A post shared by @bearys_in_dubai
ఎన్ఆర్ఐ
ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది. ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.వచ్చే జూలైలో... బాల్టిమోర్‌లో ఆటా సదస్సు‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్‌రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.(చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు)
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది.
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ వాసి..!
బ్రిటన్‌లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్‌నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ)
క్రైమ్
నాన్నా.. మేమేం పాపం చేశాం!
బొమ్మనహాళ్: తండ్రే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. దేవాలయానికి తీసుకెళ్తానని ఇద్దరినీ కాలువలో తోసేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన శిల్ప, కల్లప్పకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటాడు. కుమార్తెలు సింధు (11), అనూష (9) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్న కుమార్తెలను కల్లప్ప ఆలయానికి తీసుకెళ్లాడు. కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వద్దకు వెళ్లాక సింధును నీటిలోకి తోసేశాడు. చిన్న కుమార్తె అనూష గమనించి భయంతో పరుగులు తీయగా.. కల్లప్ప వెంబడించి మరీ పట్టుకుని కాలువలోకి విసిరేశాడు. ఏమీ తెలియనట్టు సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఏమయ్యారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు. మంగళవారం ఉదయమైనా పిల్లలు రాకపోయేసరికి బంధువులు, గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కల్లప్ప సిరిగేరి క్రాస్ వద్ద ఎల్లెల్సీ కాలువలో తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీలోకి తోసేశానని మరోసారి చెప్పాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, కర్ణాటక, ఆంధ్ర పోలీసులు కాలువలో గాలించగా మంగళవారం మధ్యాహ్నం సింధు మృతదేహాన్ని దమ్మూరు సమీపంలోని ఎల్లెల్సీవద్ద గుర్తించి బయటకు తీశారు. చిన్నమ్మాయి అనూష జాడ కోసం గాలిస్తున్నారు.
సంచలన అత్యాచార కేసులో నేరస్తుడికి శిక్ష రద్దు, బెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, జీవితఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేయడం సంచలనంగా మారింది.జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం సెంగర్‌కు బెయిల్‌ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా హైకోర్టు సెంగర్‌ను ఆదేశించింది. వీటిల్లో ఏ షరతును ఉల్లంఘించినా అతని బెయిల్ రద్దు అవుతుందని కోర్టు తెలిపింది.అత్యాచారం కేసులో సెంగర్ తన దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండే వరకు ఆయన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అత్యాచారం కేసులో డిసెంబర్ 2019 ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాలు చేశాడు. 2019, ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలీ చేశారు.అసలు కేసు ఏంటి?2017లో బీజేపీ నేతగా ఉన్న కుల్దీప్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ తరువాత బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ మరింత ఆందోళన రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ అతణ్ని పార్టీనుంచి తొలగించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో తన దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఇప్పటికే గణనీయమైన సమయం జైలులోగడిపినందున శిక్షను నిలిపివేయాలని కూడా కుల్దీప్ అప్పీలు చేశాడు. ఇది పెండింగ్‌లో ఉంది.
యువతికి వేధింపులు : హౌసింగ్ సొసైటీపై రూ.62లక్షల దావా, చివరికి
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యుల వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బాధిత యువతి రెడ్డిట్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్‌కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్‌గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్‌కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్‌తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్‌లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్‌ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్‌కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్‌లో వెల్లడించింది.మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్‌లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.సోషల్ మీడియా ప్రశంసలుఆమె పోస్ట్‌లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు.
లగ్జరీ హోటల్లో ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య, మాజీ భర్త అరెస్ట్
దుబాయ్‌లోని లగ్జరీ హోటల్లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్‌లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో శవమై తేలింది. దుబాయ్‌లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్‌ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్
వీడియోలు
YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు
ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో
హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!
ఆంధ్రా కిమ్ నారా లోకేష్
పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!
మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు
ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు
పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు
శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..

