Suryapet
-
కుమారి సేవలు మరువలేనివి
మునగాల: మునగాల మండలం కొక్కిరేణికి చెందిన ములకలపల్లి కుమారి చేసిన సేవలు మరువలేనివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొక్కిరేణికి చెందిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు సతీమణి కుమారి(48) అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందారు. బుధవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో వారు పాల్గొని మాట్లాడారు. తొలుత కుమారి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని మాట్లాడారు. రాములు పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాములు పార్టీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఎంతో ఓర్పుతో ఉంటూ అన్ని విధాల సహాయసహాకారాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతరాములు,ి జి.నరసింహారావు, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, ఎండి. జహంగీర్, వ్యవసాయ కార్మికసంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, తప్పెట స్కైలాబ్‌బాబు, అర్.వెంకటరాములు ప్రసాద్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డబ్బికారు మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, కోట రమేష్, పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, నాగారపు పాండు, కోట గోపి, మట్టిపెల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, బొప్పన పద్మ, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వట్టెపు సైదులు, మిట్టగణుపులు ముత్యాలు, షేక్ సైదా, దేవరం వెంకటరెడ్డి, బుర్రి శ్రీరాములు, నందిగామ సైదులు, రావులపెంట వెంకన్న, శంభయ్య పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో ఇక్కడ పని చేసిన డీఎస్పీ పార్థసారధి అరెస్టు అయిన విషయం విదితమే. ఆయన స్థానంలో సైబరాబాద్ ఏసీపీగా పని చేస్తున్న ప్రసన్నకుమార్ ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించి డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుసూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8,600 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్‌కు ఒక సీఎస్, డీఓలను నియమించారు. జిల్లా కేంద్రంలో 8 పరీక్ష కేంద్రాలు, కోదాడలో ఐదు , హుజుర్నగర్లో రెండు, తుంగతుర్తిలో రెండు, మఠంపల్లి, నేరేడుచర్ల తిరుమలగిరి, నడిగూడెంలో ఒక్కొక్క పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుంది.ఈ నెల 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. ట్రాక్టర్ల కిరాయిలు చెల్లిస్తాం అర్వపల్లి: కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేస్తే కిరాయిలను చెల్లిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. బుధవారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అర్వపల్లి, రామన్నగూడెంలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో ట్రాక్టర్‌కు కిరాయి రూ.300 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. వర్షాలు పడుతున్నందున కాంటాలైన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు పంపాలన్నారు. లారీల కొరత కూడా తీరనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, గిర్దావర్లు రామరాజు జలేంధర్‌రావు, పాటి వెంకట్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అశోక్ పాల్గొన్నారు. రెండు ఆసుపత్రుల అనుమతులు రద్దుసూర్యాపేటటౌన్ : చట్ట విరుద్ధంగా వైద్యం నిర్వహిస్తున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీకృష్ణ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ అనుమతులను బుధవారం రద్దు చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలలో చట్టవిరుద్ధంగా వైద్యం నిర్వహిస్తుండటంతో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్యం బృందం తనిఖీలు నిర్వహించి, నివేదికను కలెక్టర్‌కు సమర్పించామని పేర్కొన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీకృష్ణ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ అనుమతులను ఎంక్వయిరీ కమిటీ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు. క్రీడాప్రాంగణాల అభివృద్ధికి కలెక్టర్‌కు నివేదికనూతనకల్: జిల్లాలో క్రీడాప్రాంగణాల అభివృద్ధికి, నిధుల సమీకరణకు కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రామచందర్‌రావు వెల్లడించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. మినీ స్టేడియాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని ఇక నుంచి క్రీడలు తప్పా ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించకూడదని ఆయన ఆదేశించారు. క్రీడా ప్రాంగణాన్ని భద్రత కోసం పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఆర్ఐ కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
71 వేల ఎకరాలకు సాగునీరు
హుజూర్నగర్, మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలో కృష్ణానదిపై ఏర్పాటు చేసే మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా వివిధ మండలాల్లోని దాదాపు 71 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం చింతలపాలెం పరిధిలోని అంజలి సిమెంట్ పరిశ్రమ ఆడిటోరియంలో మండలంలోని రాజీవ్‌గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్‌గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఈమూడు లిఫ్ట్‌ల ద్వారా దాదాపు 71వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు సంభందించి భూ సేకరణను జూలై నాటికి పూర్తి చేసి పరిహారం చెల్లించాలని దేశించారు. 2008లో నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టి 2012 లో పూర్తి చేసి సాగునీరు అందజేశామని , 2018 నుంచి దీనికి మరమ్మతులు చేయించక పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. మళ్లీ మన ప్రభుత్వ హయాంలో రూ 37.70 కోట్లతో చేపట్టిన నక్కగూడెం లిఫ్టు పునరుద్ధరణ పనులను 2025నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా నక్కగూడెం, చింత్రియాల, కిష్టాపురం, తమ్మారం గ్రామాల్లో 3200 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. రూ 1,450 కోట్లతో చేపట్టిన ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం పనులు 2026 ఆగస్టునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీని ద్వారా మఠంపల్లి మండలంలో 20,500 ఎకరాలు, మేళ్లచెరువులో 15,800 ఎకరాలు, చింతలపాలెం మండలంలో 16,700 ఎకరాలు సాగులోకి తీసుకొస్తామన్నారు. రూ. 394 కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా మేళ్లచెరువు, కోదాడ, హుజూర్ నగర్, చింతలపాలెం, చిలుకూరు మండలాల్లోని 12 గ్రామాలలో 14,100 ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. 2026 మే నాటికి ఈలిఫ్ట్ను పూర్తి చేయాలన్నారు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు, ఎస్ఈ శివధర్మతేజ, ఆర్డీఓ శ్రీనివాసులు, ఈఈలు సత్యనారాయణ, రామకిషోర్, డీఈలు స్వామి, ఆనంద్, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ భూపాల్ రెడ్డి, ఏఈ కానుగ శ్రీనివాస్, జీవన్‌కుమార్, దుర్గయ్య, శ్రీనివాస్, నాగార్జున పాల్గొన్నారు. ఫ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ రాజీవ్‌గాంధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలపై సమీక్ష -
పెరిగిన వినియోగం.. అందని గృహజ్యోతి
పొదుపు అత్యంత కీలకం.. విద్యుత్ వాడకం విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వృథాను అరికట్టాలి. పొదుపు అత్యంత కీలకం. ఇంటిలో మనుషులు ఏ గదిలో అవసరం ఉంటే ఆ గదిలోనే లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు వినియోగించాలి. గృహజ్యోతి లబ్ధిదారులు మరింత పొదుపు పాటించాలి. వీరు 200 యూనిట్లకు మించి విద్యుత్‌ను వాడితే బిల్లు భారం భరించాల్సిందే. –శ్రీనివాస్, విద్యుత్‌శాఖ డీఈఈ, సూర్యాపేట. నాగారం : భానుడి ప్రతాపంతో ప్రజలతోపాటు పశుపక్ష్యాదులు విలవిలలాడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లను వదిలి బయటకు వస్తున్నారు. ఉపశమనం కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా గృహజ్యోతికి పలువురు దూరమయ్యారు. అమాంతం పెరిగిన వినియోగం జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు వచ్చే సరికి గృహజ్యోతి లబ్ధిదారులు 1,78,950 మంది ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు చేసుకుని సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల నుంచి ఆమోదం పొంది మార్చిలో 168 మంది, ఏప్రిల్‌లో 113 మంది అర్హులుగా ఎంపికయ్యారు. 200 యూనిట్లలోపు వినియోగించే వారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ వినియోగించినా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. పరిమితికి మించి వాడకంతో.. ఎండల తీవ్రత అధికంకావడంతో ఇళ్లలో ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. కొందరు ఏసీలు కూడా వాడుతున్నారు. పరిమితికి మించి వాడకంతో మార్చిలో 2,138 మంది, ఏప్రిల్‌లో 6,228 మంది గృహజ్యోతి పథకానికి అర్హత కోల్పోయారు. అలాగే మే నెలలో మాత్రం ఈ సంఖ్య భారీగా పెరగడంతో 10,225 మంది అనర్హులయ్యారు. మూడు నెలల్లో మొత్తం 18,591 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తించలేదు. ఫ వేసవిలో పెరిగిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలవాడకం ఫ 200యూనిట్లు దాటిన మీటర్ రీడింగ్ ఫ పథకానికి మూడునెలల్లో 18,591మంది దూరం ఫ విద్యుత్ పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు జిల్లాలో గృహజ్యోతి పథకం వివరాలు నెల మొత్తం అర్హులు పథకానికి దూరమైనవారు మార్చి 1,78,950 1,76,812 2138 ఏప్రిల్ 1,79,118 1,72,890 6228 మే 1,79,231 1,69,006 10,225 -
దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్‌గాంధీ
హుజూర్నగర్ : దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువ లేనివని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఈడ్పుగంటి సుబ్బారావు, అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి, జక్కుల మల్లయ్య, అజీజ్‌పాషా, జేఎస్, అమర్నాధ్ రెడ్డి, మజీద్, మన్సూర్‌అలీ, మహేష్, యోహాన్, ఐల వెంకన్న పాల్గొన్నారు. -
జనార్దన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
సూర్యాపేట : జలగం జనార్దన్ (జన్ను) సార్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు చేస్తామని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. జలగం జనార్దన్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డులోగల చంద్ర పుల్లారెడ్డి నగర్లో ఆయన విగ్రహాన్ని నర్సయ్య ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ జన్ను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశంలో మోదీ ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురి చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ రాజ్యహింసను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే మావోయిస్టులను, వారితోపాటు అమాయక గిరిజనులను పిట్టల్లా కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. శాంతి చర్చలు చేద్దామని మేధావులు అన్ని రాజకీయ వర్గాలు ముందుకు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆటవిక న్యాయాన్ని కొనసాగిస్తోందన్నారు. ఎన్కౌంటర్లు ఆపి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పేర్ల నాగన్న, గొడ్డలి నరసన్న, వాసా పల్లయ్య, పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, ఉపాధ్యక్షురాలు సంతోషి, ఐతరాజు పద్మ, సయ్యద్ , సయ్యద్ హుస్సేన్, వీరబాబు కట్టా రమేష్ గొడ్డలి లింగన్న పాల్గొన్నారు. ఫ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య -
మొండికేస్తున్న మిల్లర్లు
జాజిరెడ్డిగూడెం మండలంలోని ఐకేపీ సెంటర్‌కు చెందిన ధాన్యం 20 రోజుల క్రితం కోదాడలోని ధనలక్ష్మి రైస్ మిల్లుకు వచ్చింది. మూడు రోజులు ధాన్యం దిగుమతి చేసుకోలేదు. అనంతరం ధాన్యం నాణ్యత లేదని తాము దిగుమతి చేసుకోబోమని చెప్పడంతో ఆ లారీని అక్కడి నుంచి చిలుకూరు మండలం బేతవోలుకు పంపారు. అక్కడ కూడా ధాన్యం దిగుమతి చేసుకోలేదు. దీంతో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు రైతులను వెళ్లి మాట్లాడుకోవాలని చెప్పారు. అక్కడి నుంచి రైతులు వచ్చి మిల్లర్‌తో మాట్లాడారు. క్వింటాకు 4 కేజీలు తరుగు తీస్తామని దానికి ఒప్పుకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్ చెప్పడంతో రైతులు అంగీకరించారు. అప్పుడు ధాన్యం దిగుమతి చేసుకున్నారు. ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లపైనే అదనపు భారం కోదాడ డివిజన్లో ఉన్న 10 మిల్లులు అధికారులు చెప్పిన టార్గెట్ మేరకు ధాన్యం దిగుమతి చేసుకున్నారు. మిగిలిన 12 మిల్లులు ఇచ్చిన టార్గెట్‌లో 50 శాతం ధాన్యం కూడా దిగుమతి చేసుకోకపోవడంతో టార్గెట్ పూర్తి చేసిన తమనే అదనంగా ధాన్యం తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారు అంటున్నారు. హుజూర్నగర్ డివిజన్లో 18 మిల్లులు ఉండగా ఐదు మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అధికారులు మిగిలిన 13 మిల్లుల్లో 7 మిల్లులు టార్గెట్ పూర్తి చేశాయి. తమ మిల్లుల వద్ద ధాన్యం నిలువ చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని చెప్పినా అధికారులు వినకుండా తమకే అధికంగా ధాన్యం కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మిగిలిన 6 మిల్లులు 50శాతం మాత్రమే టార్గెట్ పూర్తి చేశాయని వాటికి ధాన్యం కేటాయించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని టార్గెట్ పూర్తి చేసిన మిల్లర్లు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు పూర్తి అయిన ధాన్యం నిలువ ఉంటే ఉన్నతాధికారులు ఊరుకోవడం లేదని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అదనంగా ధాన్యం కేటాయించక తప్పడం లేదని అధికారులు అంటున్నారు. దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్న మిల్లులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అదితమ చేతిలో పని కాదని కిందిస్థాయి అధికారులు అంటున్నారు. సీఎంఆర్ ధాన్యం తీసుకోవడానికి కొర్రీలుఫ సన్నరకాల నుంచి నూక ఎక్కువగా వస్తుందని నిరాకరణ ఫ టార్గెట్ పూర్తిచేసిన మిల్లర్లకే అదనంగా ధాన్యం కేటాయిస్తున్న అధికారులు ఫ ఐకేపీ, పీఏసీఎస్ లోడ్ అంటేనే హడలిపోతున్న లారీ డ్రైవర్లు -
కష్టజీవుల రాజ్యం వస్తేనే సుందరయ్యకు నివాళి
నేరేడుచర్ల: కష్టజీవుల రాజ్యం వస్తేనే కమ్యూనిస్టు ఉద్యమనేత, బడుగుల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో సిరికొండ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో కోలాట దళంతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అనంత ప్రకాశ్, నీలా రాంమ్మూర్తి, మర్రి నాగేశ్వర్రావు, శ్రీధర్, నాగ సైదులు, ధనుంజయ, సత్యం, మట్టయ్య, శ్రీను, హుస్సెన్, కోటయ్య, మట్టేష్, శ్రీను తదితరులున్నారు. -
లారీల కొరతలేకుండా చేస్తాం
అర్వపల్లి: ధాన్యం తరలింపునకు రెండు రోజుల్లో లారీల కొరత లేకుండా చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, తిమ్మాపురం, అడివెంల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు.రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆపరేటర్లు రైతుల వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదుచేసి, సకాలంలో బిల్లులు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, గిర్దావర్ పాటి వెంకట్‌రెడ్డి, కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నిఖిల్‌రెడ్డికి 11వ ర్యాంకు
మిర్యాలగూడ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ నిఖిల్‌రెడ్డి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించాడు. నిఖిల్‌రెడ్డి మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ శ్రీనివాస్‌రెడ్డి– సునంద దంపతుల కుమారుడు. నిఖిల్‌రెడ్డి తల్లి సునంద పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తుండగా, తండ్రి చాడ శ్రీనివాస్‌రెడ్డి వేములపల్లి మండల ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్నారు. నిఖిల్‌రెడ్డి ప్రాథమిక విద్యను మిర్యాలగూడలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్మీడియట్ విజయవాడ సమీపంలో గూడవలిల్లో చదివారు. ఐఐటీలో 91వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2019–20లో ఆడోబ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. యూపీఎస్పీ పరీక్షలకు ఐదుసార్లు హాజరై ఐదవసారి ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికై న చాడ నిఖిల్‌రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ప్రతి సంవత్సరం విద్యా శాఖ బడిబాట కార్యక్రమం చేపడుతుంది. 15 రోజుల పాటు నిర్వహించే బడి బాటలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, ఉచితంగా అందజేస్తున్న అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు, వసతుల గురించి వివరించారు. ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..● జూన్ 6వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై అవగాహన కల్పించాలి. ● 7వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల వివరాలు సేకరించాలి. ● 8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి కపత్రాలతో ప్రచారం నిర్వహించాలి. అంగన్వాడి కేంద్రాల్లో పోస్టర్లు అతికించాలి. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలి. పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. ● 11న జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ● 12వ తేదీన అమ్మ ఆదర్శ బడుల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించనున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయనున్నారు. స్కూల్ యూనిఫామ్ ఇవ్వనున్నారు. ● 13వ తేదీన సామూహిక అక్షరాభ్యాసం, గ్రామ సభ నిర్వహించనున్నారు. ● 16న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ దినోత్సవం జరపనున్నారు. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించనున్నారు. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించనున్నారు. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ● 17న సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. బాలికల వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. ● 18వ తేదీన తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర ఆధునీకరణ సౌకర్యాలు చూపిస్తారు. ● 19న బడి బయట కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పుస్తకాలను సిద్దం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలో బడి బాట తరహా కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదేశం మేరకు ఏప్రిల్ 23వ తేదీ నుంచి ముందస్తుగా కొనసాగిస్తున్నప్పటికీ జూన్‌లో మరోసారి చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ముందస్తు ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళుతున్నారు. బడిబాట నేపథ్యంలో మంగళవారం నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ అనంతరం ఉపాధ్యాయులు గ్రామస్తులను చైతన్యం చేయనున్నారు. ఫ జూన్ 6 నుంచి బడి బాట ఫ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన ఫ ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం -
నేడు ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బుధవారం హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో బయలు దేరి 10 గంటలకు మేళ్లచెరువులోని ఓ సిమెంట్ పరిశ్రమలోని హెలిపాడ్‌లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 10.30 నుంచి 1 గంట వరకు చింతలపాలెం మండలంలోని ఎంబీసీ, నక్కగూడెం, బుగ్గమాదారం లిఫ్టు పనులు పరిశీలించి వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 3 గంటలవరకు హుజూర్‌నగర్‌లో ఆర్అండ్బీ, జూనియర్, డిగ్రీ కళాశాలల నూతన భవనాలను పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3. 30 వరకు హౌసింగ్ కాలనీ, ఐటీఐ, ఏటీఐ భవనాలను పరిశీలిస్తారు. 3.30 నుంచి 4.30 వరకు మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ను పారంభిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనంతగిరి మండలం శాంతినగర్‌లో నూతనంగా మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై అధికారులతో చర్చిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కోదాడ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు వెళతారు. సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తాంఅర్వపల్లి: సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా అడిషనల్ డీఆర్డీఓ సురేష్‌రెడ్డి, మార్కెటింగ్ డీపీఎం ఆంజనేయులు స్పష్టం చేశారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సెర్ప్ 1వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఇక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను తొలగించడంతో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగరి , ఏపీఎం నగేష్, గిర్దావర్ వెంకట్‌రెడ్డి, ఏఈఓ ఎన్. సత్యం, రైతులు శంకర్, శ్రీరాములు, భిక్షం, మల్లయ్య, నరేందర్, నాగయ్య, లింగయ్య, సైదులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంనడిగూడెం: సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలలు, కళాశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారిణి సీహెచ్.పద్మ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగి ఉండి అనుభవజ్ఞులైన, ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తులను సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బాలికల పాఠశాలల్లో బోధించడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 97045 50271, 80089 95137 నంబర్లలలో సంప్రదించవచ్చని సూచించారు. మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాంచివ్వెంల(సూర్యాపేట) : మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, దీనిపై ఆశాకార్యకర్తలు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ అర్బన్ పీహెచ్సీలో ఆశార్కర్లకు నిర్వహించిన లీగల్ లీటరసీ క్యాంపులో ఆమె మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు వసంత సత్యనారయణ పిళ్లే యాదవ్, ఏడిండ్ల అశోక్, దావుల వీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. నకిలీ విత్తన అమ్మకాలు, నివారణ చర్యలపై మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు, విత్తన డీలర్లతో జిల్లా సీడ్ టాస్క్‌ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2025 –26 వానాకాలం సీజన్‌కు గానూ వ్యవసాయ శాఖ తరఫున ముందస్తు ప్లానింగ్‌లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని విత్తన డీలర్లకు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు తీసుకొస్తే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 6281492368 కు సమాచారం అందించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ పథకాలపై మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య, కోదాడ డీఎస్పీ పి.శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు, సూర్యాపేట జిల్లా విత్తన డీలర్లు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ కల్తీ విత్తనాలు తీసుకొస్తే కంట్రోల్ రూం నంబర్ 6281492368కు సమాచారం ఇవ్వాలి ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
21 నుంచి తాడువాయి పీఏసీఎస్‌లో విచారణ
మునగాల: మునగాల మండలం తాడువాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై ఈనెల 21 నుంచి 23 వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు బహిరంగ విచారణ చేయనున్నట్లు సొసైటీ ఇన్చార్జి సీఈఓ చందా ప్రవీణ్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా సహకార అధికారి పద్మ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి. ఇందిరను నియమించారని తెలిపారు. రుణం తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీ సొసైటీలో జమకాని రైతులు సరైన ఆధారాలతో కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఈనెల 21న విజయరాఘవపురం, నరిసింహులగూడెం, కలకోవ గ్రామాల రైతులు , 22న తాడ్వాయి, వెంకట్రాంపురం, మాధవరం, జగన్నాథపురం, 23న నేలమర్రి, రేపాల గ్రామాల రైతులు విచారణకు హాజరుకావొచ్చని కోరారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలితాళ్లగడ్డ (సూర్యాపేట): పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సూర్యాపేట పట్టణంలోని విజయ కాలనీలోగల బాల సదనంను ఆమె తనిఖీ చేశారు. పిల్లలతో ముచ్చటించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఆహారం సరిగ్గా ఇస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొంపల్లి లింగయ్య, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుంకరబోయిన రాజు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.వెంకట రత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి, డి.ఎల్.ఎస్.ఎ నామినేటెడ్ మెంబర్స్ అల్లంనేని వెంకటేశ్వర్ రావు, గుంటూరు మధు, అడ్వకేట్స్ పాల్గొన్నారు. హామీల అమలులో విఫలంసూర్యాపేట అర్బన్: గొల్లకురుమలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెలంగాణ గొర్రెలమేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో చేతివృత్తిదారుల భవనంలో జిల్లా అధ్యక్షుడు కడం లింగయ్య ఆధ్యర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్లకురుమలకు గొర్రెల కొనుగోలుకు రూ.2 లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, వజ్జ వినయ్, కంచుకోట్ల శ్రీనివాస్, రాజుల నాగరాజు, గుండాల లింగయ్య, వీరబోయిన సైదులు, చిట్లింగి యాదగిరి, కుక్కల సాంబయ్య, ఎం.సైదులు పాల్గొన్నారు. పెండింగ్ కరువు భత్యం విడుదల చేయాలిసూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి మైలారపు వెంకన్న జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సంఘం జిల్లా కార్యాలయానికి రూ.80 వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్ అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మైలారపు వెంకన్న ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, జె.యాకయ్య, శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, వెంకటయ్య, బి.ఆడం, వి.రమేష్, రమేష్, డి.లాలు, కె .జ్యోతి, ఆర్.శ్రీను, అభినవ్ పాల్గొన్నారు. -
ప్రాణాలు తీస్తున్నరు!
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హతకు మించి వైద్యం గతంలో జరిగిన మరో సంఘటన చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే మూడో కాన్పులో మగపిల్లవాడు కావాలనుకున్నారు. మూడో సారి గర్భవతి కాగా స్కానింగ్ చేయించారు. ఆడపిల్లఅని తేలడంతో భర్తతో పాటు బంధువులు కలిసి ఆ గర్భిణికి అబార్షన్ చేయించాలనుకున్నారు. అయితే 11నెలల క్రితం హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. మరో ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే నర్సుతో అబార్షన్ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈవిషయం కాస్తా మీడియాకు తెలిసిందని వెంటనే పెదవీడు గ్రామ సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లి గర్భిణికి ట్యాబ్లెట్లు, ఇంజక్షన్‌తో అబార్షన్ చేస్తుండగా వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సూర్యాపేటటౌన్: పవిత్రమైన డాక్టర్ వృత్తిని కొంత మంది అభాసుపాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అర్హత లేకున్నా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాల. ఎంబీబీఎస్ చదవకపోయినా.. ఎం.డి. చేయకున్నా.. డాక్టర్లుగా చలామణి అవుతూ ధనార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలు బలిగొంటున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట పట్టణంలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అర్హతకు మించి వైద్యంతో నిండుప్రాణం బలి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి 20 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో నివాసముండే ఓ మహిళ గర్భసంచి సమస్య ఉందని వెళ్లింది. అయితే పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో బుడిగలు వచ్చాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఆ మహిళ కుటుంబ సభ్యులు మాత్రం ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేయాలని కోరారు. దీంతో వెంటనే వైద్యులు ల్యాప్రోస్కోపి ద్వారా ఆపరేషన్ చేస్తుండగా కడుపులో పేగు కట్టయింది. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. నార్మల్ ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని చెప్పి వైద్యులు ఆరు గంటల పాటు వైద్యం చేశారు. అయినా ఆ మహిళకు బ్లడ్ బ్లీడింగ్ అవుతూనే ఉన్నా వారం రోజుల పాటు అలాగే ఆ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేశారు. తీరా పరిస్థితి విషమించడంతో ఈ హాస్పిటల్ యాజమాన్యమే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇక్కడ ఎం.డీ.గా చలామణి అవుతున్న విషయం తనిఖీల్లో బయటపడింది. సదరు డాక్టర్‌పై కేసు నమోదు అయినా ఆ ఆస్పత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ ప్రాణంపోయాక జిల్లా వైద్యాధికారి స్పందించి చర్యలు తీసుకోవడం గమనార్హం.ఫ వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఫ సూర్యాపేట పట్టణంలో తాజాగా వైద్యం వికటించి మహిళ మృతి కలెక్టర్‌కు నివేదికగత నెలలో సూర్యాపేటలో శరత్కార్డియాక్ సెంటర్, యాపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీసాయిగణేష్ , శ్రీకృష్ణ ఆస్పత్రుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు చేయగా నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. శరత్కార్డియాక్ సెంటర్లో డాక్టర్ లేకుండా ల్యాబ్ టెక్నీషియనే నడిస్తున్నాడు. యాపిల్ స్కానింగ్ సెంటర్లో డాక్టర్ కిరణ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి నకిలీ సర్టిఫికెట్లతో ఎం.డీ రేడియాలజిస్ట్‌గా చలామణి అవుతున్నాడు. శ్రీకృష్ణ ఆస్పత్రిలో డాక్టర్ రవిశేఖర్ అనస్తీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్‌గా అవతారం ఎత్తి సర్జరీలు చేస్తున్నట్టు బట్టబయలైంది. సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్‌కుమార్ చైనాలో ఎంబీబీఎస్ చేసి ఎం.డీగా చలామణి అవుతున్న విషయం బయటపడింది విదితమే. ఈ నివేదికను కలెక్టర్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు అందజేశారు. కాగా నాలుగు ఆస్పత్రులను డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సీజ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్య వైఖరి వ్యవహరించడంతో నిబంధనల మేరకు మొదట నోటీసులు అందజేశామన్నారు. అయినా మార్పు రాకుండా నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రిని సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జయ మనోహర, పీఓఎన్‌హెచ్ అనితా రాణి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇన్చార్జి డెమో మనోహర రాణి తదితరులు పాల్గొన్నారు. -
పేటకు రైలొస్తుంది!
సూర్యాపేట మీదుగా శంషాబాద్ – విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్‌కు కేంద్రం ఓకేఫ ఫైనల్ లొకేషన్ సర్వేకు నిధులు ఫ డోర్నకల్ – గద్వాల కొత్త లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఫ కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు కేటాయింపు ఫ రైల్వే స్టేషన్లలో సదుపాయాల కల్పన ఫ నిధుల కేటాయింపు వివరాలను పింక్ బుక్‌లో వెల్లడించిన రైల్వే శాఖ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా రెండు రైల్వే లైన్లు రానున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్ కింద శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర రైల్వే శాఖ ఓకే చెప్పింది. అలాగే సూర్యాపేట, నల్లగొండ మీదుగా డోర్నకల్ – గద్వాల లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైల్వే పనులకు నిధులను కేటాయించింది. రైల్వే బడ్జెట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రాజెక్టులు, ఎఫ్ఎల్ఎస్లకు కేటాయించిన నిధుల వివరాలతో కూడిన పింక్ బుక్‌ను ఇటీవల విడుదల చేసింది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు ఇలా.. ● మాచర్ల నుంచి నల్లగొండ వరకు 92 కిలోమీటర్లు పొడవునా రూ.458.26 కోట్లతో కొత్త రైల్వే లైన్‌కు ఓకే చెప్పింది. దానికి సంబంధించిన సేఫ్టీ పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించింది. ● రూ.77.80 కోట్లతో విష్ణుపురం నుంచి జాన్‌పహాడ్ వరకు 11 కిలోమీటర్ల పొడవునా కొత్తలైన్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీనికి సేఫ్టీ ఫండ్స్ కింద రూ.5 కోట్లు కేటాయించింది. ● జగ్గయ్యపేట నుంచి మేళ్లచెరువు వరకు 19.1 కిలోమీటరు పొడవునా కొత్త లైన్‌కు ఓకే చెప్పింది. దాంతోపాటు మేళ్లచెరువు–జాన్‌పహాడ్ లైన్ 24 కిలోమీటర్ల పొడవునా ఆధునుకీకరణ పనులకు రూ.513.20 కోట్లు కేటాయించింది. ● ఘట్కేసర్ నుంచి బీబీనగర్ వరకు 14.25 కిలోమీటర్ల పొడవునా 3, 4 లైన్ల డబ్లింగ్ చేసేందుకు ఎఫ్‌ఎల్‌ఎస్‌కు ఓకే చెప్పింది. ఇందుకు రూ.29 లక్షలు కేటాయించింది. ● భువనగిరి– బీబీనగర్ మధ్య 15 కిలోమీటర్ల పొడవునా 3వ లైన్ డబ్లింగ్‌కు ఎఫ్‌ఎల్‌ఎస్‌కు రూ.30 కోట్లు కేటాయించింది. ● ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ –2 విస్తరణకు ఓకే చెప్పింది. దీనికి వివిధ పద్దుల కింద రూ. 110 కోట్లు కేటాయించింది. ● అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రిలో ర్యాంపులతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను కేటాయించింది. అలాగే యాదాద్రిలో 4 కిలోమీటర్ల పొడవునా బైపాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎఫ్‌ఎల్‌ఎస్‌కు ఓకే చెప్పింది. ● గుంటూరు– బీబీనగర్ మధ్య డబ్లింగ్‌కు సంబంధించిన ఎఫ్‌ఎల్‌ఎస్‌కు రూ.3.10 కోట్లు, బీబీనగర్–భువనగిరి మధ్య డబ్లింగ్ కోసం ఎఫ్‌ఎల్‌ఎస్‌కు రూ.30 లక్షలు కేటాయించింది. ● గుంటూరు – బీబీనగర్ మధ్య రూ.2,853 కోట్లతో చేపట్టే డబ్లింగ్‌కు, రూ.110.89 కోట్లతో విష్ణుపురం వద్ద బైపాస్ లైన్ నిర్మాణానికి ఓకే చెప్పింది. ● మోతుమర్రి– విష్ణుపురం మధ్య డబ్లింగ్‌కు నిధులను కేటాయిచింది. ● రూ.3.32 కోట్లతో మిర్యాలగూడ గూడ్స్ షెడ్‌ను అభివృద్ధి చేయనుంది.ఏళ్ల నాటి కల.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో పలుమార్లు కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే, విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా శంషాబాద్ వరకు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్‌కు హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను చేపట్టింది. ఆ సర్వే గతేడాది చివరలో పూర్తి కావడంతో దానిని ఈ ఏడాది బడ్జెట్లో పొందుపరిచింది. తాజాగా ఆ కొత్తలైన్ ఎఫ్‌ఎల్‌ఎస్‌కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది కార్యరూపం దాల్చితే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 296 కిలోమీటర్ల పొడవున సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ ఎఫ్‌ఎల్‌ఎస్‌కు ఓకే చెప్పింది. దానికి రూ.7.40 కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడనుంది. -
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మే 22 నుంచి 29 వరకు రోజూ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఐఈఓ భానునాయక్, డీఈఓ ఆశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి గౌడ్, శ్రీలత రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ముక్త్యాల బ్రాంచ్ కాల్వకు లైనింగ్
మునగాల: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు అనుబంధంగా ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కాల్వ లైనింగ్ పనులకు రూ.184.60కోట్ల వ్యయంతో ఆదివారం శ్రీకారం చుట్టారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు చివరిభూములకు నీరు అందే విధంగా , నీటి ప్రవాహ వేగాన్ని పెంచడం, కాల్వ కట్టలను పటిష్టం చేసే పనులు చేపట్టనున్నారు. 45వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ముక్త్యాల బ్రాంచ్ కాల్వ మునగాల హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రారంభమై కోదాడ డివిజన్ పరిధిలో 16కిలో మీటర్లు, హుజూర్నగర్ డివిజన్ పరిధిలో 29కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. దీని కింద సుమారు 45వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు ఉంది. ముక్త్యాల బ్రాంచ్ కాల్వపై తొమ్మిది అండర్ టన్నెల్స్, రెండు డబుల్‌లేన్ రోడ్డు బ్రిడ్జిలు ఉన్నాయి. కాగా కోదాడ డివిజన్ పరిధిలో మునగాల, చిలుకూరు మేజర్లు ఉండగా హుజూర్నగర్ డివిజన్ పరిధిలో చింత్రియాల, మఠంపల్లి, లింగగిరి, రాంపూర్, గుండ్లపల్లి మేజర్లు ఉన్నాయి. చివరి భూములకు నీరు అందకపోవడంతో.. ముక్త్యాల బ్రాంచ్ కాల్వ ద్వారా చివరి భూములకు పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో ఏటా సాగుచేసిన వందల ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ముక్త్యాల బ్రాంచ్ కాల్వ కట్టలకు లైనింగ్ నిర్మిస్తే చివరిభూములకు పూర్తిస్థాయిలో నీరు అందే అవకాశం ఉందని నీరుపారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కాల్వ లైనింగ్ పనులకు ఉపక్రమించారు. మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం నుంచి లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలో పలు యంత్రాలు లైనింగ్ పనిల్లో నిమగ్నమయ్యాయి. కాగా ఈ సారి కాల్వకు నీటిని విడుదల చేసే సమయానికి లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ రూ.184.60కోట్లతో మునగాల హెడ్‌రెగ్యులేటర్ వద్ద పనులు ప్రారంభం ఫ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫ కాల్వకు నీటిని విడుదల చేసే సమయానికి పూర్తిచేసేలా ప్రణాళికలైనింగ్ పనులు కొనసాగుతున్నాయి ముక్త్యాల బ్రాంచ్ కాల్వ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. బరాఖత్‌గూడెం వద్ద ప్రస్తుతం పనులు వేగవంతం చేశాం. వీలైనంత త్వరలో లైనింగ్ పనులను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – ఉమ్మడి స్వప్న, డీఈ, నీటిపారుదల శాఖ , కోదాడ డివిజన్ -
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
కోదాడరూరల్: ఆర్థిక పరిస్థితులు బాగోలేక మానసికంగా కృంగిపోయిన మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన నవ్య(22)కు కోదాడ మండలం కూచిపూడికి చెందిన సాయిబాబాతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మానసికంగా కూడా బాగోలేకపోవడంతో ఆదివారం భర్త బయటకు వెళ్లిన తర్వాత నవ్వ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. నవ్య కుమార్తె గేటు వద్ద ఏడుస్తూ కనిపించడంతో పక్కింటివాళ్లు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నవ్య విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బతో దివ్యాంగుడు మృతిపెన్పహాడ్: వడదెబ్బకు గురై దివ్యాంగుడు మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన షేక్ లతీఫ్సాబ్ కుమారుడు ముజీబ్(30) శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎండలో వెళ్లి వచ్చి వడదెబ్బకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా వెంకటేశ్వర్లునల్లగొండ టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లును ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు వడ్డెరులకు రాయి, మట్టిపై ప్రభుత్వం తగిన హక్కులు కల్పించాలని వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ‘హలో వడ్డెర–ఛలో సూర్యాపేట’ సభకు ఆయన హాజరై మాట్లాడారు. నిత్యం క్వారీల్లో, మట్టి పనిచేసే వడ్డెర కులస్తులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. గుట్టలపై క్రషర్ మిల్లులను వడ్డెరులకు కేటాయించాలని కోరారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. వయసు పైబడిన వడ్డెర వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర కులస్తులకు అధిక సీట్లు కేటాయించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించని ప్రభుత్వాలను గద్దె దింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓర్సు రాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఓర్సు అంజయ్య, కార్యదర్శి రూపని రాజు, పసుల సోమయ్య, కోశాధికారి గోగుల మహేష్, యూత్ అధ్యక్షుడు వరికుప్పల నవీన్, సోషల్ మీడియా ఇన్చార్జి శివరాత్రి గోపి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పాల్గొన్నారు. వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ -
ఆగని రేషన్ బియ్యం దందా!
కోదాడ : రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ డీలర్ల మాయజాలంతో ఈ దందా ఇంకా కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేషన్ షాపుల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతగా లేవనే ప్రచారంతో చాలామంది లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోవడం లేదు. వీరి బియ్యాన్ని డీలర్లు తక్కువ ధరకు కొని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చనిపోయిన వారి పేర్లు తొలగించడం లేదు.. ఆహార భద్రత కార్డులున్నవారికి ఒక యూనిట్‌కు 6 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కేజీల చొప్పున బియ్యం ఇస్తుంటారు. లబ్ధిదారులలో ఎవరైనా చనిపోతే ఆ విషయాన్ని డీలర్ సంబంధిత అధికారులుకు సమాచారం ఇచ్చి వారిపేరును తొలగించాలి. కానీ, జిల్లా వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా చనిపోయిన లబ్ధిదారుల పేర్లను తొలగించడం లేదు. వీరి పేరుతో మంజూరైన బియ్యాన్ని రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో 23 మంది చనిపోయినప్పటికీ అధికారులు వారి పేర్లను తొలగించలేదు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వారు వేలల్లో ఉంటారని కొందరు డీలర్లే అంటున్నారు. సన్నబియ్యమైనా తీసుకోవడం లేదు.. గ్రామాల్లో 90 శాతం మందికి తెల్ల రేషన్‌కార్డులున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాల వారు ఉన్నారు. దీంతో వీరు రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. గతంలో దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసిన సమయంలో డీలర్ల వద్ద 20 శాతం మంది మాత్రమే బియ్యం తీసుకెళ్లేవారు. సన్నబియ్యం పంపిణీ మొదలు పెట్టిన తరువాత గత నెలలో 50 నుంచి 70 శాతం మంది బియ్యం తీసుకెళ్తున్నారు. మిగతా వారు డీలర్లేకే అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. గతంలో దొడ్డు బియ్యానికి కిలోకి రూ.7 ఇచ్చిన డీలర్లు ప్రస్తుతం సన్న బియ్యం కేజీకి రూ.15 వరకు ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కొత్తవని అందువల్ల అన్నం వండినప్పుడు కొంత మేర ముద్దగా మారుతుందని, కొన్ని రోజలు పోతే ముద్దగా మారదని అధికారులు అంటున్నారు. ఫ చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించని అధికారులు ఫ వారిపేరుతోనూ బియ్యం కోటా తెస్తున్న డీలర్లు ఫ లబ్ధిదారుల నుంచి కొని బ్లాక్మార్కెట్లో అమ్మకాలు ఫ చర్యలు తీసుకుంటున్నామారనితీరు అనంతగిరి మండలం గోండ్రియాల రేషన్ డీలర్ ఇటీవల సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా అధికారులు ఆకస్మికదాడి చేసి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఉన్నత వర్గాల వారికి తెల్ల రేషన్ కార్డులుండగా వారు సన్నబియ్యం తీసుకోవడం లేదని సమాచారం. వీరినుంచి కిలో రూ.15లకు కొనుగోలు చేసిన డీలర్ ఈ బియ్యాన్ని బ్లాక్మార్కెట్లో కిలో రూ.30లకు అమ్ముకుంటూ అధికారులకు పట్టుబడడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో చనిపోయిన లబ్ధిదారుల పేరుతో స్థానిక రేషన్ డీలర్ కొన్ని నెలలుగా బియ్యం డ్రా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. ఇటీవల దీనిపై ఒకరు ఫిర్యాదు చేయగా ప్రాథమికంగా విచారణ చేసిన అధికారులు 23 మంది చనిపోయినా వారి పేరుమీద బియ్యం డ్రా చేస్తున్నాడని గుర్తించి అతన్ని సస్పెండ్ చేశారు. చనిపోయిన వారి పేర్లు తొలగించాలి రేషన్ కార్డుల్లో పేరున్న లబ్ధిదారులు చనిపోతే ఆ విషయాన్ని డీలర్లు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి వారి పేర్లను తొలగించాలి. వారిపేరుతో బియ్యం డ్రాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డివిజన్ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో విచారణ చేయించి చనిపోయిన వారిపేర్లు తీసివేస్తాం. – సీహెచ్.సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ జిల్లాలో రేషన్ దుకాణాలు 610సాధారణ రేషన్ కార్డులు 3,04,343 అంత్యోదయ కార్డులు 19,817అన్నపూర్ణ కార్డులు 39లబ్ధిదారులు 9,49,193 ప్రతినెలా ఇచ్చే బియ్యం 6,042.72 (మెట్రిక్ టన్నులు) -
‘గోపా’ బలోపేతానికి కృషిచేయాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) బలోపేతానికి కృషిచేయాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకూరు సత్యం గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాలలో గోపా జిల్లా అధ్యక్షుడు బూర రాములు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశాని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విస్తృత స్థాయిలో గోప సభ్యత్వాలు చేయించాలని, భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలు అందజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాతి సవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగాని లక్ష్మయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు నామాల గురుమూర్తి గౌడ్, కోశాధికారి అయితబోయిన రాంబాబు గౌడ్, జాయింట్ సెక్రటరీలు రాపర్తి మహేష్ గౌడ్, భూపతి నారాయణ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, దొరేపల్లి రమేష్ గౌడ్ ఈసీ సభ్యులు కొత్త పుల్లయ్య గౌడ్, బూర సుధాకర్ గౌడ్, భూపతి వెంకటయ్య గౌడ్, ఉయ్యాల సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రి శివాలయంలో జిల్లా ప్రధాన జడ్జి పూజలు
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో గల చారిత్రాత్మక శివాలయాన్ని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను దేవాలయ ప్రధాన అర్చకుడు మునగలేటి సంతోష్‌శర్మ శాలువా కప్పి సత్కరించి, మెమొంటో అందజేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వొద్దు సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది తల్లమల్ల హస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్పీ వర్గీకరణ తీర్పు, గైడ్‌లైన్స్‌ను సరిగ్గా పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల హక్కుల ఫోరం తరఫ/న హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. రెండు వాయిదాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు కొనసాగాయి. దీంట్లో భాగంగా సుప్రభాత సేవ, నిత్యాగ్నిహోత్రి, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, అమ్మవార్లకు సహస్ర కుంమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం జరిపారు. ఆ తర్వాత మహావేధనతో భక్తులను తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు తుమాటి లక్ష్మాణాచార్యులు, నర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ‘మీసేవ’ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా శ్రీకాంత్సూర్యాపేట అర్బన్ : తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా సూర్యాపేట పట్టణానికి చెందిన గొట్టిపర్తి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బృందావన్ ఇన్‌లో అన్ని జిల్లాల అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికై న శ్రీకాంత్‌తో ప్రమాణస్వీకారం చేయించి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు అధ్యక్ష, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో భక్తుల కోలాహలం యాదగిరిగుట్ట: ఓ వైపు నిత్య పూజా కార్యక్రమాలు, మరోవైపు భారీగా తరలివచ్చిన భక్తుజనులతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామును ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలో అలంకారమూర్తుల కు నిజాభిషేకం, తులసీదళ అర్చనచేశారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన హో మం, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, ముఖమండపంలో అష్టోత్తర పూజ లు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
అత్త, మామపై అల్లుడి దాడి
గుండాల: మద్యం మత్తులో అత్త, మామపై అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి చెందింది. మామకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుండాల మండలం సుద్దాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం గ్రామానికి చెందిన గుగులోతు జున్నూబాయి(50), రాజయ్య దంపతుల కుమార్తె చుక్కవ్వను అదే గ్రామానికి చెందిన కాలియా బచ్చన్, లింగబాయి దంపతుల కుమారుడు కనకయ్యకు ఇచ్చి 16ఏళ్ల క్రితం వివాహం చేశారు. గుగులోతు జున్నూబాయి, రాజయ్య దంపతులు గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన గూడ పృథ్వీ మామిడి తోటను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన కనకయ్య ఇటీవల మరో మహిళ గౌరమ్మను పెళ్లి చేసుకొని గుండాల మండలం బూర్జుబావి గ్రామంలో ఇద్దరు భార్యలతో కలిసి మామిడి తోటను కౌలుకు తీసుకొని ఉంటున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కనకయ్య సుద్దాల గ్రామంలో అత్తమామలు ఉంటున్న మామిడి తోట వద్దకు వచ్చి వారితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇనుప వస్తువుతో అత్త, మామపై దాడి చేయడంతో జున్నూబాయి అక్కడికక్కడే మృతి చెందింది. రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గుండాల గ్రామంలో మామిడి తోటను కౌలుకు తీసుకొని ఉంటున్న కాలె కృష్ణ ఆదివారం ఉదయం సుద్దాల గ్రామానికి వెళ్లి చూడగా రాజయ్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలి పెద్ద కుమార్తె కాలియా పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాయాలపాలైన రాజయ్యను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, జున్నూబాయి మృతదేహాన్ని ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని భువనగిరి డీసీపీ ఆకాంంక్ష్ యాదవ్, సీఐ శంకర్, ఎస్ఐ జి. సైదులు పరిశీలించారు. అత్త మృతి మామకు తీవ్ర గాయాలు -
నృసింహుడిని దర్శించుకున్న సమాచార కమిషనర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు అతిథి గృహం వద్ద కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి వారికి స్వాగతం పలికారు. -
షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలి
తిరుమలగిరి : రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ షరతులు లేకుండా రుణం మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ కోరారు. ఆదివారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ మండల సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడంతో కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అరాచకాలు సృష్టిస్తోందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అనర్హులకు, అధికార పార్టీ కార్యకర్తలకే ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఎండీ.ఫయాజ్, నాయకులు ఎల్లంల యాదగిరి, శ్రీకాంత్, ఎక్బాల్, కొమురెల్లి, వెంకన్న, పురుషోత్తం, యాకస్వామి, షాహిదా, గట్టమ్మ, మల్లేష్ పాల్గొన్నారు. -
నిడమనూరు పీహెచ్సీలో అగ్నిప్రమాదం
నిడమనూరు: నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టోర్ రూంలో మంటలు చెలరేగడంతో ఆస్పత్రి కాపలాదారుడు ఉదయ్‌రాజ్ ఊపిరాడక నిద్రలేచి ఆస్పత్రి బయటకు పరిగెత్తాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ జోజి వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సబ్ స్టేషన్ సిబ్బందికి చెప్పి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హాలియా నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. స్టోర్ రూంలో కొన్ని మందులు మండే స్వభావం కల్గి ఉండటంతో ఆస్పత్రిలోని అన్ని గదులకు పొగ వ్యాపించింది. ఫ్రిజ్‌లు, ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు, ఫర్నీచర్, ఆస్పత్రి బెడ్స్, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, దగ్ధమయ్యాయి. రూ.5లక్షలకు పైగా నష్టం జరిగినట్లు పోలీసులు, ఆస్పత్రి వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆస్పత్రి సీహెచ్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జోజి తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి ఆదివారం తెల్లవారుజామున పీహెచ్‌సీని పరిశీలించారు. నిర్వహణ సరిగ్గా లేక.. నిడమనూరు పీహెచ్సీ భవనం 2001లో నిర్మించారు. నీటి లీకేజీతో భవనం స్లాబ్ ధ్వంసమైంది. భవన నిర్వహణ సరిగ్గా లేకనే షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణమని తెలుస్తోంది. నీటి లీకేజీలతో ఎర్త్ వచ్చేదని, కనీస జాగ్రత్తలు పాటిస్తే షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగే ఉండేది కాదని పలువురు అంటున్నారు. కాలిబూడిదైన రూ.5లక్షలకు పైగా విలువైన మందులు, సామగ్రి -
చికిత్స పొందుతూ మహిళ మృతి
తిప్పర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన రాచమల్ల మల్లమ్మ(60) ఈ నెల 14న తన కుమారుడు రాచమల్ల కోటిలింగంతో కలిసి సర్వారం నుంచి మామిడాల గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. రోడ్డుపై గుంతలు ఉండటంతో మల్లమ్మ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు రాచమల్ల నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కారు ఢీకొని.. నకిరేకల్: నకిరేకల్ మండలం చందపట్ల గ్రామానికి చెందిన గాదె అర్జున్(26) బైక్‌పై ఈ నెల 3న నకిరేకల్‌కు వస్తుండగా.. పట్టణ శివారులోని ఎస్ఎఫ్ గార్డెన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్జున్ను స్థానికులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో ఈ నెల 14న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. ఆదివారం మృతుడి సోదరుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. -
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
మునగాల : దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. ఆదివారం మునగాల మండలం కలకోవలో నిర్వహించిన ఆ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను కోరినట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు అనేక హామీలు ఇచ్చి వారి ఓట్లను కొల్లగొట్టి సీఎంగా గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డికి తెలంగాణలో 30లక్షల మంది దివ్యాంగులు పడుతున్న బాధలు కనిపించకుండాపోవడం బాధాకరమన్నారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. సంఘం మండల శాఖ అధ్యక్షుడు గోపిరెడ్డి మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోగుల శేఖర్‌రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా యువజన విభాగం నాయకులు గుంటి శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధుయాదవ్, తూర్పాటి చిన్నవెంకన్న పెద్దవెంకన్న, భువనగిరి భద్రయ్య, బండారు నాగరాజు, మద్దెల గోపయ్య, సంఘం మహిళా నాయకురాలు పాలబిందెల శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
రామన్నపేట: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైనది. చాలామందికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించాలనే కోరిక ఉంటుంది. కానీ కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రతిభ గల పేద విద్యార్థుల కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2025–26 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో నాలుగు వందలకు పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, ఏయిడెడ్, కస్తూర్బా, నవోదయ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు కళాశాలతో కూడిన సమాచారం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం మీసేవా కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్‌లో telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి తమ పూర్తి వివరాలు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువపత్రాలను సమర్పించాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించరాదు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.36వేలు ప్రోత్సాహకం అందించనుంది. కార్పొరేట్ విద్యా పథకంతో ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వ సహకారం 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంగడువులోగా దరఖాస్తు చేసుకోవాలి కార్పొరేట్ విద్యా పథకం ప్రతిభ గల పేద విద్యార్దులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పించబడతాయి. – వసంతకుమారి, యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి -
మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్‌లో నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందేలా చూడాలని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తాని హామీ ఇచ్చారని కుంభం తెలిపారు. -
త్వరలో గ్రామ పాలనాధికారులు
హుజూర్నగర్ : భూ సమస్యల సత్వర పరిష్కారానికి కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం గ్రామ పాలనాధికారుల (జీపీఓల) నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా అర్హత ఉన్న పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఎలను జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వీరినుంచి జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లాలో ఎంత మంది పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు ఉన్నారు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. జీపీఓ పోస్టుల్లో చేరేందుకు ఎంత మంది సుముఖంగా ఉన్నారనే వివరాలను అధికార యంత్రాంగం సేకరించింది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు జీపీఓ పోస్టుకు ఆన్లైన్ విధానంలో 238 దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఇటీవల అధికారులు పూర్తి చేశారు. కొన్ని దరఖాస్తులను తిరస్కరించారు. అయితే గతంలో వీఆర్ఏలు, వీఆర్ఓలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారిలో డిగ్రీ చేసిన వారికి, ఇంటర్‌తోపాటు ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారికి అధికారులు ఆమోదముద్ర వేశారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 279 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమించనున్నారు. పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యలపై పట్టు ఉండడంతో వారినే జీపీఓలుగా తీసుకోనున్నారు. విద్యార్హతలను సేకరించిన అధికారులు గత ప్రభుత్వం 2022 ఆగస్టు 22న వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. పలువురు ఇతర జిల్లాల్లో పని చేస్తున్నారు. ఇతర శాఖలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న పూర్వ వీఆర్ఓలను జిల్లాకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామ పాలనాధికారి పోస్టులకు ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారికి అవకాశం కల్పిస్తోంది. దూర ప్రాంతాల్లోని వారు ఎంత మంది జీపీఓలుగా రావడానికి ఇష్టపడుతున్నారు, పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలలో ఎంత మంది డిగ్రీ, ఇంటర్ పూర్తిచేశారు. వారి విద్యార్హతలను సేకరించి ప్రభుత్వానికి పంపారు. వీటన్నింటి నేపథ్యంలో నెలాఖరులోగా వారికి పరీక్ష నిర్వహించి అర్హత ఉన్న వారిని జీపీఓలుగా ఎంపిక చేసి గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫ నియామకం ప్రక్రియ వేగిరం చేసిన యంత్రాంగం ఫ ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి ఫ ప్రభుత్వానికి చేరిన వీఆర్ఓ, వీఆర్ఏల విద్యార్హతల నివేదిక ఫ నెలాఖరులో పరీక్ష నిర్వహణకు సన్నాహాలు ఫ భూ భారతి చట్టం బాధ్యతలు అప్పగించే అవకాశం దరఖాస్తు చేసుకున్నవారు 238వీఆర్ఓలు 99 వీఆర్ఏలు 93తిరస్కరణకు గురైన అర్జీలు 46నిబంధనల ప్రకారం నియామకం జీపీఓల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ నియ మ, నిబంధనల ప్రకారం నియామకాన్ని చేపడతాం. రెవెన్యూ గ్రామాల వారీగా జీపీఓలు పనిచేయాల్సి ఉంటుంది. జూన్ 2న భూ భారతి చట్టం అమలులోకి రానుండడంతో జీపీఓల నియామక ప్రక్రియను వేగవంతమైంది. – పి.రాంబాబు, అదనపు కలెక్టర్, సూర్యాపేట -
యాదగిరి కొండపై కార్పెట్లు, మ్యాట్లు
● భక్తులకు కాళ్లు కాలకుండా ఏర్పాటు యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. మాడ వీధుల్లో పరుగులు తీసే పరిస్థితి ఉంది. సమస్య పరిష్కరించేందుకు నూతన ఈఓ వెంకట్రావ్ చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, బస్టాండ్ ప్రాంతంలో పర్యటించి భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండ తీవ్రతకు కాళ్లు కాలుతున్నాయని, పరుగులు తీయాల్సి వస్తుందని ఈఓ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు బస్టాండ్, మాడ వీధుల్లో ఆదివారం కాయిర్ మ్యాట్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే లక్ష్యమని, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని ఈఓ తెలిపారు. స్వర్ణగిరి క్షేత్రంలో నేత్రపర్వంగా తిరువీధి సేవ భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణ వేడుక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూర మంగళహారతులు సమర్పించారు. -
వేధింపులు తాళలేక బావిలోకి దూకిన వివాహిత
ఆత్మకూరు(ఎం): భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె రాములు, మారెమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు కటికె కృష్ణకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కేమెడీ బైరయ్య, జయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె సంధ్యతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వివాహానికి ముందు కృష్ణ హైదరాబాద్‌లోని కృష్టవేణి టాలెంట్ స్కూల్లో పనిచేసేవాడు. వివాహం తర్వాత గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో సంధ్యపై కృష్ణ, జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో కృష్ణపై సంధ్య పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో జీవతంపై విరక్తి చెందిన సంధ్య ఆదివారం సాయంత్రం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సిద్ధాపురం రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో దూకింది. సమీపంలో మామిడి చెట్టుకు కాపలాగా ఉన్న కుర్రాడు చూసి చుట్టుపక్కల వారికి సమామాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణయ్య ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. బావి గట్టుపై ఆధార్‌కార్డు, చెప్పుల జత, సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైరింజన్ సహాయంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తోడుతున్నారు. బావిలో నీరు చాలా ఉండటంతో రాత్రి 11.30గంటల వరకు కూడా సంధ్య ఆచూకీ లభించలేదు. తనను భర్త కృష్ణతో పాటు అత్త, మామ, బావ, తోటికోడలు వేధిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్య సూసైడ్ నోట్లో రాసినట్లు తెలిసింది. బావిలో నీటిని తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం -
చెరువుల్లో చేపల కొలనులు
కూలీలు, మత్స్యకారుల ఉపాధికి ప్రభుత్వ కార్యాచరణచిలుకూరు మండలంలో ఏడు చెరువులు ఎంపిక చేశాం చిలుకూరు మండలంలో చిలు కూరులో ఒకటి, బేతవోలులో 2, చెన్నారిగూడెంలో 2, ఆచార్యులగూడెంలో ఒకటి, నారాయణపురంలో ఒక చెరువుల్లో చేపల కొలనుల తవ్వకాలకు ఎంపిక చేశాం. ఏడు చెరువుల్లో చేపల కొలనుల తవ్వకాలకు ప్రతిపాదనలు పంపించాం. ఆయా చెరువుల శిఖంలో కొలనులు ఏర్పాటుకు కొలతలు తీసుకుంటున్నాం. – నిర్మల, ఏపీఓ, చిలుకూరు చిలుకూరు: గ్రామాల్లో కూలీలకు చేతినిండా పని కల్పిస్తూ.. చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధిహామీ పథకం కింద నిధులు కేటాయించి చెరువులు, కుంటల్లో చేపల కొలనులు తవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా చెరువులు, కుంటల శిఖం భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు కూలీలు, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. కొలనుల తవ్వకాలకు ప్రణాళిక చేపల కొలనుల నిర్మాణంలో భాగంగా జిల్లాలో అనువైన చెరువులు, కుంటల సమీపంలో శిఖం భూములు, నీటిని తరలించేందుకు వీలున్న ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఏడాది 180 చెరువుల్లో కొలనుల పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో చెరువుల్లో నీళ్లు ఉంటేనే గ్రామాల్లో నీటి సమస్య ఉండదనే ఉద్దేశంతో నీళ్లు వదలకుండా ఉంచుతున్నారు. వర్షాలు ప్రారంభమయ్యాయక చెరువుల్లోని నీళ్లు కొంత మేర వదిలి శిఖం భూములు తేలాక మరో నెలరోజుల తరువాత చెరువుల్లో చేపల కొలనుల తవ్వకాలు పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. మత్స్యకారులకు అదనపు ఆదాయం చేపల కొలనులు నిర్మించడం ద్వారా చెరువుల్లో నీరునిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో ఈ నీరు పంటలసాగుకు వాడుకోవచ్చు. కొలనుల తవ్వకంతో వెళ్లే మట్టిని పొలాలకు తోలుకోవడంతో భూసారం పెరుగుతుంది. చేపల పెంపకంతో మత్స్యకారులకు అదనపు ఆదాయం వస్తుంది. చెరువు శిఖం భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయి. ఫ ఉపాధి పథకం కింద 180 చెరువుల్లో తవ్వకాలకు ప్రణాళిక ఫ ప్రతిపాదనలు పంపిన యంత్రాంగం ఫ ఒక్కో కొలనుకు రూ.8లక్షలు కేటాయింపు ఫ ప్రతి క్యూబిక్ మీటర్‌కు రూ.291.45 కూలి చెల్లింపు కొలనుల నిర్మాణం ఇలా.. చెరువులకు 100 నుంచి 300 మీటర్ల దూరంలో 25 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతులో ఈ చేపల కొలనులు తవ్వనున్నారు. ఒక్కో కొలను నిర్మాణానికి రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో పనిచేసిన కూలీలకు ప్రతి క్యూబిక్ మీటర్‌కు రూ.291.45 చొప్పున కూలి చెల్లించనున్నారు. ప్రధాన చెరువుల్లోని నీటిని చేపల కొలనుల్లోకి రాకుండా నాలుగు వైపులా కట్టలు నిర్మించనున్నారు. కొలనుల నిర్మాణానికి 12 లక్షల పనిదినాలు కేటాయించారు. అయితే జిల్లాలో 2.63 లక్షల ఉపాధి జాబ్‌కార్డులు, 5,70,275 మంది కూలీలు ఉండగా వీరిలో 3,34,539 మంది పనులకు వెళ్తున్నారు. వీరందరికీ కొలనుల నిర్మాణంలో భాగంగా చేతినిండా పని లభించనుంది. -
పెద్దదేవులపల్లి వాసికి డాక్టరేట్
త్రిపురారం: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన పసుల సైదులు, రాములమ్మ దంపతుల కుమారుడు మధుబాబు అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్ లూసియానాలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నాడు. న్యూరో సైన్స్ విభాగంలో చేసిన మధుబాబు చేసిన పరిశోధనకు గాను శనివారం రాత్రి యూనివర్సీటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో డాక్టరేట్ ప్రదానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మధుబాబు చిన్నప్పటి చదువులో చురుగ్గా ఉండేవాడని, అతడికి డాక్టరేట్ రావడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో ఆదివారం గంజాయి తాగుతూ ముగ్గురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబూబ్పేట గ్రామ శివారులో ఆదివారం కొంతమంది యువకులు గంజాయి తాగుతున్నారని పక్కా సమాచారం రావడంతో ఎస్ఐ అనిల్‌కుమార్ తన బృందంతో కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు గాజుల బాలకృష్ణ, గాజుల ప్రవీణ్, గాజుల సాయి గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 150 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో గోల్డ్ వర్క్‌షాప్ దగ్ధంమిర్యాలగూడ అర్బన్: షార్ట్ సర్క్యూట్‌తో గోల్డ్ వర్క్‌షాప్ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని పెద్దబజారులో మారోజు కిరణ్‌కుమార్, మునగాల శ్రీనివాస్ బంగారం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. రోజుమాదిరిగా శనివారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో షాప్ నుంచి మంటలు వస్తుండటంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి, షాప్ యజమానులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.5లక్షలతో పాటు ఐదు తులాల బంగారం దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. కార్లు ఢీకొని దుప్పి మృతిమిర్యాలగూడ: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని రెండు కార్లు ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముఖేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తలపాలెం గ్రామ శివారులో చుక్కల దుప్పి రోడ్డు దాటుతుండగా.. కల్లేపల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. అదే సమయంలో కల్లేపల్లి నుంచి మిర్యాలగూడకు వస్తున్న మరో కారు కూడా దుప్పిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొండ్రపోల్ పీహెచ్సీలో దుప్పి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. -
వైద్య ఆరోగ్యశాఖ ప్రక్షాళన!
అనుమతుల్లేని ఆసుపత్రుల్లో మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలుసూర్యాపేటటౌన్ : ప్రభుత్వం జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు పూనుకుంది. జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతుల్లేకుండా కొనసాగుతున్నాయని, అర్హతలేని డాక్టర్లతో వైద్యసేవలు అందిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్, సూర్యాపేట ఐఎంఏ నిర్వహించిన సంయుక్త సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టింది. దీంతో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. అనుమతులు, అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులతో ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు జిల్లా కేంద్రంలో తనిఖీలు చేపట్టి ఏకంగా 55 ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో 17 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి, రెండు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో సూర్యాపేటలోని శరత్ కార్డియాక్ సెంటర్లో డాక్టర్ లేకుండానే ఆపరేటరే నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 13 ఏళ్లుగా అర్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్తో చలామణి అవుతున్నట్టు తేలింది. దీంతోపాటు మరో ఆసుపత్రి సర్టిఫికెట్ వ్యాలిడిటీ పూర్తయ్యాక కూడా రెన్యువల్ చేసుకోనట్టు నిర్ధారించారు. ఈ దాడుల్లో ఏకంగా 55 ఆసుపత్రులను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేల్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు రిపోర్టు అందించగా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. డీఎంహెచ్ఓ, ఐఎంఏ డాక్టర్లు, సూర్యాపేట ఆర్డీఓ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో 17 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చి, రెండు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. దీంట్లో భాగంగా శనివారం రాష్ట్ర వైద్య బృందం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అర్హత, అనుభవం లేకున్నా స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై విచారణ చేఽశారు. వెలుగులోకి పలు వాస్తవాలు ఆర్డీఓ నేతృత్వంలోనూ ఐఎంఏ, ప్రత్యేక బృందాల ఆరా ఇప్పటికే 55కిపైగా రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రుల గుర్తింపు 17 ఆసుపత్రులకు నోటీసులు, రెండు స్కానింగ్ సెంటర్లు సీజ్ శనివారం డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో రాష్ట్ర వైద్య బృందం విచారణసంచలనంగా మారిన డీఎస్పీ, సీఐ ఏసీబీ ట్రాప్..ఇటీవల అర్హతలు, అనుమతులు లేకుండా నడిపిస్తున్న యాపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీసాయిగణేష్ మల్టీస్పెషాలిటీ, శ్రీకృష్ణ ఆసుపత్రులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు గుర్తించారు. వీటిపై సూర్యాపేట ఐఎంఏ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మూడు ఆసుపత్రుల డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో యాపిల్ స్కానింగ్ సెంటర్ డాక్టర్‌కు బెయిల్ ఇచ్చేందుకు సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనకు పూనుకుంది. -
పేదల ‘ఉపాధి’కి ఎసరు!
వందరోజులు పని కల్పించాలి కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులను తగ్గించడం సరైంది కాదు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలి. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత మూడు నెలల పాటు ఉపాధి పనికి వెళ్లి జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు పనిదినాలు తగ్గిస్తే ఎలా బతకాలి. – గుండాల కొమరయ్య, ఉపాధి కూలీ, తుంగతుర్తి పనులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025–26గాను సూర్యాపేట జిల్లాకు 32.92 లక్షల పనిదినాలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన పనులను చేపడుతున్నాం. నిర్దేశిత సమయంలోనే పనుల లక్ష్యాన్ని చేరుకుంటాం. – వీవీ. అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట నాగారం : కేంద్ర ప్రభుత్వం పేదల ఉపాధికి ఎసరు పెట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కేంద్రం పరిమితులు విధించింది. ఈ పథకంలో పనిదినాలు తగ్గించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద ప్రతి వేసవిలో మూడు నెలలపాటు కూలి పనులు దొరకడంతో కూలీల జీవనం సజావుగా సాగేది. కూలీలకు రోజువారీ కూలి గరిష్టంగా రూ.260 వరకు వచ్చేంది. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉపాధి పనులకు పోతె రోజుకు రూ.750 వదరకు కూలి వచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులు తగ్గించడం తమ జీవనోపాధిని దెబ్బతీయడమేనని కూలీలు వాపోతున్నారు. ప్రభుత్వ పనులపైనా ప్రభావం..ఉపాధిహామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, గ్రామ పంచాయతీ భవనాలు, పశువుల పాకలు, పౌల్ట్రీలు, చేపల కుంటలు, పండ్ల తోటలు పెంపకాలు, చెక్ డ్యామ్ నిర్మాణాలు వంటి పనులకు వినియోగిస్తుంది. ఉపాధిహామీ పనిదినాలను తగ్గించడంతో ప్రభుత్వ అభివృద్ధి పనులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పీఆర్ శాఖ అధికారులు అంటున్నారు. తగ్గించిన పనిదినాలు 24.05 లక్షలుజిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా 3.36 లక్షల మంది కూలీలు ప్రతి ఏడాది పనులకు వెళ్తున్నారు. మొత్తం 2.63 లక్షల జాబ్ కార్డులుండగా 5.70లక్షల మంది రిజిస్టర్డ్ కూలీలున్నారు. 2024–25 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 57.42 లక్షల పనిదినాలు కేటాయించగా ప్రస్తుతం 2025–26 సంవత్సరానికి కేవలం 32.92 లక్షల పనిదినాలు కేటాయించింది. దాదాపు 24.05 లక్షల పనిదినాలు తగ్గించడంపై కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ ఉపాధిహామీ పనిదినాలు తగ్గింపు ఫ పరిమితులు విధించిన కేంద్రం ఫ ఆందోళనలో కూలీలుజిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య 3.36 లక్షలు 2024–25లో పనిదినాల కేటాయింపు 57.42 లక్షలు 2025–26 ఆర్థిక సంవత్సరానికి 32.92 లక్షలలు -
వరికొయ్యలు కాలిస్తే భూసారం తగ్గుతుంది
తాళ్లగడ్డ (సూర్యాపేట): పొలాల్లో వరికొయ్యలు, ఎండు గడ్డిని కాలిస్తే భూసారం తగ్గడంతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని డీఏఓ జి.శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో రైతుల పొలాలను సందర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలోని వరికొయ్యలు, గడ్డికి, వ్యర్థాలకు నిప్పు పెడితే భూమిలో పంటలకు మేలు చేసే ఎరలు నశిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.కృష్ణ సందీప్, ఏఈఒ ముత్తయ్య, రైతులు వెంకట్‌రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలితుంగతుర్తి : అర్హత కలిగిన దివ్యాంగులు, వయోవృద్ధులు సహాయ ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు అన్నారు. శనివారం తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులు, వయోవద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ దరఖాస్తులను అలింకో సంస్థ వారు పరిశీలించి అర్హత కలిగిన దివ్యాంగులకు, వయోవద్ధులకు సహా య ఉపకరణాలు అందిస్తారన్నారు. ఇప్పటివరకు 150 అర్హత ఉన్న దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుకుమార్, సీడీపీఓ శ్రీజ, సూపర్వైజర్స్ మంగమ్మ, కై రున్నిషా, ప్రమీల, అలింకో సాఫ్ట్ రష్మీరంజన్, రాజా బాబు, సాయి, సంజీవ, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ముగిసిన వృత్యంతర శిక్షణ సూర్యాపేట : చివ్వెంల మండలం దురాజ్‌పల్లి సమీపంలోని స్వామి నారాయణ గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజు లుగా నిర్వహిస్తున్న మొదటి విడత వృత్యంతర శిక్షణ శనివారం ముగిసింది. చివరి రోజులు ఆర్పీలు తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గంలోని గణితం, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లతోపాటు ప్రాథమిక పాఠశాలలకు చెందిన సుమారు 750 మందికిపైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల ఉపాధ్యాయులకు ఈనెల 20 నుంచి రెండో విడత శిక్షణ అందించనున్నట్టు డీఈఓ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్వాలిటీ కంట్రోల్ అధికారి జనార్దన్, సెక్టోరియల్ అధికారులు రాంబాబు, శ్రవణ్‌కుమార్ పర్యవేక్షించారు. -
21 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : ఈ నెల 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈఓ( భానునాయక్ తెలిపారు. శనివారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫెయిల్ అయిన వారు, ఇంప్రూవ్మెంట్ రాసేవారు 8,600 మంది ఉన్నారని తెలిపారు. వారికోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 8 పరీక్ష కేంద్రాలు, కోదాడలో ఐదు పరీక్షా కేంద్రాలు, హుజూర్‌నగర్‌లో రెండు, తుంగతుర్తిలో రెండు, మఠంపల్లి, నేరేడుచర్ల, తిరుమలగిరి, నడిగూడెంలో ఒక్కొక్క పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీ సభ్యులు, ప్రిన్సిపాల్స్ రాజమోహన్, విజయనాయక్, సీనియర్ అధ్యాపకులు జి.లక్ష్మయ్య, జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడు వీడీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీఐఈఓ భానునాయక్ -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల: పారిశుద్ధ్య, మున్సిపల్ కార్మికులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేనట జిల్లా కేంద్రంలోని మున్పిపల్ కార్యాలయంలో కార్మిక చట్టాలపై మున్పిపల్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట జిల్లాను క్లిన్ సిటీ జాబితాలో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, విధులు గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్పిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, మమత, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
కాంటాలు త్వరగా పూర్తిచేయాలి
పెన్‌పహాడ్, మోతె: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. శనివారం పెన్‌పహాడ్ మండలం అనంతారం, అనాజిపురంతోపాటు మోతె మండలం రావిపహాడ్, బీక్యాతండాలో కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ఎప్పటికప్పుడు తేమశాతం చూసిన ధాన్యాన్ని కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రాలకు అవసరమైన లారీలను పంపిస్తామని వెంటనే బస్తాలు ఎగుమతి చేయాలన్నారు. ట్రక్కు షీట్ రాగానే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. ఆయన వెంట పెన్‌పహాడ్ తహసీల్దార్ లాలు, మోతె డీటీ లావణ్య, ఏఓ అరుణారెడ్డి, ఏపీఎంలు అజయ్‌నాయక్, వెంకయ్య, ఏఈఓ ఝాన్సీ, సీఈఓ సైదులు, ధనలక్ష్మి, సుధాకర్ ఐకేపీ సిబ్బంది ఉన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు -
యువ వికాసానికి ‘సిబిల్’ గుబులు
తిరుమలగిరి (తుంగతుర్తి): యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుదారుల్లో బ్యాంకు సిబిల్ స్కోర్ గుబులు పట్టుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రాయితీ రుణాలు ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువత నుంచి జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 52,069 మంది దరఖాస్తులు అందాయి. ఇదంతా బాగానే ఉన్నా యువ వికాసం రుణాలు రావాలంటే తప్పనిసరిగా బ్యాంకు సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. అయితే బ్యాంకులకు పంపిన దరఖాస్తు ఫారాల అభ్యర్థుల సిబిల్ స్కోర్‌ను చూసి మరలా వాటిని కార్యాలయానికి పంపుతారు. బ్యాంకు సిబ్బంది అందుకు పాన్ కార్డు ప్రామాణికంగా చేసుకొని జాబితాను తయారు చేయనున్నారు. సిబిల్ స్కోర్ ప్రామాణికంగా రాజీవ్ యువ వికాసం రుణాలు అందిస్తామనడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. రూ.4 లక్షల రుణానికి అధిక అర్జీలు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాల్లో అత్యధికులు రూ.4 లక్షల రుణం కావాలని దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం వివిధ రకాల వ్యాపారులకు ఒక్కో రకమైన యూనిట్ విలువను ముందుగానే కేటాయించారు. దరఖాస్తుదారులు ఆ రకంగా అందులో తమకు నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోవాలి. రూ.50 వేలు రుణం తీసుకుంటే 100 శాతం రాయితీ కల్పిస్తారు. అంటే తిరిగి రుణం చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగతా రూ.50 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంటే 70 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో అర్హుల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు కలిపి 52,069 మంది రుణాలకు దరఖాస్తులు చేసుకోగా ఇందులో 80 శాతం మంది రూ.4 లక్షల రుణం కావాలని పేర్కొనడం విశేషం.మహిళలకు ప్రత్యేక కోటా కొత్తగా మొదటిసారి రుణం తీసుకునే వారికి ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనికితోడు సంబంధిత వ్యాపారంలో అనుభవం ఉండే వారికి సైతం ప్రాధాన్యత కల్పించనున్నారు. మొత్తం కోటాలో దివ్యాంగులకు 5 శాతం, మహిళలకు 20 శాతం యూనిట్లు కేటాయించాలని ఉత్తర్వులు ఉన్నాయి. ఫ సిబిల్ స్కోర్ 700కు తక్కువుంటే రుణాలు కష్టమే ఫ రూ.50 వేల కంటే ఎక్కువ రుణానికి పాన్‌కార్డు తప్పనిసరి ఫ 52,069 మంది దరఖాస్తు ఫ రూ.4లక్షల రుణానికి 80 శాతం మంది.. -
ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి
తిరుమలగిరి( తుంగతుర్తి): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. శుక్రవారం తిరుమలగిరిలోని ఏఎస్ఆర్ మిల్లును అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. అనంతరం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని జనగాం మిల్లుకు తరలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.హరిప్రసాద్, ఏఓ నాగేశ్వరరావు, ఏపీఎం మధుసూదన్, ఆర్ఐ జార్జ్‌రెడ్డి, ఏఈఓ లక్ష్మీచైతన్య పాల్గొన్నారు. అర్హత లేని వైద్యులపై చర్యలు తప్పవుసూర్యాపేట టౌన్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో అర్హత లేని వైద్యులు వైద్యం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ, శ్రీకృష్ణ ఆసుపత్రులను తనిఖీ బృందం సభ్యులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రుల అర్హతలను పరిశీలించి టీఎస్ఎంసీ అర్హత లేని ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ చేయబడవని తెలిపారు. బయో మెడికల్ వేస్టేజ్ సర్టిఫికెట్, పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్స్ సర్టిఫికెట్, రోమా, ఫైర్ ఎక్సేషన్ సర్టిఫికెట్ వైశాల్యాన్ని బట్టి, ఫైర్ సిలిండర్స్, బిల్డింగ్ పర్మిషన్ లెటర్, డాక్టర్ సర్టిఫికెట్స్ విత్ ఫొటోస్ తప్పకుండా ఉండి తీరాలన్నారు. వారి వెంట డాక్టర్ ఆనంద్, తనిఖీ బృందం సభ్యులు తదితరులు ఉన్నారు. వాసవి క్లబ్ సేవలకు ప్రత్యేక గుర్తింపునేరేడుచర్ల : అత్యుత్తమ సేవలను అందించినందుకు వాసవి క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉత్తమ వాసవి క్లబ్‌గా సూర్యాపేట జిల్లా ఎంపికై ందని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ఇటీవల వైజాగ్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఐదు నెలలుగా వాసవి క్లబ్ నిర్దేశించిన సేవ కార్యక్రమాలను గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఉత్తమ జిల్లాగా ఎంపికై నందుకు వనిత క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేయాలి సూర్యాపేట : నకిలీ వైద్యులపై దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదుచేసి వారి అక్రమ ఆస్తుల్ని జప్తు చేసి కఠినంగా శిక్షించాలని సూ ర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్లను స్మరిస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లికార్జున్ మాట్లాడుతూ అర్హతలేని డాక్టర్లు, స్కానింగ్ సెంటర్ల స్కాంపై ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శులు తన్నీరు యాదగిరి, సట్టు వెంకన్న, దేవత్ కిషన్ నాయక్, జనార్దన్, వీరబోయిన భగవాన్ కన్నా యాదవ్, మూడ్ రవీంద్ర నాయక్, వీరబోయిన సంజీవ్ నాయక్, కమలాకర్‌రావు, చిరంజీవి, లింగయ్య పాల్గొన్నారు. -
సర్టిఫికెట్లు ప్రదానం
నల్లగొండ టూటౌన్ : సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ సంస్థ నిర్వహించిన నైపుణ్య శిక్షణ అభివృద్ధి (టాస్క్)కు సహకరించిన యూనివర్సిటీ సిబ్బందికి శుక్రవారం ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సరిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని టాస్క్‌ను రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అల్వాల రవి, డాక్టర్ వై.ప్రశాంతి, సుధారాణి, జయంతి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
డెంగీతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : డెంగీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్బంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. దోమలు ఇళ్ల పరిసరాల్లో ఉన్న గాబులు, తొట్లు, డ్రమ్ములు, ట్యాంకుల్లో ఉన్న నీటి నిల్వల్లో, పాత టైర్లు, ఎయిర్ కూలర్లు,, పూల కుండీల్లో ఉన్న నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జయమనోహరి, అశ్రిత, మోతీలాల్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, సూపర్వైజర్ వెంకన్న, మనోజ్‌రెడ్డి, కడారి రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతు కుదేలు
పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి కౌలు మందం కూడా వచ్చేలా లేదు నలభై ఎకరాల మామిడి తోటను రూ.12 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. రూ.8 లక్షల పెట్టుబడి పెట్టాను. ఈ సారి దిగుబడి తగ్గింది. దీనికితోడు గాలి దుమారానికి చాలా కాయలు రాలాయి. ఇప్పటివరకు రూ.5లక్షల కాయలు అమ్మాను. ఉన్న దిగుబడిని చూస్తే కౌలు కూడా పూడేటట్టు లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – నేలమర్రి శ్రీను, రామాపురం, నడిగూడెం మండలం మార్కెట్‌కు కాయలు తీసుకెళ్తే తిరిగి తేలేం.. చెట్ల నుంచి తెంపిన కాయలను వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాల్సిందే. ధర తక్కువగా ఉందని నిల్వ ఉంచుకోలేము. అలాగని మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి తీసుకురాలేము. ఇవన్నీ తెలుసు కాబట్టే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధర తగ్గించి కొనుగోలు చేస్తూ నిలువునా ముంచుతున్నారు. – బండమీది ఎల్లయ్య, కౌలు రైతు, ఆత్మకూర్(ఎస్) ప్రభుత్వం ఆదుకోవాలి మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు అనువైన మార్కెట్, గిట్టుబాటు ధరలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్యానవన రైతులు బతికి బట్ట కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. – అర్వపల్లి తిరుపతయ్య, కౌలు రైతు నసీంపేట, ఆత్మకూర్(ఎస్) మండలంసూర్యాపేట అర్బన్ : ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో మామిడి తోటలు పూత బాగా పూసినా తేనెమంచు, చీడపీడల బెడదతో దిగుబడి తగ్గిపోయింది. గత సీజన్లో కంటే మామిడి ధర పెరిగినప్పటికీ ఈసారి పెట్టుబడులు కూడా అధికం కావడంతో అందుకు అనుగుణంగా మార్కెట్లో ధర అందడం లేదని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డు నుంచి హైవేకు ఇరువైపులా కొత్త బస్టాండ్ వరకు గల మామిడి మార్కెట్‌కు రైతులు రోజుకు సుమారు 200 టన్నుల మామిడి కాయలు తీసుకొస్తారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా వ్యాపారుల కు విక్రయిస్తుంటా రు. వాటిని కొన్నవారు మ హారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు అధిక ధరకు ఎగుమతి చేస్తారు. తూకంలో భారీగా కోత! మార్కెట్లో వ్యాపారులు ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత మళ్లీ మార్చొద్దు కానీ కాంటా అయ్యాక లోపల కొంతకాయ పాడైపోయిందని ధరలు తగ్గిస్తూ.. తూకంలో కోత విధిస్తున్నారు. సూట్ పేరిట టన్నుకు క్వింటా కోత పెడుతూ 6 నుంచి 8 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. దీంతో రూ.వందకు రూ.10 నుంచి రూ.15 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో చిన్నకాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే తక్కువ ధర చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ మార్కెట్లే దిక్కు ఈ సీజన్లో మామిడి దిగుబడి తగ్గడంతో ఏ రైతు కూడా జిల్లాకు సుమారు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న బాటసింగారంలోని జాతీయ పండ్ల మార్కెట్‌కు తరలించలేని పరిస్థితి. దీంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు మార్కెట్లలోనే అమ్ముకుంటున్నారు. వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగాలి కానీ వ్యాపారుల ధరలు తగ్గించి కొంటున్నారు. బంగినపల్లి మామిడి ఎంత క్వాలిటీగా, పెద్ద సైజులో ఉన్నా టన్నుకు రూ.40 వేలకు మించడం లేదని రైతులు అంటున్నారు. గతేడాది మొదటి రకం మామిడి టన్ను ధర రూ.రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంది. అయితే ప్రస్తుతం సీజన్లో రూ.35వేల నుంచి రూ.40 వేల వరకు పెరిగింది. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా ధర రావడంలేదని, ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. ఫ తూకంలో కోత విధిస్తున్న వ్యాపారులు ఫ టన్నుకు 8శాతం వరకు కమీషన్ వసూలు ఫ కరువైన అధికారుల పర్యవేక్షణ ధరలు ఇలా (టన్నుకు రూ.వేలల్లో..) కొనుగోళ్లు ప్రారంభంలో 60ప్రస్తుతం (నాణ్యమైన కాయ) 40మధ్యస్థంగా ఉన్న కాయ 25రాలిపడి మచ్చలు ఉన్న కాయ 10 -
సాగర్ మేజర్లు అధ్వానం
కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి మా గ్రామ సమీపాన ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ కట్టలు పలుచోట్ల బలహీనంగా మారాయి. పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే కట్టలపై నీరు పొంగిపొర్లుతుంటుంది. గత యాసంగిలో కట్టపై నీరు పొంగిపొర్లింది. గతంలో కూడా పలు చోట్ల గండ్లు కూడా పడ్డాయి. – రామిని సైదిరెడ్డి, రైతు రత్నవరం కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి పాలారం మేజరు కాల్వ నాచు, మట్టితో పూడుకుపోయింది. పలు చోట్ల లైనింగ్ దెబ్బతిన్నది. వల్లాపురం నుంచి త్రిపురవరం వరకు కాల్వలో స్థానిక రైతులు స్వచ్ఛందంగా పూడికను తొలగిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాలారం మేజర్‌కు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. – దొంతగాని భద్రయ్య, రైతు సిరిపురంనడిగూడెం : మండల పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న పలు మేజరు కాల్వలు అధ్వానంగా మారాయి. పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో పలుచోట్ల మేజర్లు, మైనరు కాల్వలకు ఇరువైపులా కంపచెట్లు, లైనింగ్‌లు దెబ్బతిన్నాయి. కాల్వ కట్టలు బలహీనంగా మారాయి. మరికొన్ని చోట్ల కాల్వలు మట్టి, నాచుతో పూడుకుపోయి నీటి ప్రవాహం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. చివరి భూములకు నీరందక ఆందోళన మండల పరిధిలోని సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా రామాపురం వద్ద 13–బీ కొమరబండ మేజరు కాల్వ రామాపురం నుంచి ఎకలాస్‌ఖాన్‌పేట, తెల్లబెల్లి, కొమరబండ వరకు 16 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ కాల్వ కింద దాదాపు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే చాకిరాల వద్ద 14–ఏ కొత్తగూడెం మేజరు కాల్వ శ్రీరంగాపురం, రత్నవరం, వాయిలసింగారం, తెల్లబండతండా, గోల్‌తండా, అనంతగిరి, శాంతినగర్, గోండ్రియాల గ్రామీల మీదుగా మంగళతండా వరకు 27 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ కాల్వ కింద దాదాపు 27 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే సిరిపురం వద్ద 14–బీ పాలారం మేజరు కాల్వ సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం, పాలారం, చనుపల్లి గ్రామాల వరకు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికింద దాదాపు 14 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నది. అయితే ఈ కాల్వలకు పలు చోట్ల మైనరు కాల్వలు కూడా ఏర్పాటు చేశారు. కానీ కాల్వ పలుచోట్ల పూడిపోయి ఇరువైపులా కంపచెట్లు పెరిగి చాలా చోట్ల లైనింగ్ పూర్తిగా దెబ్బతిని ఉంది. షట్టర్లు సరిగ్గా లేవు. దీంతో చివరి భూములకు నీరందడం లేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. గత్యంతరం లేక బోర్లు వేయించుకుని, బావులు తీయించి పంటలు సాగు చేసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. వేధిస్తున్న లష్కర్ల కొరత కొమరబండ, కొత్తగూడెం, పాలారం మేజరు కాల్వల నిర్వహణ బాధ్యతలు చూసే లష్కర్ల కొరత ఏళ్ల తరబడి వేధిస్తోంది. దీంతో కాల్వలపై పర్యవేక్షణ కొరవడింది. ఉన్న కొద్దిపాటి సిబ్బందితో నీటి పారుదల శాఖ నెట్టకొస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కాల్వలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి, ఖాళీగా ఉన్న లష్కర్ పోస్టులను భర్తీ చేసి చివరి భూములకు నీరందేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఫ ఇరువైపులా దెబ్బతిన్న లైనింగ్ ఫ కాల్వల పొడవునా పెరిగిన కంపచెట్లు ఫ పలుచోట్ల మట్టితో పూడుకుపోయిన దుస్థితి ఫ చివరి భూములకు అందని సాగునీరు ఫ ఆందోళనలో ఆయకట్టు రైతాంగం మేజర్ పేరు పొడవు ఆయకట్టు (కి.మీ.) (ఎకరాల్లో..)13–బీ కొమరబండ 16 16,000 14–ఏ కొత్తగూడెం 27 27,00014–బీ పాలారం 14 14,000 -
పనిచేసిన వారికే పదవులు
భానుపురి : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే, పీసీసీ పరిశీలకుడు భూక్యా మురళీ నాయక్, సహ పరిశీలకుడు ఛత్రురావు అన్నారు. డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ కమిటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అర్హులైన నాయకులకు కచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షుల పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఫ పీసీసీ పరిశీలకుడు మురళీ నాయక్ -
అకాల వర్షం.. ఆగమాగం
తిరుమలగిరి, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్): తిరుమలగిరి, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో గురువారం రాత్రి, తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు జలమమయమయ్యాయి. అక్కడక్కడా స్వల్పంగా ధాన్యం తడిసింది. తుంగతుర్తి మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కనీసం ధాన్యం రాశుల వద్ద కూడా రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ధాన్యం రాశుల మధ్య నీరు నిలిచి కొంత మేర వరదకు కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆత్మకూర్ (ఎస్) మండలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ముక్కుడుదేవులపల్లిలో పిడుగుపాటుకు గురై బయ్య సోమయ్యకు చెందిన గేదె మృతి చెందింది. రామన్నగూడెంలో తాటిచెట్టుపై పిడుగు పడి చెట్టు దగ్ధమైంది. పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాకుండా నిల్వ ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి వేగంగా ధాన్యం కాంటాలు వేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఫ తిరుమలగిరి, ఆత్మకూర్(ఎస్), తుంగతుర్తి మండలాల్లో కురిసిన వర్షం ఫ పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రాశులు ఫ ముక్కుడుదేవులపల్లిలో పిడుగుపడి గేదె మృతి పిడుగు పాటుకు గృహోపకరణాలు దగ్ధం హుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పట్టణంలోని టీచర్స్ కాలనీలోని చిట్యాల రాములమ్మ ఇంట్లో చెట్టుపై పిడుగు పడింది. దీంతో వారింట్లోనే కాకుండా చుట్టుపక్కల వారి ఇళ్లలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. -
జాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎక్కడా జాప్యం చేయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు యాసంగి ధాన్యం సేకరణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి కొనుగోలు పెరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు 2,49,670 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీసీఓ పద్మ, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, మార్కెటింగ్ డీఎం శర్మ, మెప్మా పీడీ రేణుక తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం ఆత్మకూర్ (ఎస్): అకాల వర్షాల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం ఏనుబాములలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో శుక్రవారం ధాన్యం ఎగుమతులను పరిశీలించి మాట్లాడారు. గతేడాది ఇదే సీజన్లో 2,30,614 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సీజన్లో 2,49,670 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అక్కడక్కడా ధాన్యం కొద్దిమేర తడిసిందన్నారు. అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, జిల్లాలో మరో నాలుగైదు రోజుల్లోనే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ పి.రాంబాబు, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఫ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ధాన్యం ఎగుమతులను త్వరగా పూర్తి చేయాలి
నూతనకల్: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం ఎగుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపహాడ్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రికార్డులు, ధాన్యం రాశులను పరిశీలించి మాట్లాడారు. లారీల కొరతను సత్వరమే పరిష్కరించాలని జిల్లా సివిల్‌సప్లయ్ అధికారిని ఆదేశించారు. హుజూర్నగర్ సివిల్‌సప్లయ్ ఆర్ఐతో మాట్లాడి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లు యాజమానులు దిగుమతి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నూతనకల్ మండలానికి అదనంగా 10లారీలు పంపించి ఈ నెల 20 వరకు సాధ్యమైనంత వరకు కాంటాలు పూర్తి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సివిల్‌సప్లయ్ డీఎం ప్రసాద్, తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత, ఏఓ మురళీబాబు, ఏపీఎం రమణాకర్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని వల్ల భాపురం గ్రామ శివారులోని జగన్మాత, దురాజ్‌పల్లి గ్రామ శివారులోని నవతర్న మిల్లులను తనిఖీ చేశారు. మిల్లుల్లో దిగుమతి ఆలస్యం కావడంతో లారీలు మిల్లులో ఉంటున్నాయని, దీనివల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో నియమించుకుని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీటీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు సత్వరమే పూర్తి చేయాలినూతనకల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే పనులను సత్వరమే పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ అప్పారావు సూచించారు. గురువారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులను చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కాంటాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునిత, ఎంపీఓ శశికళ, ఏపీఓ మామిడి శ్రీరాములు, ఏపీఎం రమణాకర్, సీసీలు ముత్తయ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడమే ధ్యేయం ఫ టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్ భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే ధ్యేయంగా అధిష్టానం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకుడు, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ పేర్కొన్నారు.గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట, చివ్వెంల మండలాల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.మండల, గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీలో నిలబడాలనుకునే కార్యకర్తలు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అందజేయాలన్నారు. కార్యకర్తల కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాంరెడ్డి దామోదర్ రెడ్డిది అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, కోతి గోపాల్ రెడ్డి, ఎలిమినేటి అభినయ్, తిరుమల ప్రగడ అనురాధ, చింతమల రమేష్, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా పుష్పయాగంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రాతఃకాలార్చన, సుప్ర భాత సేవ, ద్రవిడ ప్రబంధసే వాకాలం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకంతో సమస్ర కుంకుమార్చనలు చేశారు శ్రీస్వామి అమ్మవార్లకు ద్వాదశసేవలు, శృంగారడోలోత్సవం, పవళింపుసేవ చేపట్టారు.అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. తిరుకల్యాణోత్సవాలు ముగిసినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. -
స్థూపం నిర్మాణంలో భాగస్వాములు కావాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : తెనాలి పట్టణంలోని బుర్రిపాలెం రోడ్డులో ఉన్న సరస్వతి ఆలయంలో స్థూపం నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పెనుగొండ శ్రీవాసవి శాంతిధామం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) పిలుపునిచ్చారు. గురువారం శ్రీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో పాల్గొని వెళ్తూ మార్గ మధ్యలో సూర్యాపేట పట్టణంలోని శ్రీ వాసవి మాత సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈగ దయాకర్ గుప్తా నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడారు. దేశంలోనే మొదట్టి సారిగా సరస్వతి స్షూపం నిర్మించి అందులో శ్రీచక్రం ఆకారంలో ఉన్న లక్ష రాతిపలకలను నిక్షిప్తం చేయనున్నట్లు తెలిపారు. స్థూపం నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా శ్రీ సరస్వతి మాత అనుగ్రహం పొందవచ్చన్నారు. ఎంతో పవిత్రమైన కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు ఈగ దయాకర్ గుప్తా, విజయ లక్ష్మి దంపతులు, భక్తులు మిర్యాల శివకుమార్, గోపారపు రాజు, బోనగిరి విజయకుమార్, బెలిదే అంజయ్య, బొల్లం రమేష్, కలకోటి నరసయ్య, గుండా శ్రీనివాసు, తేడ్ల ప్రభాకర్, సత్తయ్య, మిర్యాల కవిత, తెడ్ల పల్లవి, ఇమ్మడి పద్మ, హనుమాండ్ల పుష్ప, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు. -
క్షతగాత్రులకు నగదురహిత వైద్యం
తిరుమలగిరి (తుంగతుర్తి): రోడ్డు ప్రమాదాలు సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగి స్తాయి. జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరో ఇద్దరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయా ప్రమాదాల్లో గాయపడుతున్న వారు సైతం అత్యవసర వైద్యసేవలు పొందలేక మృత్యువాత పడుతున్నారు. ఇలా జరిగిన కుటుంబాలకు గుండెకోత మిగులుస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. నగదు రహిత వైద్యంప్రమాదం జరిగిన గంట (గోల్డెన్ అవర్) లోపు క్షతగాత్రులకు వైద్యం అందితే అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చునని వైద్య నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రహదారుల రవాణా శాఖ కొత్త స్కీంను తెస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్–2025గా నామకరణం చేసింది. బాధితులకు ట్రామా, పాలిట్రామా సేవలు అందించగల సామర్థ్యం కలిగిన అన్ని ఆసుపత్రులను ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నోటిఫికేషన్లో సూచించింది. ఏడు రోజుల వరకు సేవలు పొందే అవకాశంమోటారు వాహనం కారణంగా రహదారి ప్రమాదానికి గురైన వారందరూ ఈ పథకం కింద సంబంధిత ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యసేవలు పొందేందుకు అర్హులవుతారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఏడు రోజుల దాక ఈ సేవలు పొందవచ్చు. ఆర్థోపెడిక్తోపాటు తీవ్ర గాయాలైన వారికి చికిత్స అందించే అన్ని సౌకర్యాలు కలిగిన ట్రామా, పాలిట్రామా కేర్ ఆసుపత్రుల్లోనే ఈ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. రోగికి అయిన వైద్య ఖర్చులను ప్యాకేజీలకు అనుగుణంగా పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ప్రమాద సమాచారం బంధు మిత్రులకు తెలిసేలోగా వైద్య ఖర్చులకు సొమ్ము సమకూర్చే లోగా క్షతగాత్రుల ప్రాణాలు నిలబెట్టడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ఉచిత వైద్యసేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త స్కీంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రక్షణగా.. ఫ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టిన కేంద్రం ఫ రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు ఫ ఆర్థోపెడిక్ ఆసుపత్రుల్లో సేవలు పొందేందుకు అవకాశం ఫ త్వరలోనే అమలుకు సన్నాహాలు -
పార్కింగ్ చేసిన కార్లలో పిల్లలు ఎక్కకుండా చూడాలి
సూర్యాపేటటౌన్ : పార్కింగ్ చేసిన కార్లలో పిల్లలు ఎక్కకుండా తల్లిదండ్రులు చూడాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. వేసవి కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్లిన పిల్లలు తీవ్రమైన వేడిమి వల్ల ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసుల సూచనలు.. ● వాహనాన్ని లాక్ చేయకముందు లోపల ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకోవాలి. ముందు, వెనుక సీట్లను పరిశీలించాలి. ● పార్క్ చేసే వాహనంలో, లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు. ● వాహన తాళాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. అనుకోకుండా వాహనంలోకి వెళ్లి చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ● వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని, ఒంటరిగా వాటిలోకి ప్రవేశించరాదని పిల్లలకు తెలియజేయాలి. ● ‘చైల్డ్ డిటెక్షన్ అలర్ట్’ వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో అమర్చండి. ● వాహనాల విండోలకు బ్లాక్ ఫిల్ములు లేదా అధిక టింటింగ్ ఉపయోగించరాదు. ● వాహనంవాడకంలో లేనప్పటికీ డోర్లు, విండోలు పూర్తిగా మూసి లాక్ చేయాలి.ఫ జిల్లా ఎస్పీ కె.నరసింహ -
ఇక్కత్‌కు, శిల్పకళకు ఫిదా..
సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్క్‌లో సుందరీమణులుభూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సుందరీమణులు గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఒక బృందం భూదాన్‌పోచంపల్లిని, మరో బృందం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించింది. నేతన్నల గొప్పదనం చూసి అబ్బురపడి.. ఆఫిక్రా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన చేనేత థీమ్‌లో పాల్గొని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ వస్త్రాలను పరిశీలించి అబ్బురపడ్డారు. చేనేతల గొప్పతనం చూసి అందాలభామలు చప్పట్లు కొట్టారు. అలాగే ఇండో వెస్ట్రన్ ఇక్కత్ దుస్తులతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ చూపి మైమరిచిపోయారు. ప్రముఖ డిజైనర్ స్వాతి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రూపొందించిన ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వస్త్రాలను ప్రముఖ మోడల్స్ ధరించి, ప్రముఖ కొరియోగ్రఫీ సుందర్ పర్యవేక్షణలో ప్రదర్శించిన రాంప్‌వాక్ వావ్ అన్పించింది. సుమారు 30 మంది మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు. ఆకట్టుకున్న చేనేత స్టాళ్లు టూరిజం పార్కు ఆవరణలో పద్మశ్రీ గజం గోవర్థన్, జాతీయ అవార్డు గ్రహీత తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు భోగ బాలయ్య, ఎన్నం మాధవిశివకుమార్, చేనేత టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత సహకార సంఘంతో పాటు గద్వాల్, నారాయణపేట, సిద్ధిపేట గొల్లభామ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు.వీటిలో పోచంపల్లి ఇక్కత్‌తో పాటు తేలియారుమాళ్లు, గొల్లభామలు చీరలను చూసి ప్రపంచ సుందరీమణులు మురిసిపోయారు. సంప్రదాయ చీరకట్టుతో నృసింహుడి క్షేత్రానికి.. కరేబియన్ దీవులకు చెందిన తొమ్మిది మంది సుందరీమణులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్ప కళను చూసి పరవశం పొందారు. సంప్రదాయ చీరకట్టు, లంగా ఓణీతో సాయంత్రం 5గంటలకు కొండపైన గల అతిథిగృహానికి చేరుకున్న సుందరీమణులు.. తొలుత అఖం దీపారాధన చేశారు. ఆ తరువాత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫొటోకు పూజలు చేసి మీడియా గ్యాలరీ వద్ద అతిథులకు అభివాదం చేశారు. అలాగే బ్రహ్మోత్సవ మండపం వద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లో శ్రీస్వామివారి కై ంకర్యాలను వీక్షించి ఫొటోలు దిగారు. ఇక్కత్ వస్త్రాలతో సన్మానం సుందరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇక్కత్ శాలువాతో సన్మానించారు.ఫ జిల్లాలో రెండు బృందాలుగా పర్యటన ఫ ఒక టీం భూదాన్‌పోచంపల్లి, మరొకటి యాదగిరిగుట్ట ఆలయ సందర్శన ఫ ఇక్కత్ డిజైన్లు చూసి అబ్బురపడిన అందగత్తెలు ఫ యాదగిరిగుట్టలో నృసింహుడి దర్శనం, శిల్పకళను వీక్షించి పరవశం -
మట్టపల్లిలో వైభవంగా చక్రతీర్థస్నానం
మఠంపల్లి: మట్టపల్లిలో కొనసాగుతున్న తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు కృష్ణానదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిఅమ్మవారికి చక్రతీర్థస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో పూర్ణాహుతి చేపట్టారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రాతాః కాలార్చన, సుప్ర భాత సేవ, ద్రవిడ ప్రబంధసేవాకాలం, పంచామృతాభిషేకం, మంత్ర పుష్ప నీరాజనాలతో శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి సమస్ర కుంకుమార్చన చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను పల్లకిలో కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించి వసంతసేవ, చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ప్రవేశం అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. సాయంత్రం దోపుఉత్సవం, ధ్వజారోహణం, మౌనబలి నిర్వహించారు. గురువారం రాత్రి పవళింపుసేవతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు , లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, బ్రహ్మాచార్యులు ,ఆంజనేయాచార్యులు, శేషగిరిరావు ,శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వాన నీటిని ఒడిసిపడుతున్న రైతు
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చండూరు మండలానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి ప్రయత్నం అభినందనీయమే. తనకున్న భూమిలో ఆరేళ్ల కిందటే భూగర్భ జలాలను పెంపొందించేందుకు కందకాలు తవ్వించారు. నాలుగు ఎకరాల్లో ఫాం పాండ్లు, నీటిని నీటి గుంతలు తవ్వించారు. ఎండలు మండుతున్నా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. ఆ నీటితోనే వ్యవసాయ క్షేత్రంలో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలు, జొన్న చేను సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, కర్బూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ వంటివి పండిస్తున్నారు. అంతేకాదు వేప, జామాయిల్, కానుగ చెట్లను సైతం పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా పచ్చదనంతో నిండిపోయింది. -
బోరు బావుల్లో సమృద్ధిగా నీరు
మూసీ నదిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడం వల్ల గ్రామంలో బోర్లు, బావులు ఎండిపోలేదు. సమృద్ధిగా నీరు రావడంతో నీటి కొరత తలెత్తలేదు. గతంలో వేసవి వచ్చిందంటే బోర్లు, బావుల్లో నీరు తగ్గిపోయి ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. చెక్ డ్యామ్‌లు నిర్మించాక నీటి సమస్యకు పరిష్కారం లభించింది. – వెంకట్‌రెడ్డి, దోసపహాడ్, పెన్పహడ్ రైతులను ప్రోత్సహించాలి వాటర్‌షెడ్ పథకంలో భాగంగా అన్ని వాగుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించాలి. వృథాను అరికట్టేలా రైతులకు మెళకువలు నేర్పించాలి. – కొండూరి స్వామి, రైతు, జనగాం, నారాయణపూర్ -
కరువు నేలన జలసిరులు!
చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటల్లో వర్షపు నీటి నిల్వ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటికి నిలకడ నేర్పితే కరువుఛాయలు దరిచేరవు. వాన నీటిని ఒడిసిపడితే జీవ వైవిధ్యం అలరారుతుంది. ఈ తరహాలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరద, వృథా నీటిని నిల్వ చేస్తూ చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు, కందకాలు నిర్మించడం ద్వారా ఏ కాలమైనా నీటికి ఢోకా ఉండడం లేదు. వీటి నిర్మాణంతో సాగునీటి సమస్య నుంచి రైతులు బయటపడ్డారు. ఆయా ప్రాంతాల్లో పశుపక్ష్యాదులకు నిరంతరం నీరు దొరుకుతోంది. సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో ఆయా పల్లెలు కరువును జయించాయి. అష్టకష్టాల నుంచి గట్టెక్కి.. సూర్యాపేట మండలంలో గతంలో వేసవి ప్రారంభంలోనే ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. తలాపున మూసీ నది ఉన్నా గుక్కెడు నీళ్లు దొరక్క, పంటలు పండని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. గత ప్రభుత్వం మూసీ నది కింద 9 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి, ఆరింటిని పూర్తి చేసింది. టేకుమట్ల–2, రాయినిగూడెం–2, కాసారాబాద్–2 నిర్మాణం పూర్తి కాగా, ఝెడ్లపల్లి–1, కేటీ అన్నారం–1, కాసారాబాద్–1 నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలతో మండల పరిధిలోని భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి సమస్య తగ్గిపోయింది. బోరు బావులు, ఊట బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటోంది. చెక్ డ్యామ్‌లలో నిల్వ ఉన్న నీటిని రైతులు మోటార్ల ద్వారా పొలాలకు తరలించుకుని పంటలు సాగుచేస్తున్నారు. చెక్ డ్యామ్‌లతో తీరిన నీటి సమస్య పెన్పహడ్ మండలంలో భూగర్భ జలాలు పెరిగేందుకు చెక్‌డ్యామ్‌లు దోహదపడుతున్నాయి. మండలంలోని దోసపహాడ్, అనాజీపురం, నాగులపహాడ్ గ్రామాల పరిధిలోని మూసీ నదిపై ఆరు చెక్ డ్యామ్‌లు నిర్మించారు. వీటి నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ ఆధారిత బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రజలకు వేసవిలో తాగునీటి నీటి సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ప్రతి వర్షపు చినుకు నీటిలో ఇంకేలా.. కరువు నేలలో జలాలను నిల్వ చేసి జీవం పోయడానికి పీఎం కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద యాద్రాది భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, చిల్లాపురం, కొత్తగూడెం సహా 16 గ్రామాల్లో ఈ పథకాన్ని గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి వానచినుకు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. కొండలు, వాలు ప్రాంతాల్లో పైనుంచి వచ్చే నీటిని భూగర్భ జలంగా మార్చేలా చెక్‌డ్యామ్‌లు, ఊట చెరువులు నిర్మించారు. పొలాల నుంచి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, కందకాల తవ్వకం చేపట్టారు. ఇప్పటి వరకు 68 పనులు పూర్తి చేశారు.ఫ పెరుగుతున్న భూగర్భ జలాలు ఫ వేసవిలోనూ బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఫ తాగు, సాగునీటి సమస్యకు చెక్ ఫ నీటి సంరక్షణతో కరువును జయిస్తున్న పల్లెలు -
15లోగా పూర్తిస్థాయి పరిశీలన చేయాలి
భానుపురి (సూర్యాపేట) : రాజీవ్ యువ వికాసం పథకం కింద నమోదైన దరఖాస్తులను ఈ నెల 15లోగా పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత బ్యాంకులకు పంపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం కింద నమోదైన 60,107 దరఖాస్తులకు 56,606 పరిశీలన పూర్తయిందని, ఇప్పటివరకు 52,069 దరఖాస్తుల వివరాలను బ్యాంకులకు పంపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీజీడీఓ శంకర్, డీడబ్ల్యూఓ జగదీశ్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఉద్యానశాఖ అధికారి నాగయ్య పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి సంబంధిత అధికారులతో వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లుల వద్ద ధాన్యం లారీలను వేగంగా దిగుమతి చేసుకోనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు వచ్చిన వెంటనే ధాన్యం ఎగుమతి త్వరగా అయ్యేలా చూడాలన్నారు. గన్నీ బ్యాగుల కోసం ముందు రోజే వివరాలు పంపాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీసీఓ పద్మ, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్ నాయక్, మార్కెటింగ్ డీఎం శర్మ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను విశేషంగా జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.పోలీస్ యూనిఫాంకు ప్రత్యేక స్థానంసూర్యాపేటటౌన్ : పోలీస్ యూనిఫాంకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని ఎస్పీ కె.నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తూ ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించి కోరిన చోటుకు బదిలీ ఉత్తర్వులను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేసి మాట్లాడారు. ఈ యూనిఫాం గుర్తింపును కూడా ఇస్తుందన్నారు. ప్రజల దృష్టి పోలీసులపై ఉంటుందని, ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాలని కోరారు. పోలీస్‌శాఖతో పాటు యూనిఫాం గౌరవాన్ని కాపాడుతూ పనిచేయాలన్నారు. తోటి సిబ్బందికి పనిలో సలహాలు ఇస్తూ ఆదర్శంగా ఉండాలన్నారు. మంచి ఆహార అలవాట్లు కలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగబూషణరావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్, ఆర్ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు.అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలిభానుపురి (సూర్యాపేట) : తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ సూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్ దరఖాస్తుల స్వీకరణ, 2024–25 విద్యా సంవత్సరం సాధించిన ఫలితాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, డీటీడీఓ శంకర్ పాల్గొన్నారు.భూ సమస్యల పరిష్కారానికే భూ భారతినాగారం : భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ పేర్కొన్నారు. నాగారం మండల పరిధిలోని మామిడిపల్లిలో భూ భారతి చట్టంపై బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూ సమస్యలకు సంబంధించి గతంలో 33మాడ్యూల్స్ ఉండేవని, భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేసి మాడ్యూల్స్ సంఖ్యను ఆరుకు కుదించిందన్నారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ఈర్ల సైదులు, గడ్డం ఉదయ్, వెన్నెల నాగరాజు, మాగి శంకర్, పాక ఉపేందర్, మేడిపల్లి వేణు, మద్దిరాల మంజుల, సిరిపంగి రాధ, నెమ్మాది స్రవంతి, పోతరాజు శిరీష, గ్రామస్తులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన వారికే పదవులు
తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకే పదవులు వస్తాయని టీపీసీసీ పరిశీలకుడు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. బుధవారం తుంగతుర్తిలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల శాఖ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షుల పదవుల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో 2017 సంవత్సరం కన్నా ముందున్న వారు, ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడిన వారు అర్హులవుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసే వారికి తగిన అవకాశాలు కల్పించడం నాయకత్వం బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పార్టీ అబ్జర్వర్ శత్రురావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.ఫ టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్ -
శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సుందరీమణులు
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి : మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాని ఓ బృందం, భూదాన్‌పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం శాఖతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.నారసింహుడి క్షేత్రంలో ప్రత్యేక పూజలువివిధ దేశాలకు చెందిన పది మంది సుందరీమణుల బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి రానుంది. వీరు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరి కొండపైకి చేరుకుంటారు. కొండపైన అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో అఖండ దీపారాధన వద్దకు చేరుకుని దీపాలు వెలిగిస్తారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొంటారు. వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనం చేసి, శ్రీస్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు. దర్శనం తర్వాత ముఖ మండపంలో పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం స్వర్ణ విమాన గోపురం వద్ద ఆలయమంతా కనిపించేలా ఫొటోలు దిగుతారు. సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రధానాలయ ముఖ మండపం, మహా రాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తరువాత భక్తులకు శ్రీస్వామి వారి దర్శనాలను కొనసాగిస్తారు.పోచంపల్లికి 25 మంది అందాలభామలుఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి, యునెస్కో అనుబంధ సంస్థచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్‌పోచంపల్లిని గురువారం సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. అలాగే హాంఫి థియేటర్లో ప్రముఖ మోడల్స్‌చే నిర్వహించే ర్యాంప్ వాక్‌ను తిలకిస్తారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతి రూపొందించిన ఇండోవెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ కొనసాగనుంది. చేనేత ప్రాముఖ్యతను సుందరీమణులకు ప్రత్యేక యాంకర్స్ ద్వారా వివరిస్తారు. అలాగే పద్మశ్రీ గజం గోవర్ధన్, జాతీయ అవార్డు గ్రహీతలైన తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు బోగ బాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, చేనేత సహకార సంఘం, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ల ఆధ్వర్యంలో పది స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. -
ఖాకీకి అవినీతి మకిలీ!
పోలీస్ స్టేషన్లో ప్రతీ పనికి పోలీసుల వసూళ్లు సూర్యాపేటటౌన్ : జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తీరుతో ఆ శాఖ అప్రతిష్టపాలవుతోంది. ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే పైసలు ఇవ్వందే పని కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా అడ్డదారులు తొక్కుతూ అవినీతి సొమ్ముకు కక్కుర్తి పడుతున్నారు. ఈ ఏడాది కాలంలో ఇప్పటికే ఒక కానిస్టేబుల్, ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి చిక్కారు. తాజాగా డీఎస్పీ, సీఐ ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడడం కలకలం రేపుతోంది. బెయిల్ ఇవ్వాలంటే.. నీతి, న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు లంచాలు డిమాండ్ చేస్తూ ఆ శాఖకు చెడ్డపేరుతెస్తున్నారు. ఏదైనా కేసు అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ.వేలు, లక్షల్లో సదరు పోలీస్ అధికారికి ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల ఏసీబీ వలలో చిక్కిన పోలీస్‌ల తీరు చూస్తుంటే అలానే ఉంది. డబ్బులు ఇస్తేనే బెయిల్ ఇస్తామని, లేదంటే బెయిల్ ఇవ్వకుండా రిమాండ్‌కు పంపిస్తామని బెదిరింపులకు సైతం పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం. ఏసీబీకి చిక్కిన కేసులు.. ● ఈ ఏడాది జనవరి 12న కోదాడ నుంచి తిరుమలగిరి మీదుగా డీసీఎంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న వారు సిద్దిపేట జిల్లా వడ్డెపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ పేరు చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్ పేరు తొలగించడానికి అప్పటి తిరుమలగిరి ఎస్ఐ సురేష్ రూ.3లక్షలు లంచం డిమాండ్ చేయగా చివరకు రూ.1.40లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో జనవరి 28న తిరుమలగిరి ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ● గత ఏడాది అక్టోబర్‌లో పౌరసరఫరాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఆరుగురిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒక నిందితుడిని పిలిపించుకొని అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ.15వేలు డిమాండ్ చేసి రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులుఎస్ఐ అంతిరెడ్డిని ఏప్రిల్ 8న పట్టుకున్నారు. ఫ బెయిల్ ఇవ్వాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే.. ఫ ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా మారని తీరు ఫ ఈ ఏడాది ఇప్పటికే ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ ఫ తాజాగా సోమవారం సూర్యాపేట డీఎస్పీ, పట్టణ సీఐ కూడా.. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే.. ఈ ఏడాది ఏప్రిల్ 2న సూర్యాపేట డీఎస్పీగా పార్థసారథి , ఆరు నెలల క్రితం సూర్యాపేట పట్టణ సీఐగా వీరరాఘవులు బాధ్యతలు చేపట్టారు. వీరు విధుల్లో చేరిన అతి తక్కువ కాలంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోవడం.. ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం స్పందించింది. గత నెలలో సూర్యాపేటలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించగా అర్హత లేకుండానే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నట్లు నిర్ధారించింది. అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీ సాయిగణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఐఎంఏ సభ్యులు గత నెల 29న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.25లక్షలు ఇవ్వాలని డీఎస్పీ, సీఐ డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని చెప్పడంతో కనీసం రూ.16లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బాధితుడు నల్లగొండలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో సోమవారం పట్టుకున్నారు. హయత్ నగర్లో సోదాలుహయత్నగర్ లో డీఎస్పీ పార్థసారథి నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అక్రమంగా ఉన్న 21 బుల్లెట్లను గుర్తించారు. దీనిపై అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లనుసైతం అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా.. ఇటీవల నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో చక్రయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డీఎస్పీ రవిని డీజీపీ కార్యాలయానికి, తుంగతుర్తి సీఐ శ్రీనును జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు. మట్టపల్లి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఆ ఎన్నారై కారు మట్టపల్లిలోని ఆయన ఇంట్లో ఉందని తెలుసుకున్న ఎస్ఐ రామాంజనేయులు ఆయన సొంత అవసరాల కోసం వారం రోజుల పాటు కావాలని సంప్రదించి తీసుకున్నారు. రెండు నెలలవుతున్నా కారు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీస్ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పలు అవినీతి ఆరోపణలతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేశారు. గత ఏడాది తుంగతుర్తి, పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్‌లలో పని చేస్తున్న ముగ్గురు ఎస్ఐలు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని వీఆర్‌కు అటాచ్ చేశారు. ఇలా ఇంకా కొంత మంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా వారి తీరు మారకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. -
పైరవీలతో పదవులు రావు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ‘కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకే పదవులు వస్తాయి.. పైరవీలతో పదవులు రావు’ అని టీపీసీసీ పరిశీలకుడు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఇసుక మాఫియా, భూ మాఫియా సాగిందని పేర్కొన్నారు. మండల శాఖ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షుల పదవుల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో 2017 సంవత్సరం కన్నా ముందున్న వారు, ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడినవారు అర్హులవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర : మందుల సామేల్, ఎమ్మెల్యే. త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, పార్టీ అబ్జర్వర్ శత్రురావు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నాయకులు వై.నరేష్ ,యోగానందాచార్యులు, పాల్వాయి నాగరాజు, వివేక్‌రెడ్డి, కృష్ణప్రసాద్, పాలకుర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన సమావేశం ముగిసిన తరువాత టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కార్ల ముందు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం 30 సంవత్సరాలుగా కృషి చేశామని, తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తమపై వందలాది కేసులు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మురళీనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.ఫ టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్ -
కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం
చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారులకు రాజీ మార్గమే రాజమార్గం అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. జూన్ 14న లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారంలో పోలీసులు, జ్యుడీషియల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని, సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉంచాలన్నారు. ఇప్పటికే జిల్లాకు కేసుల పరిష్కారంలో మంచి పేరు ఉందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలకే కోర్టుల మెట్లు ఎక్కుతున్నారని, దీనివల్ల కాలం, ధనం, వృథా అవుతుందన్నారు. లోక్‌అదాలత్‌లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, మోటర్ వెహికిల్, విద్యుత్, ఎకై ్సజ్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, ఏఎస్పీలు నాగేశ్వర్రావు, అప్పారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు
నాగారం: ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం నాగారం మండల పరిధిలోని వర్థమానుకోట, నాగారంబంగ్లా గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను పరిశీలించి మాట్లాడారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కాంటాలు వేయాలని ఆదేశించారు. కాంటాలు అయిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిల్లుల వద్ద మిల్లర్లు సకాలంలో ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులకు సూచించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వహించవద్దన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. అలాగే ట్రక్షీట్లను, ట్యాబ్ ఎంట్రీ, రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, డీఎంసీఎస్ ప్రసాద్, ఏఓ కృష్ణకాంత్, ఆర్ఐ అల్లాఉద్దీన్, ఏపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
భూ భారతి దరఖాస్తులు 1,690
గరిడేపల్లి: భూ భారతి చట్టం కింద గరిడేపల్లి మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. ఈనెల 5 తేదీన ప్రారంభమైన ఈ సదస్సులు 12వతేదీతో ముగిశాయి. ఇందులో రైతులు వివిధ సమస్యలపై మొత్తం 1,690 దరఖాస్తులు అందించారు. వీటిలో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 731, అత్యల్పంగా డిజిటల్ సంతకం పెండింగ్‌పై ఆరు దరఖాస్తులు వచ్చాయి. త్వరలో క్షేత్రస్థాయిలో విచారణభూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలాన్ని ప్రకటించారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తహసీల్దార్ బండ కవిత, డీఏఓ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో పాటు పలువురు అధికారులు పర్యవేక్షించారు. 1,940 మంది రైతులకు దరఖాస్తు ఫారాలు అందించారు. అయితే 1,690 మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందించారు. రైతులకు సహకారం అందించేందుకు ఆయా గ్రామాల్లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండి దరఖాస్తులను నింపి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా దరఖాస్తులు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు. రెవెన్యూ గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు తాళ్లమల్కాపురంలో 73, రాయినిగూడెం 140, కాల్వపల్లి 50, గడ్డిపల్లి 61, గరిడేపల్లి 193, కుతుబ్షాపురం 140, గానుగబండ 69, వెలిదండ 269, సర్వారం 118, పొనుగోడు 321, కల్మలచెర్వు 256 దరఖాస్తులు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు 731పెండింగ్ మ్యుటేషన్ 26డిజిటల్ సంతకం పెండింగ్ 06విస్తీర్ణంలో తేడాలు 73పేర్లలో తప్పుల సవరణ 07ప్రొహిబిటెడ్ ల్యాండ్ 46అసైన్డ్‌ల్యాండ్ 196పౌతి 69సాదాబైనామా 130ఇతర సమస్యలు 406ఫ పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గరిడేపల్లి మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు ఫ రైతుల నుంచి అనూహ్య స్పందన ఫ అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 731 దరఖాస్తులు.. అత్యల్పంగా డిజిటల్ సంతకం పెండింగ్‌పై ఆరు.. ఫ వచ్చేనెల 1లోగా సమస్యలు పరిష్కరించేలా ప్రణాళికజూన్ 1లోగా సమస్యలు పరిష్కరిస్తాం గడిడేపల్లి మండలంలో భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం ఐదు టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేయనుంది. ఈ సమస్యలను జూన్ 1వ తేదీలోగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా కలెక్టర్ ఎంపిక చేసి సదస్సులు నిర్వహించడం సంతోషంగా ఉంది. – బండ కవిత, తహసీల్దార్ -
ఆధారాలు పక్కాగా నమోదు చేయాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేటటౌన్ : కేసుల దర్యాప్తులో సాక్షా ధారాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అధికారులకు సూచించారు. కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి కోర్టు, పోలీసు శాఖ సమన్వయంపై మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల్లో నిందుతులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా దర్యాప్తు పక్కాగానైపుణ్యంతో చేయాలని అధికారులకు సూచించారు. కోర్టు అధికారులతో సమన్వయంతో పని చేయాలని, సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పర్చాలని పేర్కొన్నారు. నేరగాళ్లకు శిక్షలు పడేలా పని చేయడంలో దర్యాప్తు అధికారికి ఎంత బాధ్యత ఉంటుందో కోర్టు డ్యూటీ సిబ్బందికి కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు. కేసులు పెండింగ్ లేకుండా దర్యాప్తును సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్ సీజ్సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఆపిల్ స్కానింగ్ సెంటర్‌ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం మంగళవారం సీజ్ చేశారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేయగాస్కానింగ్ సెంటర్‌ను నకిలీ డాక్టర్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. నివేదికను కలెక్టర్, డీఎంహెచ్ఓకు సమర్పించారు. విచారణ చేపట్టిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ప్రశాంతంగా పాలిసెట్ సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలో పాలిసెట్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఏ, బీ సెంటర్ లు, ఎస్వీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్కేఎల్కే డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ మేధా జూనియర్ కళాశాల, శ్రీనిధి జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. 1436 మంది బాలురు, 1362 బాలికలు మొత్తం 2798 మంది దరఖాస్తు చేసుకున్నారు.1330 మంది బాలురు,1260 మంది బాలికలు మొత్తం 2,590 హాజరు కాగా, 106 మంది బాలురు, 102 బాలికలు మొత్తం 208మంది గైర్హాజరైనట్టు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె. సుజాత తెలిపారు. హనుమంతుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. -
డీఎస్పీ ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తింపు
హైదరాబాద్: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్సీ పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.పార్థసారథికి సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది ఏసీబీ. నిన్న (సోమవారం) డీఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలను గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవినీతి కేసులో భాగంగా ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. -
ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వెబ్ పోర్టల్‌లో శాఖల వారీగా డిపార్ట్మెంట్ ప్రొఫైల్, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్, వార్షిక నివేదిక, శాఖల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారుల వివరాలు అప్డేట్ చేయాలన్నారు. ప్రతి శాఖ కార్యాలయంలో ఒక అధికారిని నోడల్ అధికారిగా నియమించాలన్నారు. ఈ నెల 25 లోపు సంక్షేమ అధికారులు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించి, బ్యాంకు క్లియరెన్స్ ఇప్పించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వివి అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలిభూభారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గ నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసీల్దార్లు , ఆర్ఐలు పాల్గొన్నారు. -
వైభవంగా మట్టపల్లిలో తిరుకల్యాణోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం తెల్లవారు జామున వైభవంగా నిర్వహించారు. అర్చకులు కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మ నాభాచార్యులు, బ్రహ్మచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి బృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్రబెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు,తలంబ్రాలను సమర్పించి నిండు వైశాఖ పౌర్ణమి వెన్నెలలో కల్యాణతంతు జరిపించారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత ఉత్సవమూర్తులను గజ, సింహ, అశ్వ వాహనాలపై అశేషభక్తుల జయజయధ్వానాల నడుమ కల్యాణమండపం వరకు ఊరేగింపుగా తరలించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి యాదాద్రి కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తిలు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్‌లు శ్రీస్వామివారికి సమర్పించారు. గుండ్లపల్లి భక్తులు ఎదుర్కోళ్లదివిటీలు, పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామస్తులు, సూర్యాపేట జిల్లా లింగగిరి వాసులు శ్రీస్వామి, అమ్మవారికి మెట్టెలు, మంగళసూత్రం, ఉత్తర జంధ్యములు, వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు పర్యవేక్షణలో హరికిరణాచార్యులు, వెంకటాచార్యులు కల్యాణతంతు జరిపించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం అనంతరం గరుడవాహన సేవ నిర్వహించారు. నృసింహోపాసనం పద్యపఠనం, వేదపఠనం, భక్తిసంగీతం, శ్రీలక్ష్మీనరసింహస్వామి అవతార విశేషం హరికథ, శ్రీమట్టపల్లి క్షేత్రమహాత్యం బుర్రకథ , భక్తిసంగీత విభావరి నిర్వహించారు. అనంతరం రథోత్సవం చేపట్టారు. -
పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆటలపై దృష్టి పెట్టాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో జిల్లా పోలీస్, బాలభవన్ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యా పేట పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పిల్ల లకు ఆటల ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. మేధస్సును పెంచే ఆటలపై దృష్టి పెట్టాలన్నారు. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, జిల్లా బాల భవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణా రెడ్డి, అమిద్ ఖాన్, యోగా గురువు, జిల్లా బాల భవన్ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు చివ్వెంల(సూర్యాపేట): వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. తేమశాతం 17 రాగానే సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలన్నారు. ఈకార్యక్రమంలో నిర్వాహకురాలు చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలిఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ, అలింకో సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్యాంపుల్లో సహాయ పరికరాల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డీ. జహీర్ బాబా ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 14న హుజూర్నగర్, 15న కోదాడ, 16న సూర్యాపేట, 17న తుంగతుర్తి లో నిర్వహించే క్యాంపుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులతో సదరం సర్టిఫికెట్, యూడీఐడీకార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోలు జతపర్చాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి బ్యాటరీ సైకిల్, ట్రై సైకిల్, వీల్ చైర్, చేతి, చంక కరల్రు, శ్రవణ యంత్రాలు, ప్రత్యేక మానసిక వికలాంగుల కిట్లు అందించనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలిభానుపురి (సూర్యాపేట) : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కోరారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆదేశా నుసారం కాంగ్రెస్ పార్టీ కార్యాల యాలకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను కోరినట్లు ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఎకరం భూమి కేటాయించి ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు వెంకన్న చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం పరిశీలించాలని తహసీల్దార్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, నాయకులు చింతమల్ల రమేష్, ఎలిమినేటి అభినయ్, తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, రుద్రంగి రవి, నాగుల వాసు, అబ్దుల్ రహీం, సిరివెళ్ల శబరినాథ్, అన్నమయ్య రాము, సాయి నేత తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి ఎంజీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలునల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14 వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్‌టికెట్ లేదా నూతన హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని ఆయన తెలిపారు. కళాశాల గుర్తింపు కార్డు, ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
చెత్తతో ఆదాయం పెంచేలా..
హుజూర్నగర్ : మున్సిపాలిటీలకు అదనపు ఆదా యం సమకూర్చేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటి నుంచి సేకరించే చెత్తతోపాటు దుకాణాల ద్వారా వచ్చే వ్యర్థాలకు ఇకపై పక్కాగా లెక్క ఉండేలా అధికారులు చర్యలు చేపడతారు. చెత్త పరిమాణం ఆధారంగా వాణిజ్య కేంద్రాలను విభజించనున్నారు. ప్రాంతాన్ని బట్టి వాణిజ్య కేంద్రాల్లో చెత్త పరిమాణాన్ని లెక్కించి పన్ను వసూలు చేసి మున్సిపాలిటీలకు ఆదాయం రాబట్టనున్నారు. దుకాణ సముదాయాలకు క్యూఆర్ కోడ్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నివాస గృహాలకు ఇదివరకే జియోట్యాగింగ్ చేపట్టి మ్యాపింగ్ చేశారు. నగరపాలికల్లో మాదిరిగా ఇకపై మున్సిపాలిటీల్లోనూ వాణిజ్య ప్రాంతాల్లోని చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని ప్రకారం ప్రధాన రహదారికి అనుకుని ఉన్న ప్రతి దుకాణాన్ని గుర్తించి జియో ట్యాగింగ్‌లో పొందుపర్చిన లెక్కల ఆధారంగా దుకాణ సముదాయాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన నంబర్ కేటాయించనున్నారు. స్థానికత ఆధారంగా మ్యాపింగ్ చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, మాంసం విక్రయ దుకాణాలకు క్యూఆర్ కోడ్‌ను అమర్చేందుకు మున్సిపాలిటీల్లో కార్యాచరణ రూపొందిస్తున్నారు. తద్వారా ఏయే దుకాణానికి ఎంత చెత్త వస్తుందో లెక్కలు వేసి దాని పరిమాణాన్ని బట్టి పక్కాగా పన్ను విధించనున్నారు. రోడ్ల వెంట చెత్త చేయకుండా.. మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు తెచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంబడి చెత్త ఉండకుండా ప్రణాళికలు రూపొందించారు. రోడ్లపై చెత్త పారేయకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దుకాణాల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫ చెత్త లెక్క పక్కాగా ఉండేలా కార్యాచరణ ఫ మున్సిపాలిటీల్లో చెత్త పరిమాణాన్ని బట్టి విధించనున్న పన్ను ఫ నూతన విధానానికి యంత్రాంగం కసరత్తు ఫ చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఫ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకుల సాధనకు పోటీ తడి చెత్తతో ఎరువుల తయారీ మున్సిపాలిటీల్లో ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అనంతరం తడి చెత్తతో ఎరువుల తయారీ చేపట్టాలని నిర్ణయించారు. రైతులకు అవసరమయ్యే ఎరువులను తయారు చేసి వారికి నిర్ణీత రుసుం ఇచ్చి ఆదాయం రాబట్టాలని భావిస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్తను వేర్వేరు డబ్బాల్లో సేకరించి కేటాయించిన ట్రాక్టర్లలో ఆటోల్లో డంపింగ్ యార్డుకు తరలించాలని నిర్దేశించారు. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మురుగు కాల్వల్లో చెత్త వేయొద్దు పట్టణాలు చెత్తమయం కాకుండా ఎవరికి వారు ఇళ్లల్లో స్వీయ నియంత్రణ పాటించాలి. చెత్తను మురుగు కాల్వల్లో వేయకుండా తడి పొడి చెత్త డబ్బాల్లో వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలి. వ్యాపార సముదాయాల వారు కడూఆ స్వచ్ఛత విషయంలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి. – శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్ రోజువారీగా వెలువడే చెత్త వివరాలు (మెట్రిక్ టన్నుల్లో..) మున్సిపాలిటీ వార్డులు చెత్త సూర్యాపేట 48 55కోదాడ 35 32హుజూర్నగర్ 28 18నేరేడుచర్ల 15 5తిరుమలగిరి 15 5 -
శాశ్వత పరిష్కారం వెతకాలి
టెర్రరిస్టులను అంతమొందించేందుకు శాశ్వత పరిష్కారం వెతకాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.సాగరతీరం.. అందగత్తెల విహారంఫ నాగార్జునసాగర్‌కు మిస్‌వరల్డ్ పోటీదారులు ఫ గిరిజన సంప్రదాయ రీతిలో స్వాగతం ఫ విజయవిహార్‌లో ఫొటోషూట్‌తో సందడి ఫ బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఫ మహాస్థూపంలో ధ్యానం ఫ బుద్ధ చరిత్ర నృత్య ప్రదర్శనను తిలకించిన ముద్దుగుమ్మలు నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ తీరంలో సోమవారం సుందరీమణులు విహరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌వరల్డ్ –2025 పోటీలకు హాజరైన అందగత్తెలు.. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో నిర్వహించిన బుద్ధజయంతికి హాజరయ్యారు. వీరు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథిగృహానికి చేరుకుని అక్కడ కాసేపు సేదదీరిన అనంతరం విజయవిహార్ వెనుకభాగంలో జలాశయతీరంలోని పార్కులో ఫొటోషూట్‌లో సందడి చేశారు. ఆ తర్వాత బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి, పూజలు చేశారు. అక్కడినుంచి మహాస్థూపం వరకు నడిచి వెళ్లగా అక్కడ తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో వారికి స్వాగతం పలికారు. మహాస్థూపం వద్ద శిల్పాల గురించి తెలుసుకున్నారు. మహాస్థూపంలో ధ్యానం చేశారు. ఫొటో ప్రదర్శన, బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శనను తిలకించారు. డిన్నర్ అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. బుద్ధపూర్ణిమ బౌద్ధులకు ఎంతో ప్రత్యేకం – కలెక్టర్ ఇలా త్రిపాఠి బుద్ధపూర్ణిమ బౌద్ధులకు ఎంతో ప్రత్యేకమని కలెక్టర్ ఇలాత్రిపాఠి అన్నారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా సాగర్ బుద్ధవనానికి హాజరైన ప్రపంచ సుందరీమణులకు బుద్ధ పూర్ణిమ గురించి ఆమె వివరించారు. బుద్ధపూర్ణిమను మీ అందరితో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. బుద్ధుడు ప్రపంచానికి ప్రశాంత జీవన విధానాన్ని నేర్పించాడని పేర్కొన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మీ మాతృదేశాలలో తెలియాజేయాలని సుందరీమణులను కోరారు. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ మిస్‌వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వడం గొప్ప విషయమన్నారు. ప్రపంచ బౌద్ధులంతా దర్శించుకునే విధంగా ఇక్కడ బుద్ధవనం నిర్మాణమైందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌తోపాటు బౌద్ధప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం తగు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎస్పీ శరత్ చంద్రపవార్, ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీలు రమేశ్, మౌనిక, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వెల్లంకి గెస్ట్‌హౌస్‌లో సేదదీరిన అందాల భామలు చింతపల్లి : సుందరీమణులు చింతపల్లి మండల పరిధిలోని తీదేడు గ్రామ శివారులో గల వెల్లంకి గెస్ట్‌హౌస్‌లో సోమవారం సందడి చేశారు. వారు నాగార్జునసాగర్ వెళ్తూ మార్గమధ్యలో వెల్లంకి గెస్ట్‌హౌస్‌లో 30 నిమిషాల పాటు సేదదీరారు. మిస్‌వరల్డ్ పోటీదారులు మండల కేంద్రం మీదుగా వెళ్తుండడంతో వారిని చూసేందుకు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి చూపారు. మాల్ వెంకటేశ్వరనగర్ నుంచి నాగార్జునసాగర్ వరకు పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. -
ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన పోలీసు ఉన్నతాధికారులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ఏబీసీకి చిక్కారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేస్తూ డీఎస్పీ, సీఐ ఏబీసీకి దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ఓ ఆస్పత్రిపై నమోదైన కేసులో భారీగా లంచం డిమాండ్ చేశారు.. కేసు వివరాలను.. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మీడియాకు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, వ్యాపారం సజావుగా సాగాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారధి డిమాండ్ చేశారు. డీఎస్పీను కలిసి సెటిల్ చేసుకోమంటూ సీఐ వీర రాఘవులు ఆఫర్ ఇచ్చారు. డీఎస్పీని కలిసిన సదరు వ్యక్తి.. రూ. 25 లక్షలు ఇవ్వలేనని ప్రాధేయపడటంతో రూ. 16 లక్షలు తీసుకునేందుకు అంగీకరించారు. డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ సీఐ, డీఎస్పీ ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి పూర్తి స్థాయిలో విచారించామని . ఏసీబీ డీఎస్పీ తెలిపారు.గతంలో కూడా సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారధిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. రేపు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తాం. డబ్బులు తీసుకుంటూ దొరకడమే కాదు. డిమాండ్ చేయడం కూడా నేరంలో భాగమే’’ అని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
శాటిలైట్ టోల్ వసూలు ఇప్పట్లో లేనట్లే
చౌటుప్పల్ రూరల్: జాతీయ రహదారులపై టోల్ వసూలుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు మే 1వ తేదీ నుంచి అమలు చేస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూలుకు కచ్చితమైన సొంత నావిగేషన్ ఉపగ్రహాలు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు. జీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను సొంతంగా రూపొందించింది. అయితే ఈ టెక్నాలజీని ఇస్రో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే శాటిలైట్ విధానంలో టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది. ఈ వ్యవస్థను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఏడాది ఆగస్టు నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. అక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు జరిగిన తర్వాత దేశంలోని జాతీయ రహదారుల అన్నింటికి అమలు చేయనున్నారు. మొదటగా భారీ వాహనాలకు శాటిలైట్ టోల్ వసూలు విధానం అమలు చేసి తర్వాత కార్లు, మిగతా వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. 2027 నుండి అన్నిరకాల వాహనాలకు శాటిలైట్ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం అమలు కోసం ఫాస్టాగ్ స్థానంలో నావిగేషన్ చిప్‌ను వాహనాలకు బిగించనున్నారు. కార్లకు ఈ చిప్ జీపీఎస్ కోసం రూ.4వేల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాస్టాగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. నావిగేషన్ ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చే వరకు వాయిదా పూర్తిస్థాయిలో అభివృద్ధికాని ఐఆర్ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ -
గోమాత.. జాతీయ జెండాలతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయ కొండ చుట్టు ఆదివారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీస్వామి వారి జయంతి సందర్భంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం అంటూ గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు గోమాతతో పాటు జాతీయ జెండాలు, కాషాయం జెండాలతో భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. 5వేలకు పైగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మెట్ల దారి మార్గంలో వెళ్లి శ్రీస్వామిని దర్శించుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్, ఈవో వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం
పాకిస్తాన్‌తో తాడో పేడో తేల్చుకోవాలి – నర్సింగ్ మార్క్, మాజీ సైనికుడునల్లగొండ : పాకిస్తాన్ మొదటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడటం భారత దళాలు వారికి బుద్ధి చెప్పడం, తోక ముడిచి వెనుదిరగడం పాకిస్తాన్‌కు అలవాటే. పాకిస్తాన్‌తో ఇప్పటికై నా తాడోపేడో తేల్చుకోవాలని అంటున్నారు మాజీ సైనికుడు, సెక్షన్ కమాండర్ నర్సింగ్ మార్క్. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్ మార్క్ 1984లో ఆర్మీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని సావ్గర్లో ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకుని జమ్ముకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, హైదరాబాద్, నేపాల్, కేరళ తదితర ప్రాంతాల్లో పని పని చేశారు. 2004లో రిటైర్ అయ్యారు. శత్రువు మీద గురి పెట్టడమే లక్ష్యం..చేతిలో తుపాకి ఎదురుగా ఉన్న శత్రువు మీద గురిపెట్టడం ఒకటే లక్ష్యంగా సైనికులు పోరాడుతారు. సైనికుడు లక్ష్యాన్ని చేధించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు. పోరాడి వీరమరణం పొందుతాడే తప్ప శత్రువు చేతికి చిక్కే పరిస్థితి తెచ్చుకోరు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే యుద్ధంలో ‘జవాన్‌కు ఆఖరి గోలి ఆఖరి దుష్మన్’ అనే విధానం ఆఖరి తూటాతో శత్రువును నాశనం చేయడం.. అవకాశం లేకపోతే శత్రువుల చేతిలో చంపకుండా తనకు తానే కాల్చుకుని వీరమరణం పొందుతాడు తప్ప వెన్ను చూపడు. ఆ విధంగా ప్రతి సైనికుడు యుద్ధంలో పోరాడుతాడు. కార్గిల్స్ యుద్ధంలో సెక్షన్ కమాండర్‌గా పని చేశా..1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో నేను సెక్షన్ కమాండర్‌గా పని చేశా. హిమాలయాల్లో టైగర్ హిల్స్‌పై ఆరు నెలలు ఉన్నాం. మంచు పర్వతమిది. మంచినీళ్లు కూడా ఉండవు. మంచుని కరిగించుకుని తాగాలి. వంట చేసుకోవాలన్న అక్కడ ఉన్న మంచుగడ్డలను గిన్నెలో వేసి నీరుగా మార్చిన తర్వాతే వంట చేసుకోవాలి. ఒక్కోసారి తిండి లేకున్నా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టైగర్ హిల్స్‌పై పైకి ఒకసారి వెళ్లామంటే ఆరు నెలలకు అవసరమైన అన్ని అహార పదార్థాలు, మెడిసిన్ తీసుకెళ్లాలి. అత్యవసరమైతే పైనుంచి హెలికాప్టర్లో వచ్చి పైనుంచి కిందకు వదులుతారు. సమాచార వ్యవస్థ కూడా అసలు ఉండదు. కార్గిల్ యుద్ధంలో శత్రువులు మా వైపు రాకుండా ముందే మైన్ ఎం14, ఎం16లను భూమిలో పాతిపెట్టేవాళ్లం. వెంట్రుక లాంటి వైర్లును అమర్చాం. అయితే శత్రువులు అటుగా ఆ మైన్లను దాటి వస్తే ఆ వైర్‌కు కాలు తగిలినా.. మైన్ మీద కాలు పెట్టినా అది పేలిపోతుంది. అలా శత్రువుల ఆట కట్టంచే వాళ్లం. మళ్లీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంపాకిస్తాన్తో మళ్లీ యుద్ధం జరిగిన సమయంలో.. నన్ను పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. నేను ట్రెయిన్డ్ జవాన్‌ను. ఎప్పుడైనా దేశం రక్షణ కోసం జరిగే యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటాను. మాతో పాటు చాలా మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారు.దేశసేవ చేయడం అదృష్టం – లక్క లింగారెడ్డి, మాజీ సైనికుడు పెద్దవూర : దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాలి. అది అందరికీ రాదు అని చెబుతున్నారు ఇండియన్ ఆర్మీలో 19 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన లక్క లింగారెడ్డి. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన లింగారెడ్డి. తల్లింద్రులకు ఒక్క కుమారుడు. ఆర్మీలో చేరవద్దని తల్లిదండ్రులు ఎంత వద్దని వారించినా దేశానికి సేవ చేయాలన్న తలంపుతో 2003లో ఆర్మీలో చేరారు. 2022 డిసెంబర్లో రిటైర్ అయ్యారు. 19 ఏళ్లు సైన్యంలో పనిచేశా..ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ)లో ట్రైనింగ్ చేసి 47 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌లో పోస్టింగ్‌కు వెళ్లా. తన సర్వీసులో ఆరున్నర సంవత్సరాలు జమ్మూ కశ్మీర్లో పనిచేశా. మూడు సంవత్సరాలు ఉగ్రవాదులను ఏరివేసే స్పెషల్ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్(25 రాష్ట్రీయ రైఫిల్స్)లో పనిచేశా. ఆ సమయంలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నా. 19ఏళ్లు సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రెండు కిలోమీటర్ల వరకు ఎదురొచ్చి కుంకుమ దిద్ది, హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రెండు కిలోమీటర్లు పూలు చల్లుతూ బాణాసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఆ అనుభూతిని నేను జీవితంలో మరిచిపోలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ధైర్యంగా, విరోచితంగా, సాంకేతికతతో పోరాడుతోంది. యుద్ధం వల్ల దేశానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్‌లో ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ఉంటాయి. యుద్ధ సమయంలో తన అవసరం ఉందని సైన్యం పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నా. దేశ సేవ చేసే అదృష్టం అందరికీ రాదు మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి‘ఆపరేషన్ సిందూర్‌తో భారత జవాన్లు గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పుడు యుద్ధం జరిగినా సైన్యం పిలస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉంటాం. దేశరక్షణ కోసం ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాం. అది అందరికీ రాదని చెబుతున్నారు’ మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి. ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారు ‘సాక్షి’తో మాట్లాడారు. -
జయ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
సూర్యాపేటటౌన్: ఈఏపీసెట్ ఫలితాల్లో సూర్యాపేటలోని జయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఎప్‌సెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన కె. ఉజ్వన్ 141వ ర్యాంకు, జి. తేజశ్రీ 266, సీహెచ్. హన్షితశ్రీ 695, టి. అమూల్య 913, బి. లాస్య 917, పి. అమిత్ సూర్య 1948, బి. శివమణి 2270, డి. జగదీష్ రాజు 2935, వై. ప్రదీప్ 3364, కె. సాయినందన్ 3977, జి. నవదీప్‌రెడ్డి 4003, సీహెచ్. కుశల్ రాజు 5044, సీహెచ్. అక్షయ భారతి 5583, కె. యామిని 5823, ఎం. హన్సిని 5843, వి. బిందుమాధవి 6002, ఎస్. నక్షత్ర 6630, కె. పవన్ కుమార్ 7280, జి. సాయిరాం 8325, ఆర్. ప్రియదర్శిని 8328, ఎం. సాద్విక 8361, సీహెచ్. వైశాలిని 8449, జె. కీర్తన 8989, ఎ. కిషోర్ 9502 ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను ప్రిన్సిపాల్, కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నేరేడుచర్ల: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే చోరీకి పాల్పడి బంగారం, వెండి, నగదు అపహరించారు. ఈ ఘటన ఆదివారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ రాములునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ స్థానిక పశు వైద్యశాలలో అంటెండర్‌గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇస్మాయిల్ భార్య నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడలో తన పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇస్మాయిల్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి రాగా.. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.15వేల నగదు, 10 తులాల వెండి, 4 గ్రాములు బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే నేరేడుచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.భువనగిరి బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతిభువనగిరిటౌన్: భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి బస్టాండ్ పరిసరాల్లో బిక్షాటన చేస్తూ తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 38 ఏళ్లు) ఆదివారం ఉదయం హైదరాబాద్ ప్లాట్‌ఫాం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బస్టాండ్‌కు చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిని పరిశీలించగా.. అతడు మృతిచెంది ఉన్నాడు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.వీఓఏ ఆచూకీ లభ్యంయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో వీఓఏగా విధులు నిర్వహిస్తున్న మిట్ట సంధ్య ఆచూకీ ఆదివారం తెలిసింది. అధికార పార్టీ నాయకులు వేధిస్తున్నారని నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంధ్య తన స్యూటీని ఆలేరు బస్టాండ్‌లో పార్కింగ్ చేసి హైదరాబాద్‌కు వెళ్లింది. హైదారాబాద్‌లోని చర్లపల్లి పరిధిలో తన చెల్లెలి ఇంటి వద్ద ఉనట్లు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించి.. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. -
‘ఆదర్శ’లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
సద్వినియోగం చేసుకోవాలి ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలి గిన అధ్యాపకులతో నాణ్య మైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మమత, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కొర్లపహాడ్● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● 20వ తేదీ వరకు గడువు ● ఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ● ఒక్కో పాఠశాలకు 160 సీట్లుకేతేపల్లి, తిరుమలగిరి: ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 31 పాఠశాలలుఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ఉండగా.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో మాత్రమే ఆదర్శ పాఠశాల ఉంది. ప్రతి పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు. ఎంపిక ప్రక్రియ ఇలా...పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ సిలబస్‌తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు. బాలికలకు హాస్టల్ సౌకర్యంఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్‌కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు. -
ఈఏపీసెట్‌లో ‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో వి. కుషాల్ 28వ ర్యాంకు, వై. నిషాంత్ 61, డి. దుర్గా గుజిరి 222, ఏ. సాయితేజ 253, కె. విశావని వాగ్దేవి 301, బి. రిషిత 321, ఆర్. జోష్ణవ్ కుమార్ 334, కె. సాయిదివ్య వర్షిత 423, జి. సాయి ప్రణవి 491, కె. హాసిని 575, వి. ప్రణతి, కె.తేజస్విని 653, బి. ఈశ్వర్ గుప్తా 855, యు. వశిష్ఠ 908, బి. మనిశేషు 968, డి. శ్రీలేఖ 1195, పి. స్మైలికరెడ్డి 1262, కె. నిషాంత్‌రెడ్డి 1394, ఎల్. మనోహర్ 1422, జి. అలేఖ్య 1482వ ర్యాంకు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బి. సాయిగీతిక, డీజీఎం సీహెచ్. చేతన్ మాధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, డీఎన్ జె. కృష్ణ, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి తగిన ఫలితం దక్కింది
ఆత్మకూర్(ఎస్): ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే ఏదో ఒక రోజు పార్టీ తనను గుర్తిస్తుందని భావించానని, అనుకున్నట్లుగానే తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఆదివారం తన స్వగ్రామమైన ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో అద్దంకి దయాకర్ పాల్గొని మాట్లాడారు. తనను ఉన్నత పదవిలో చూడాలని 11ఏళ్లుగా ఎందరో ఆశతో ఎదురు చూశారని, వారి దీవెనలతోనే కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాక పార్టీ తన స్థాయికి మించి బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. తన అభివృద్ధికి, ఉన్నతికి సహకారం అందించిన శ్రేయోభిలాషులను అన్నివిధాలుగా ఆదుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం పాదాలకు పాలాభిషేకం చేశారు. క్రీస్తు రాజు దేవాలయంలో ఫాదర్ అలెగ్జాండర్‌చే దీవెనలు తీసుకున్నారు. మనం ఫౌండేషన్ గంపల కృపాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా జేఏసీ చైర్మన్ భూపతి రాములు, గంపల నారాయణ, జానకిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకన్న, యాదగిరి, గరిగంటి ప్రకాశ్, గంపల లింగయ్య, సైదులు, నిమ్మ ఎల్ల య్య, వార్డెన్ లింగయ్య, కొంపల్లి మల్లారెడ్డి, గుంటూరు చిట్టిబాబు, రామకృష్ణ, గంగరబోయిన శ్రీను, గురుస్వామి, జలగం మల్లేశ్, కాటూరి రాములు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
సాగర్‌కు సుందరీమణులు
నేడు బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్‌వరల్డ్ పోటీదారుల బృందం టూర్ షెడ్యూల్ ఇలా.. ● మధ్యాహ్నం 1.00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతారు. ● 3 గంటలకు చింతపల్లి సమీపంలోని వెల్లంకి గెస్ట్ హౌజ్‌కు చేరుకుని 3.30 గంటల వరకు అక్కడ సేదదీరుతారు. ● 4.30కు నాగార్జునసాగర్ విజయ విహార్‌కు చేరుకుంటారు. ● సాయంత్రం 5 గంటల వరకు విజయవిహార్‌లో ఫ్రెష్ అప్ అవుతారు. ● 5.30 వరకు టీ, ప్రధాన ద్వారం వద్ద ఫొటో షూట్లో పాల్గొంటారు. ● 5.45 వరకు విజయ విహార్ నుంచి బుద్ధవనం చేరుకుంటారు. ● 6 గంటల వరకు అక్కడ ఫొటో సెషన్ ఉంటుంది. ● 6.10కి స్వాగత నృత్యం నడుమ మహాస్థూపం వద్దకు చేరుకుంటారు. ● 6.20 వరకు మహాస్థూపం విషేశాలను గైడెడ్ టూర్ శివనాగిరెడ్డి వారికి వివరిస్తారు. ● 6.30 వరకు బుద్ధశాసన వద్ద ప్రపంచ సుందరీమణుల ధ్యానం చేస్తారు. ● 6.40 నుంచి 6.50 వరకు బుద్ధవనంపై సంక్షిప్త ఉపన్యాసం ఉంటుంది. ● 6.50 నుంచి 7 గంటల వరకు జాతకవనంలో గడుపుతారు. ● రాత్రి 7 నుంచి 7.45 వరకు జాతకవనం వద్ద డిన్నర్ చేస్తారు. ● 7.45 నుంచి 8.45 వరకు వెల్లంకి గెస్ట్‌కు చేరుకుంటారు. ● 9 గంటల వరకు అక్కడ సేదతీరుతారు. ● 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. నాగార్జునసాగర్ : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం సోమవారం నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనుంది. వారి రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ముందుగా వీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి చింతపల్లి సమీపంలో ఉన్న వెల్లంకి అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయవిహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. మహాస్థూపంలో సుందరీమణుల ధాన్యం సుందరీమణులు మహాస్థూపంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి విశేషాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వారికి వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం, తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక అంతా నాగార్జునసాగర్‌లో ఆయా ప్రాంతాలను సిద్ధం చేసింది. బౌద్ధ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం చారిత్రక ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజేసేలా ఏర్పాట్లు చేసింది. పపంచ సుందరీమణులు సేదదీరేందుకు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహాన్ని తీర్చిదిద్దింది. టైల్స్, బెడ్లు, కర్టెన్స్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. బుద్ధవనం, విజయ విహార్ అతిథి గృహాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సిద్ధం చేశారు. సుందరీమణులు ఇక్కడే డిన్నర్ చేయనున్నందున వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే వారికి భోజనాలు తీసుకురానున్నారు.ఫ పర్యటనకు అంతా సిద్ధం చేసిన పర్యాటక శాఖ ఫ లంబాడా నృత్యంతో వారికి స్వాగతం ఫ విజయవిహార్‌లో విడిది.. బుద్ధవనంలో ధ్యానం చేసేలా ఏర్పాట్లు -
ఈఏపీ సెట్లో కలకోవ విద్యార్థికి 27వ ర్యాంకు
మునగాల: ఈఏపీ సెట్లో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన బుర్రి శ్రీనివాసరావు–విజయలక్ష్మి దంపతుల కుమారుడు రిషిక్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు సాఽధించాడు. రిషిక్‌కుమార్ ప్రాథమిక విద్య మునగాల, కోదాడలో, ఇంటర్ విద్య హైదరాబాద్‌లో కొనసాగింది. తమ కుమారుడు ఈఏపీ సెట్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా రిషిక్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మా నాన్న చిన్నతనం నుంచి నేర్పిన క్రమశిక్షణతోపాటు అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఇంత మంచి ర్యాంకు సాధించానన్నాడు. భవిష్యత్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించి ప్రజాసేవ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో ఎంవీఎన్ భవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాములు, మట్టిపల్లి సైదులు, కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, దండా వెంకటరెడ్డి, కోట గోపి, ఎం.రాంబాబు, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు. వయోవృద్ధుల హక్కుల సాధనకు కృషితాళ్లగడ్డ (సూర్యాపేట) : వయోవృద్ధుల హక్కుల సాధన కోసం తనవంతు కృషిచేస్తానని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టీఏఎస్‌సీఏ) జిల్లా అధ్యక్షుడు ఆరె రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వయోవృద్ధుల సంఘం సమావేశం అనంతరం సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కుల చట్టం 2007కు సంబంధించిన వాల్‌పోస్టర్ ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచామని, అలాగే సుమారు 60గ్రామాల్లో వృద్ధులకు కరపత్రాలు పంచి ఈ చట్టంపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్, సభ్యులు గుంటకండ్ల ముకుందరెడ్డి, అన్నపూర్ణమ్మ, పిచ్చమ్మ, ముస్కుల గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నారసింహుడికి లక్ష మల్లెల పూజ
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకట వాసుదేవాచార్యులు, సోమయాజుల సూర్యనారాయణ మూర్తిశాస్త్రి, లక్ష్మీనరసింహమూర్తి జానపాటి సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో లక్షమల్లెలతో అర్చనలు పూర్తిచేశారు. అనంతరం స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి కల్యాణానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన టీవీ కళాకారుడు ధూళిపాళ శివరామకృష్ణయ్యభాగవతార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీరామతీర్థ సేవాశ్రమ పీఠం భక్తులు ప్రదర్శించిన నాదస్వర కచేరీ, భక్తి సంగీతం, ససంగీత విభావరి నాదలహరి, శ్రీసీతా కల్యాణం హరికథ, శ్రీలక్ష్మీనృసింహ నామ సంకీర్తనలతోపాటు దాచేపల్లి, చౌటపల్లి, పెదవీడు, చెన్నాయిపాలెం, మాచవరం గ్రామాలకు చెందిన కోలాట, భజనలు ఆకట్టుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు స్వామివారి తిరుకల్యాణోత్సవం జరుగనుందని ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు , భక్తులు పాల్గొన్నారు. ఫ మట్టపల్లిలో రెండో రోజుకుచేరిన తిరుకల్యాణోత్సవాలు -
అంతర్జాతీయ స్థాయిలో భద్రత
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో జరిగే బుద్ధపూర్ణిమకు హాజరవుతున్న ప్రపంచ సుందరీమణులకు అంతర్జాతీయ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపల్లి సమీపంలోని వెల్లంకి అతిథి గృహం నుంచి నాగార్జునసాగర్ వరకు రహదారి వెంట పూర్తి స్థాయిలో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవిహార్, వెల్లంకి గెస్ట్ హౌస్‌తో పాటు బుద్ధవనంలో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ సుందరీమణులు తిరిగే ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం ఎల్లో కలర్ పాసులు కలిగిన వారిని మాత్రమే ఈ ప్రాంతంలోకి అనుమతిస్తామన్నారు. పోలీసులు అధికారులు, ఇతర శాఖల అధికారులకు ఆరెంజ్ కలర్ పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రవేశద్వారాల వద్ద విధులు నిర్వర్తించే వారితో పాటు వీఐపీలకు, బయటి వ్యక్తులకు గ్రీన్ కలర్ పాస్‌లు, మీడియాకు వైట్‌కలర్ పాసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడా ట్రాఫిక్ మళ్లించకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
డీఎంహెచ్ఓను సస్పెండ్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : అర్హతలు, ధృవపత్రాలు లేకున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లకు అనుమతులిచ్చిన డీఎంహెచ్ఓను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, మాస్‌లైన్ (ప్రజాపంథా) పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని మహర్షి డిగ్రీ కళాశాలలో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదల ఆరోగ్యం–నకిలీ డాక్టర్స్ ప్రభుత్వ వైఖరి అంశంపై నిర్వహించిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో మెడికల్ మాఫీయాపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కోకన్వీనర్ లింగయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాంబాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు పోలెబోయిన కిరణ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నరేష్, రాష్ట్ర నాయకులు బాషిపంగు సునీల్, పోరెళ్ల విప్లవ్‌కుమార్, అశోక్, కరీం, గడ్ల రమాశంకర్, బంటు సందీప్, ధరావత్ వెంకటేష్, సంతోష్‌రెడ్డి, నాగేశ్వర్‌నాయక్, చామకూర మహేందర్, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మైనర్లకు వాహనాలిస్తే కేసులు తప్పవు
సూర్యాపేటటౌన్ : మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కేసులు తప్పవని ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి పట్టుబడిన 73 మంది మైనర్ పిల్లలు, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారికి వాహనాలు ఇవ్వకూడదన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ప్రమాదాలకు గురవుతూ ఇతరులను ప్రమాదాల బారిన పడేస్తున్నారని తెలిపారు. ఎవరైనా చెడు ప్రవర్తన కలిగి ఉంటే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి లేదా చట్టపరిధిలో అవగాహన కల్పిస్తూ మంచి మార్గం వైపు నడిచేలా కృషిచేయాన్నారు. నూతన వాహన చట్టంల ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఒక్కసారి పట్టుబడితే వారికి 25 ఏళ్ల వయసు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెనన్స్ ఇవ్వడం కుదరదన్నారు. అలాగే రూ.25 వేల జరిమానా విధిస్తారని, తల్లిదండ్రులు, వాహన యజమానులు జైలుపాలు అవుతారని గుర్తు చేశారు. వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు ఆంజనేయులు, బాలునాయక్, సాయిరాం, ఏడుకొండలు, ప్రవీణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ కె.నరసింహ -
మెడికల్ మాఫియాను నిర్మూలించాలి
సూర్యాపేట : జిల్లాలో మెడికల్ మాఫియాని వెంటనే నిర్మూలించి, డీఎంహెచ్ఓను విధుల నుంచి తొలగించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా శనివారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మెడికల్ మాఫియా వల్ల అసలు డాక్టర్లు ఎవరో నకిలీ డాక్టర్లు ఎవరో తెలియక ప్రజలు గందరగోళంలో పడుతున్నారన్నారు. డీఎంహెచ్ఓ కోటాచలం అవి నీతికి పాల్పడుతూ, అనర్హులు ఆసుపత్రులు పెట్టుకోవడానికి విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రాబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న వారిలో అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లతోపాటు కొత్త వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారికి లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి అమలులో వారి సేవలను వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 500 మందికి సర్వేయర్లుగా త్వరలోనే ప్రత్యేక శిక్షణ ప్రారంభించబోతోంది. 26 నుంచి శిక్షణ భూభారతి అమలులో భాగంగా రాష్ట్రంలో ఐదు వేల మందికి సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. అర్హులైన వారు ఈ నెల 17వ తేదీలోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. 60 శాతం మార్కులతో, గణితం సబ్జెక్టుగా కలిగిన ఇంటర్ పూర్తయినవారు, ఐటీఐ (డ్రాఫ్ట్‌మెన్ సివిల్), డిప్లొ మా, బీటెక్ సివిల్, తత్సమాన అర్హతలు కలిగిన పాత సర్వేయర్లతోపాటు, కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మే 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రెవెన్యూ పరిపాలనకు తోడుగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ ద్వారా ఈ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలోనే 200 మంది, సూర్యాపేట జిల్లాలో 150 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 150 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. మూడు దశల్లో శిక్షణ, పరీక్షలు సర్వేయర్లకు మూడు దశల్లో శిక్షణ ఇస్తారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, క్షేత్ర స్థాయి (ఫీల్డ్) విషయాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తరువాత 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తర్వాత జిల్లా స్థాయిలో వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. అది పాసైతే లైసెన్స్ కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన వారు సర్వే చేసేందుకు అర్హులు. వారు చేసే సర్వేకు అధికారిక గుర్తింపు ఉంటుంది. భూ భారతి చట్టం అమలులోనూ సర్వే పనుల కోసం వారి సేవలను పరిగణనలోకి తీసుకోనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చి న భూభారతి చట్టం అమలుకు అర్హులైన సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ప్రత్యే క శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌లు జారీ చేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 17లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అర్హత కలిగిన ప్రైవేట్ సర్వేయర్లకు లైసెన్స్‌లు ఫ మ్యాథ్స్‌తో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసినవారికి అవకాశం ఫ భూ భారతి చట్టం అమలులో భాగంగా వారికి ప్రత్యేక శిక్షణ ఫ ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 మందికి అవకాశం ఫ భూ సర్వేకు తొలగనున్న అడ్డంకులు తీరనున్న సర్వేయర్ల కొరత జిల్లాలో ఇక సర్వేయర్ల కొరత తీరనుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 33 మండలాల పరిధిలో 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా, 15 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద భూసేకరణ చేపట్టే పనులకు వారే సర్వే చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం అయ్యేంది. సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల సమయం పట్టేది. మరోవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా అనేక రకాల భూ సమస్యలు తలెత్తాయి. ఒకరి భూమి మరొకరికి పేరున పడటం, హద్దులు చెరిగిపోయాయి. దీంతో చాలా మంది సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వ్యవసాయ భూములు కూడా రియల్ ఎస్టేట్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నాలా కన్వర్షన్ కోసం అనేక దరఖాస్తులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో సర్వేయర్ల కొరత వల్ల సర్వేలో తీవ్ర జాప్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్హత కలిగిన వారికి శిక్షణ ఇచ్చి, లైసెన్స్ జారీ చేయడం ద్వారా సర్వేయర్లుగా గుర్తింపు ఇవ్వబోతోంది. దీంతో సర్వే సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. -
సంతోష్‌బాబు ఎంతో జాలి కలవాడు
సంతోష్‌బాబు 2016లో లెఫ్టినెంట్ కల్నల్‌గా, 2017లో కల్నల్‌గా పదోన్నతి పొందాడు. ఎక్కడ ఉన్నా రోజూ నాతో తప్పనిసరిగా మాట్లాడేవాడు. కొడుకుగా ఎంతటి పెద్దస్థానంలో ఉన్నా ఎప్పుడూ నాకు ఏదైనా పని చెప్తావా, నేనేమైనా సహాయం చేయాలా అమ్మ అని అడిగేవాడు. జాలి, దయ కలవాడు. 2020 జూన్ 14వ తేదీన మాకు మధ్యాహ్నం రెండు గంటలకు పిడుగులాంటి వార్త తెలిసింది. సంతోష్ ఇక లేడు అనే వార్తను టీవీలో చూస్తుండగానే వందల మంది మా ఇంటికి వచ్చారు. దేశం కోసం నా కొడుకు ప్రాణం అంకితం అయిందని గర్వపడ్డ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదలాడుతూనే ఉన్నాయి. -
నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు 12న నాగార్జునసాగర్, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాక మూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా.. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ
ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదం యాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు. యాదగిరీశుడి దర్శనం యాదగిరిగుట్ట : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు. ● అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. ● త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ● అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ● గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు. ● పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు. అరటి, మామిడి తోరణాలతో.. ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్‌కు రానున్నారు. ● మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు. ● అక్కడి నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు. ● విజయ విహార్ ఎదుట ఈవెంట్ మేనేజర్ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు. ● ఆ తర్వాత విజయ విహార్ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్ ఉంటుంది. ● అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాస్థూపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది. ● మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్ గైడ్ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. ● మహాస్తూపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్‌లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు. ● అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది. ● అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలను తీసుకురానున్నారు. భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్‌పోచంపల్లికి ఈనెల 15న మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ● మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. ● టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు. ● మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ● అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్లో స్నాక్ రిఫ్రెష్మెంట్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు. ● అక్కడ నుంచి హంపి థియేటర్‌కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్‌వాక్‌ను తిలకిస్తారు. ● తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్‌వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు. ● టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్‌లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ ఏడు, మిగతావి గద్వాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు. ● రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ వెళ్తారు. పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’బుద్ధుడి చెంతకు..హైదరాబాద్‌కు చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు -
అయోమయంలో డిగ్రీ విద్యార్థులు
కోదాడ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన 2, 4, 6 సెమిస్టర్ల వార్షిక పరీక్షలతో పాటు 1, 3, 5 బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 14నుంచి నిర్వహిస్తామని యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. దీంతో తమకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవరకు పరీక్షల నిర్వహణకు సహకరించబోమని సహాయనిరాకరణ కొనసాగిస్తామని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు దగ్గరపడుతుండగా ఇప్పటి వరకు డిగ్రీ వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడంతో ఫైనలియర్ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 64 కళాశాలలు.. 20 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ పరిఽధిలో మొత్తం 118 కళాశాలలుండగా విద్యార్థుల ఆదరణ లేక సగానికిపైగా కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న 64 డిగ్రీ కళాశాలల్లో మూడు సంవత్సరాలకు కలిపి సుమారు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఉన్న మూడు అటానమస్ కళాశాలల్లో పరీక్షలు పూర్తి కాగా ఎంజీయూ పరిధిలోని కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు గతంలోనే వాయిదా పడగా, వార్షిక పరీక్షలు మూడుసార్లు వాయిదా వేశారు. ఆరువేల మంది ఫైనలియర్ విద్యార్థులపై ప్రభావం ఎంజీయూ పరిధిలో డిగ్రీ ఫైనలీయర్ చదువుతున్న విద్యార్థలు 6 వేలమంది వరకు ఉన్నారు. వీరు డిగ్రీ పూర్తిచేసుకుని పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే డిగ్రీ పరీక్షలు పూర్తికాకపోవడంతో పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ కాలేని పరిస్థితి. దీంతో తాము విద్యా సంవత్సరం నష్టపోతామని ఫైనలియర్ విద్యార్థులు అంటున్నారు. ప్లాన్–బీ రెడీ చేస్తున్నారా..? డిగ్రీ పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించకపోతే వర్సిటీ అధికారులు ప్లాన్–బీ రెడీ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరీక్షలు మళ్లీ వాయిదా వేస్తే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రానుందని, అవసరమైతే ప్లాన్–బీని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.దోస్త్‌కు దూరంగా కళాశాలలు.. నాలుగేళ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న డిగ్రీ కళాశాలలు ఈ విద్యాసంవత్సరం(2025–26)లో ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకోవడానికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన దోస్త్‌కు దూరంగా ఉంటున్నాయి. దాదాపు 20 కళాశాలలు ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకోవడం లేదని సమాచారం. భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు, అధ్యాపకుల వేతనాలు ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నందున మూసివేతకే వీరు మొగ్గుచూపుతున్నారు. ఫ పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఎంజీ యూనివర్సిటీ ఫ సహకరించేది లేదంటున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫ దగ్గర పడుతున్న పీజీ ప్రవేశ పరీక్షలుసహాయ నిరాకరణ కొనసాగిస్తాం.. నాలుగేళ్లుగా డిగ్రీ కళాశాలలకు సుమారు రూ.120 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. అప్పటి వరకు పరీక్షల విషయంలో మా సహాయ నిరాకరణ కొనసాగిస్తాం. – మారం నాగేందర్‌రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం సంఘం జిల్లా అధ్యక్షుడు సమస్య పరిష్కారం అవుతుంది విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా పరీక్షల నిర్వహణకు సహకరించాలని ప్రైవేట్ యాజమాన్యాలను కోరుతున్నాం. సోమవారం వరకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. పరీక్షలు నిర్వహణకు రెడీగా ఉన్నాం. విద్యార్థులు కూడా పరీక్షలకు సిద్ధం కావాలి. – ఉపేందర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎంజీయూ -
నాయబ్ తహసీల్దార్, గిర్ధావర్ సస్పెన్షన్
ఫ సీనియర్ అసిస్టెంట్, తహసీల్దార్‌పై చర్యలకు సిఫారసు భానుపురి (సూర్యాపేట) : వివాదంలో ఉన్న భూమిని పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ శివారులోని 75 సర్వే నంబర్లో నిమ్మల భారతమ్మకు చెందిన 5 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఈ భూమిని ఇతరులకు అక్రమంగా పట్టా చేసేందుకు డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఏప్రిల్ 24న రెవెన్యూ లీలలు శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ విచారణకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాంబాబు విచారణలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు తప్పు చేసినట్లు రుజువు అయినట్లు కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో అక్రమంగా పట్టా చేసిన అప్పటి నాయబ్ తహసీల్దార్ (డీటీ) హరిచంద్రప్రసాద్, ఆర్ఐ రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం కలెక్టర్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఇంద్రకుమార్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లినందున అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా సీసీఎల్ఏకు సిఫారసు చేశారు. ఇక అప్పటి తహసీల్దారు వినోద్కుమార్పైనా శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు చార్జ్‌మెమో జారీ చేస్తూ సీసీఎల్ఏకు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా మొదటి అదనపు కోర్టు పీపీకి సన్మానంచివ్వెంల(సూర్యాపేట): ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్య కేసులో బాధితుల తరఫున వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన జిల్లా మొదటి అదనపు కోర్టు పీపీ నాతి సవీందర్ కుమార్‌ను శుక్రవారం ఎస్సీ నరసింహ సూర్యాపేటలోని తన కార్యాలయంలో సన్మానించారు. కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్ పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవుసూర్యాపేటటౌన్: వైద్య చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేసే వైద్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ ఎం.రాజీవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య విప్లవం–ప్రైవేట్ వైద్యరంగ ప్రక్షాళన అనే అంశంపై వైద్యులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజారోగ్యం మెరుగునకు చేపట్టిన ఈ కార్యక్రమానికి వైద్యులు తమ సంపూర్ణ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో ఐఎంఏ సూర్యాపేట ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఎల్.రమేష్, వైద్యులు పాల్గొన్నారు. -
మట్టపల్లి ఆలయం ముస్తాబు
మఠంపల్లి: ఈనెల 7 నుంచి 10 వరకు జరిగే అధ్యయనోత్సవాలకు మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ఈనెల 10 నుంచి 15వరకు తిరుకల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు చైన్నె తదితర నగరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ● 7నుంచి 10వరకు తొలక్కం, అధ్యయనోత్సవం, పరమపద ఉత్సవం, శాత్తుమరై పూర్తిచేసి అదేరోజు రాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ● 11న విశ్వక్సేనారాధన, అఖండదీపారాధన, అంకురారోపణ, ధ్వజారోహణం, లక్షమల్లికా సహస్రనామార్చన, లక్షమల్లికా పుష్పపూజ, అర్థరాత్రి ఎదుర్కోళ్లు ఉత్సవంతో శ్రీస్వామి అమ్మవార్లను అశ్వ, గజ, సింహ, గరుడ తదితర వాహనాలపై మంగళవాయిద్యాలతో భక్తుల జయజయఽ ధ్వానా ల నడుమ కల్యాణ మండపానికి చేరుస్తారు. ● 12న తెల్లవారు జామువరకు శ్రీస్వామివారి కల్యాణం నిండుపున్నమి వెన్నెల రాత్రిలో శోభాయమానంగా నిర్వహిస్తారు. అనంతరం గరుడవాహనసేవ , శ్రీస్వామివారి రథోత్సవం, హరికథలు, బుర్రకథలు ఏర్పాటు చేశారు. ● 13న శ్రీసూక్త సహిత మహాలక్ష్మియాగం, సాయంత్రం శ్రీస్వామి వారు కృష్ణానదిలో హంసవాహనంపై నావావిహారం చేస్తారు. ● 14న చక్రతీర్థం, వసంతసేవ, దోపుఉత్సవం చేపడతారు. ● 15న శృంగార డోలోత్సవం, పవళింపు సేవతో తిరుకల్యానోత్సవాలు ముగుస్తాయి. అన్నదాన ఏర్పాట్లుఉత్సవాలకు వచ్చేభక్తులకు సుమారు 22కులాల అన్నదాన సత్రాలతో పాటు దేవస్థానం వారుకూడా భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు. ఎండతీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పాలకవర్గం తెలిపింది. కృష్ణానదిలో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఆర్టీసీ ఆంధ్రాప్రాంతంలోని దాచేపల్లినుంచి, తెలంగాణ ప్రాంతంలోని హుజూర్నగర్ నుంచి అదనపు బస్సులు నడుపనుంది. 11 నుంచి వాహనసేవలుఈనెల 11న రాత్రి కల్యాణమూర్తి అలంకారంలో గజ, సింహ, శేషవాహనములు, 12న ఉదయం గరుడవాహనంపై శ్రీమన్నారాయణమూర్తి అలంకారం, సాయంత్రం శ్రీరాజమన్నార్ అలంకారంలో రథోత్సవం, 13న సాయంత్రం హంసవాహనంపై శ్రీరంగసాయి అలంకారం, 14నఅశ్వవాహనంపై శ్రీజయమన్నార్ అలంకారం, 15న పవళింపుసేవ నిర్వహించనున్నారు.నేటి నుంచి 10 వరకు అధ్యయనోత్సవాలు 11న అర్ధరాత్రి స్వామివారి తిరుకల్యాణం భారీగా తరలిరానున్న భక్తులుకల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి మట్టపల్లి దేవాలయంలో జరగనున్న తిరుకల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వివిధ కులాల అన్నదాన సత్రాలు భక్తులకు భోజన వసతులు కల్పించనున్నాయి. లడ్డూ,పులిహోర ప్రసాదాలు సిద్ధం చేస్తున్నాం – చెన్నూరు విజయ్‌కుమార్, అనువంశిక చైర్మన్,మట్టపల్లి దేవాలయం -
ఎగుమతికి లారీలేవీ?
తూకం వేసిన ధాన్యం బస్తాలు కల్లాల్లోనే..●● లారీల కొరతతో కొన్నిచోట్ల కాంటాలు కూడా వేయడం లేదు ● ధాన్యం ఎగుమతి అయినా.. మిల్లుల వద్ద కూడా కొర్రీలు ● ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు సవాలక్ష కష్టాలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తగా మారింది. అధికారుల అజమాయిషీ లేకధాన్యం కల్లాలకు తెచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా తూకం వేయక, వేసినా కూడా లారీలు రాక రోజుల తరబడి ఆ కల్లాల వద్దే పడిగాపులు కాయాల్సిన వస్తోంది. కొన్ని చోట్ల లారీ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రైతులే వాహనాలను పెట్టుకొని ధాన్యం తరలించాల్సి వస్తోంది. ఆ తరువాత ట్రక్ షీట్ ఆలస్యంగా రావడం, చివరకు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు రావడం కూడా 20 రోజులపైనే పడుతోంది. కొర్రీలు పెట్టి కోత విధిస్తున్నారుకల్లాల్లో తూకం వేసేప్పుడు బస్తాకు కిలో అధికంగా తూకం వేస్తుండగా, తూకం వేసిన ధాన్యం మిల్ల రు వద్దకు తీసుకెళ్లాక, ధాన్యం బాగలేదంటూ దిగుమతి చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. దీంతో సంబంధిత కొనుగోలు కేంద్రానికి మిల్లర్లు ఫలానా రైతు ధాన్యం బాగలేదని చెప్పడం, దీంతో నిర్వాహకులు నీ ధాన్యం బాగలేదంట.. బస్తాకు 2 కిలోలు మిల్లర్లు కోత వేస్తారట.. లేదంటే నీ ఇష్టం అని చెబుతుండటంతో రైతులు అంగీకరించక తప్పడంలేదు. ఇలా 40 కిలోల బస్తాకే 3 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటేనే ట్రక్ షీట్ రైతుకు అందుతోంది. అప్పుడే ఆ ట్రక్ షీట్ ఆధారంగా రైతు ఎంత విక్రయించారన్న వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లేదంటే ధాన్యం వెనక్కి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారు. మిల్లర్లు ఆడిందే ఆట...మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. అసలే కాంట్రాక్టర్లు కొద్దిపాటి లారీలను ధాన్యం రవాణాకు పంపిస్తున్నారు. అయితే ధాన్యం దిగుమతి చేసుకోలేమంటూ నల్లగొండ చుట్టుపక్కల ఉన్న మిల్లర్లు రెండు మూడు రోజులు కొర్రీలు పెట్టడంతో నల్లగొండ ధాన్యాన్ని మిర్యాలగూడ, దేవరకొండ మిల్లులకు తరలించినట్లు సమాచారం. అంటే ఇటు ట్రాన్స్‌పోర్టు చార్జీలు ప్రభుత్వంపై అదనంగా పడుతున్నాయి. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో మిల్లర్లు చెప్పిందే వినాల్సివస్తోంది. ఆత్మకూర్.ఎస్ మండలంలో లారీల కొరత తీవ్రంగా ఉంది. కాంటాలు వేసినా లారీలు సకాలంలో రాకపోవడంతో బస్తాలు అలాగే ఉంటున్నాయి. రోజుకు రెండు మూడు లారీలు రావాల్సి ఉండగా మూడు రోజులకు ఒక లారీ మాత్రమే వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నాం నేరేడుచర్లలోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం కాంటాలు వేసినా లారీలు రావడం లేదు. దీంతో సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుంటే బిల్లులను చెల్లిస్తామని అధికారులు చెప్పారు. దీంతో సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. – ధానావత్ చాంప్లా, పుల్గంబండతండా, నేరేడుచర్ల లారీలు సమయానికి రావడం లేదుదాదాపు 60 క్వింటాల ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు అవుతుంది. వారానికి రెండు లారీలు కూడా వెళ్లడం లేదు. దీంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయి. రోజు రెండు నుండి మూడు లారీలు వస్తే కాంటాలు త్వరగా అవుతాయి. – గుద్దేటి జాన్‌రెడ్డి, ఆత్మకూరు.ఎస్ -
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం
భానుపురి (సూర్యాపేట) : ఆరోగ్యం విషయంలో ఆడపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట డివిజన్లోని నాలుగు మండలాల్లో 306 మంది లబ్ధిదారులకు రూ.3.06 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆహారంలో అన్ని పోషకాలు లేకపోవడం వల్ల వివిధ వ్యాధుల బారినపడుతున్నారన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వం లక్ష రూపాయలను కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందజేస్తుందన్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ పేద ఆడపిల్ల పెళ్లికి రూ.1,00,116 అందించడం ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఒక్క తెలంగాణలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి, లాలు, హరికిశోర్శర్మ, కృష్ణయ్య పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సీఎం వ్యాఖ్యలు ఆక్షేపనీయం
సూర్యాపేటటౌన్ : ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపనీయమని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీపీఎఫ్కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు పాలకులకు అధికారాన్ని అప్పగించారని అన్నారు. ప్రజలందరి బాగోగుల కోసమే ఉద్యోగులు పనిచేస్తారని చెప్పారు.ప్రజల్లో భాగమే ఉద్యోగులు అన్న విషయాన్ని సీఎం గుర్తించుకోవాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు బోనస్ కోసం ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు బండారు శ్రీనివాస్, శిరగాని యాకయ్య, సుధాకర్‌రెడ్డి, పోతురాజు నర్సయ్య, దీకొండ మహేష్, జిల్లా జానయ్య, ఎస్.కె.సుభాని, మల్లయ్య, తూము శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. కొలతల ప్రకారమే ఉపాధి కూలీలకు వేతనాలుమోతె: ఉపాధిహామీ పథకం కూలీలకు కొలతల ప్రకారమే వేతనాలు అందుతాయని డీఆర్డీఓ అప్పారావు తెలిపారు. మంగళవారం మోతె మండల పరిధిలోని హుస్సేన్‌బాద్ గ్రామంలో ఉపాధి పనులను తనిఖీ చేశారు. మట్టి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. కూలీలందరూ ఉదయం 7 గంటలకు పనులకు హాజరవుతున్నారా? రోజుకు ఎంత కూలి వస్తుందని అడిగారు.రోజూ 150 మాత్రమే కూలి వస్తుందని కూలీలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.307 వేతనం అందుతుందన్నారు. పని ప్రదేశంలో కూలీలకు నీరు,నీడ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూలీల మస్టర్లలో హాజరు తీసుకున్నారు. గ్రామంలో నర్సరీని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నాగేష్, పంచాయతీ కార్యదర్శి, ఈసీ శ్రీహరి, ఫీల్డ్అసిస్టెంట్ గజ్జి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సమస్యల పరిష్కారమే సీపీఐ ఎజెండా
చిలుకూరు: పేద ప్రజల సమస్యల పరిష్కారమే సీపీఐ ఎజెండా అని మాజీ ఎమ్మెల్యే , సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే పాలకులు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఉపాధిహామీ పథకానికి, వ్యవసాయ, కార్మిక రంగాలకు కేంద్రం బడ్జెట్ లో నిధులు తగ్గించడం వల్ల దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో పాలకులు ఆలోచన చేయాలన్నారు. పార్టీనాయకులు ప్రజల పక్షాన బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభకు ముందు పార్టీ జెండాను పల్లా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల మహాసభలో 250 మంది ప్రతినిధులు పాల్గొనగా, 35 మంది కౌన్సిల్ సభ్యులను, మండల కార్యవర్గ సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సభలో సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నారాయణరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, యల్లావుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, బూర వెంకటేశ్వర్లు, కొండా కోటయ్య, చేపూరి కొండలు, దొడ్డా వెంకటయ్య, సాహెబ్ అలీ, కాంపాంటి వెంకటయ్య, రెమిడాల రాజు, చిలువేరు అంజనేయులు, పొరడ్ల మట్టయ్య, జయసుధ, తాళ్లూరి వెంకటయ్య, కీసర వెంకటేశ్వర్లు, కందుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నాలా నిండా వ్యర్థాలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్ఓతాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పలు వీధుల్లో రోజూ చెత్త తొలగించకపోవడం.. డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా వారంతా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెత్త సేకరణకు పరిమితమయ్యారు. దీంతో మిగతా చోట్లలో డ్రెయినేజీల్లో చెత్త, మురుగు పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెయినేజీలు పూడిపోతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిస్తున్నాయి. దీంతో దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నామని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ తొలగించకపోవడంతో..సూర్యాపేట పట్టణంలోని 28 వార్డులో తాళ్లగడ్డ ఫైర్ స్టేషన్ ఎదురుగా జెజెనగర్లో, రాజారాం కాలేజ్ రోడ్, చర్చి కాంపౌండ్ వెనుక భాగం, గోపాలపురం, 60 ఫీట్ల రోడ్ నాలా, నల్లాలబావి, డీమార్ట్ దగ్గర నాలాలు, పట్టణంలోని పలు వీధుల్లో డ్రెయినేజీలు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. రోజూ ఇంట్లో, వీధిలోని వ్యర్థాలు ఊడ్చి కుప్పచేసినా పారిశుద్ధ్య కార్మికులు ఎత్తకుండా వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో వాడుకునే నీరు, వ్యర్థఆహార పదార్థాలు పైపులైన్ల ద్వారా డ్రెయినేజీల్లోకి చేరుతున్నా వాటిని తొలగించడం లేదు. దుర్వాసనను తట్టుకోలేక కాలువలపై బండలు, అట్టాలు, బస్తాలు కప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పది. అలాగే చర్చి కాంపౌండ్ వెనుక ప్రాంతంలో ఖాళీ స్థలాలు చెత్త డంపు కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీలు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోయి అధ్వానంగా మారారయి. 60 ఫీట్ల రోడ్డు, నల్లాలబావి ప్రాంతాల్లో ప్రధాన నాలాలకు వచ్చే కాలువల్లో పూడిక తీయక కొన్నిచోట్ల మట్టితో నిండి గడ్డి మొలకెత్తడం పారిశుద్ధ్యకార్మికుల, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫలితంగా దోమలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అంటున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్ శానిటనీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ను వివరణ కోరగా కార్మికులను పంపించి మురుగు కాలువలను శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఖాళీ స్థలాల్లోని వ్యర్థాలను తొలగించాలి చర్చి కాంపౌండ్ ప్రాంతంలో డ్రెయినేజీలు మురుగు, చెత్తతో నిండి ఉన్నాయి. కాలువలు పూడి నీరుపారక దుర్వాసన వస్తోంది. ఖాళీ స్థలాల్లో వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలలో దోమలు వృద్ధి చెంది రాత్రిళ్లూ ఇబ్బంది పడుతున్నాం. అధికారులు చొరవ చూపి కాలువల్లో పూడిక తీయించాలి. – గుడుపురి సత్యం, చర్చి కాంపౌండ్ సూర్యాపేట పట్టణంలో మురుగుతో నిండుతున్న డ్రెయినేజీలు డంపింగ్ యార్డులుగా పలు వీధులు కొన్నిచోట్లనే చెత్త తొలగింపు అధికారుల పర్యవేక్షణ కరువు దుర్వాసనతో ప్రజల ఇబ్బందులుమున్సిపల్ కార్మికుల వివరాలు ఔట్సోర్సింగ్ 313కాంట్రాక్టు 110 పర్మినెంట్ 48 మొత్తం 471ప్రధాన నాలాలను శుభ్రం చేయాలి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మురుగు నీరు ప్రధాన నాలాల్లోకి వస్తోంది. దీంతో నాలాల్లోకి చెత్త చేరుతోంది. నాలాల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధభరితంగా మారుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు నాలాల నుంచి షీల్ట్ తీయించి శుభ్రం చేయించాలి. – కిరణ్ కుమార్, తాళ్లగడ్డ -
రూ. 38 కోట్లు
ఎల్ఆర్ఎస్ రాబడి● 25శాతం రాయితీతో ఐదు మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం ● 3వ తేదీతో ముగిసిన స్థలాల క్రమబద్ధీకరణ గడువు ● అత్యధికంగా సూర్యాపేటకు రూ.21.07 కోట్లు.. అత్యల్పంగా తిరుమలగిరికి రూ.1.28కోట్లు..హుజూర్నగర్ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. 25శాతం రాయితీతో ఫీజు చెల్లించి నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్దేశిత గడువు ముగిసేనాటికి రూ.38.39 కోట్ల ఆదాయం సమకూరింది. ఫీజు చెల్లించినవారు 12,654 మందిజిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,476 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 59,135 దరఖాస్తులు ఫీజు చెల్లించేందుకు అర్హత పొందాయి. 12,654మంది అర్జీదారులు ఫీజులు చెల్లించారు. దీంతో మున్సిపల్‌శాఖకు రూ. 38.39 కోట్ల ఆదాయం సమకూరింది. 3వ తేదీతో ముగిసిన గడువుఎల్ఆర్ఎస్కింద 2020లో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి తోడు దరఖాస్తుదారుల ప్రయోజనం కోసం ఫిబ్రవరి 19 నుంచి వన్‌టైం సెటిల్మెంట్చేసిన వారికి 25శాతం ఫీజు రాయితీసైతం ప్రకటించింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదు. ఫీజు చెల్లించేందుకు గడువు తక్కువగా ఉండడంతో మరో మారు ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఆశించిన స్థాయిలో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు గడువు పొడిగించగా అది కూడా ముగిసింది.సూర్యాపేట మున్సిపాలిటీ టాప్జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయల్లో సూర్యాపేట టాప్‌లో నిలిచింది. సూర్యాపేట మున్సిపాలిటీకి అత్యధికంగా రూ. 21.07 కోట్లు రాగా తిరుమలగిరికి అత్యల్పంగా రూ.1.28కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం(రూ.కోట్లలో)ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ వివరాలుమున్సిపాలిటీ దరఖాస్తులు అర్హత ఉన్నవి ఫీజు చెల్లించినవి సూర్యాపేట 35,632 31,939 6,710 21.07కోదాడ 16,227 14,780 3659 12.07హుజూర్నగర్ 4,424 3,474 826 2.43తిరుమలగిరి 6,036 5,852 7661.28నేరేడుచర్ల 3,157 3,090 693 1.54మళ్లీ గడువు పొడిగిస్తే తెలియజేస్తాం ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం పొడిగించిన గడువు ముగిసింది. ఇప్పటికే గడువు పొడిగించడం వల్ల పలువురు దరఖాస్తుదారులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. గడువును మరొక సారి పెంచాలని కొందరు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై ఆలోచన చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం గడువును పెంచిన వెంటనే తెలిజేస్తాం. – కె. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్ -
సాగర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ
నాగార్జునసాగర్: హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పలువురు సుందరీమణులు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని ఈ నెల 12న నాగార్జునసాగర్‌కు రానున్నారు. సాగర్‌లోని బుద్ధవనం, విజయ విహార్ అతిథిగృహం ప్రాంతాల్లో వారు పర్యటించనున్న నేపథ్యంలో ఆ ప్రదేశాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక సోమవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై బుద్ధవనంలోని మహాస్థూపం అంతర్భాగంలో గల సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ.. భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశఽంలో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, హాలియా సీఐ జనార్దన్‌గౌడ్, హాలియా, సాగర్ సర్కిళ్ల పరిధిలోని ఎస్ఐలు సంపత్‌గౌడ్, వీరశేఖర్, వీరబాబు, సతీష్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.10 కోట్ల విలువ చేసే గంజాయి దహనం
భువనగిరి: రైళ్లలో తరలిస్తుండగా పట్టుకున్న గంజాయిని సికింద్రాబాద్ రైల్వే డ్రగ్ డిస్పోజల్ కమిటి చైర్మన్ చందనాదీప్తి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా పరిశ్రమలో దహనం చేశారు. పరిశ్రమ వద్ద చందనాదీప్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 2024 నుంచి 2025 మే 5 వరకు రైళ్లలో తనిఖీలు నిర్వహించి 2010 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం 74 కేసులను నమోదు చేసి పట్టుకున్న గంజాయి విలువ రూ. 10,05,06,750 ఉందన్నారు. సికింద్రాబాద్ అర్బన్, రూరల్, కాజీపేట డివిజన్ పరిధిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా కంపెనీలో కాల్చివేసినట్లు చెప్పారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు రైల్వే స్టేషనన్లతో పాటు రైళ్లలో పటిష్ట నిఘా పెడుతున్నట్లు చందనాదీప్తి చెప్పారు. విలేకరుల సమావేశంలో నోడల్ అధికారి ఎన్.జావేద్, కాజీపేట రైల్వే డీఎస్పీ కృపాకర్, సికింద్రాబాద్ రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటామని ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.● ప్రజావాణిలో బాధితులకు ఎస్పీ భ రోసా -
లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10నుంచి 15వరకు జరిగే తిరుకల్యాణోత్సవాలకు ఎలాంటిలోటుపాట్లు లే కుండా ఏర్పాట్లు చేయాలని హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఆదేశించారు. మట్టపల్లి ఆలయంలో తిరుకల్యాణోత్సవ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్, తలంబ్రాల మండపం, వివిధ కులవృత్తుల అన్నదాన సత్రాలు, స్నానఘాట్లను పరిశీలించారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు జయప్రదమయ్యేలా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈకార్యక్రమలో హుజూర్నగర్ సీఐ గజ్జె చరమందరాజు, మఠంపల్లి ఎస్ఐ పి.బాబు, ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ సిరికొండ నవీన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెడ్డి అన్నదాన సత్రంలో 10వేల మందికి భోజన ఏర్పాట్లుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలోని రెడ్డి నిత్యఅన్నదాన సత్రంలో ఈనెల 10నుంచి 15 వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలకు తరలివచ్చే సుమారు 10వేల మంది భక్తులకు సరిపడా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్రం కమిటీ అధ్యక్షుడు సాముల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక సత్రంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. సత్రంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఈనెల 10న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సత్రం కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకా చౌదరిరెడ్డి, జనరల్ సెక్రటరీ చిట్టెంరెడ్డి నాగిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వి.శంభిరెడ్డి, ఎస్. క్రిష్ణారెడ్డి, చిన్నపురెడ్డి, జి.క్రిష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. శివుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ,గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణంముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు పూజలు గావించారు. -
పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి తక్షణమే దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనుమతి పత్రాలు లేకుండా, గడువు ముగిసిన వీసాలతో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించాలన్నారు. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు దేశంలో నరమేధం సృష్టించి శాంతియుతంగా ఉంటున్న దేశంలో అల్లర్లు జరిగేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, మాజీ ఉపాధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, వెంకటరెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం.డీ. ఆబిద్, రంగరాజు రుక్మారావు, బూర మల్సూర్, రంగినేని లక్ష్మణరావు, బండపల్లి శ్రీనివాస్, పేరాల లక్ష్మణ రావు, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
గరిడేపల్లి: భూ సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం, తాళ్లమల్కాపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గరిడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపి నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామసభలు నిర్వహించిన సమయంలో రైతులు పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. రైతులు దరఖాస్తులు నింపే విషయంలో ఇబ్బందులు లేకుండా గ్రామసభలు నిర్వహించే చోట సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో సమస్యల పరిష్కారానికి ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సివచ్చేదన్నారు. ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నామని తెలిపారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారని తద్వారా వారికి ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే గ్రామాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ సదస్సు ద్వారా రాయినిగూడెంలో 140 దరఖాస్తులు, తాళ్లమల్కాపురంలో 73దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్, కోదాడ ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఏఓ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్ బండ కవిత, నడిగూడెం, కోదాడ, తహసీల్దార్లు సరిత, వాజిద్‌అలీ, ఆర్ఐలు ప్రవీణ్, రాంబాబు, దబ్రేజ్తో పాటు రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలిభానుపురి (సూర్యాపేట) : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరెట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగు నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లా వెబ్ పోర్టల్‌లో శాఖల వారీగా ప్రొఫైల్, జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్, వార్షిక నివేదిక, శాఖల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారులు వివరాలు అప్డేట్ చేయాలన్నారు. రాష్ట్ర , జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై అర్జీదారులకు కచ్చితమైన సమాధానం తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వివి అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూ ఓ నరసింహారావు, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమశాఖల అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పరిపాలన ధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్, శ్రీనివాస రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఊరూరా నిఘా కమిటీలు
చిలుకూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం ఊరూరా నిఘా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల నిబంధనలు ఉల్లంఘింస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది పని దినాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. మార్గ దర్శకాలకు అనుగుణంగా పనులు చేయలని నిర్ణయించింది. పేరుకే సామాజిక తనిఖీలుజిల్లాలో 23 మండలాల్లో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 63 వేల జాబ్‌కార్డులు ఉండగా వీటిలో 5,70,275 మంది కూలీలు ఉన్నారు. 3,34,539 మంది కూలీలు ఉపాధిహామీ పని చేస్తున్నారు. ఏటా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి పలు అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం నామ మాత్రపు రికవరీతో సరి పెడుతున్నారు. సమస్యను గుర్తించిన కేంద్రం ప్రభుత్వం పనుల్లో మార్గ దర్శకాలు పాటించడం లేదంటూ పని దినాల్లో కోత విధించడం మొదలు పెట్టింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో ఐదుగురితో కూడిన నిఘా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిఘా కమిటీలు రాష్ట్ర సాయికి పరిమితం కావడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ సిబ్బందే కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరు స్థానికులు కాకుండా వేరే గ్రామానికి చెందిన వారిని నియమించనున్నారు. ఉపాధిహామీ పనుల్లో అవినీతి అడ్డుకట్టకు చర్యలు ఐదుగురు సభ్యులతో కమిటీ వారానికోసారి పనుల పరిశీలన ప్రభుత్వ ఉత్తర్వులు జారీనిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఉపాధి పనులను కమిటీ వారానికోసారి పరిశీలించి పనుల మంజూరు, పనులు జరుగుతున్న తీరు, కూలీల హాజరు, డబ్బుల చెల్లింపులు తదితర వివరాలను గుర్తించి మండల పరిషత్ అధికారులకు అందజేస్తుంది. మండలాధికారులు కలెక్టర్‌కు నివేదిస్తారు. ఇక నుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించాలని పనుల వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తనిఖీల్లో వెల్లడైన రికవరీ నిధులను తాత్సారం చేయకుండా రాబట్టాలని కొత్త ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
యాదగిరిగుట్ట కారిడార్ అభివృద్ధి చేయండి
సాక్షి,యాదాద్రి: భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీని ఎంపీ చామల కలిసి వినతి పత్రం అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయ పరిసర కారిడార్‌లో రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు. ప్రాచీన దేవాలయాలు, వారసత్వ గ్రామాల మధ్య సరైన రహదారి కనెక్టివిటీ లేకపోవడం వల్ల భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, కొలనుపాక, కీసరగుట్ట, పెంబర్తి ప్రాంతాల మధ్య కనెక్టివిటీ రోడ్లు విస్తరించాలని కోరారు. అలాగే ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నంబర్ 8 నుంచి కీసర జంక్షన్– యాదగిరిగుట్ట–కొలనుపాక–పెంబర్తి మధ్యన రోడ్డు అభివృద్ధి చేస్తే యాదగిరిగుట్ట ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. వరంగల్, కరీంనగర్ హైవేలపై ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కూడా ఈ దారి ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుందన్నారు. ఆలేరు నుంచి బచ్చన్నపేట వరకు లింక్ రోడ్డు నిర్మాణం ద్వారా జాతీయరహదారి 163–365బీ మధ్యన అనుసంధానం కలుగుతుందన్నారు. దీనివల్ల కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్–యాదగిరిగుట్ట రహదారిలో ఇప్పటికే ఆమోదించిన బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట్ మరియు లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతాల్లో రెండు ఎలివేటెడ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌లు మంజూరు చేయాలన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
మామిడి కోతలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఇథిలిన్‌తో మాగబెట్టాలిమామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగబెడతారు. దీని వలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్భైడ్‌తో మాగబెట్టడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్‌తో మామిడిని మాగించడం అన్ని విధాలా మంచిది. ఇథిలిన్ అనేది గ్రోత్ హార్మోనన్్.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్ ఇథిలిన్ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14 గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. పెద్దవూర: ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్నాయి. కోతలు కూడా మొదలవుతున్నాయి. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మామిడి కాయలు కోసే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా అపార నష్టం వాటిల్లే అవకాశం ఉందని పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి మురళి చెబుతున్నారు. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటుగా ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్, ప్యాకింగ్‌లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం వలన ఈ నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఉదయం పది గంటలోపే కోయాలి మామిడి తోటల్లో కాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. శ్వేద గ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చ రంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్ మీటర్ ద్వారా బ్రిక్స్ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. లోపల కండ లేత పసుపు రంగులో ఉండాలి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళ ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6 నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చ గాని, దెబ్బ గాని తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టి నేలపై ఉంచకూడదు. శుభ్రపర్చడం చాలా అవసరం మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం. 10 గ్రాముల డిటర్జంట్‌ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కాయలను కడగాలి. తర్వాత 52 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధి చేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాంకిగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటల లోపే ప్యాక్హౌజ్కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను తిరిగి మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. పురుగు మందులను పిచికారీ చేయరాదు నిషేధించిన పురుగు మందులను కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రీయ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తర్వాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పెద్దవూర మండల ఉద్యానవన శాఖ అధికారి మురళి సూచనలు -
నంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద, నంబర్ ప్లేట్ లేని, మైనర్ డ్రైవింగ్, సరైన పత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వ్యక్తులను పట్టుకుని వారిపై కూడా ెకేసులు నమోదు చేశారు. అనంతరం డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులను నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు ఎన్ సందీప్‌రెడ్డి, వి. శంకర్, జె. సైదులు, ఏఎస్ఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనయ్య పాల్గొన్నారు. చిట్యాలలో..చిట్యాల: నంబర్ ప్లేట్లు లేని, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపినట్లయితే వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని నార్కట్‌పల్లి సీఐ నాగరాజు హెచ్చరించారు. చిట్యాలలో సోమవారం ఎస్ఐ ఎన్. ధర్మాతో కలిసి నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణగిరి క్షేత్రంలో తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామికి సోమవారం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహాస్రనామార్చన నిర్వహించారు. అనంతరం పద్మావతి, గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామికి నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నదానం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అదుపుతప్పి ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలురామన్నపేట: అదుపుతప్పి ఆటో బోల్తా పడడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌కు చెందిన రెండు కుటుంబాల వారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో బొడ్రాయి పండుగకు వెళ్లారు. సోమవారం ఆటోలో రామాంతాపూర్‌కు తిరుగు పయనమయ్యారు. ఆటో రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులోని కోళ్లఫాంల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బి. జ్యోతి, వైష్ణవి, కె. గంగమ్మ, వెంకటేష్, కొండయ్యతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు లభ్యంకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యమైనట్లు ఎస్ఐ రామ్మూర్తి సోమవారం తెలిపారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ముడుసు కార్తీక్(28)గా గుర్తించామన్నారు. అతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆదివారం తన స్నేహితులతో కలిసి కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని రైస్ మిల్లుల వద్ద బంధువుల పెళ్లికి వచ్చి మధ్యాహ్న సమయంలో ఈత కొట్టడానికి చింతకుంట్ల గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో దిగగా.. ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి తల్లి, తమ్ముడు ఉన్నట్లు సమాచారం. వడదెబ్బతో వృద్ధుడు మృతిచండూరు: ఎండల తీవ్రతకు చండూరు మున్సిపాలిటీకి చెందిన దోటి నరసింహ(80) వడదెబ్బకు గురై సోమవారం సాయంత్రం మృతిచెందాడు. సీపీఐ నాయకులు నరసింహ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ ఎదుట కార్మికుల ధర్నా
మోటకొండూర్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ గేటు ఎదుట సోమవారం ఉదయం అందులో పనిచేసే కార్మికులు ధర్నా చేపట్టారు. ఇటీవల కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందగా.. తమ ప్రాణాలకు భరోసా కల్పించాలని, కనీస వేతనం రూ.30వేలు ఇవ్వాలని, రోజుకు 8 గంటలే పని ఉండేలా చూడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. డ్యూటీలో ఇద్దరు కార్మికులను, ఒక డాక్టర్ ఎల్లప్పుడూ కంపెనీలో అందుబాటులో ఉంచాలన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించి కంపెనీ నుంచే ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేసుకోవాలన్నారు. మెరుగైన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పనిలో చేరి వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని, కార్మికుల కోసం భోజనం హాల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ వచ్చి వీలైనంత త్వరగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరిస్తేనే విధులకు హాజరవుతామని, అప్పటి వరకు కంపెనీకి రాలేమని కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ధర్నాలో కార్మికులు జి. నాగిరెడ్డి, వాకిటి నవీన్‌రెడ్డి, కాదూరి ఎలేందర్, బాల్ద సిద్దులు, నాగార్జున, ప్రవీణ్, చందు, నాగరాజు తదితరులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే విధులకు హాజరవుతామని తెలిపిన కార్మికులు -
లారీల కొరత లేకుండా చూస్తాం
తిరుమలగిరి (తుంగతుర్తి): కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని మిల్లులకు పంపిన 24 గంటల లోపు ట్రక్ షీట్లు తెచ్చి ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం లోపు తేమ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ బి. రాంబాబు, తహసీల్దార్ హరిప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే జాన్‌మహ్మద్ ఉన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ -
డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జహంగీర్ అలీ
ఖమ్మం సహకారనగర్ : తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ జహంగీర్ అలీ ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ హిలావత్ అంజియా వ్యవహరించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఎండీ. జహంగీర్ అలీ, సంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్‌గౌడ్, ఖమ్మం నుంచి కె. వెంకటేశ్వర్లు అధ్యక్ష స్థానానికి నామినేషనన్లు దాఖలు చేశారు. చివరకు వెంకటేశ్వర్లు, మల్లేష్ నామినేషన్లు ఉపసంహరించుకోగా.. జహంగీర్ అలీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా, సోమవారం ఖమ్మంలోని డ్రైవర్ల సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘంలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎండీ సలీం, దాసరి వేణు, లింగంపల్లి గంగన్న, జి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లోని సామగ్రి దగ్ధం
మునగాల: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్ తండాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసనగర్ తండాకు చెందిన దివ్యాంగురాలు గంటపంగు సైదమ్మ తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా.. సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, వంట సామగ్రి, దుస్తులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.70వేల మేరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాఽధితురాలు కోరుతోంది. రోడ్డు వెంట రపాయన వ్యర్థాలు వదులుతున్న లారీలు సీజ్ చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట రసాయన వ్యర్థా లను వదులుతున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి రసాయన వ్యర్థా లతో వచ్చిన రెండు లారీలు ఆదివారం రాత్రి అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట వాటిని వదులుతుండగా గ్రామస్తులకు తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు లారీ యజమానులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. సర్వే అడ్డగింతహుజూర్నగర్ రూరల్: మండలంలోని బూరుగడ్డ గ్రామంలో 64వ సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సర్వే నంబర్లో మొత్తం 164 ఎకరాల భూమి ఉండగా అందులో 60 ఎకరాలకు మాత్రమే పట్టా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 104 ఎకరాల భూమిని పలువురు రైతులు ఆక్రమణలో ఉంది. ఇదే భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన ప్రభుత్వ సర్వేయర్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సర్వే నంబర్లోని కొంత భూమిని గతంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ తన కుటుంబ సభ్యుల పేరుతో పట్టా చేయించుకున్నారు. ఈ అక్రమాలు బయటపడి అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, కంప్యూటర్ ఆపరేటర్‌పై కేసులు నమోదయ్యాయి. యువకుడు అదృశ్యంరామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల సందీప్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సందీప్ గత నెల 28న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా సందీప్ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అతడి భార్య దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. -
నీట్‌కు 859 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాలో నీట్–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం నాలుగు సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. నాలుగు సెంటర్లలో మొత్తం 890 మంది విద్యార్థులకు గాను 859 మంది హాజరు కాగా 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకేంద్రాలను కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ తనిఖీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఎస్పీ నరసింహ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. -
సస్యశ్యామలం చేస్తాం
మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులంతా సహకరించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సాగునీటి, పౌరసరఫరాల శాఖ (వరి ధాన్యం సేకరణ, సన్న బియ్యం పంపిణీ) పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.94వేల కోట్లు ఖర్చు చేసిందని, ఆ నిధులతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ గత ప్రభుత్వం ట్రిబ్యునల్‌తో ఒప్పందం చేసుకుందని, సాగర్ ప్రాజెక్టులో నిల్వ ఉన్న 811 టీఎంసీల నీటిని 512 టీఎంసీలు ఏపీకి, 298 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా గత ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ రీ ఓపెన్ చేసి పునఃపరిశీలన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తామే పూర్తి చేస్తామని, నిర్లక్ష్యానికి గురైన డిండి ప్రాజెక్టుకు గాను రూ.1,800 కోట్లు కేటాయించామన్నారు. సాగునీటి పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తిసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో సాగునీటి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ల పనుల పురోగతిని వివరిస్తుండగా చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్‌ను పిలిచి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించాలన్నారు. సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్‌నంద్‌లాల్, భూసేకరణ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్‌కృష్ణారెడ్డి, నీటి పారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్, అడిషనల్ డీజీపీ చౌహాన్, తెలంగాణ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం హాజరైన మండలి చైర్మన్ గుత్తా, మంత్రి కోమటిరెడ్డి తదితరులు -
చెస్‌పోటీలు మేధాశక్తిని పెంచుతాయి
సూర్యాపేట అర్బన్ : చెస్ పోటీలు విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచుతాయని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం టీటీడీ కళ్యాణ మండపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులకు నిర్వహించిన చెస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్, మెమొంటోలు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. విద్యార్థులు నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపెందించుకోవాలని, ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలని తెలిపారు. త్వరలోనే విద్యానగర్ లో ఉచితంగా చెస్ నేర్పించడానికి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ కుమార్, కోశాధికారి మురళి, గండూరి శ్రీధర్, దేవరశెట్టి శ్రీకాంత్, వెంకటమురళి, నర్సింగరావు, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
28 మందికి ఉద్యోగ నియామకపత్రాలు
కోదాడ: రెవెన్యూ, వైద్యారోగ్యశాఖల్లో కారుణ్య నియామకంతోపాటు, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు పొందిన 28 మందికి ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాలు అందజేశారు. రెవెన్యూ శాఖలో ఐదుగురు, వైద్యారోగ్యశాఖలో ఒకరికి కారుణ్య నియమాకం పొందగా.. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 మంది ఉద్యోగాలు పొందారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీఎంహెచ్ఓ కోటాచలం తదితరులు పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు సూర్యాపేటటౌన్ : పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పోలీసు శాఖ పటిష్టంగా అమలు చేస్తుందని, కొత్త నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్‌కు గరిష్టంగా రూ.25 వేల వరకు జరిమానా ఉంటుందని, తల్లిదండ్రులను కూడా కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ ఒకసారి పట్టుబడితే వారి వివరాలను రవాణా శాఖకు పంపుతామని తెలిపారు. వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాలకృష్ణ నాగారం : వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలకృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేంద్ర, జనరల్ సెక్రటరీ రూపానిరాజు, సోషల్ మీడియా ఇన్చార్జి శివరాత్రి గోపి, కార్యదర్శి బండారి రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల రమేష్‌చంద్ర, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల మల్లయ్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుకల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10 నుంచి 15వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాల వాల్‌పోస్టర్లను ఆదివారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణా చార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కిక్కు!
రోడ్లపైనే పార్కింగ్.. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో మూడు వైన్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారి వెంటే ఉన్నాయి. దీంతో సాయంత్రమైతే వైన్స్‌ల ఎదుట మందుబాబులు క్యూ కడుతుండటంతో రోడ్డుపైనే బైక్‌లు పార్కింగ్ చేసి మద్యం సేవిస్తున్నారు. ఈ రోడ్డులో ఎక్కువగా రద్దీ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కొత్తబస్టాండ్ సమీపంలో గల వైన్స్ ఎదుట అడ్డగోలుగా పార్కింగ్ చేస్తున్నారు. అదేవిధంగా జమ్మిగడ్డ సమీపంలోని జాతీయ రహదారి వెంట, ఇందిరమ్మ కాలనీ సమీపంలో, పిల్లలమర్రి రోడ్డు సమీపంలో, కుడకుడ గ్రామ శివారులో ప్రాంతాల్లో వైన్స్‌లు ఉన్నాయి. మందుబాబులు ఈ వైన్స్‌ల సమీపంలోని ఖాళీ స్థలాల్లోనే మద్యం సేవించి హల్చల్ చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం ● మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న యువకులు ● ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులుసూర్యాపేట: కొందరు మందుబాబులు బహిరంగ మద్యపానం చేస్తున్నారు. వైన్స్‌ల్లో పర్మిట్ రూంలు, బార్లు ఉన్నా... కొందరు ఖాళీ స్థలాలు, రోడ్డు మీదనే మద్యం తాగుతున్నారు. అటువైపుగా వచ్చిన విద్యార్థులను, మహిళలను ఇబ్బందులు పెడుతున్నారు. మరికొందరు గొడవలకు సైతం దిగుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మందుబాబులు రోడ్ల మీదనే వాలిపోతున్నారు. దీంతో ప్రజలు ఆయా చోట్ల రోడ్ల మీదకు రావాలంటే జంకుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రాత్రివేళల్లో మద్యం సేవించి బాటిళ్లు అక్కడే పడేస్తున్నారు. ఫలితంగా ఉదయం పాదచారులకు, వాకింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్‌లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. కొరవడిన పర్యవేక్షణజిల్లాలో ఉన్న మద్యం దుకాణాలపై ఎకై ్సజ్ అధికారులు, పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. రాత్రి వేళలో ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాల దగ్గర బహిరంగంగానే తాగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆరు రోజులు.. పదకొండు గ్రామాలు
గరిడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పథకం కింద సూర్యాపేట జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలం ఎంపికై ంది. కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు మండలంలోని సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారుల బృందం గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు. మండలంలో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి భూ భారతి కార్యక్రమం ద్వారా పరిష్కారమయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభించనుంది. అధికారులు వారి స్థాయిని బట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. మండలం పూర్తిగా ఆయకట్టు మండలం కావటం బోర్లు, బావులు, చెరువులు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా వరి సాగవుతుంది. దీంతో మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాలో గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ధరణి చట్టం ద్వారా ఇబ్బందులు పడ్డ రైతులు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం ద్వారా పూర్తి సమస్యలు పరిష్కారం కానున్నట్లు అధికారులు తెలిపారు. సాదాబైనామాల పరిష్కారం 13బీ అసైన్డ్ భూములు వారసత్వ భూములు వికేంద్రీకరణ బ్లాక్‌ల విభజనతో పాటు ఇతర భూ సమస్యలు పరిష్కారం కానుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నేటి నుంచి గరిడేపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు భూ భారతి పైలెట్ మండలంగా ఎంపిక 12 వరకు కొనసాగనున్న సదస్సులు రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 5 నుంచి 12 వరకు జరిగే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి రైతు హాజరై దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలి. – బండ కవిత, తహసీల్దార్, గరిడేపల్లి గ్రామసభల షెడ్యూల్ ఇలా.. గరిడేపల్లి మండల వ్యాప్తంగా ఈ నెల 5 తేదీ నుంచి 12వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహించనున్నారు. తహసీల్దార్, డీఏఓ టీమ్ లీడర్లుగా 20మంది సభ్యులతో రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా ప్రతిరోజు 9గంటల నుంచి 5గంటల వరకు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈమేరకు వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేసి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ నెల 5న తాళ్లమల్కాపురం, రాయినిగూడెం, 6న కాల్వపల్లి, గడ్డిపల్లి, 7న గరిడేపల్లి, కుత్భుషాపురం, 8న గానుగబండ, వెలిదండ, 9న పొనుగోడు, సర్వారం, 12న కల్మ లచెరువు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. -
మాట నిలబెటు్టకునా్నం
కోదాడ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశామని, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడలోని బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వతంత్ర పోరాటంలో ఓబన్న చూపిన పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కోదాడలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. గత పాలకులు బీసీలను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా కులగణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం కాంగ్రెస్ చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకుంటుందని తెలిపారు. అంతకు ముందు భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా కోదాడలోని వైద్యశాల వద్ద 100 పడకల వైద్యశాల భవనం నిర్మించనున్న స్థలాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడే బేంచ్పై కూర్చొని కలెక్టర్, ఎస్పీలతో సమాలోచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ ఏసురత్నం, ఏబీసీ చైర్మన్ రాములు, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశం, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేనిబాబు, వంటిపులి వెంకటేష్, వంటిపులి గోపయ్య, శ్రీను, వెంకయ్య పాల్గొన్నారు. తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..తిరుమలగిరి (తుంగతుర్తి): తన సొంత గ్రామమైన తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బ్రిడ్జి, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.60లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తాటిపాముల గ్రామంలో కోటి రూపాయలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, మరో కోటి రూపాయలు ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చెన్నూరు రిజర్వాయర్ నుంచి తాటిపాముల గ్రామానికి నీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు సంకెపల్లి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, ఎస్పీ నర్సింహ పాల్గొన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ మంత్రిని కోరారు. అంతకుముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికే 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ చేపట్టిన కులగణనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుంది రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు
ప్రశంసలు అందుకున్న ప్రశాంత్.. తెలంగాణ ఉద్యమంలో ‘అమ్మ తెలంగాణ.. మరో తెలంగాణ.. అమరవీరులే... అంటూ పాట రాసి స్వయంగా పాడాడు. కరోనా సమయంలో మంత్రి సీతక్క చేపట్టిన సేవలపై శ్రీమలినం లేని మట్టిమనిషి’ అంటూ వీడియో చేసి మంత్రి సీతక్క చేతుల మీదుగా అవిష్కరింపజేశాడు. ఇటీవల కశ్మీర్ పహల్గాం వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ ‘భరతమాత శిరస్సుపై సరిహద్దు కంచె తెంపి దూసుకొచ్చె సంగ్రామం’ అంటూ ఇటీవల దేశభక్తి వీడియో రూపొందించి ప్రముఖ కవి డి. అరవిందరాయుడు చేతుల మీదుగా విడుదల చేశాడు. గ్రామ పంచాయతీ కార్మికులపై కూడా వీడియోలు రూపొందిచాడు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటల రచన చేస్తున్న ప్రశాంత్ ఇటీవల హైకోర్డు జడ్జి చంద్రశేఖర్ చేతుల మీదుగా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు సైతం అందుకున్నాడు. ప్రశాంత్ కృషిని మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ సైతం అభినందించారు. తనకు అవకాశం కల్పిస్తే సినిమా రంగంలో పాటలు రచన చేసి పాడగలని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ప్రశాంత్ అంటున్నాడు. ఆత్మకూరు(ఎం): మారుమూల పల్లెటూరిలో పుట్టి పాటలపై తనకున్న ఆసక్తితో సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడేనికి చెందిన చంద్రగిరి ప్రశాంత్. ప్రశాంత్ స్వయంగా పాటలు రాసి వాటిని పాడుతూ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. మోదుబావిగూడేనికి చెందిన వసంత, రాజారామ్ దంపతుల కుమారుడు ప్రశాంత్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ కప్రాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న రోజుల్లో స్కూల్లో పాటల పోటీలు నిర్వహించగా.. తన తల్లి వసంత తోటి కూలీలతో కలిసి పొలంలో పాడిన పాట గుర్తొచ్చి దానిని ప్రశాంత్ పాడి వినిపించాడు. గొంతు చాలా చక్కగా ఉండటంతో ఉపాధ్యాయులు ప్రశాంత్‌ను అభినందించారు. అప్పటి నుంచి తానే స్వయంగా పాటలు రాసి, సీడీలు చేయాలని ప్రశాంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రతి పాట సీడీ చేయాలంటే సుమారు రూ.20వేల వరకు ఖర్చయ్యేదని, తన జీతంతో పాటు తల్లిదండ్రులు ఆర్ధికంగా సాయం అందించేవారని ప్రశాంత్ చెబుతున్నాడు. తమ కుమారుడు మంచి రచయితగా, మంచి గాయకుడుగా అందరు గర్వించే విధంగా ఎదగాలని ప్రశాంత్ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రాసి, వీడియోలు రూపొందిస్తున్న ప్రశాంత్ మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోకతేజచే ప్రశంసలు -
ఒకే కంటెయినర్లో 101 పశువుల తరలింపు
● డ్రైవర్‌పై కేసు నమోదు కోదాడరూరల్ : కంటెయినర్లో అక్రమంగా తరలిస్తున్న 101 పశువులను ఆదివారం తెల్ల వారుజామున కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని హనుమాన్‌జంక్షన్ సంత నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు ఒకే కంటెయినర్లో 76 ఎద్దులు, 25 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. కోదాడ రూరల్ పోలీసులు అంతర్ రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్‌రోడ్‌లో కంటెయినర్‌ను తనిఖీ చేయగా.. పశువులు పట్టుబడ్డాయి. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి డ్రైవర్ ఎర్రవళ్ల సునీల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో రైతు బలవన్మరణంగుర్రంపోడు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేపూరు గ్రామానికి చెందిన నక్కనబోయిన సత్తయ్య(52) ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. దిగుబడి లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలిభువనగిరిటౌన్ : న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరానికి జిల్లాలోని న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన సేవభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఆదివారం సహస్రనామార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గచ్చిబౌలి: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నూతన్‌కల్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థి డాక్టర్ మర్రి సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులైన చురుకంటి పవన్‌రెడ్డి, చురుకంటి అశోక్‌రెడ్డి, చురుకంటి శ్యామ్‌సుందర్‌రెడ్డిలు టీజీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ ఆర్.రామ్మోహన్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజమల్లును సన్మానించారు. -
రామలింగాలగూడెంలో ఆదిమానవుని ఆనవాళ్లు
క్లాక్‌టవర్ (నల్లగొండ), తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలోని దేవుని గుట్టపై రాతియుగపు కాలం నాటి ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. మరుగునపడిన వారసత్వ చిహ్నాలను గుర్తించి, వాటి ప్రాముఖ్యతను స్థానికులకు తెలియజేసే శ్రీప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్ఙీ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన రామలింగాలగూడెంలోని శివాలయం పక్కనే ఉన్న దేవుని గుట్టపై ఆదివారం జరిపిన పరిశీలనలో పాల్గొని మాట్లాడారు. మూడు బండలపైన కొత్త రాతియుగపు మానవులు, తాము నిత్యము వాడుకునే రాతి పనిముట్లతో ఎద్దులు, దుప్పులు, జింకలు, కుక్కలు, పులి ఇంకా ఆనాటి మానవులు వేటాడే దృశ్యాల బొమ్మల్ని తీర్చిదిద్దారన్నారు. ఈ రాతికళ క్రీ.పూ. 6000– 4000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని ఆయన చెప్పారు. గుట్టపై సహజంగా ఏర్పడిన నీటిదోనెలు, రాతి గొడ్డళ్లను అరగ తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. గుట్టపై సహజంగా ఏర్పడిన పెద్ద పెద్ద బండల మాటున గల గుహల్లోనూ, పాము పడగ ఆకారంలో గల రాతి చరియల కింద నివసిస్తూ, తీరిక సమయాల్లో తాము పాల్గొన్న సంఘటనలను, చూసిన దృశ్యాలను చిత్రించారని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ పురాతన రాతికళను కాపాడి, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పి వెంకటేష్, మోతీలాల్ పాల్గొన్నారు. పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
ధాన్యం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి
కోదాడరూరల్: రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించే ధాన్యం నిబంధనల ప్రకారం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో కోదాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా తేమ శాతం 17 ఉండేలా చూసుకొని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా వారం రోజుల లోపే కాంటాలు వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకురాగానే వారికి సీరియల్ నంబర్లు ఇవ్వాలని ఆ ప్రకారం కాంటా వేయాలని ఆదేశించారు. సరిపడా గన్నీ బ్యాగులు వస్తున్నాయా లేదా లారీల సమస్య, హమాలీల కొరత ఏమైనా ఉందా అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 5000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని, మరో 1500 క్వింటాళ్లు ఉంటాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ధాన్యం రాశులను చూసి వాటి తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను సైతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో గోపతి శ్రీనివాస్ అనే రైతు ధాన్యం తేమశాతం పరిశీలించి నాణ్యత బాగుందని ఆ రైతుకు బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీజీఓ పద్మ, ఏపీడీ సురేష్, తహసీల్దార్ వాజిద్‌అలీ, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, డీటీసీఎస్ రాంరెడ్డి, కమతం వెంకటయ్య, అనూష ఉన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ -
బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కొండమల్లేపల్లి: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఆదివారం ఆటోలో ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు ఆటోలో కూర్చోగా.. మిగతా వారు బావిలోకి దిగారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆటోలో నలుగురు మాత్రమే వెళ్లారు. ఇదంతా వ్యవసాయ బావి వద్ద పనిచేసే ఓ రైతు గమనించి బావి దగ్గరకి వెళ్లి చూడగా.. జత దుస్తులు, చెప్పులు ఉండటం గమనించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు బావి వద్దకు చేరుకుని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని దేవరకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచార ఇవ్వగా వారు వ్యవసాయ బావి వద్దకు చేరుకొని బావిలో గాలించగా.. వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 36 నుంచి 38 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిశెట్టి దుప్పలపల్లిలో..తిప్పర్తి: తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉంటుందని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712670181 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
అభినయ శ్రీనివాస్‌కు గద్దర్ ఐకాన్ అవార్డు
మోత్కూరు: ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా’ వంటి ఉద్యమ గీతాన్ని రాసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మోత్కూరు వాసి అభినయ శ్రీనివాస్‌కు గద్దర్ ఐకాన్–2025 అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ ప్రాంగణంలోని భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాయి అలేఖ్య ఫౌండేషన్ వారి 32వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతులమీదుగా అభినయ శ్రీనివాస్‌కు ఈ అవార్డును నిర్వాహకులు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, అవార్డుల కమిటీ అధ్యక్షురాలు అలేఖ్య, తెలంగాణ రచయితలు, గాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య
హుజూర్నగర్: ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్మ చేసుకుంది. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్ట ణానికి చెందిన షేక్ ఖాసింబీ తన కుమార్తె షేక్ మహబూబీ అలియాస్ హసీనా(19)ని గత నెల 30వ తేదీన చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసుఫ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కాగా హసీనా తన భర్త యూసుఫ్‌తో కలిసి శనివారం తన తల్లిగారింటికి వచ్చింది. ఆదివారం ఉదయం బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన హసీనా అందులో ఉన్న ఇనుప కడ్డీకి ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. హసీనా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. -
రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తాం
హుజూర్నగర్: భారత ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధ నిర్ణయాలను స్వాగతిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తుపాకుల ద్వారానే చరిత్ర మారుతుందనే సిద్ధాంతానికి తాము వ్యతిరేకమని, క్లిష్టమైన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని సీపీఐ నమ్ముతుందన్నారు. కర్రి గుట్టల్లో కూంబింగ్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి ఎన్కౌంటర్లను నివారించాలని కోరారు. మావోయిస్టులు కూడా చట్టపరంగా ఉద్యమాలు చేసి ప్రజల్లో మార్పు తీసుకోచ్చేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, ఎన్నికల హామీలను సక్రమంగా అములు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ప్రధాన కార్యదర్శి అజయ్‌నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, సూర్యనారాయణ, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
Nalgonda: రాపిడో రయ్ రయ్!
మనం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే బస్సులేదా ఆటో, సొంత వాహనం అవసరం. కానీ ఇప్పుడు రాపిడో యాప్‌లో బుక్ చేసుకుంటే వాహనం మన ముందుకొచ్చి ఆగుతుంది. గమ్య స్థానానికి చేర్చుతుంది. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఇలాంటి బైక్ ట్యాక్సీ సర్వీసులు ఇప్పుడు జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. వీటి రాకతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రాపిడో యాప్‌లో బైక్, ఆటో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతోంది. (నల్లగొండ), సూర్యాపేట టౌన్ : భువనగిరి టౌన్ ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలో ‘రాపిడో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా పట్టణాల పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు రాపిడో యాప్ ద్వారా ఆటో, బైక్ బుక్ చేసుకుంటే చాలు మన ఇంటి దగ్గరకే ఆటో, బైక్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటాయి. అందుకు ముందుగా మనం చేయవలసిందల్లా మన సెల్‌ఫోన్‌లోని ‘ప్లే స్టోర్’ నుంచి ‘రాపిడో’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం కొన్ని ఆప్షన్స్ పూరించాక అది మన సేవలకు సిద్ధమవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాప్ ఓపెన్ చేస్తే వెళ్లే లోకేషన్ అడుగుతుంది. దాన్ని పూరించాక, ప్రయాణ చార్జీని తెలుపుతుంది. మనకు సమ్మతమైతే వెంటనే ఓకే ఆప్షన్ నొక్కగానే వాహనం మన దగ్గరకు ఎన్ని నిమిషాల్లో చేరుకుంటుందో తెలియజేస్తుంది. వాహనం రాగానే మనల్ని పికప్ చేసుకుని, గమ్య స్థానానికి చేరుస్తుంది. ఇది పట్టణ ప్రజల రవాణా సౌకర్యార్థం, నిరుద్యోగుల ఉపాధికి బాసటగా నిలుస్తోంది.నల్లగొండలో 90 వాహనాలు⇒ నల్లగొండ పట్టణంలో రాపిడోలో 90 వరకు వాహనాలు నడుస్తున్నాయి. పట్టణం పరిధిలో ప్రస్తుతం కేశరాజుపల్లి, ఎస్ఎల్బీసీ, కతాల్‌గూడ, పానగల్లు, ఎంజీ యూనివర్సిటీ వరకు ఈ సేవలు కొనసాగుతున్నాయి. డిమాండ్ పెరిగితే ఇంకా విస్తరించే అవకాశం ఉంది.⇒ రాపిడో సర్వీసులు భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ పట్టణాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటి రాకతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన సేవలు అందుతున్నాయి. యాదిరిగుట్ట నుంచి ఎయిమ్స్ వరకు ఆటో, బైక్ సెలవు అందుబాటులో రావడంతో పాటు, బీబీనగర్ ఎయిమ్స్ నుంచి కార్లు కూడా అందుబాటులో వచ్చాయి. ⇒ సూర్యాపేటలో ప్రస్తుతం రాపిడోలో 30 బైక్‌లు, 20 గాఆటో ట్యాక్సీలు నడిపిస్తున్నారు. గతంలో సూర్యాపేట పట్టణం పరిసర ప్రాంతాలు చుట్టూ ఆరు కిలోమీటర్ల వరకు రాపిడో ట్యాక్సీలు నడిపించారు. ఇప్పడు జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ట్యాక్సీలు నడిస్తున్నారు. దీంతో ప్రయణికులు వారు వెళ్లే ప్రాంతానికి రాపిడో బుక్ చేసుకుంటున్నారు. యువతకు ఉపాధి అవకాశంరాపిడో యాప్ ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతోంది. ముఖ్యంగా చిన్నచిన్న ఉద్యోగాలు లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే యువత పార్టైంగా రాపిడో యాప్ ద్వారా ప్రయాణికులను చేరవేసి ఆదాయం పొందుతోంది. ముందుగా యువత రాపిడో కెప్టెన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాహన వివరాలు, లైసెన్స్, మొబైల్ నంబర్లను పొందుపర్చాలి. ఎవరైతే ప్రయాణికుడిగా దగ్గరగా ఉంటారో వారికి మెసేజ్ వెళ్లడంతో క్షణాల్లో అక్కడి వెళ్లి ప్రయాణికుడిని గమ్యస్థలం చేరుస్తున్నారు. ఫుల్‌టైం పని చేసేవారు రోజుకు రూ.700 నుంచి రూ.1000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే వీరంతా ఆ డబ్బును వారంలో రెండుసార్లు మాత్రమే తమ ఖాతా నుంచి డ్రా చేసుకోవాల్సిరోజూ మూడు, నాలుగు రైడ్లునేను ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాను. నాకున్న బైక్‌ను రాపిడో యాప్‌లో యాడ్ చేశాను. నల్లగొండలో రోజూ మూడు నుంచి నాలుగు రైడ్లకు వెళ్తున్నా. ప్రస్తుతం రూ.200 నుంచి రూ.400 వరకు వస్తున్నాయి. రాపిడో సేవలు అందుబాటులో ఉన్నా చాలా మందికి తెలియకపోవడంతో సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. – రమేష్, రైడర్, నల్లగొండ -
నేడు కోదాడ, హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్, కోదాడ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదివారం హుజూర్నగర్, కోదాడలో పర్యటించనున్నారని మంత్రి పీఆర్ఓ వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు కోదాడ బస్టాండ్ సెంటర్లో వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడలోని వంద పడకల వైద్యశాల స్థలం, నిర్మాణ విషయంపై, రెడ్లకుంట, శాంతినగర్, పాలేరు ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం హుజూర్‌నగర్‌కు వెళతారు. అక్కడ 241 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని మంత్రి పీఆర్ఓ పేర్కొన్నారు. జిల్లా కోర్టుకు వేసవి సెలవులు చివ్వెంల: జిల్లా కోర్టుకు ఈనెల 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సెలవుల్లో సివిల్ కేసులకు సబంధించిన ఫైలింగ్‌లను పరిశీలించేందుకు ప్రత్యేక జడ్జీలకు బాధ్యతలు అప్పగించారు. మొదటి వెకేషన్లో భాగంగా ఈనెల 5 నుంచి 21 వరకు 17 రోజుల పాటు సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద కేసులు పరిశీలిస్తారు. అలాగే 22 నుంచి జూన్ 6 వరకు నల్లగొండ జిల్లా కోర్టు పోక్సో జడ్జి కులకర్ణి విశ్వనాథ్ దిలిప్రావు బాధ్యతలు చేపడతారు. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి కోర్టులకు సబంధించిన సివిల్ కేసు దావాలు, క్రిమినల్ కేసులను సంబంధిత కోర్టుల జడ్జీలు పరిశీలించనున్నారు. నాలుగు ఆసుపత్రులకు షోకాజు నోటీసులుసూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఆపిల్ స్కాన్ సెంటర్, శ్రీకృష్ణా, శ్రీ సాయిగణేష్ మల్టీస్పెషాలిటి, శరత్ కార్డియాక్ సెంటర్ ఆసుపత్రులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం జిల్లా రిస్ట్రేషన్ అథారిటీ నిబంధనలను అనుసరించి షోకాజు నోటీసులు జారీ చేసినట్ట డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల వ్యవధిలోపు సరైన వివరణ, ధ్రువపత్రాలు సమర్పించని పక్షంలో సంబంధిత ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని, తనిఖీలు నిర్వహించి స్పష్టమైన ధ్రువపత్రాలు కలిగి ఉన్న వారికి మాత్రమే అనుమతి రిజిస్ట్రేషన్ కొనసాగించనున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం మారినా, డాక్టర్, సిబ్బంది మారినా జిల్లా వైద్యారోగ్యశాఖకు తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలిగరిడేపల్లి: భూ భారతి అమలులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గరిడేపల్లి మండలంలో ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5న రాయినిగూడెం జెడ్పీహెచ్ఎస్, తాళ్లమల్కాపురం యూపీఎస్, 6న కాల్వపల్లి ఎంపీపీఎస్, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్, 7న గరిడేపల్లి జెడ్పీహెచ్ఎస్, కుత్భుషాపురం యూపీఎస్, 8న గానుగబండ, వెలిదండ జెడ్పీహెచ్ఎస్, 9న సర్వారం యూపీఎస్, పోనుగోడు జెడ్పీహెచ్ఎస్, 12న కల్మలచెరువు జెడ్పీహెచ్ఎస్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. సివిల్ వివాదాలు, కోర్టులో ఉన్న భూ కేసుల దరఖాస్తులను ఈ సమావేశాల్లో స్వీకరించబోమన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఏఓ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్ కవిత, డీటీ స్రవంతి, ఆర్ఐ రాంబాబు, ప్రవీణ్, కార్యదర్శి సైదానాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మధు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎం.రాంబాబు, నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకన్న, గోపి పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
చివ్వెంల : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేట సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలను భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన లీగల్ లిటరసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల హక్కులు, విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో బార్ అసోసియేసన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టుపల్లి ప్రవీణ్‌కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు ఎండీ అబ్దుల్ లతీఫ్, శ్రీనివాస్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, మధు, పీపీ లక్ష్మణ్ నాయక్, ఏజీపీ పూల్‌సింగ్ నాయక్ పాల్గొన్నారు. -
రెండు రోజులు అలర్్ట!
ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయయి. ఎండల తీవ్రత పెరగడంతోపాటు.. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మార్చిలోనే మొదలైన ఎండలుఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చిలోనే మొదలైన ఎండలు ఏప్రిల్ చివరి నాటికి అధికమయ్యాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, అయితే ఆది, సోమవారం తర్వాత ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దుఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే టోపీ ధరించడం, తలకు తువాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, నీడ ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని, ఎక్కువ మోతాదులో మంచినీరు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి కూలీలు ఉదయం వేళల్లో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పని ప్రదేశంలో షామియానాలు ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న రెండు రోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న కలెక్టర్ మండలం గ్రామం ఉష్ణోగ్రతదామరచర్ల దామరచర్ల 43.8మాడుగులపల్లి మాడుగులపల్లి 43.7దామరచర్ల తిమ్మాపూర్ 43.6మిర్యాలగూడ టేక్యాతండా 43.4త్రిపురారం మాటూరు 43.3అడవిదేవులపల్లి ముల్కచర్ల 43.2నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి 43తిరుమలగిరిసాగర్ తిరుమలగిరిసాగర్ 43మోతె మామిళ్లగూడెం 43.1అప్రమత్తంగా ఉండాలి భానుపురి (సూర్యాపేట): జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలి. వడదెబ్బ తగిలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని ఆదేశించాం. చిన్నారులు, వయోవృద్ధులు ఎండకు బయటకు వెళ్లవద్దు. ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. – కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
4 సెంటర్లు.. 890 మంది విద్యారు్థలు
నేడు నీట్ పరీక్ష● సూర్యాపేటలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్సూర్యాపేటటౌన్ : మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఆదివారం(4వ తేదీ) నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు చేసింది. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన నాలు గు పరీక్ష కేంద్రాలైన మోడల్ స్కూల్ ఇమాంపేట, టీజీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్–కళాశాల (బాలికలు ) ఇమాంపేట, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్–జూనియర్ కళాశాల దురాజ్‌పల్లి చివ్వెంల మండలం, గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో 890 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 1:30గంటల వరకే అనుమతి విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకుంటున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో కంట్రోల్ రూం, సీసీ కెమెరా లు, బందోబస్తు, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం సూర్యాపేట పరిధిలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆభరణాలు, ఫుల్ హ్యాండ్ షట్స్, బూట్లు ధరించి వచ్చినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1433 ఫోన్ చేయాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ నాగేశ్వర్రావు, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్లు శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జయలత ఉన్నారు. -
ఎస్సారెస్పీకి లైనింగ్ వేయరూ..!
అర్వపల్లి: తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో 2.20లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ స్టేజ్–2) లైనింగ్, పునరుద్ధరణ పనులకు ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2010లో ఎస్సారెస్పీ రెండోదశ కాలువ నిర్మాణ పనులు పూర్తవగా ఏడేళ్ల నుంచి ప్రతి సీజన్‌కు గోదావరి జలాలలను జిల్లాకు వదులుతున్నారు. కానీ, అప్పటి నుంచి ఈ కాలువకు లైనింగ్, ఇతర మరమ్మతులు చేపట్టింది లేదు. దీంతో అక్కడక్కడా కట్టలు తెగుతూ, తూములు ధ్వంసమవుతూ నీరు వృథాగా పోతూ చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. రూ.500 కోట్ల నిధులు అవసరమున్నా..జిల్లాలో ఎస్సారెస్సీ రెండోదశ కింద మూడు నియోజకవర్గాలకు సాగు నీరందించేందుకు 61,70, 71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ మేజర్)లు ఉన్నాయి. ఇందులో 71డీబీఎం పెద్దది. 69 డీబీఎం తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో 27కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికింద 60,572 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే 70 డీబీఎం నాగారం, తిరుమలగిరి మండలాల్లో 9కి.మీ. మేర విస్తరించి ఉంది. దీని కింద 7వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 71 డీబీఎం తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నాగారం, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లో 68.45కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికింద 1,42,230 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కేవలం 71డీబీఎం పరిధిలో మాత్రమే గత కొన్నేళ్ల కిందట సుమారు 5కి.మీ. పైన లైనింగ్ చేసి మిగతాది వదిలేశారు. 69, 70, 71డీబీఎంలతో పాటు వీటి కింద ఉన్న ప్రధాన మైనర్లు 22ఎల్, 36ఎల్, 7ఎల్, 15ఎల్, 22ఆర్, 69టెయిలాండ్కు మరమ్మతుతోపాటు లైనింగ్, తూములు, షట్టర్ల రిపేర్లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాలువలు కంపచెట్లు, పూడికతో నిండిఉన్నాయి. అయితే లైనింగ్, మరమ్మతులకు రూ.500 కోట్ల వరకు నిధులు అవసరమున్నా ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.34 కోట్లే కేటాయించారు. ఈ నిధులు ఎటూ సరిపోవని అధికారులే అంటున్నారు. తాటిపాములకు నేడు మంత్రి ఉత్తమ్ రాకతుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో తన స్వగ్రామమైన తాటిపాములలో ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనుల చేయనున్నట్టు సమాచారం. మంత్రి పర్యటన ఈ నేపథ్యంలో ఏటా అధికారులు పంపుతున్న ప్రతిపాదనల ఆమోదిస్తారో లేదోనని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడి రాబోతున్న మంత్రి ఎస్సారెస్పీ కాలువల దుస్థితిని పరిశీలించి బడ్జెట్‌తో సంబంధం లేకుండా తగినన్ని నిధులు కేటాయించాలని కాలువలను ఆధునీకరించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.నిధులు కేటాయించాలి ఎస్సారెస్పీ–2 కాలువల పునరుద్ధరణకు రూ.500 కోట్ల నిధులు అవసరముండగా ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.34 కోట్లు కేటాయించడం సమంజసం కాదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడకు వస్తున్నందున నిధుల కేటాయింపుపై దృష్టిపెట్టాలి. – వజ్జె శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడుఎస్సారెస్పీ–2 స్వరూపం.. ఆయకట్టు 2.20 లక్షల ఎకరాలు ప్రధాన డీబీఎంలు 69, 70, 71 నీళ్లందే ప్రాంతాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టు–2 కాలువలుఫ చివరి ఆయకట్టుకు నీరందని వైనం ఫ ఏడేళ్లుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఫ ఈసారి బడ్జెట్లో రూ.34.01కోట్లు మాత్రమే కేటాయింపు ఫ నేడు తాటిపాములలో మంత్రి ఉత్తమ్ పర్యటన ఫ మంత్రి హామీలపై రైతుల ఆశ గోదావరి జలాలే ఆధారం ప్రతి సీజన్లో పది ఎకరాల వరకు వరిపంట సాగు చేస్తాను. కేవలం గోదావరి జలాలను నమ్ముకొని పంటలు సాగు చేస్తున్నాను. గతేడాది నుంచి నీళ్లు సరిగా రావడం లేదు. కాలువలు కంపచెట్లతో నిండాయి. వెంటనే కాలువలను బాగు చేయాలి. – చెరుకుపల్లి ప్రవీణ్, రైతు, తిమ్మాపురం -
అనుమతులకు మించి నిర్మాణాలు
సూర్యాపేటలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో కొందరు గృహ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తుంటే.. మరికొందరు ఒకటి రెండు అంతస్థులకే అనుమతి తీసుకుని అంతకుమించి అంతస్థుల నిర్మాణాలు చేపపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రం కావడంతో గృహ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో అక్రమ నిర్మాణాలు కూడా అధికమయ్యాయి. దాదాపు పట్టణంలోని సగం ఇళ్లకు అనుమతులు లేవని అధికారులు లెక్కలు సేకరించారు. అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైరవీలు చేస్తున్నారు.. మున్సిపాలిటీ నుంచి గృహ యజమానులు జీ ప్లస్ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకుని ఆపైన ఇష్టానుసారంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి కన్నా అదనంగా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో అధికారులు నాలుగు నెలలుగా దాదాపుగా 30 ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొందరికి నోటీసులు ఇచ్చి, ఐదారు ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకున్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా రెండేళ్ల క్రితం టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను నియమించినప్పటికీ రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల ఒత్తిడికి తలొగ్గి క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని పట్టణ వాసులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో భాగంగా చాలామంది భవన నిర్మాణాలకు అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. వీటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న గృహ యజమానులు నిబంధనలను పాటించడం లేదనే చర్చ సాగుతోంది. వీధి రోడ్లు ఇరుకుగా.. అనుమతులకు మించి అక్రమ భవనాలు ఒక ఎత్తైతే పట్టణంలో చాలా వీధుల్లో ఇంటి ముందు స్థలం వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి ర్యాంపులను వీధిరోడ్డు మీదికి వచ్చేలా నిర్మిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఇంటి ముందు ర్యాంపులను నిర్మిస్తుండడంతో వీధుల్లో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. ఫలితంగా ఆయా వీధులగుండా ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఫ పర్మిషన్ ఇంటికి.. నిర్మించేది బహుళ అంతస్థులు ఫ అంతర్గత రోడ్లను ఆక్రమించి ర్యాంపులు, మెట్లు ఏర్పాటు ఫ ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో వార్డులు 48నివాస గృహాలు 39,800 పట్టణ జనాభా 1,53,000ఇటీవల గుర్తించిన అక్రమ నిర్మాణాలు 30 -
ఈదురుగాలుల బీభత్సం
కోదాడరూరల్ : మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన దోరకుంట, చిమిర్యాల, నల్లబంగూడెం, రామాపురం క్రాస్‌రోడ్, రెడ్లకుంటలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి చిమిర్యాలలో కలకొండ పద్మ ఇంటిపై వేపచెట్టు విరిగి పడగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నది. రెడ్లకుంటలో యామపంగు దిలీప్, పిడమర్తి పెద్ద సైదులు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోగా మరో రెండు ఇళ్లు, నల్లబంగూడెంలో మూడు ఇళ్లు పాక్షింకంగా దెబ్బతిన్నాయి. ఆరబోసుకున్న ధాన్యం రాశుల కిందకు నీరు చేరి పాక్షికంగా తడిశాయి. ఆయా గ్రామాల్లో రోడ్ల వెంట ఉన్న చెట్ల కొమ్మలు విరిగాయి. 15 విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో తెల్లవారుజామున 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది ఆయా గ్రామాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి సాయంత్రం వరకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. అలాగే నల్లబండగూడెం, రెడ్లకుంట, కాపుగల్లులో ఈదురుగాలులకు దాదాపుగా 90 ఎకరాల్లో మామిడి, సపోట పంటలకు నష్టం జరిగింది. ఆయా తోటల్లో చెట్లు విరిగి కాయలు నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ కూలిన విద్యుత్ స్తంభాలు, విరిగిన చెట్లు ఫ లేచిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు ఫ మామిడి, సపోట తోటల్లో రాలిన కాయలు -
పేదలకు అండగా ఎర్రజెండా
గరిడేపల్లి : ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఎల్లప్పుడూ పేదలకు అండగా పోరాడేది ఎర్రజెండాయేనని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెం గ్రామంలో జరిగిన ఆ పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా గెలిపించుకోవడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మండవ వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, కుందూరు వెంకట్‌రెడ్డి, గోవిందరెడ్డి, అంబటి వెంకటరెడ్డి, ఏసుపాదం, వెంకన్న, సైదిరెడ్డి లింగరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
5 నుంచి రెవెన్యూ సదస్సులు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గరిడేపల్లి మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు హాజరైన అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఆవాస గ్రామాల రైతులంతా హాజరుకావాలని కోరారు. రైతులు రెవెన్యూ సదస్సుకు వచ్చేటప్పుడు తమ భూ సమస్యలకు సంబంధించిన పూర్తి ఆధార పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా ఎస్పీ నరసింహ, ఏఎస్పీ నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ధర్మారెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవరావు, తహశీల్దార్లు శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణయ్య, నాగార్జునరెడ్డి, కవిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీటీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాననీటిని ఒడిసిపట్టాలి వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి నిర్వహించిన జిల్లా వాచ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల్లో బోర్ వెల్స్ వద్ద వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ శివధర్మ తేజ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి అరుణాకర్‌రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలునాయక్, డీపీఓ యాదయ్య, సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఫ పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలంలో నిర్వహణ ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వెల్లడి -
ధాన్యం కొనాలని రైతుల ధర్నా
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మండల పరిధిలోని రాజ్‌నాయక్ తండాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం సూర్యాపేట–జనగామ రోడ్డుపై ధర్నాకు దిగారు. లారీలు రావట్లేదనే సాకుతో కాంటాలు నిలిపివేశారని, ఐదు రోజులకు ఒక లారీ చొప్పున కాంటాలు వేస్తే మేము ఇలా ఎన్ని రోజులు కేంద్రంలోనే నిరీక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి కాంటాలు వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రోడ్డుపై ధర్నా చేయడంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇతర వాహనదారులు పక్కనే మడికట్ల నుంచి వెళ్లాల్సి వచ్చింది. -
మన దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు
రజాకార్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ, ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ దర్శకుడు విజయ్‌కుమార్‌ను వరించిన అవార్డుచిట్యాల, భూదాన్‌పోచంపల్లి : ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ, భూదాన్‌పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌కుమార్‌లకు ఈ అవార్డు దక్కింది. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటిసారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ ‘యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే15వ ఫిల్మ్ ఫెస్టివల్లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగిరీలలో అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్ ఎంపికయ్యారు. యాట సత్యనారాయణ గురువారం రాత్రి జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అవార్డు అందుకోగా.. బడుగు విజయ్‌కుమార్ శనివారం అందుకోనున్నారు. -
‘ఈఏపీ’ పరీక్ష కేంద్రం తనిఖీ
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈఏపీ (ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మ) సెట్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. బందోబస్తును పరిశీలించారు. బందోబస్తు నిర్వహణలో సిబ్బంది పనితీరును కొనియాడారు. ‘సప్లిమెంటరీ’కి విద్యార్థులను సిద్ధం చేయాలిఆత్మకూర్ (ఎస్): అధ్యాపకులు ప్రతిరోజూ కళాశాలకు వస్తూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని డీఐఈఓ భానునాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు బాధ్యతగా వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన విద్యాసంవత్సరం అడ్మిషన్లపై దృష్టి సారించాలన్నారు. గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాల యాదయ్య, కాలేజీ అధ్యాపకులు గునగంటి వెంకటేశ్వర్లు, దశరథ, డాక్టర్ అమల, లింగయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధపెట్టాలి : డీఆర్డీఓ పెన్‌పహాడ్: నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని డీఆర్డీఓ వీవీ.అప్పారావు నిర్వహకులకు సూచించారు. శుక్రవారం పెన్‌పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామంలో నర్సరీ, ఐకేపీ కొనుగోలు కేంద్రం, అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లోని మొక్కలకు రోజూ నీరుపోయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాబ్‌ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో 48గంటల్లో ధాన్యం డబ్బులు పడేలా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ సిబ్బంది, ఉపాధి హామీ, సీ్త్రనిధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏఓ అనిల్‌కుమార్, సీ్త్రనిధి మేనేజర్ జ్యోతి, ఏపీఎం అజయ్‌నాయక్, ఏపీఓ రవి, ఈసీమహేష్, వీఓఏ విజయ, రజిని, ఇందిరమ్మ, సుశీల, సీసీ పద్మావతి, సునీత, రమణ పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణమ్మకు హారతిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద జీవనది కృష్ణమ్మకు శుక్రవారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక పల్లకీలో మంగళవాయిద్యాలతో ప్రహ్లాద ఘాట్ తరలించారు. అనంతరం ప్రత్యేక హారతి పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రవేశానంతరం మహా నివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బదరీనారాయణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.